Monday, 13 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా — భారీ వర్షాలు దృష్ట్యా పాఠశాలలకు అవసరమైతే సెలవులు ప్రకటించవచ్చు — గౌ. కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ సూచనలు

డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నుండి గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారి ఆదేశాల ప్రకారం, జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు లో ఉధృతంగా కొనసాగుతున్న వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజల భద్రత, విద్యార్థుల రక్షణ మరియు పాఠశాలల పరిసర ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను పరిశీలించి, స్థానిక స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని అన్ని మండల విద్యాశాఖాధికారులకు సూచనలు జారీ చేయబడినవి. స్థానిక పరిస్థితులు తీవ్రంగా ఉండి, విద్యార్థులు పాఠశాలకు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటే, సంబంధిత మండల విద్యాశాఖాధికారి స్థానిక మండల రెవెన్యూ అధికారి (తహసీల్దార్)తో సంప్రదించి, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలకు తాత్కాలిక సెలవులు ప్రకటించవచ్చును. అవసరమైతే 27.10.2025, – 28.10.2025, మరియు 29.10.2025 తేదీలలో పాఠశాలలను మూసివేయవచ్చునని గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా స్థానిక పరిస్థితులను బట్టి తీసుకోవలసి ఉండగా, ప్రతి మండల విద్యాశాఖాధికారి తహసీల్దార్‌తో సమన్వయం చేసుకొని నిర్ణయం తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అధికారిక ప్రకటనలను గమనించాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి, డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం

E-పేపర్

కార్తీకమాస శివాలయం లక్ష పత్రిక పూజ మహోత్సవం

గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 తూర్పుగోదావరి జిల్లా చాగలమండలం చాగల్లు గ్రామంలో వేంచేసి ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, సూర్య నమస్కరములు దీపోత్సవం, మరియు లక్ష పత్రి పూజ మహోత్సవాన్ని గ్రామస్తులు బ్రహ్మశ్రీ లింగాల శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరిపించి ఉన్నారు END

తిరుపతి

మాడంబాకం మునిరత్నమ్మ మృతి కి నివాళులర్పించిన ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పట్టణంలోని కలంకారి జాతీయ అవార్డు గ్రహీత మాడంబాకం మునిరత్నమ్మ స్వర్గస్తులయ్యారు.వారి గృహానికి వెళ్లి వారి భౌతికాయానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.

విశాఖపట్నం

మాధవదార గ్రామంలో గైరమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

మాధవదార గ్రామంలో సుమారు యాభై సంవత్సరాల క్రితం భక్తుల ఆరాధనతో వెలసిన గైరమ్మ తల్లి ఆలయం వద్ద నేడు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ప్రజలు, భక్తులు, పెద్దలు, మహిళలు ఆనందోత్సాహాలతో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. ప్రతీ సంవత్సరం పెద్ద ఎత్తున జరిగే ఈ ఉత్సవాలు గత కొన్నేళ్లుగా పరిస్థితుల వల్ల నిర్వహించబడలేదు. కానీ ఈసారి గ్రామంలోని గైరమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు, అమ్మలు ముందడుగు వేసి మళ్లీ ఉత్సవాలను పునరుద్ధరించారు. గ్రామ పెద్దల సహకారంతో, యువత స్ఫూర్తితో సనపల వెంకటరావు గారి గృహం వద్ద విశేషంగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా పూజారి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, కలశ స్థాపనలు నిర్వహించగా, గ్రామ పెద్దలు సనపల వర ప్రసాద్, సనపల వెంకటరావు వంటి ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఉదయం నుండి ప్రారంభమైన వేడుకల్లో గ్రామస్తులు, మహిళలు సాంప్రదాయ వేషధారణలో తల్లిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో “జై గైరమ్మ” నినాదాలతో మార్మోగింది. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఉత్సవానికి ప్రత్యేక చైతన్యం తెచ్చారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ – “గైరమ్మ తల్లి మన గ్రామానికి ఆధ్యాత్మిక ఆత్మ, అమ్మ ఆశీర్వాదంతో ప్రతి ఇల్లు సుఖశాంతులతో నిండిపోవాలి అనే మనస్ఫూర్తి కోరికతో మళ్లీ ఉత్సవాలు ప్రారంభించాం” అని తెలిపారు. సాయంత్రం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించబడింది. రాబోయే రోజులలో సాంస్కృతిక కార్యక్రమాలు, హరతుల సేవ, భజనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో పుట్ట స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్

నందిగామ మండలం, కంచల గ్రామంలో అనంత సుబ్బారాయేశ్వర స్వామి (పుట్ట స్వామి) వారి పూజా కార్యక్రమం లో నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి స్థానిక మహిళలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్స వంలో ఆమె పాల్గొనిస్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఏచూరి రాము, అనుమోలు కిషోర్, కొండ, కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కాకినాడ

అన్నమ్మ ఘాటీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నాగుల చవితి ఉత్సవాలు….

