Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: తహసీల్దార్

నంద్యాల

గాంధీజీకి నివాళి

నంద్యాల : మహాత్మా గాంధీజీ 157వ జయంతిని పురస్కరించుకుని నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం గాంధీజీ చిత్రపటానికి తహసీల్దార్ ఎం. శ్రీవాణి, రెవెన్యూ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం. శ్రీవాణి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీజీ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.దేశంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు గాంధీజీ బోధించిన విలువలను ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసేవలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేయడం ద్వారా గాంధీజీ ఆశయాలకు నిజమైన గౌరవం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు రామచంద్రరావు, ఎం.వి.ఎస్.ఎస్. శేఖర్‌రెడ్డి, శూలం విజయశేఖర్, ఎంఆర్‌ఐ మాధవీరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

నంద్యాలలో 14వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) 14వ రోజు వంటావార్పుతో సమ్మె కొనసాగించారు. వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 1న కలెక్టరేట్ వద్ద సహాయ నిరాకరణ, ఆపై అక్టోబర్ 2 నుంచి సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎర్ర బూరిగలు, మండల అధ్యక్షులు ఆకతర్ భాష, నగేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

నంద్యాల :రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కొత్తగా తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం నంద్యాల తహసీల్దార్‌కు వారు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆకుమల్ల బ్రహ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ యూనిస్ మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్ విధానంతో డీలర్లపై ఆర్థిక, పనిభారం વધી రేషన్ పంపిణీ ఆలస్యమవుతోందన్నారు. క్వింటా కమిషన్‌ను ₹100 నుంచి ₹300కు పెంచి డీలర్లకు ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి షేక్ అప్సర్ భాష తదితరులు పాల్గొన్నారు.