అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయనిధి (CMRF) కోసం దరఖాస్తు చేసుకున్న వత్సవాయి మండలం, భీమవరం గ్రామానికి చెందిన వాసిపల్లి సుబ్బారెడ్డి గారికి, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి సిఫారసు మేరకు, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రూ. 81,000/- విలువ గల CMRF చెక్కు మంజూరైంది.
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుల సూచన మేరకు ఈ చెక్కును జనసేన పార్టీ నాయకులు లబ్ధిదారునికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ తుమ్మల ప్రభాకరరావు గారు, జనసేన నాయకులు శ్రీ షౌకత్ అలీ గారు, శ్రీ ఈమని కిషోర్ కుమార్ గారు, శ్రీ గొర్రెపాటి సుదర్శన్ గారు, భీమవరం గ్రామ నాయకులు శ్రీ గుండం రంగారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.


