Monday, 8 December 2025

Tag: Manthani

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం

*మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం* మంథని/హైదరాబాద్, జులై 27, పున్నమి ప్రతినిధి: మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా కుడుదుల వెంకన్న, వైస్ చైర్మన్, డైరెక్టర్లు శనివారం హైదరాబాద్ లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు అభినందనలు తెలియజేశారు. ఇదే క్రమంలో మంత్రి మాట్లాడుతూ చైర్మన్, డైరెక్టర్లు అందరూ కలిసి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, రైతుల కష్టాలను తీర్చడానికి వారి వెన్నంటే ఉండాలని, వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలని అన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మంథని మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, వివిధ మండలాల చైర్మన్స్, డైరెక్టర్స్ పాల్గొనడం జరిగింది.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

జూనియర్ సివిల్ జడ్జిని సన్మానించిన ఇనుముల..!!

*జూనియర్ సివిల్ జడ్జిని సన్మానించిన ఇనుముల…!!* మంథని/హైదరాబాద్, జులై 27, పున్నమి ప్రతినిధి: ఉస్మానియా యూనివర్సిటీలోని న్యాయ కళాశాలలో ఎల్ ఎల్ ఎం ప్రథమ సంవత్సరం చదువుతూ, ఇటీవల ప్రకటించిన జ్యుడిషియరీ నియామక ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జి ( జే సీ జే ) గా ఎన్నికయిన సహచర విద్యార్థిని ధరావత్ సుష్మ ను తమ బ్యాచ్మెట్, పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది, లాయర్స్ ఇండియా ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇనుముల సత్యనారాయణ (సతీష్ ) అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తమతో పాటు పీజీ చేస్తున్న సుష్మ జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్ లో జ్యుడిషియర్ విభాగంలో మరింత ఎత్తుకు ఎదుగాలని పలువురు ఆకాంక్షించారు. అదేవిధంగా పదవ తరగతి వరకు సూర్యాపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో చదివి, ఆ తర్వాత హైదరాబాద్ లోని పెండెకంటి న్యాయ కళాశాలలో ఎల్ ఎల్. బి పూర్తి చేసి, గ్రామీణ నేపథ్యం న్యాయ శాస్త్ర ప్రతిభకు అడ్డురాదనీ నిరూపించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయిన సుష్మ ను సహచర విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయశాస్త్ర పీజీ విద్యార్థి ఇనుముల సత్యనారాయణ తో పాటు సహచర పీజీ విద్యార్థులు నరేష్ రాథోడ్, ప్రభావతి, నవీన్ కుమార్, ఆనంద్, వేణుగోపాల్, సువర్ణ, శరత్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు

రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు మంథని, జులై 22, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 23న నిర్వహించే రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయడానికి విద్యార్థి లోకమంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని,బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని,అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి.ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ లతో ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యా రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు బందెల రాజకుమార్, నాయకులు రజినీకాంత్, గణేష్, రోహిత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ రంగారెడ్డి హైదరాబాద్

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తిచేయాలి- మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, జులై 18, పున్నమి ప్రతినిధి : బాచుపల్లి – గండి మైసమ్మ వరకు 6 వరసల రోడ్డు, బహుదూర్ పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపు పై రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ సువర్ణ, హెచ్ ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ నవాజ్, జిహెచ్ ఎంసీ అదనపు కమిషనర్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, మేడ్చెల్స్ అదనపు కలెక్టర్, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి, ఫారెస్టేతర స్థలాల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగే విధంగా యుద్ధ ప్రాతిపదికన నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అటవీ శాఖకు చెందిన 19 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించి మొదటి దశ ఫార్మాటిలిటీలన్నీ గడువులోగా అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానికులకు చెందిన భూముల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులో మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే 8 శాసన నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి అన్నారు. బహదూర్ పల్లి నుంచి కొంపల్లి రోడ్డులో అటవీ భూమి బదలాయింపునకు సంబంధించి స్టేజ్-1 ప్రక్రియ పూర్తయిందని ఫారెస్ట్ అధికారులు శ్రీధర్ బాబుకు వివరించారు. బాచుపల్లి – గండి మైసమ్మ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీభూమి ట్రాన్సఫర్ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. సుభాష్ నగర్ పైపు లైన్, సెయింట్ యాన్స్ స్కూల్ రోడ్డు నిర్మాణం పనులను కూడా పూర్తి చేయాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పోస్టులు మoజూరు చేయండి

ముధోల్, జులై 16(తెలంగాణ పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముధోల్లో ప్రారంభం అయినా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2024 సంవత్సరంలో 54 విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. 8మంది అతిథి అధ్యాపకుల నియామకం జరిగింది. ఈ సంవత్సరo కుడా అధ్యాపకుల సహకారంతో ఫేస్ 3 వరకు 86 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. కానీ ఇప్పట్టి వరకు అధ్యాపకులకు పర్మిషన్ ఇవ్వలేదు. అడ్మిషన్స్ షెడ్యూల్ ప్రకారం క్లాస్ లు ప్రారంభమయ్యాయి. అధ్యాపకుల నియామకంలో ఆలస్యం వలన విద్యార్థులు నష్టపోతున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవోలో ముధోల్ డిగ్రీ కళాశాల కు పోస్ట్ లు మంజూరు చేయలేదు. దీని వలన ఇక్కడ ఉన్న అధ్యాపకులకు విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కమీషనర్ వెంటనే స్పందించి ముధోల్ కళాశాలకు పోస్ట్ లు-నిధులు విడుదల చేయాలని ముధోల్ వీడీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి ముధోల్ఎమ్మెల్యే రామారావు పటేల్ కి స్థానిక నాయకులు ఫోన్ చేసి వివరించారు. ఎమ్మెల్యే కూడా ఈ విషయం పై ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్య పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది.