కాకినాడ జిల్లా, కాకినాడ సిటీ,పున్నమి న్యూస్: జగన్నాధపురం అన్నమ్మఘాటీ సెంటర్ వద్ద ఉన్న వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయంలో నాగుల చవితి పర్వదినోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్త పైలా అన్నపూర్ణ సారథ్యంలో జరిగిన ఈ వేడుకలకు వేకువజామునుండే భక్తులు తరలివచ్చి స్వామివారికి పాలు, గుడ్లు, పసుపు,కుంకుమ,పూలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు హరహర సుబ్రహ్మణ్య నినాదాలతో ఆలయ ప్రాంగణంమార్మోగించారు. పండితుల సాన్నిధ్యంలో పాలాభిషేకం,నాగప్రతిష్ఠా పూజ, నాగహోమం వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సాయంత్రం సమయంలో స్వామివారికి అలంకార మహోత్సవం,దీపాలంకరణ,మహా హారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ధర్మకర్త పైలా అన్నపూర్ణ మాట్లాడుతూ ఈ ఆలయం ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రోత్సాహం,భక్తుల సహకారంతో ఈ ఆలయం పేరు ప్రఖ్యాత సాధించిందన్నారు. సహజసిద్ధంగా ఇక్కడ పాముల పుట్ట ఉండడం,సాధారణ రోజుల్లో నాగు పాము దర్శనం కావడం ఈ స్థల ప్రత్యేకత.లోకకల్యాణం కోసం సమస్త జనావళిపై శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కటాక్షం ఉండాలని మనసారా కోరుకుంటున్నాని తెలిపారు. భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి పాలు గుడ్లు సమర్పించి, తమ కోరికల సాధన కోసం ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేదపారాయణం,నాగకల్యాణం నిర్వహించారు.చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువత సేవా బృందాలు భక్తుల సౌకర్యం కోసం నీటి పంపిణీ, ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించాయి.భక్తుల రాకపోకలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

అమరావతి

ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండి • అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలి

• ‘మొంథా’ తుఫాన్ వస్తోంది… అప్రమత్తంగా ఉండండి • ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదు • ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండి • అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలి • జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం • వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌తో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్ అమరావతి అక్టోబర్ పున్నమి ప్రతినిధి: రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాను పొంచివున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మొంథా’ తుపాన్ రాష్ట్రంపై ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రధానంగా ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుందని… 80 నుంచి 100 మి.మీ. మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల నుంచి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిళ్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని… తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. తీరప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పారు. అన్ని ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లలో నీటిమట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా జరపాలన్నారు. రియల్ టైమ్‌లో వచ్చే సమాచారాన్ని తక్షణం ప్రభుత్వ యంత్రాంగంలోని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించి, తుఫాను నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్

⚠️ అత్యవసర ప్రజా ప్రకటన ⚠️

⚠️ అత్యవసర ప్రజా ప్రకటన ⚠️ (మోన్తా తుఫాన్ కారణంగా జారీ చేయబడినది) 📢 వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, సముద్రం తీవ్రంగా ఉధృతంగా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణ భద్రత నిమిత్తం ఈ క్రింది ఆదేశాలు జారీ చేయబడుతున్నాయి 👇 1️⃣ 26 తేది నుంచి 28 తేదీ వరకు ముత్యాలమ్మపాలెం మరియు తిక్కవానిపాలెం బీచ్ ప్రాంతాలకు అనుమతి పూర్తిగా నిషేధం. 👉 ప్రజలు సముద్రతీర ప్రాంతాలకు వెళ్ళకూడదు. 👉 పోలీసులు, రెవెన్యూ మరియు స్థానిక అధికారులు అక్కడ నిరంతరం గస్తీ నిర్వహిస్తారు. 2️⃣ రేపటి నుండి బీచ్‌లు పూర్తిగా మూసివేయబడతాయి. 👉 మరిన్ని ఆదేశాలు వచ్చే వరకు బీచ్ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదు. 3️⃣ చేపల వేట పూర్తిగా నిలిపివేయబడతాయి. ⚠️ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పక పాటించండి. ప్రజల భద్రతకే ఇది చేపడుతున్న తాత్కాలిక చర్య.

కాకినాడ

ఘనంగా కామ్రేడ్ వంకా వర్ధంతి

రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, కామ్రేడ్ వంకా సత్యనారాయణ ఏడో వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ వంకా పెద్ద మనుమడు డా అడ్డాల, జానకి రమ, సత్య సాహితీ చే మహిళలకు దుప్పట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కమ్యూనిజం భావజాలంతో మన భారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. మహిళలకు సామాజిక సమానత్వం, భూసంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం అనే అంశాలపై పోరాడిన కమ్యూనిస్టు పార్టీలో పెనుగొండ శాసనసభ్యుడిగా మూడుసార్లు పనిచేసిన వంకా సత్యనారాయణ తన 19వ ఏట పార్టీలో చేరారన్నారు.93వ ఏట కాలం చేశారన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చేరిన నాటి నుండి తుది శ్వాస విడిచే వరకు పార్టీ అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేశారన్నారు.ఆయన చూపిన బాట లొ పయనిస్తూ ఆయన మనుమడు డా అడ్డాల సత్యనారాయణ నిరంతరం ప్రజా సేవలో ఉండటం అభినంద నీయమని అన్నారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ “వంక సత్యనారాయణ పెద్ద మనవడునైన తాను ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు.అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల రత్న ప్రసాద్, బుద్ధరాజు సత్యనారాయణ రాజు,ఎస్.శ్రీ నగేష్, మంచెం సుబ్రహ్మణ్యేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మొంథా తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి*

*మొంథా తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి* * తుపాన్ కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం ఉంది * ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేయండి * ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతులకి ముందస్తు సమాచారం ఇవ్వండి * తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులను అప్రమత్తం చేయండి” అని స్పష్టం చేశారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ తెలిపారు. వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, పిఠాపురం, పెద్దాపురం నియోజక వర్గాల రైతులు, ప్రజలకి సమాచారం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో కాకినాడ వెళ్ళేందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు సిద్ధంకాగా, ఈ పరిస్థితుల్లో వద్దని సహాయక చర్యల సన్నద్ధతలో యంత్రాంగం నిమగ్నమై ఉంటుందని, ఇప్పుడు జిల్లా పర్యటన వద్దని జిల్లా కలెక్టర్ సున్నితంగా సూచించారు….

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.