ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల రూపకల్పనలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ ఆక్ట్, 1974 ప్రకారం విడుదల చేసిన ఫార్మ్–1 నోటిఫికేషన్ ద్వారా పలు మండలాల భౌగోళిక పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు గెజిట్‌లో పేర్కొంది.ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి వేగవంతం చేసే లక్ష్యంతో కొత్త జిల్లా/రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు మరియు కొన్ని మండలాల బదిలీలు ప్రతిపాదించబడుతున్నాయి.
అన్నమయ్య జిల్లాలోకి చేరనున్న మండలాలు
గెజిట్ ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి క్రింది మండలాలు అన్నమయ్య జిల్లాలోకి చేర్చేందుకు ప్రతిపాదించారు:అందులో 1 ఒంటిమిట్ట మరియు2. సిద్ధవటం ఉన్నాయి.
మదనపల్లె కొత్త జిల్లా ప్రతిపాదన ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్–II ప్రకారం మదనపల్లెను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా ప్రస్తావించింది. ఈ కొత్త జిల్లాలో కలుపబోయే మండలాలు:మదనపల్లె,రామసముద్రం,తంబల్లపల్లె,ములకలచేరువు, పెద్దమండ్యం,కురబలకోట,పెద్ది తిప్ప సముద్రం,
బిరంగీ కోతకోట,చౌడేపల్లె,
పుంగనూరు,సోదుం,సోమల,
పీలేరు(కొత్త డివిజన్ హెడ్‌క్వార్టర్) ప్రతిపాదన)గుర్రంకొండ,
కలకాడ,కలికిరి, కంభంవారి పల్లె,కల్లూరు,వాల్మీకి పురం,ఈ మండలాలులో కొన్నింటిని చిత్తూరు,పలమనేరు, రాయచోటి,అన్నమయ్య జిల్లాలకు పునర్విభజించే అంశాలు కూడా నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అభ్యంతరాల ఆహ్వానం
ఈ ప్రతిపాదనలపై జిల్లాలో నివసించే ప్రతి వ్యక్తి నుంచి అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అభ్యంతరాలు 30 రోజుల్లోగా ఆయా కలెక్టర్లను లిఖితపూర్వకంగా సంప్రదించాలని గెజిట్‌లో పేర్కొంది.ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పునర్వ్యవస్థీకరణలు అమల్లోకి వస్తే,జిల్లాల పరిపాలన మరింత సమర్థవంతం అవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ విడుదల – కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల రూపకల్పనలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ ఆక్ట్, 1974 ప్రకారం విడుదల చేసిన ఫార్మ్–1 నోటిఫికేషన్ ద్వారా పలు మండలాల భౌగోళిక పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు గెజిట్‌లో పేర్కొంది.ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి వేగవంతం చేసే లక్ష్యంతో కొత్త జిల్లా/రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు మరియు కొన్ని మండలాల బదిలీలు ప్రతిపాదించబడుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోకి చేరనున్న మండలాలు గెజిట్ ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి క్రింది మండలాలు అన్నమయ్య జిల్లాలోకి చేర్చేందుకు ప్రతిపాదించారు:అందులో 1 ఒంటిమిట్ట మరియు2. సిద్ధవటం ఉన్నాయి. మదనపల్లె కొత్త జిల్లా ప్రతిపాదన ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్–II ప్రకారం మదనపల్లెను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా ప్రస్తావించింది. ఈ కొత్త జిల్లాలో కలుపబోయే మండలాలు:మదనపల్లె,రామసముద్రం,తంబల్లపల్లె,ములకలచేరువు, పెద్దమండ్యం,కురబలకోట,పెద్ది తిప్ప సముద్రం, బిరంగీ కోతకోట,చౌడేపల్లె, పుంగనూరు,సోదుం,సోమల, పీలేరు(కొత్త డివిజన్ హెడ్‌క్వార్టర్) ప్రతిపాదన)గుర్రంకొండ, కలకాడ,కలికిరి, కంభంవారి పల్లె,కల్లూరు,వాల్మీకి పురం,ఈ మండలాలులో కొన్నింటిని చిత్తూరు,పలమనేరు, రాయచోటి,అన్నమయ్య జిల్లాలకు పునర్విభజించే అంశాలు కూడా నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అభ్యంతరాల ఆహ్వానం ఈ ప్రతిపాదనలపై జిల్లాలో నివసించే ప్రతి వ్యక్తి నుంచి అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అభ్యంతరాలు 30 రోజుల్లోగా ఆయా కలెక్టర్లను లిఖితపూర్వకంగా సంప్రదించాలని గెజిట్‌లో పేర్కొంది.ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పునర్వ్యవస్థీకరణలు అమల్లోకి వస్తే,జిల్లాల పరిపాలన మరింత సమర్థవంతం అవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

