Sunday, 22 March 2026
  • Home  
  • అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: నెల్లూరు కోటేశ్వరరావు పిలుపు
- ఖమ్మం

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: నెల్లూరు కోటేశ్వరరావు పిలుపు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని . ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల బతుకులను దెబ్బతీస్తూ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అవినీతి, అరాచకాలు, కమీషన్ల పాలనతో రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో మార్చి 23, సోమవారం నాడు నిర్వహించనున్న “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని, పేదల సమస్యలను విస్మరించిన ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని . ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రజల బతుకులను దెబ్బతీస్తూ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అవినీతి, అరాచకాలు, కమీషన్ల పాలనతో రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో మార్చి 23, సోమవారం నాడు నిర్వహించనున్న “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని, పేదల సమస్యలను విస్మరించిన ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.