Tuesday, 9 December 2025

Category: కాకినాడ

కాకినాడ

*కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ 09:* జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామం లో గణేష్ యాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన అన్నదాన సమారాధన కార్యక్రమానికి జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ముందుగా ఆలయ కమిటీ వారు రమేష్ గారికి సాధార స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో గంధం శ్రీనివాస్, గంధం వెంకటరమణ, బత్తుల కేశవరావు, ద్వారపూడి వీరభద్రరావు, కర్ణాకుల రాంబాబు, కర్ణాకుల ప్రసాద్,సూరభత్తుల సిమ్మయ్య, రంగన్నాధం కాపు,సూరభతుల కృష్ణ, సూరభతుల వీరబాబు,రాయి బుల్లాబ్బాయి, మాదారపు వీరబాబు, నాగేశ్వరావు, మణికంఠ, రమేష్, శ్రీను, కనకరాజు, వీరబాబు, శివ, ఓంకృష్ణ, సోమరాజు,రాయి శ్రీను,గంధం లోవరాజు, బండారు ఈశ్వరరావు, అడబాల అర్జుణరావు,గణేష్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కాకినాడ

*యర్రంపాలెం మత్స్య సహకార సంఘం నెంబర్ బి 61 ఎన్నికలు ఏకగ్రీవం* *అధ్యక్షుడిగా పాక నాగేశ్వరరావుఏకగ్రీవ ఎన్నిక* కాకినాడ జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ 9: గండేపల్లి మండలం యర్రంపాలెం మత్స్య సహకార సంఘం నెంబర్ బి 61 నూతన పాలకవర్గఎన్నికలు సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం గండేపల్లి మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు పెదపాటి శుభకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగాయి. సంఘ అధ్యక్షుడిని పాక నాగేశ్వరరావు, కార్యదర్శిగా పేదపాటి సుబ్బారావు, కార్యవర్గ సభ్యులుగా పులి వెంకన్న, పిల్లి సుబ్బారావు, సైనం పెద్దబ్బులు, బోర్ర ప్రసన్నకుమార్, నీలపల్లి అప్పారావు, నూకతట్టు దేవదాసు, సైనం పౌలు అను ఏడుగురు సభ్యులను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. వీరి పదవి కాలం ఐదు సంవత్సరాలు అనగా 2030 వరకు పనిచేస్తారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా రాజేంద్ర కుమార్ ఎఫ్డిఓ ఏలేశ్వరం పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో రాబోయే ఐదు సంవత్సరాలు మా మత్స్య సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. ఎన్నికల్లో మత్స్యకార సహకార సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.