Monday, 13 April 2026

Blog

E-పేపర్

న్యూ కృష్ణ నగర్ నందు నందు కాలనీ వాసులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు:మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ న్యూ కృష్ణ నగర్ నందు నందు కాలనీ వాసులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రత్నమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నందా బాల, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుబ్బరామరాజు, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, ఎంపీటీసీ మహేష్ రెడ్డి, సర్పంచ్ రామకృష్ణ,కొప్పల శంకరయ్య, కొన్నిపాటి ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్, ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, ఎంపీటీసీలు బండారు మల్లికార్జున, పుష్పలత, ఎక్స్ ఎంపిటిసి బత్తిన ఆనందయ్య యాదవ్, రవిశంకర్ యాదవ్, ప్రతాప్ రెడ్డి, వార్డు మెంబర్లు వినోద్ కన్నా, కరిముల్లా, ఫరూక్, సుబ్బరాయుడు, బాబి, ఎర్ర తొట్టి బాబు, సిద్దయ్య, డివి రమణ, రాజగోపాల్,రమణ రెడ్డి,ఇనమాల చైతన్య,మహిళా నాయకురాళ్లు అరుణమ్మ, గౌసియా, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ PMAY-G హౌసింగ్ స్కీమ్ గుడ్ న్యూస్! – ఇళ్ల కల సాకారం అయ్యేందుకు మరో అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇళ్ల లేని పేద కుటుంబాలకు శుభవార్త. ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) పథకం కింద గృహ సర్వే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సర్వేకు చివరి తేదీ నవంబర్ 5, 2025గా నిర్ణయించారు. ఈ గడువు పొడిగింపుతో అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల సాకారం చేసుకునే మరో విలువైన అవకాశం లభించింది. PMAY-G పథకం లక్ష్యం 2029 నాటికి ప్రతి పేదవారికి సురక్షితమైన సొంత ఇల్లు కల్పించడం. ఈ పథకం కింద ప్రభుత్వం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థల కేటాయింపు కూడా స్పష్టంగా తెలిపింది — గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. గృహ నిర్మాణానికి అవసరమైన సబ్సిడీ, సదుపాయాలు, మరియు బ్యాంకు సహాయం ఈ పథకం కింద అందజేయబడతాయి. అర్హులుగా పరిగణించబడే వారు ఇళ్లు లేని, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు కావాలి. దరఖాస్తు చేసుకునే వారు తమ కుటుంబ వివరాలు, ఆదాయ ధృవపత్రం, మరియు ఆధార్ కార్డుతో సమీప గృహనిర్మాణ శాఖ AE కార్యాలయాన్ని సంప్రదించాలి. సంబంధిత అధికారులు సర్వే ద్వారా వివరాలు సేకరించి అర్హుల జాబితాను రూపొందిస్తారు. ఈ గడువు పొడిగింపుతో ముందుగా సర్వేలో పాల్గొనలేకపోయిన అనేక కుటుంబాలు ఇప్పుడు తమ పేరును నమోదు చేసుకునే అవకాశం పొందాయి. ప్రభుత్వం ప్రజలను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమయానికి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రతతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు పేర్కొన్నారు. మీ మిత్రులు, కుటుంబ సభ్యులు అర్హులైతే ఈ సమాచారాన్ని వారికి తప్పనిసరిగా షేర్ చేయండి!

అన్నమయ్య

తుపాను హెచ్చరికలో భాగంగా చిట్వేల్ ఎస్సై జాగ్రత్త సూచనలు

రాబోయే తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని చిట్వేల్ పోలీసు విభాగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ రోజు (26-10-2025) చిట్వేల్ ఎస్సై పట్టణంలోని వివిధ షాపుల యజమానులతో సమావేశమై తగు సూచనలు ఇచ్చారు. కిరాణా, ఫాన్సీ, బట్టల షాపులు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర వ్యాపార సంస్థలపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ బోర్డులు గాలి, వర్షం ప్రభావంతో కిందపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అటువంటి ప్రమాదాలను నివారించేందుకు బోర్డులను గట్టిగా కట్టించుకోవాలని, సడలిపోయిన వాటిని వెంటనే తొలగించాలని సూచించారు. ఎస్సై మాట్లాడుతూ — “ప్రజల ప్రాణ భద్రత అత్యంత ముఖ్యం. తుపాను సమయంలో ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదకరం కావొచ్చు. అందువల్ల ప్రతి వ్యాపారవేత్త తన షాపు పరిధిలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి” అని తెలిపారు. తుపాను ప్రభావం దృష్ట్యా పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రజలకు అవసరమైన సూచనలు అందిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

