Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: Mahabubabad

మహబూబాబాద్

కరువు పరిస్థితుల్లో కోట్ల భారం

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రూ-అప్‌ చార్జీలు వేయాలని ఇఆర్స్సీ చెప్పినా కేసీఆర్ గారు అనుమతించలేదు. విద్యుత్ సంస్థల భారాన్ని ప్రజలపై వేయొద్దు అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి కరువు పరిస్థితుల్లో ప్రజలపై రూ. 5420 కోట్ల భారం వేస్తున్నడు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా పీడన పాలన !! విద్యుత్ సంక్షోభం పై హరీష్ రావు ధ్వజమెత్తారు Uploaded Video:

మహబూబాబాద్

అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు*

*కురవి, అక్టోబర్ 07:* కురవి మండలంలోని బంచరాయితండాకు చెందిన పత్రిక విలేకరి దేవన్న గారి తండ్రి బానోత్ సక్రం గారు ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు,ఈ సందర్భంగా వారి కుటుంబానికి *రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు* అదే గ్రామానికి చెందిన నునావత్ శ్రీను గారు ఇటీవల ప్రమాదానికి గురై, వైద్యుల సూచన మేరకు కాలు తొలగించాల్సి రావడంతో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* శ్రీను గారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా *రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు* ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నునావత్ వీరన్న, మాజీ ఎంపీటీసీ వీరు నాయక్, తేజ నాయక్, సేత్య, శరత్, ఐలి నరహరి గౌడ్, బోడ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు

మహబూబాబాద్

అధిక బిల్లులపై వార్డు మెంబర్ల నిరసన

*మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం వార్డు మెంబర్లు కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకుని, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వార్డు మెంబర్ల శిక్షణ తరగతుల నిర్వహణలో వాస్తవంగా జరిగిన ఖర్చులకు మించి బిల్లులు చెల్లించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన పత్రాలను మీడియా ముందు చూపిస్తూ వారు వివరించారు.* *శిక్షణ తరగతుల్లో స్థానికంగానే వంటలు నిర్వహించి భోజనాలు మాత్రమే అందించారని, సమోసాలు తదితర అల్పాహారాలు తమకు ఇవ్వలేదని తెలిపారు. అశోక హోటల్ నుంచి తీసుకువచ్చిన బిల్స్ పూర్తిగా తప్పు అని మండిపడ్డారు. అలాగే స్కేలు, పెన్సిళ్లు, పెన్నులు వంటి సామగ్రి కూడా ఎవరికీ అందించలేదని చెప్పారు. అయినప్పటికీ ఆయా వస్తువులకు బిల్లులు ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా పొందిన పత్రాల్లో వెల్లడైందని పేర్కొన్నారు.* *శిక్షణ తరగతులు జయ్యారం గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించగా, అక్కడ ఇప్పటికే సౌండ్ సిస్టమ్, కుర్చీలు తదితర సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటికి కూడా బిల్లులు చూపించినట్లు పత్రాలను ప్రదర్శించారు. ప్రజాధనానికి సంబంధించిన బిల్లుల విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, సర్పంచిగా పోటీ చేసిన అభ్యర్థులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.*

మహబూబాబాద్

కుటుంబ సభ్యులకు ఓదార్పు

ది.07.10.2026 మరిపెడ మండలం, *గిరిపురం మాజీ సర్పంచ్ భూక్య లాల్య గారి భార్య భూక్య బుల్లి (56)* గారు కొద్ది రోజులుగా అనారోగ్య‌ సమస్యతో బాధపడుతు ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని ఈరోజు ఇటుకలగడ్డ తండ లో సందర్శించి,నివాళులర్పించి,కుంటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించిన.. 🔹*డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ గారు* *గిరిపురం గ్రామ పెద్దలు PVRN శాస్త్రీ- అన్నపూర్ణమ్మ గారు,* గ్రామ నాయకులు, తండా వాసులు తదితరులు ఉన్నారు.

