అనాసాగరం గ్రామ పరిధిలోని వందల ఎకరాల మాగాణి పొలాలకు వెళ్లే ప్రధాన రహదారి రైతులకు తలనొప్పిగా మారింది. ఇటీవల కురిసిన అకాల వర్షాల ప్రభావంతో రహదారి గుంతల మయం అవడంతో రోజూ వందలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. పంట దిగుబడి సమయం సమీపిస్తుండటంతో పండిన పంటను ఇంటికి తరలించడంలో పెద్ద సమస్యలు తలెత్తే అవకాశ ముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఈ సమస్యను గమనించిన నందిగామ జనసేన నాయకుడు కొట్టె బద్రి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మరియు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం బోర్డు మెంబర్ తంబళ్ళపల్లి రమాదేవి ఆదేశాల మేరకు గ్రామ రైతులను ఏకం చేసి సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం రైతాంగ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కలసి రహదారి దుస్థితిని వివరించి, తక్షణ పరిష్కారం కోసం అర్జీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టె బద్రి, నల్లగొండ మురళీ కృష్ణ, టీడీపీనాయకులు దుగ్గిదేవి గోపి కృష్ణ, గ్రామ పెద్దలు, కూలీలు, రైతులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

అనాసాగరం పొలాల రహదారి దెబ్బతిని… రైతులకు నానా ఇబ్బందులు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు జనసేన బద్రి వినతి
అనాసాగరం గ్రామ పరిధిలోని వందల ఎకరాల మాగాణి పొలాలకు వెళ్లే ప్రధాన రహదారి రైతులకు తలనొప్పిగా మారింది. ఇటీవల కురిసిన అకాల వర్షాల ప్రభావంతో రహదారి గుంతల మయం అవడంతో రోజూ వందలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. పంట దిగుబడి సమయం సమీపిస్తుండటంతో పండిన పంటను ఇంటికి తరలించడంలో పెద్ద సమస్యలు తలెత్తే అవకాశ ముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఈ సమస్యను గమనించిన నందిగామ జనసేన నాయకుడు కొట్టె బద్రి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మరియు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం బోర్డు మెంబర్ తంబళ్ళపల్లి రమాదేవి ఆదేశాల మేరకు గ్రామ రైతులను ఏకం చేసి సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం రైతాంగ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కలసి రహదారి దుస్థితిని వివరించి, తక్షణ పరిష్కారం కోసం అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టె బద్రి, నల్లగొండ మురళీ కృష్ణ, టీడీపీనాయకులు దుగ్గిదేవి గోపి కృష్ణ, గ్రామ పెద్దలు, కూలీలు, రైతులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

