Monday, 13 April 2026

Blog

పల్నాడు

స్పా ముసుగులో వ్యభిచారం

*స్పా ముసుగులో వ్యభిచారం.. ఒకే లాడ్జిలో ఏడు ಜಂటಲು……. పల్నాడు జిల్లా………. **నరసరావుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న లాడ్జిలపై పోలీసులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏడు జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లాడ్జిలో గత ఏడాది నుంచి ప్రతిరోజూ అసాంఘిక కార్యకలాపాలు (వ్యభిచారం) జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, జిల్లాలోని కొన్ని హోటళ్లను కేంద్రంగా చేసుకొని జూదరులు పేకాట ఆడుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్

కార్మిక సంఘం ఎన్నికల్లో బీజేపీ పై బి ఆర్ ఎస్ విజయం

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్–బాలానగర్ ప్రాంతంలోని MTAR టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలోని సంఘం విజయం సాధించింది. భారత ట్రేడ్ యూనియన్ తరఫున పోటీ చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్ పై బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గెలుపొందారు. ఈ విజయంతో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆనందం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శక్తి మరింత బలపడుతుందని నాయకులు తెలిపారు.

కాకినాడ

పెద్దాపురం టిడ్కో గృహల నందు కార్దన్ అండ్ సెర్చ్

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10, కాకినాడ జిల్లా, S.P. శ్రీ బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు డిఎస్పి . శ్రీ.D.శ్రీహరి రాజు పర్యవేక్షణలో కార్డాన్ అండ్ సెర్చ్ లో భాగంగా పెద్దాపురం వాలుతిమ్మాపురం రోడ్డు మార్గంలో ఉన్న టిడ్కో గృహాలలో ఐదు బృందాలుగా పోలీసులు అధికారులు విస్తృత తనిఖీలు ఆదివారం తెల్లవారిజమున 4.గంటల నుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ విజయ శంకర్ ,సామర్లకోట క్రైమ్ సి.ఐ అంకమరావు,పెద్దాపురం ఎస్ఐ మౌనిక,జగ్గంపేట ఎస్సై రఘురాం, గండేపల్లి ఎస్సై నాగబాబు, 50 మంది పోలీస్ సిబ్బంది 5 బృందాలు గా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.24 ద్విచక్ర వాహనాలను ,1 ఆటో ను రికార్డులు లేవని గుర్తించారు. పోలీస్ వారు డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహించి, టిడ్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలకు పెద్దాపురం సిఐ విజయ శంకర్ కొన్ని సూచనలను ఇస్తూ ,అసాంఘిక కార్యక్రమాల కు ఎవరైనా పాల్పడితే తక్షణమే సమాచారం అందించేలా పోలీస్ అధికారుల మొబైల్ నెంబర్లను ఇచ్చారు. అలాగే బయట వ్యక్తులు ఎవరైనా ఆశ్రయం కోసం వచ్చిన తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారికి అవగాహన కల్పించారు.

విశాఖపట్నం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ:26-10-25 బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 8కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 550 కి.మీ, చెన్నైకి 850 కి.మీ, విశాఖపట్నంకి 880 కి.మీ,కాకినాడకి 880 కి.మీ, గోపాల్‌పూర్ కి 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కౌశలం సర్వే

గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కౌశలం సర్వే వెరిఫికేషన్ నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. పౌరుల పెండింగ్ ఈకేవైసీ నవీకరణకు గడువు నవంబర్ 15. అలాగే 5–7, 15–17 ఏళ్ల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రత్యేక శిబిరాలు జరుగుతున్నాయి. కౌశలం వెరిఫికేషన్ (డెడ్‌లైన్: నవంబర్ 5) పెండింగ్ eKYC అప్డేట్ (డెడ్‌లైన్: నవంబర్ 15) బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్యాంపులు (5–7 & 15–17 ఏళ్ల పిల్లల కోసం)

Blog

సర్వీసు సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ పునరుజ్జీవనమే మార్గం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె నాగేంద్రప్ప

ఆత్మకూరు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌ను తక్షణం పునఃప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.“రండి…టీ తాగుతూ మాట్లాడుకుందాం” కార్యక్రమం గురువారం ఆత్మకూర్ పట్టణంలోని మలేరియా కేంద్రం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో తాలూకా సంఘం అధ్యక్షుడు కల్లూరి మస్తానయ్య అధ్యక్షతన ఉద్యోగులు తమ సమస్యలను సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి 35 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని గుర్తుచేశారు. ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తే గృహ కల నెరవేరుతుందని సూచించారు. జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప మాట్లాడుతూ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ట్రిబ్యునల్ పునరుద్దరణ అవసరమన్నారు. తాలూకా స్థాయి ఉద్యోగుల అభిప్రాయాలను రాష్ట్ర సంఘం ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తున్నామన్నారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ చర్చలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి కాదు, సమస్యలకు సానుకూల పరిష్కారం కాంక్షించి చేపడుతున్నామని వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు నాలుగేళ్లుగా పెన్షన్, ఇతర ప్రయోజనాలు లభించక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాలూకా అధ్యక్షులు కల్లూరి పెద్ద మస్తానయ్య, ముఖ్య కార్యదర్శి సి. చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ పి. ప్రసాదరావు, ధనలక్ష్మి, రవణమ్మ, జాయింట్ సెక్రెటరీ ఎం. జనార్ధన్, ఎం. రసూల్, ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఖమ్మం