మహబూబాబాద్

కురవిలో ‘అక్రమ పట్టాల’ కలకలం

•ఎరుకల కుటుంబంపై దౌర్జన్యాలా..? •కురవిలో భూదందా ఆరోపణలు.. బాధితులపై దౌర్జన్యాలా?! •భూమి పంచాయితీపై భగ్గుమన్న బీఎస్పీ..! ••ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టాలి. మహబూబాబాద్ జిల్లా విలేకరి: కురవి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో ప్రభుత్వ భూమి స్థలానికి సంబంధించి అక్రమ పట్టా ఆరోపణలు, నివాస గృహాల మధ్య పెట్రోల్ పదార్థాలతో భూ షెడ్లు చేయడం, ప్రశ్నించిన బాధితులను కులం పేరుతో దూషిస్తూ దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ డిమాండ్ చేశారు. కురవికి చెందిన బాధితుడు నిమ్మశెట్టి వెంకన్న, ఆయన కుటుంబ సభ్యులు తమపై జరుగుతున్న అన్యాయాన్ని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్‌కు వివరించారు. బాధితులు అందించిన ఆధారాలు, రికార్డులను పరిశీలించిన అనంతరం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధితులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దార్ల శివరాజ్ మాట్లాడుతూ.. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన అమాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న తల్లారి వీరన్న, తల్లారి లక్ష్మీనారాయణ, తాతూరి సంతోష్, చిలుముల సంతోష్, చిలుముల శ్రీకాంత్ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులను కులం పేరుతో దూషించి, అవమానించి, దాడులు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన అంశమన్నారు. సర్వే నంబర్ 852పై సమగ్ర విచారణ చేయాలి: కురవిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 852కు సంబంధించి పూర్తి లింక్ పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, హక్కులు, స్వాధీనం తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని శివరాజ్ కోరారు. రామయ్య ఒకే ఇంటికి ఒకే నంబర్ ఉన్న పరిసరాల్లో ఒకే ఇంటి నంబర్‌పై 7 గుంటల రిజి స్వప్నాలు ఎలా జరిగాయి? సంబంధిత రికార్డులు ఎలా సృష్టించబడ్డాయి? అనే అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూమికి సంబంధించి పట్టా ఎలా మంజూరైంది? దానికి సంబంధించిన రికార్డులు ఏమిటి? అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్య పెట్రోల్‌పై చర్యలు ఏది..? నివాస గృహాల మధ్య పెట్రోల్ పదార్థాలు ఉపయోగించి భూ షెడ్లు చేయడం వల్ల స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని శివరాజ్ ఆరోపించారు. పెట్రోల్ పదార్థాల వినియోగానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? నిబంధనలకు అనుగుణంగానే వినియోగిస్తున్నారా? అనే అంశాలపై పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. బాధితులపై దాడులు, బెదిరింపులు, కులం పేరుతో దూషణలకు పాల్పడిన వారిపై SC/ST (Prevention of Atrocities) Actతో పాటు ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకుంటే ప్రజా సంఘాలతో ఉద్యమం: బాధిత కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు వారి నివాసానికి, ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని శివరాజ్ కోరారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే మాల మహానాడు, ఎంఆర్‌పీఎస్, గిరిజన సంఘాలు, ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ హెచ్చరించారు.

