Thursday, 5 February 2026
  • Home  
  • ప్రజా ఉద్యమంతోనే అడ్డుకుంటాం!
- విశాఖపట్నం

ప్రజా ఉద్యమంతోనే అడ్డుకుంటాం!

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో నేటితరం భవిష్యత్తు శూన్యం 📍 29వ వార్డు సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖపట్నం, నవంబర్ 2: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే నేటి తరాల భవిష్యత్తు శూన్యం అవుతుందనీ, వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జగదాంబ జంక్షన్ వైఎస్సార్ విగ్రహం వద్ద 29వ వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసుపల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలతో కలిసి సంతకాలు చేశారు. “వందేళ్ల చరిత్రను తిరగరాసి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకువచ్చి, 8,700 కోట్ల రూపాయలతో నిర్మాణాలు ప్రారంభించిన జగన్‌మోహన్ రెడ్డి పై రాజకీయ కక్షతో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ నేటి తరాల భవిష్యత్తును నాశనం చేస్తోంది,” అని వాసుపల్లి మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వం చేసిన మంచి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ నిలిపివేస్తూ కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలకు ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తూ ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకునేది ప్రజా ఉద్యమమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు: స్టేట్ యూత్ సెక్రటరీ కనకల ఈశ్వర్, జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్, సౌత్ యూత్ ప్రెసిడెంట్ బెవర మహేష్, జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీ నీలాపు లక్ష్మి, జిల్లా RTI సెక్రటరీ ఆరుగుల రాజు, జిల్లా యూత్ సెక్రటరీ తమ్మినేని శ్రీను, జనరల్ సెక్రటరీ గుమ్మడి చంద్రమౌళి, 29వ వార్డు సోషల్ మీడియా ప్రెసిడెంట్ పడాల సూర్య, జిల్లా వికలాంగుల విభాగం జనరల్ సెక్రటరీ కోట ఆనంద ప్రసాద్, ఉరికిటి శివ పండు, ఇందు, వెంకటలక్ష్మి, పప్పు కమల, పైబోడి శివ, ఆబోతుల వెంకటరమణ, చెన్న మురళి, వడ్డాది శివ, గండి వలస పెంటయ్య, చరణ్, కల్చరల్ విభాగం రాష్ట్ర సెక్రటరీ కంటుముచ్చు సాగర్, వాణిజ్య విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేడిపల్లి శివ, 38వ వార్డు యూత్ అధ్యక్షుడు చాపల నూకరాజు (బుడ్డి) తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో నేటితరం భవిష్యత్తు శూన్యం

📍 29వ వార్డు సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

విశాఖపట్నం, నవంబర్ 2: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే నేటి తరాల భవిష్యత్తు శూన్యం అవుతుందనీ, వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.

జగదాంబ జంక్షన్ వైఎస్సార్ విగ్రహం వద్ద 29వ వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసుపల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలతో కలిసి సంతకాలు చేశారు.

“వందేళ్ల చరిత్రను తిరగరాసి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకువచ్చి, 8,700 కోట్ల రూపాయలతో నిర్మాణాలు ప్రారంభించిన జగన్‌మోహన్ రెడ్డి పై రాజకీయ కక్షతో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ నేటి తరాల భవిష్యత్తును నాశనం చేస్తోంది,” అని వాసుపల్లి మండిపడ్డారు.

జగనన్న ప్రభుత్వం చేసిన మంచి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ నిలిపివేస్తూ కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలకు ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తూ ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకునేది ప్రజా ఉద్యమమేనని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు:

స్టేట్ యూత్ సెక్రటరీ కనకల ఈశ్వర్, జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్, సౌత్ యూత్ ప్రెసిడెంట్ బెవర మహేష్, జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీ నీలాపు లక్ష్మి, జిల్లా RTI సెక్రటరీ ఆరుగుల రాజు, జిల్లా యూత్ సెక్రటరీ తమ్మినేని శ్రీను, జనరల్ సెక్రటరీ గుమ్మడి చంద్రమౌళి, 29వ వార్డు సోషల్ మీడియా ప్రెసిడెంట్ పడాల సూర్య, జిల్లా వికలాంగుల విభాగం జనరల్ సెక్రటరీ కోట ఆనంద ప్రసాద్, ఉరికిటి శివ పండు, ఇందు, వెంకటలక్ష్మి, పప్పు కమల, పైబోడి శివ, ఆబోతుల వెంకటరమణ, చెన్న మురళి, వడ్డాది శివ, గండి వలస పెంటయ్య, చరణ్, కల్చరల్ విభాగం రాష్ట్ర సెక్రటరీ కంటుముచ్చు సాగర్, వాణిజ్య విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేడిపల్లి శివ, 38వ వార్డు యూత్ అధ్యక్షుడు చాపల నూకరాజు (బుడ్డి) తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.