E-పేపర్

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల భవన నిర్మాణ సంక్షేమ బోర్డు

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల భవన నిర్మాణ సంక్షేమ బోర్డు రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని అక్టోబర్ 28న రాయచోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ను జయప్రదం చేయండి.అక్టోబర్ 28 రాయచోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగు ధర్నా కు ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ రాక.ఆదివారం రైల్వే కోడూరు లో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)అధ్యక్షులు పాండురంగయ్య ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది . ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ హాజరై మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పెండింగ్‌లో ఉన్న క్లైములకు తక్షణమే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.గత వైసిపి ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కార్మికుల కోసం ఏర్పాటైన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తూ 2019లో జీఓ నెం.1214 జారీ చేయడం వల్లే వేలాది క్లైమ్ లు పెండింగ్‌లోకి వెళ్లాయని వారు అన్నారు. అయితే అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూడా 18 నెలలు గడిచినా ఈ సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సెస్ రూపంలో వందల కోట్ల రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్‌కి చేరుతున్నప్పటికీ, ఆ నిధులు కార్మికుల సంక్షేమానికి వినియోగించకపోవడం ఆందోళనకరమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకుపైగా పెండింగ్ క్లెయిమ్లు వెంటనే క్లియర్ చేయాలని, లేనిపక్షంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలను ముట్టడించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.వైసిపి పాలనలో కార్మికులు ఎన్నో వేధింపులకు గురయ్యారని, ఎన్నికల ముందు కూటమి నాయకులు కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 50 లక్షల కుటుంబాలు ఆశతో కూటమికి మద్దతు ఇచ్చారని, కానీ ఇప్పటివరకు హామీలు నెరవేర్చకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.ఇప్పటికే వేలాది కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు పోస్టుకార్డులు రాసి వినతులు పంపారని, అలాగే కార్మికశాఖ మంత్రి, వెల్ఫేర్ బోర్డు చైర్మన్, లేబర్ కమిషనర్‌లను కూడా ప్రత్యక్షంగా కలిసి విన్నవించామని వారు తెలిపారు. అయినప్పటికీ పరిష్కారం లేకపోవడంతో, త్వరలో భవన నిర్మాణ కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుకు కోటి రూపాయలు కేటాయిస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక దాని వూసే లేదన్నారు. క్లైమ్లకు నిధులు మంజూరు చేస్తామని ధాంబికాలు పలికారని వారు ఏద్దావా చేశారు. కార్మికులు అక్టోబర్ 28 జరుగు ధర్నాను జయప్రదం చేయాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. *ఈ సమావేశంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రైల్వే కోడూరు కమిటీ నాయకులు భాస్కర్ నరసింహులు హరి చిన్న. భవన నిర్మాణ సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

కాకినాడ

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదిలిన తీవ్ర వాయుగుండం. మరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగాబలపడుతుందనీ,మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వారు వెల్లడించారు.ప్రస్తుతానికి చెన్నైకి 770 కి.మీ, విశాఖపట్నం కి 820 కి.మీ, కాకినాడ కి 810 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిందన్నారు. సోమవారం కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయి ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని , అప్రమత్తంగా ఉండాలనీ అధికారులు ఆదేశించారు.

