*అప్పుఘర్ తీర ప్రాంతాన్ని రాత్రి పరిశీలించిన నగర మేయర్*
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
బంగాళాఖాతంలో ఏర్పడిన మొoథా తుఫాన్ కారణంగా బీచ్ రోడ్ లోని లోతట్టు ప్రాంతా ప్రజలను అప్రమత్తం చేయాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆయన జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, మూడవ జోన్ జోనల్ కమిషనర్ శివప్రసాద్, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అప్పుఘర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం తో పాటు బీచ్ లోని తీర ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తుఫాన్ ప్రభావత ప్రాంతాలను ఎదుర్కొనేందుకు 24 గంటలు అప్రమత్తంగా టీమ్లను ఏర్పాటు చేసామని తెలిపారు. జీవీఎంసీ అధికారులు తీర ప్రాంత వెంబడి 27 జెసిబిలు, 56 టిప్పర్లు, 6 క్రేన్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. తుఫాను వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఏదైనా విపత్తు సంభవిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్ కు గాని, జీవీఎంసీ ఏర్పాటుచేసిన ఫోన్ నెంబర్ గాని ఫోన్ చేయాలని నగర ప్రజలకు సూచించారు. నేడు రేపు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు తమ బోట్లకు లంగర్లు వేసి సురక్షితంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, చెట్లు కింద, ఓర్డింగులు వద్ద ఉండరాదని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


