*IMS తో సరికొత్త విధానానికి నాంది – ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు*
*– రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*
*విశాఖపట్నంఅక్టోబర్ పున్నమి ప్రతినిధి, :* ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం, సమన్వయం, పారదర్శకత తీసుకురావడమే సాంకేతికత యొక్క అసలైన అర్థం అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన రియల్ టైమ్ ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IMS) ఆంధ్రప్రదేశ్ పాలనలో కొత్త యుగానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు.
*ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో విప్లవాత్మక మార్పు*
ప్రజల సమస్యల పరిష్కారంలో కొత్త దిశగా అడుగులు వేస్తూ, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) ను ఆధునికీకరించి IMS రూపంలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని పల్లా గారు తెలిపారు. ప్రజల ఫిర్యాదులు, ఫీల్డ్‌లో తలెత్తే సమస్యలు ఇకపై రియల్ టైమ్‌లో ప్రభుత్వానికి చేరుతాయి. సంబంధిత శాఖలు వెంటనే స్పందించి, సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షిస్తాయి అని ఆయన అన్నారు.
*రియల్ టైమ్ స్పందన – వేగవంతమైన పరిష్కారం*
రాష్ట్రవ్యాప్తంగా విభిన్న విభాగాల్లో, జిల్లాల్లో తలెత్తే సమస్యలను RTGS ఆధ్వర్యంలో IMS వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ప్రతి ఫిర్యాదు, ప్రతి ఘటనపై సంబంధిత శాఖ మంత్రి, సెక్రటరీ, కలెక్టర్, ఎస్‌పీ వంటి అధికారులను IMS WhatsApp గ్రూప్‌లో చేర్చుతారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ గ్రూప్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రజలు తమ ఫిర్యాదు స్థితిని IMS డాష్‌బోర్డ్‌లో రియల్ టైమ్‌గా ట్రాక్ చేసుకోవచ్చు. ఇకపై ప్రజా సమస్య – ప్రభుత్వ స్పందన మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదు. ఇది ఒక గవర్నెన్స్ రివల్యూషన్ అని పల్లా గారు అన్నారు.
*చంద్రబాబు విజన్ – లోకేష్ టెక్ లీడర్‌షిప్ ఫలితం*
IMS వ్యవస్థ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మంత్రివర్యులు నారా లోకేష్ గారి సాంకేతిక విజన్ కలయికతో పుట్టిన ఆధునిక పరిపాలన వ్యవస్థ అని పల్లా గారు పేర్కొన్నారు. చంద్రబాబు గారు ఎప్పుడూ సాంకేతికతను ప్రజా సేవలో ఉపయోగిస్తుంటారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి IMS వరకు ఆయన నాయకత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్‌లో దేశానికి ఆదర్శంగా నిలిచింది అని అన్నారు. లోకేష్ గారి సాంకేతిక నాయకత్వం వల్ల ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అయిందని చెప్పారు. ప్రతి సమస్యకు సమయపరిమితి, బాధ్యత, ఫాలోఅప్ ఇవన్నీ ఒకే వేదికపై కనిపిస్తున్నాయి. ఇదే సుపరిపాలన అని అన్నారు.
*డిజిటల్ గవర్నెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ – దేశానికి ఆదర్శం*
RTGS, IMS వంటి వ్యవస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొత్త దశలోకి అడుగుపెట్టిందని పల్లా గారు అన్నారు. ప్రజలకు సమయానుకూల సేవలు అందించడమే కాదు, సమస్యలు విస్తరించకముందే పరిష్కరించడమే ఈ వ్యవస్థ ఉద్దేశ్యం. ఇది చంద్రబాబు గారి దూరదృష్టి, లోకేష్ గారి సాంకేతిక నైపుణ్యం కలయికతో సాధ్యమైంది అని పల్లా శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు.