మహబూబాబాద్

నిజమైన దాంపత్యం

*ప్రతి భార్యాభర్త తప్పక చదవాల్సిన మనందరి కథ* 🙏 “ఏవండీ… ఒక మాట అడుగుతాను. ఏమీ అనుకోకుండా నిజాయితీగా సమాధానం చెప్పాలి…” “మళ్లీ ఏదో భేతాళ ప్రశ్న వేయబోతున్నావా? సరే… అడుగు!” “మన పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. మనిద్దరం ఇక్కడే ఉంటున్నాం. దేవుడి దయవల్ల తిండికి, బట్టకి, సొంతింటికి లోటు లేదు. ఇద్దరం ఒకరికొకరం తోడుగా హాయిగా కాలం గడుపుతున్నాం. కానీ… రానురాను మన వయసు పెరుగుతోంది. ఓపికలు తగ్గుతున్నాయి. పూర్వం లాగా పిల్లల దగ్గర శాశ్వతంగా ఉండలేం. వాళ్లూ ఉద్యోగాలు, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలతో మన దగ్గరకు ఎప్పుడూ రాలేరు. అందుకే… ఒకవేళ నాకు ఏమైనా అయితే మీరు ఒంటరిగా ఎలా ఉంటారో అని భయంగా ఉంది. ఈ ఆలోచనలతో రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు…” భర్త కాసేపు మౌనంగా ఉండి… “నాకూ అదే భయం ఉంది. కానీ ఒక చిన్న తేడా ఉంది. నువ్వు నేను లేకపోతే ఎలా బతకాలి అని ఆలోచిస్తున్నావు… నేను మాత్రం నువ్వు లేకపోతే ఎలా బతకాలో ఆలోచిస్తున్నాను! నీకంటే నేను ఐదేళ్లు పెద్దవాడిని. మనలో ఎవరు ముందు వెళ్తారో ఎవరికీ తెలియదు. అందుకే ఈరోజు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ❤️ ప్రేమ అంటే ఒకరిపై ఒకరు ఆధారపడటం మాత్రమే కాదు… ఒకరు లేని సమయంలో మరొకరు నిలబడేలా చేయడం కూడా! నువ్వు నాకు ఎన్నిసార్లు చెబుతావు… ‘మీరు లేకపోతే నేను ఏం చేయాలి?’ అని. కానీ నేను అడుగుతున్నది… ‘నేను లేకపోతే నువ్వు ఏం చేయగలవు?’ మన సందు చివర్లో ఉన్న ATMకి వెళ్లి డబ్బు తీసుకురాగలవా? UPI ద్వారా డబ్బు పంపగలవా? ఫోన్‌లో వచ్చిన OTP అంటే ఏమిటో తెలుసా? Google Pay / PhonePe / Net Banking ఎలా ఉపయోగించాలో తెలుసా? అత్యవసర సమయంలో Cab బుక్ చేయగలవా? 108 Ambulanceకి ఫోన్ చేయగలవా? నా ఫోన్‌లో Emergency Contacts ఎక్కడున్నాయో తెలుసా? మన పిల్లలకు Video Call ఎలా చేయాలో తెలుసా? WhatsAppలో Location Share చేయగలవా? మన ఇంటి Google Maps Locationని ఎవరికైనా పంపగలవా? నా హాస్పిటల్, డాక్టర్, ఇన్సూరెన్స్ వివరాలు ఎక్కడున్నాయో తెలుసా? మన ఆరోగ్య బీమా కార్డు ఎక్కడుంది? దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా? ఇంట్లో Gas అయిపోతే ఎలా Book చేయాలో తెలుసా? కరెంట్ బిల్లు ఎలా చెల్లించాలో తెలుసా? నీ మొబైల్ Recharge ఎలా చేసుకోవాలో తెలుసా? మన Bank Accounts ఎక్కడున్నాయి? ఎన్ని Deposits ఉన్నాయి? ఏవి Maturityకి వస్తున్నాయి? మన ముఖ్యమైన Documents — Aadhaar, PAN, Insurance, Property Papers, Bank Details — ఎక్కడ భద్రంగా ఉన్నాయో తెలుసా? మన పిల్లలు విదేశాల్లో ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం… కానీ వాళ్లకు మన అవసరం వచ్చినప్పుడు మనం Video Call చేయగలమా? వాళ్లకు మన పరిస్థితిని సరిగ్గా చెప్పగలమా? ఇవి చిన్న విషయాలే అనిపించవచ్చు. కానీ… అత్యవసర