తెలంగాణ పెద్దపల్లి

రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా చేయాలి: సీపీఐ

*రైతులకు యూరియా కొరతను నివారించి, సరఫరా చేయాలి* *జూలై 17 న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి* *సీపీఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్* ముత్తారం, జులై 15, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఉన్న రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉందని, కొరతను నివారించి సరపరా చేయాలని సీపీఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ ప్రభుత్వ అధికారులను కోరారు. మంగళవారం ముత్తారం మండల సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వర్షా కాలం ప్రారంభమై రైతులు తమ వ్యవసాయ అవసరాలకు సరిపడా యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారని, మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న రైతులకు సరిపడా యూరియాను అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) పెద్దపల్లి జిల్లా మహాసభలు జూలై 17 న జిల్లా కేంద్రంలోని ఎస్ .ఎన్ గార్డెన్ లో జరుగుతాయని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆయన అన్నారు. సీపీఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ మహాసభలు నిర్వహించి నూతన నాయకత్వాన్ని ఎన్నుకుని భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ జాతీయ సమితి నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17 న జరిగే జిల్లా మహాసభల్లో ముత్తారం మండల సీపీఐ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరౌతారని ఆయన అన్నారు. ముత్తారం మండల సీపీఐ కార్యదర్శి కామ్రేడ్ గాదె సమ్మయ్య అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ నాయకులు అల్లం ఓదేలు, గుండ విజయ్ కుమార్, రేగుంట మహేశ్, గంధం రాజయ్య, ముంజ సతీష్, సి.హెచ్. రాజ్ కుమార్, ఎం.చంద్రమౌళి, నల్లి శంకర్, జి.గంగయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టియు ముందంజ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు ముందంజ కాటారం, జులై 16, పున్నమి ప్రతినిధి: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రెండవ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపాధ్యాయ సంఘం నాయకులు నిర్వహించారు. మంగళవారం కాటారం మండల కేంద్రంలోని ధన్వాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో 38 మంది ఉపాధ్యాయులను పీఆర్టియు సంఘం సభ్యులుగా చేర్చుకున్నామని, కాటారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఏ రవీందర్, ఏ, తిరుపతి, తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజలో ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు ఎస్ సతీష్, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ

ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, జులై 14, పున్నమి ప్రతినిధి: మహిళా శ్వశక్తి సంఘాలు క్రియాశీలకంగా పనిచేసి ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం మంథని నియోజకవర్గ పరిదిలోని కాటారం, మహాదేవ పూర్, మహా ముత్తారం, పలిమెల, మల్హర్ మండలాల పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాలు, బాంక్ లింకేజీ, ప్రమాద భీమా, రుణ భీమా, మహిళా సంఘాలు ద్వారా నడుపుతున్న ఆర్టీసీ బస్సుకు అద్దె చెల్లింపులు, ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ ను రెడ్ కో సంస్థ ద్వారా తిరిగి ప్రభుత్వం కోనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మహిళా సంఘాలు ద్వారా దాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశ్యం, లక్ష్యం మహిళల ఆర్థికాభివృద్ధి ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. 36,34,751 లక్షల రూపాయలు ప్రమాద భీమా, రుణ భీమా 30 లక్షలు, బ్యాంకు లింకేజీ 10.30 కోట్లు, 69.03 లక్షలు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. డివిజన్ లో మొత్తం 3161 మహిళా సంఘాలలో 32070 మంది సభ్యులున్నారని తెలిపారు.మహిళలు తలచుకుంటే చేయలేనిది ఏమి ఉండదని ఇంట్లో వంట నుండి పిల్లల విద్యాబ్యాసం వరకు అన్నింటిలో మహిళలు ముందుంటారని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో మహిళలలకు పైసా కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని తెలిపారు. అవసరాన్ని బట్టి రుణాలు, వనరులు సమకూర్చి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వ్యాపార వేత్తలుగా తయారు చేయనున్నట్లు తెలిపారు. మీ శక్తి, యుక్తి కి వాణిజ్య, వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పనకు ప్రభుత్వం గొప్ప ఆలోచనలతో ముందుకు పోతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా కోటి రూపాయలతో సోలార్ విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ప్రభుత్వానికి విద్యుత్ విక్రంయించి సంఘాల సభ్యులకు ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. వారం రోజుల్లో మండలానికి 100 మంది మహిళలకు కుట్టు మిషన్లులో శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీవోను ఆదేశించారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. 200 లోపు ఉచిత విద్యుత్తు, 500లకు గ్యాస్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, 9 రోజులలో 9 వేల కోట్లు రైతు భరోసా, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు ద్వారా ఇందిరామహిళా శక్తి క్యాన్టీన్లు, వడ్డీలే ని రుణాలు, దాన్యం కొనుగోలు కేంద్రాలు, యూనిఫామ్స్ కుట్టించే పనులు, గణపురం, మహాదేవ పూర్ లో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఇస్తూ ఆర్థికాభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు వివరించారు. మహిళా సాధికారితకు టీము వర్కుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న 6 రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షలు చొప్పున 30 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, 5 మండలాల సింగిల్ విండో చైర్మన్లు, సమ్మక్క సారక్క జిల్లా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, కార్యదర్శి రజిత తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.