ప్రభుత్వ — ప్రైవేటు అందరి పాఠశాలల ప్రధానోపాధ్యాయుల దృష్టికి:
ప్రస్తుత విద్యా సంవత్సరంలో LKGలో చేర్చిన విద్యార్థుల వయస్సు పరిమితి సంబంధంగా కొత్త మార్పు జరిగింది.
మునుపటి ప్రకారం, 12.06.2022 లేదా అంతకుముందు జన్మించిన విద్యార్థులను మాత్రమే UDISE+ STUDENT MODULE అంగీకరిస్తోంది. కానీ రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి ఈ అంశం తీసుకువెళ్లిన తరువాత, కట్‌ఆఫ్ తేదీని 12.06.2022 నుంచి 31.08.2022 వరకు విస్తరించారు.
అందువల్ల, 13.06.2022 నుండి 31.08.2022 మధ్యలో జన్మించిన LKG విద్యార్థులు కూడా ఇప్పుడు UDISE+ STUDENT MODULE లో అప్డేట్ చేసుకోవడానికి అర్హులు.
కావున, తమ పాఠశాలలో ఇలాంటి విద్యార్థులు ఇంకా UDISE+ లో నమోదు కాని పరిస్థితిలో ఉంటే, వెంటనే అప్డేట్ చేయవలసిందిగా అన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియజేయబడింది.