సమయంలో ఇవే జీవితంలో పెద్ద విషయాలవుతాయి! ⸻ భార్య నెమ్మదిగా… “మీరు ఎన్నిసార్లు చెప్పారు… కానీ నాకు ఇవన్నీ అవసరం ఉండదనిపించింది. మీరు ఉన్నారుగా… అన్నీ మీరే చూసుకుంటారు అనుకున్నాను…” భర్త చిరునవ్వుతో… “అదే మన పెద్ద పొరపాటు. ‘ఆయన ఉన్నారుగా… ఆమె ఉన్నారుగా…’ అని జీవితమంతా ఒకరిపై ఒకరు ఆధారపడుతూ వచ్చాం. కానీ జీవితానికి గ్యారంటీ లేదు. అందుకే ఇకనుంచి… నువ్వు నాకు నేర్పాలి. నేను నీకు నేర్పాలి. నువ్వు UPI నేర్చుకో. నేను వంట నేర్చుకుంటాను. నువ్వు Bank పనులు నేర్చుకో. నేను ఇంటి పనుల్లో కొన్ని నేర్చుకుంటాను. నువ్వు Emergency Contacts తెలుసుకో. నేను Insurance వివరాలు తెలుసుకుంటాను. నువ్వు Online Payments నేర్చుకో. నేను Medicines, Medical Records ఎక్కడున్నాయో నీకు చూపిస్తాను. మనిద్దరం కలిసి బతకాలి… అదే సమయంలో ఒకరు లేకపోయినా మరొకరు ధైర్యంగా నిలబడగలగాలి.” భార్య కళ్లలో నీళ్లు… “ఇలా చెప్పేసరికి భయంగా ఉంది…” భర్త ఆమె చేతిని పట్టుకుని… “భయపడాల్సిన అవసరం లేదు. మన చేతిలో లేనిదాని గురించి భయపడటం కంటే… మన చేతిలో ఉన్నదాన్ని నేర్చుకోవడం మంచిది. దేవుడు మనకు ఎన్ని రోజులు జీవితం ఇస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన ఇచ్చిన ప్రతి రోజును ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో, ఒకరికొకరం అండగా గడపడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. 🙏 భగవద్గీత చదవడం మాత్రమే కాదు… అందులోని ధైర్యాన్ని జీవితంలో ఆచరించాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే… చదువు, ఉద్యోగం, కారు డ్రైవింగ్, వంట, ఈత, టెక్నాలజీ, డబ్బు నిర్వహణ… అన్నీ నేర్పిస్తాం. కానీ మనం వయసు పెరిగిన తర్వాత… ‘ఇవి నాకు ఎందుకు?’ అని అనకుండా ‘రేపు అవసరం అయితే నేనే చేసుకోగలనా?’ అని ఆలోచించాలి. ⸻ 🌷 ఈ కథ మనందరికీ ఒక చిన్న గుర్తు భర్త భార్యకు ప్రత్యామ్నాయం కాదు. భార్య భర్తకు ప్రత్యామ్నాయం కాదు. కానీ… ఒకరి జీవితంలో మరొకరు అద్భుతమైన తోడు. ❤️ ఆ తోడు ఉన్నంతకాలం ప్రేమగా జీవిద్దాం. అదే సమయంలో… ఒకరు లేని రోజు వచ్చినా, మరొకరు కూలిపోకుండా నిలబడేలా ఒకరినొకరు సిద్ధం చేద్దాం. 📱 Technology నేర్చుకుందాం. 💳 Digital Payments నేర్చుకుందాం. 🏦 Banking తెలుసుకుందాం. 🚑 Emergency Services తెలుసుకుందాం. 📄 Documents సక్రమంగా ఉంచుకుందాం. 🔐 ముఖ్యమైన సమాచారాన్ని సురక్షితంగా నిర్వహిద్దాం. ❤️ పిల్లలతో Regular Contactలో ఉందాం. 🙏 ముఖ్యంగా… ఒకరినొకరు ప్రేమగా, గౌరవంగా చూసుకుందాం. 🌺 చివరగా ఒక్క మాట… “నీవు లేక నేను లేను” అనేది ప్రేమ. “నీవు లేకున్నా నేను నిలబడగలను” అనేది జీవితంపై అవగాహన. “నీవు ఉన్నంతకాలం నీకు తోడుగా ఉంటాను” అనేది నిజమైన దాంపత్యం. ❤️ కర్తవ్యం మన వంతు… కాపాడటం ఆయన వంతు. 🙏 ఈ చిన్న కథను మనలాంటి ప్రతి భార్యాభర్త ఒక్కసారి చదివి… ఒక్కసారి మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకుందాం.🙏

