Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
BHUPALPALLE

నేత్రదాన అవగాహన సదస్సు భూపాలపల్లి లో నిర్వహణ

Punnami Newsroom Published:
నేత్రదాన అవగాహన సదస్సు భూపాలపల్లి లో నిర్వహణ

Story highlights

  • భూపాలపల్లి: 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నేత్రదానంపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో డా.
  • భరత్ కుమార్, నేత్ర వైద్య విభాగ అధిపతి, నేత్రదాన ప్రాముఖ్యతను వివరించారు.

భూపాలపల్లి: 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నేత్రదానంపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. భరత్ కుమార్, నేత్ర వైద్య విభాగ అధిపతి, నేత్రదాన ప్రాముఖ్యతను వివరించారు.

డా. బి.ఆర్. భరత్ కుమార్ మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం ద్వారా అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపును ప్రసాదించవచ్చని, ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. దేవేందర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, నేత్రదాన మహత్తరమైన మానవతా సేవ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి. హెప్సీబా, ఆప్కామిక్ అధికారి బూరుగు రవికుమార్, మురళీధర్ రెడ్డి, ఎన్‌సీడీ కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *