संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: భక్తి

నంద్యాల

మహానంది దేవస్థానంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానం ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని గాంధీ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని అధికారులు పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు

నంద్యాల

గాంధీజీకి పోలీసుల నివాళి*—

నంద్యాల : మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిన గాంధీజీ దేశ ప్రజలకు ఆదర్శమన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, సహనం, సేవా భావం నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.కార్యక్రమంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆర్‌ఎస్‌ఐ కాళీ శ్రీచరణ్, పోలీసు సంఘం అధ్యక్షుడు స్వామినాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం

నంద్యాల : మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్‌, జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి అన్నారు.గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సత్యం, శాంతి, అహింస, జాతి సమైక్యత కోసం గాంధీజీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. రైతులు ఐక్యంగా శాస్త్రీయ పద్ధతులు పాటించి ఉద్యాన రంగ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారని తెలిపారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశ రక్షణ, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ‘జై జవాన్‌–జై కిసాన్‌’ నినాదాన్ని అందించారని గుర్తుచేశారు. ఇరువురు మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నంద్యాల

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నంద్యాలలో జనసేన నాయకుల ఘన నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు గల గాంధీజీ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు మరియు రాచమడుగు రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు రాచమడుగు చందు మాట్లాడుతూ:”సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన శాంతియుత పోరాట పంథా, సమాజ హితం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిదాయకం. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. సమాజంలో మంచి మార్పు కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, నీతివంతమైన పాలన దిశగానే సాగుతున్నాయి.” ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఠాగూర్, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

మహానందిలో TTD JEO డాక్టర్ శరత్ ఐఏఎస్ దంపతుల ప్రత్యేక పూజలు

మహానంది:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలోని శ్రీ కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామివార్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (JEO) డాక్టర్ శరత్ ఐఏఎస్ దంపతులు దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన TTD JEO దంపతులకు ఆలయ ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డి, పాలకమండలి చైర్మన్ నరాల చంద్రమౌళిరెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.దర్శనానంతరం స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో TTD JEO దంపతులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా, ఈవో మరియు చైర్మన్ స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

నంద్యాల

శ్రీవారిని కాలినడకన వెళ్లి దర్శనం చేసుకున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు.

నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డి లు గురువారం తెల్లవారుజామున వి ఐ పి బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు తిరుపతి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకొని గురువారం తెల్లవారుజామున శ్రీవారికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డి తలనీలాలు సమర్పించుకొని వి ఐ పి బ్రేక్ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శనం చేసుకొని, శ్రీవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.

నంద్యాల

కాణిపాకం వేడుకలకు మహానంది పట్టువస్త్రాలు

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామివారి తరఫున సోమవారం పట్టువస్త్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి, చైర్మన్ నరాల చంద్రమౌళిరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు, ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ధర్మకర్తలు కాణిపాకం చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా కాణిపాకం దేవస్థానం తరఫున మహానందీశ్వర స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను ఎన్. శ్రీనివాసరెడ్డి, నరాల చంద్రమౌళిరెడ్డికి అందజేసి వేదాశీస్సులు అందించారు. అలాగే మహానంది దేవస్థానం తరఫున కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను స్వీకరించారు. ఇరు ఆలయాల ప్రతినిధులు వేదపండితుల ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమం రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధాన్ని చాటిచెప్పింది.

నంద్యాల

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా నరసింహమూర్తి ఏకగ్రీవ ఎన్నిక

నంద్యాల : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా నరసింహమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా బ్రాహ్మణ సమాజ సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో నూతన జిల్లా అధ్యక్షుడిగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాఖ్య ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సమాఖ్య సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల జిల్లాలోని బ్రాహ్మణ కుటుంబాల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.బ్రాహ్మణుల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకుని సమాఖ్యను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.నరసింహమూర్తి ఏకగ్రీవ ఎన్నికపై సమాఖ్య నాయకులు, సభ్యులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో నంద్యాల జిల్లాలో బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ పత్రిక సమావేశంలో పాల్గొన్న వారు రాష్ట్ర కమిటీ సభ్యులు విశ్వనాథ్, నవీన్, జిల్లా కార్యదర్శి పురాణం సాయికిరణ్, ముల్లంగి కుమార్, గాదిరాజు దత్తాత్రేయ శర్మ, రవితేజ శర్మ, నందన శర్మ, శ్రీవత్సవ, తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

మహానంది క్షేత్రంలో కన్నులపండువగా ‘మహాలయ పౌర్ణమి’ చంద్రదర్శనం!

మహానంది: పితృదేవతలకు నమస్కరించి, వారి ఆశీస్సులు పొందే పవిత్రమైన పితృపక్షాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మహాలయ పౌర్ణమి (మహాలయ పున్నమి) శుభసమయంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఒక అద్భుతమైన, ఆధ్యాత్మిక దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. పితృదేవతలకు మోక్షమార్గాన్ని ప్రసాదించే దివ్య కాంతిలా మహానంది క్షేత్రంలోని గోపురాలు, ప్రాకారాలు, మరియు మండపాల నడుమ పూర్ణ చంద్రుడు రక్త వర్ణంలో కాంతివంతంగా ప్రకాశించాడు. దేవాలయం పక్కనే ఉన్న వెలగచెట్టు కొమ్మల మధ్య నుంచి అరుణ కాంతులతో వెలిగిపోతున్న ఈ ‘బ్లడ్ మూన్’ చంద్రుడి రూపం భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చింది.ఆలయ ప్రాంగణం మరియు ప్రకృతి అందాల నడుమ వెలువడిన ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకోవడానికి స్థానిక భక్తులు, యాత్రికులు విశేషంగా తరలివచ్చారు. పితృ తర్పణాలకు అత్యంత పవిత్రమైన ఈ రోజున, మహానందీశ్వరుని దివ్య సన్నిధిలో ఇలాంటి కాంతివంతమైన చంద్ర దర్శనం కలగడం ఎంతో శుభసూచకమని ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల

మహానంది ఆలయంలో పాలకమండలి కీలక నిర్ణయాలు.. అక్టోబర్ 11 నుంచి దసరా వేడుకలు

మహానందీశ్వరస్వామి వారి దేవస్థానంలో చైర్మన్‌ నరాల చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో 2026–27 సాధారణ, అన్నదాన బడ్జెట్లకు ఆమోదం తెలిపారు. అలాగే దేవస్థానం దుకాణాల అద్దె బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.