కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
అక్టోబర్ 17
జిల్లా ఎస్పీ శ్రీ కాంతిలాల్ పాటిల్ IPS ఆదేశాల మేరకు, కాగజ్‌నగర్ Z.P.H.S ప్రాంగణంలో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
కళాబృందం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, బాల్యవివాహాల ముప్పులు, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రత, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, హెల్ప్‌లైన్ నంబర్లు (1930, 100, 1098) తదితర అంశాలపై వినూత్నమైన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు చైతన్యం కలిగించారు.
స్థానిక ఎస్.ఐ శ్రీకాంత్ విద్యార్థుల ప్రశ్నలకు సమగ్రంగా స్పందించడమే కాక, యువతలో నైతిక విలువలు, క్రమశిక్షణ, సమాజసేవపై చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమ అనంతరం ఎస్.ఐ గారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఐ శ్రీకాంత్, కళాబృంద సభ్యులు రోహిత్, రాంచందర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, రజిత, సంఘవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


