Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: collectorate

BHUPALPALLE

నేత్రదాన అవగాహన సదస్సు భూపాలపల్లి లో నిర్వహణ

భూపాలపల్లి: 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నేత్రదానంపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. భరత్ కుమార్, నేత్ర వైద్య విభాగ అధిపతి, నేత్రదాన ప్రాముఖ్యతను వివరించారు. డా. బి.ఆర్. భరత్ కుమార్ మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం ద్వారా అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపును ప్రసాదించవచ్చని, ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. దేవేందర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, నేత్రదాన మహత్తరమైన మానవతా సేవ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి. హెప్సీబా, ఆప్కామిక్ అధికారి బూరుగు రవికుమార్, మురళీధర్ రెడ్డి, ఎన్‌సీడీ కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి

కలెక్టరేట్ లో రక్షాబంధన్ వేడుకలు

రాఖీ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ మహిళా సిబ్బంది జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సహోదరత్వం, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ ప్రాశస్త్యాన్ని స్మరించుకున్నారు. కార్యాలయ విధుల నిర్వహణలో జిల్లా కలెక్టర్ అందిస్తున్న మార్గదర్శకత్వం, సహకారానికి మహిళా సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మహిళా అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, వారి సంక్షేమం, భద్రతకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సీనియర్ సహాయకులు విజయ, అనురాధ, సుమలత, జూనియర్ సహాయకులు మౌనిక తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి

కలెక్టరేట్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

క్రీడా ప్రాధికార సంస్థ (వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్), హైదరాబాద్ వారి ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్ గారి అనుమతితో జిల్లా కలెక్టర్ కార్యాలయ మీటింగ్ హాల్ నందు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను శుక్రవారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని పురస్కరించుకుని, కలెక్టరేట్ పరిపాలన అధికారి (AO) శ్రీనివాస్ మరియు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నవీన్ రెడ్డి గార్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ క్రీడారంగానికి ధ్యాన్ చంద్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, స్థానిక క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

జయశంకర్ భూపాలపల్లి

భూ భారతి పనులకు వేగం పెంచాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

భూ భారతి, సాదా బైనామా, బల్క్ ల్యాండ్ సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బల్క్ భూముల సర్వే, భూ భారతి, సాదా బైనామా, సర్ ప్రక్రియకు నోటీసులు జారీ తదితర అంశాలపై తహసీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. సాదా బైనామాలో 2325, భూ భారతి 93 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ ఓటర్లు, అనామలిస్ ఓటరులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. జారీ చేసిన నోటీసు, నోటీసు తీసుకున్న వ్యక్తి ఫోటోలు ఎన్నికల సంగం పోర్టల్ అప్ లోడ్ చేయాలని సూచించారు. బల్క్ ల్యాండ్ సర్వే పూర్తి అయిన సర్వే నంబర్లుపై సమగ్ర నివేదికలు అందచేయాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ వసంత రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి

పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, ఆగస్టు 20(పున్నమి ప్రతినిధి): పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ, నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పుస్తకాలు, పాఠకులకు అందుతున్న సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీ ఏర్పాట్లు, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.అభ్యర్థులకు అవసరమైన కాంపిటీటివ్ పుస్తకాలు, కంప్యూటర్ సదుపాయం, ఆర్‌ఓ వాటర్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.గ్రంథాలయాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రమశిక్షణతో చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని అభ్యర్థులకు సూచించారు. అనంతరం గ్రంథాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, గ్రంథాలయ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.