నేడు ప్రధాని మాన్ కీ బాత్

పున్నమి ప్రతి నిధి అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాని మోడి గారి ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం నేడు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఇది 127వ ఎపిసోడ్. దేశవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి, దూరదృష్టి ఉన్న సువిశాల డిజిటల్ వేదికల ద్వారా ప్రజలతో ప్రధాని మోడి మాట్లాడనున్నారు. ప్రధాని మోడి ప్రజలతో నేరుగా మాట్లాడి, సామాజిక, జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకుంటారు.

ఆంధ్రప్రదేశ్

కొత్తకోడూరులో గిరిజన కాలనీ పర్యటన – బొబ్బేపల్లి సురేష్ నాయుడు తోటపల్లి గూడూరు (ప్పున్నమి ప్రతినిది అక్టోబర్స 25):-సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు పంచాయతీలోని గిరిజన కాలనీని పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — రాబోయే మూడు రోజుల పాటు మంతా తుఫాన్‌కి సంబంధించి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గిరిజనులను కాపాడడంలో, వారికి సమాజంలో మంచి స్థానం కల్పించడంలో ఎప్పుడూ వెన్నంటి ఉండే వ్యక్తి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డేనని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో వాలంటీర్ వ్యవస్థను ప్రజల సేవకోసం కాకుండా, పార్టీ ప్రచార కార్యక్రమాలకోసం వినియోగించిందని బొబ్బేపల్లి విమర్శించారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, ప్రభుత్వ పథకాలను వారికి చేరవేయడంలో ఎలాంటి కృషి జరగలేదని ఆయన అన్నారు. “సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే ఆయన కుమారుడు గురించి మాత్రమే మాట్లాడే కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి ఏమీ చేయలేదు. పేద గిరిజన పిల్లలకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చిన ఆనవాళ్లు లేవు. అలాంటి వ్యక్తికి సోమిరెడ్డిని విమర్శించే అర్హత లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, పామంజి శ్రావణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

హైదరాబాద్ సిపి సజ్జనార్..* *రౌడీలు.. స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతాం ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 హైదరాబాద్ సిపి సజ్జనార్ *రౌడీలు.. స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతాం..* *ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారు.* ఈరోజు సాయంత్రం 5 గంటలకు చాదరగట్టి విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఘటన జరిగింది.. రౌడీ షీటర్ మొబైల్స్ స్నాచర్స్ ఇద్దరూ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారు. రౌడీ షీటర్ మమ్మద్ ఉమర్ అన్సారి.. 20కి పైగా కేసు నమోదు అయ్యాయి.. రెండు పిడి యాక్ట్ లు నమోదు.. రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు.. దొంగను చేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన గన్ మెన్ వచ్చారు. దొంగ కత్తి తో గన్ మెన్ పై దాడి చేసాడు. వెంటనే డీసీపీ చైతన్య రెండు రౌండ్లు దొంగ పై కాల్పులు జరిపారు. దొంగకు చేతి పై.. కడుపు లో గాయాలయ్యాయి. దొంగకు మాలకపేట యశోద ఆసుపత్రికి తరలించాము. పరారీ లో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నాం. రౌడీలు.. స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతాం.. డీసీపీ స్వల్ప అస్వస్థత కు గురయ్యారు.. గాయలైన కానిస్టేబుల్ లు ఇద్దరూ ఆసుపత్రి లో క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం. మహమ్మద్ ఉమర్ అన్సారీ.. కేసులు.. నేరాలు.. అతనికి సహకరిస్తున్న వారిని గుర్తిస్తాం…

హైదరాబాద్

రైల్వే బోర్డు కీలక నిర్ణయం… తక్షణమే అమలు..!

పున్నమి ప్రతి నిధి దేశంలో పెరుగుతున్న మధుమేహ రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రైల్వే బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు టికెట్‌ బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు “డయాబెటిక్ మీల్” ఆప్షన్‌ను కూడా ముందుగానే సూచించవచ్చు. ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న వారికి చక్కెర, కొవ్వు తక్కువగా ఉండే ప్రత్యేక భోజనం అందించనుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు ప్రకటించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.