కామారెడ్డి,05 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :
ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు కలిసి తనిఖీ!
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల మధ్యాహ్న భోజనం నాణ్యతకు గ్రామ పాలకులు ఎలాంటి కాంప్రమైజ్ చేయరని నిరూపించేలా సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్ లత శ్రీనివాస్ , ఉపసర్పంచ్ మద్దికుంట దయానంద్, గ్రామ పెద్దలు గంగా రెడ్డి, కుమ్మరి మురళీలు కలిసి సీధిపోశకాలకు మొత్తం గ్రామం సమక్షంలో హెచ్చరిక ఇచ్చారు.మధ్యాహ్నం బడి ప్రాంగణంలోకి రహస్యంగా ప్రవేశించిన సర్పంచ్ లత శ్రీనివాస్ పిల్లలు తిన్న మధ్యాహ్న భోజన ప్లేట్లను, వంటగది, గోదామును పూర్తిగా తనిఖీ చేశారు. భోజనంలో వాడిన కూరగాయలు, అన్నం, పప్పు నాణ్యత, పరిశుభ్రతలు అందరి కళ్ల ముందే పరీక్షించారు. ఈ ఆకస్మిక చెక్‌కి సీధిపోశకులు ఆశ్చ ర్యంతో ఉత్తేజం చెందారు.పిల్లల ఆరోగ్యం మా మొదటి బాధ్యత, ప్రతి రోజూ ఇలాంటి తనిఖీలు చేస్తూ నాణ్యతను కాపాడతాం అని సర్పంచ్ లత శ్రీనివాస్ లు స్పష్టం చేశారు.ఉపసర్పంచ్ మద్దికుం ట దయానంద్ మాట్లాడుతూ, గ్రామ పిల్లల భవి ష్యత్తు మా చేతుల్లో ఎలాంటి లోపాలు ఉంటే అక్కడే సర్దుతాం” అన్నారు. గ్రామ పెద్దలు గంగా రెడ్డి, కుమ్మరి మురళీలు పిల్లలతో మాట్లాడి, భోజ నం ఎలా ఉందో తెలుసుకున్నారు. పిల్లలు సంతో షంగా “భోజనం చాలా బాగుందని సర్పంచ్ తెలి పారు.ఈ తనిఖీ గ్రామంలో మంచి చర్చనీయాంశ మైంది. ప్రజలు సర్పంచ్ లత శ్రీనివాస్ ల నాయక త్వాన్ని, గ్రామ పెద్దల సహకారాన్ని ప్రశంసిస్తు న్నారు. మధ్యాహ్న భోజన పథకం సడన్ చెక్‌లతో మరింత బలపడి, పిల్లల భవిష్యత్తును మెరుగు పరుస్తుందని అంచనా వేస్తున్నారు గ్రామస్తులు.