మహబూబాబాద్

సేవా జ్యోతి యాత్ర బైక్ ర్యాలీ

🪷🇮🇳 సేవా జ్యోతి యాత్ర – బైక్ ర్యాలీ 🇮🇳🪷 సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజాసేవ–అంకితభావం మరియు దేశ సేవ – వికసిత్ భారత్ సంకల్పం సందర్భంగా… 🔥 సేవా జ్యోతి యాత్ర – బైక్ ర్యాలీ 🔥 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అక్టోబర్ 7వ తేదీన ఉదయం 9:30 గంటలకు మానుకోట పట్టణ కేంద్రంలోని నెహ్రూ సెంటర్ నుండి వివేకానంద సెంటర్ వరకు సేవా జ్యోతి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ⭐ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ శ్రీ మార్తినేని ధర్మారావు గారు మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, హనుమకొండ పాల్గొంటున్నారు 🏍️ ప్రతి బైక్‌పై ఇద్దరు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షుల నుండి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు, కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. 👉 ప్రతి మండలం నుండి కనీసం 30 బైకులు 👉 ప్రతి బైక్‌పై ఇద్దరు తప్పనిసరిగా పాల్గొనాలి 👉 అందరూ ఉదయం 9:30 గంటలకు నెహ్రూ సెంటర్‌కు సకాలంలో చేరుకోవాలి. 🇮🇳 మన భాగస్వామ్యం… మన బాధ్యత 🔥 మన సంకల్పం… వికసిత్ భారత్ 🪷 సేవా జ్యోతి యాత్రను విజయవంతం చేద్దాం! మీ చీకటి మహేష్ గౌడ్ బిజెపి మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి

మహబూబాబాద్

అనుబత్తుల ఐలయ్య మృతికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నివాళులు

కురవి మండలం మోదుగులగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబత్తుల ఉపేందర్ తండ్రి అనుబత్తుల ఐలయ్య గారి మృతి పట్ల ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు సంతాపం వ్యక్తం చేశారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఐలయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్, మండల నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచ్లు, గ్రామ అధ్యక్షులు, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

మరిపెడ మండల కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం

మరిపెడలో జనరల్ బాడీ సమావేశం మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. మరిపెడ మండల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుగులోతు రవి నాయక్, టౌన్ అధ్యక్షులు రామ్ లాల్ నాయక్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

22-A భూముల రిజిస్ట్రేషన్ లకు షరతులతో అనుమతి

*22-A భూముల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి* *తెలంగాణ ప్రభుత్వం 22-A పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి ఇచ్చింది.* ▪️ చెల్లుబాటు అయ్యే లేఅవుట్/బిల్డింగ్/అపార్ట్‌మెంట్ అనుమతి తప్పనిసరి. *▪️ HMDA/GHMC/CMC/MMC/DTCP లేదా స్థానిక సంస్థ అనుమతి ఉండాలి.* ▪️ చెల్లుబాటు అయ్యే రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్లు సమర్పించాలి. *▪️ కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు తుది తీర్పులు, ఆదేశాలకు లోబడి ఉంటాయి.* ▪️ వివాదాస్పద ఆస్తులపై అధికారులు పూర్తిస్థాయి పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ▪️ సందేహాలు, అభ్యంతరాల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు.