గద్వాల్ డిసెంబర్ 29(పున్నమి ప్రతినిధి)
ఆధార్‌లో 05 మరియు 15 సంవత్సరాల వయస్సు పూర్తయిన పిల్లలకు తప్పనిసరిగా బయోమెట్రిక్ నవీకరణ చేసుకోవాలి…. జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న 05 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల వయస్సు పూర్తయిన పిల్లలకు ఆధార్‌లో బయోమెట్రిక్ నవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మార్గదర్శకాల ప్రకారం, ఈ వయస్సులలో పిల్లల వేలిముద్రలు (Fingerprints), కంటి మణులు (Iris Scan), ఫోటో మార్పులకు లోనవుతాయని దృష్టిలో ఉంచుకొని, ఆధార్ వివరాల ఖచ్చితత్వాన్ని నిలుపుకోవడానికి ఈ నవీకరణ అవసరమని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా లోని ఆధార్ సెంటర్ లలో తల్లిదండ్రులు / సంరక్షకులు తమ పిల్లల ఆధార్ నవీకరణను సమీపంలోని ఆధార్ నమోదు / నవీకరణ కేంద్రంలో సంబంధిత దృవీకరణ పత్రాలతో తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించడమైనది. సకాలంలో బయోమెట్రిక్ నవీకరణ చేయించుకోకపోతే, భవిష్యత్తులో పాఠశాల ప్రవేశాలు, ప్రభుత్వ పథకాలు, పరీక్షలు మరియు ఇతర సేవలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పిల్లవాడి ఆధార్ బయోమెట్రిక్ నవీకరణను వెంటనే పూర్తి చేయించుకోవాలని సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని, ఆధార్ నిర్వాహకులు పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.


