పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10
గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదిలిన తీవ్ర వాయుగుండం. మరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగాబలపడుతుందనీ,మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వారు వెల్లడించారు.ప్రస్తుతానికి చెన్నైకి 770 కి.మీ, విశాఖపట్నం కి 820 కి.మీ, కాకినాడ కి 810 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిందన్నారు.
సోమవారం కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయి ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని , అప్రమత్తంగా ఉండాలనీ అధికారులు ఆదేశించారు.