E-పేపర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం రాష్ట్ర పరిశీలకులు సుదర్శన్‌రెడ్డి, హనుమంతు

నంద్యాల ఉద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహనతో పనిచేస్తున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమేనని రాష్ట్ర పరిశీలకులు సుదర్శన్‌రెడ్డి, హనుమంతు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యవర్గ సభ్యుడు సంఘం బలోపేతానికి కృషి చేయాలని, సభ్యత్వం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. హనుమంతు మాట్లాడుతూ సంఘం కోసం నిజాయితీగా కృషి చేసే వారిని రాష్ట్ర నాయకత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప మాట్లాడుతూ రాష్ట్రాధ్యక్షులు కె.ఆర్‌.సూర్యనారాయణ మార్గదర్శకత్వంలో ఉద్యోగుల శ్రేయస్సు కోసం సంఘం కృషి చేస్తోందని, “రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం” కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సమస్యలపై సమగ్ర అవగాహన సృష్టిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, రాష్ట్ర ఎన్‌ఎంఆర్ టైమ్‌స్కేల్‌ అధ్యక్షుడు సురేష్‌, వేణుగోపాల్‌రెడ్డి, యశ్వంత్‌, విజయలక్ష్మి, చక్రధర్‌, చెంచమ్మ, యేసురత్నం, మహిళా సిటీ అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ, సంఘం ప్రతినిధులు కోటేశ్వర రావు, బుల్లెట్ భాష, చక్రపాణి గౌడ్, మహమ్మద్ రఫీ, పద్మావతి, ప్రీతి, గాయత్రి, ధరణి, నిర్మల, నాగపద్మిని, గుర్రమ్మ, శిరీష, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

నందలూరు ఉరుస్ మహోత్సవమునకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు ఆహ్వాన పత్రిక

ఈనెల 31-10-2025 శుక్రవారం జరిగే నందలూరు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా మగ్దుమ్ ఉరుసు మహోత్సవముకు రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమణకి మగ్దుమ్ షా దర్గా ఉరుస్ కమిటీ సభ్యులు దర్గా చిన్న గురువులయ్య సయ్యద్ హైదర్ హుసేని సాహెబ్ తో కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహబూబ్ బాషా టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ యువనాయకులు పఠాన్ మహర్ ఖాన్,వరల్డ్ హ్యూమన్ రైట్స్ సయ్యద్ జుల్ఫికర్, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

గుల్జార్ భాషకు ఉరుసు ఆహ్వాన పత్రిక అందించిన హైదర్ సాహెబ్

నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ హజరత్ ఖ్వాజా సయ్యద్ మఘధూమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈనెల 31-10-2025 హాజరుకావాలని మాజీ డైరెక్టర్ రోడ్లు భవనాల అభివృద్ధి శాఖ మరియు జేఏసీ సభ్యులు.గండికోట గుల్జార్ భాషను మరియు మాజీ అదనపు ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జానీను మఘధూమ్ షావలి దర్గా పీఠాధిపతి చిన్న గురువులయ్య హైదర్ సాహెబ్ మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వక కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహబూబ్ బాషా టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ యువనాయకులు పఠాన్ మహర్ ఖాన్,వరల్డ్ హ్యూమన్ రైట్స్ సయ్యద్ జుల్ఫికర్, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

మెంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వరల్డ్ హ్యూమన్ రైట్స్ సయ్యద్ జుల్ఫికర్

మెంథా తుఫాన్ నేపథ్యంలో చెయ్యురు నది తీర గ్రామ ప్రజలు లోతట్టు ప్రదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హ్యూమన్ రైట్స్ జుల్ఫికర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెంథా తుఫాన్ ప్రభావం వీడే వరకు ఇంటి వద్దె ఉండాలని.కరెంటు స్తంభాలను ముట్టుకోవడం గాని పక్కన నిలబడరాదని.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్రమత్తను తేలిగ్గా తీసుకోకూడదని తెలిపారు. నదులు,వాగులు,చెరువులు, కల్వర్టులు,బ్రిడ్జిలు,దగ్గరకు వెళ్ళవద్దని అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని తెలిపారు. ప్రభుత్వం అందించే సూచనలను పాటించి రైతులు తగ్గ జాగ్రత్తలు ముందే తీసుకోవాలని కోరారు. తుఫాన్ ప్రభావం నాలుగు రోజులు పాటు ఉంటుందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే మినహా బయటికి రావద్దని సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అభివృద్ధి లక్ష్యంగా ప్రైవేటీకరణ: శ్రీనివాస్

అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేపట్టిందని గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేటీకరణకు మద్దతుగా రాజోలులో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో పోస్టర్లు అతికించి, ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రదర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలకు కోట్లాది రూపాయలు అప్పులు చేసి, నిధులను దుర్వినియోగం చేసిందని ఆయన విమర్శించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.