Monday, 13 April 2026

Blog

విశాఖపట్నం

అంత: రాష్ట్ర నిందితులు- దొంగిలించిన ఆస్తి స్వాధీనం

విశాఖపట్నం సిటీ పోలీస్ గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: గాజువాకలో ట్రక్ డ్రైవర్ హత్య నగదు, సెల్ ఫోన్ దొంగలించి పరారైన అంత: రాష్ట్ర నిందితులు- దొంగిలించిన ఆస్తి స్వాధీనం తేది:15.10.2025 న గాజువాక పోలీస్ స్టేషన్లో ఒక అసహజ మరణం కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదుదారుడు నజీబ్ హుస్సేన్ తన సోదరుడు మిరాజ్ హుస్సేన్ (వయస్సు 35సం.లు), ట్రక్ డ్రైవర్, ఎస్.కె రోడ్ వేస్ సంస్థకు చెందినవాడు, బూకెల్ గ్రామం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నివాసి, తన ట్రక్ లోనే మృతి చెందినట్లు తెలిపాడు. ఆ ట్రక్ నంబరు CG-06HA-7988, ఆటోనగర్ రోడ్, రామా ఎంటర్ప్రైజెస్ ఎదురు, గాజువాక, విశాఖపట్నం వద్ద నిలిపివుండగా మృతదేహం గుర్తించబడింది. ఈ ఘటన 11.10.2025 నుండి 14.10.2025 మధ్య కాలంలో జరిగివుండవచ్చు అని, 15.10.2025 ఉదయం 11:00 గంటలకు పోలీసులకు నివేదించబడింది. ఫిర్యాదుదారుడు ఇచ్చిన పిర్యాదు మేరకు గాజువాక పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్:461/2025 సెక్షన్ ఆఫ్ లా 194 BNSS అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేయబడింది. అనంతరం దర్యాప్తు అధికారి అయిన ఎస్.ఐ. చి. హరికృష్ణ గారు సంఘటనా స్థలాన్ని సందర్శించి, సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించి, రక్తపు మరకలు కలిగిన షర్టు, క్లాత్ పీస్, విరిగిపోయిన పిడి గల ఇనుప రాడ్ వంటి సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం కింగ్ జార్జ్ హాస్పిటల్ మార్చురీ కి తరలించి, పోస్ట్మార్టం చేయించబడింది. దర్యాప్తులో భాగంగా మృతుని ఉపయోగించిన మొబైల్ ఫోన్ మరియు అతని కాల్ వివరాలు (CDR) పరిశీలించగా, ఆ మొబైల్ ఫోన్ సరైపాలి గ్రామం, మహాసముంద్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రాంతంలో ఉపయోగిస్తునట్లు గుర్తించబడింది. స్థానిక పోలీస్ సహాయంతో అనుమానితులు A1 ఇండ్రపాల్ @ ఇంద్ర సింగ్ రాజ్పుత్ (27 సం.లు), లారీ డ్రైవర్ మరియు A2 రతీ నాయక్ (25 సం.), లారీ క్లీనర్/పెంటర్ పని చేసే వ్యక్తి, ఇద్దరూ సరైపాలి నివాసులని నిర్ధారించబడింది. తేదీ 25.10.2025 న వీరిని సరైపాలి వద్ద అదుపులోకి తీసుకొని, విచారించిగా ఇద్దరు. నిందితులు ఇంద్రపాల్ మరియు రతీ నాయక్, మద్యం సేవించి లాభం కోసం ట్రక్ డ్రైవర్ మిరాజ్ను 13.10.2025 న హత్య చేసినట్లు అంగీకరించారు. అనంతరం చోరీ కాబడిన మృతుని యొక్క మొబైల్ ఫోన్ (Realme C67 5G) నిందితుడు A1 వద్ద నుండి తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. తేదీ 11.10.2025 న ఒడిశా రాష్ట్రంలోని రాయగడ బ్రిడ్జ్ వద్ద మిరాజ్ను కలుసుకుని, అతని ట్రక్ కేరడా చెక్ పోస్ట్ వద్ద ఎక్కారు. 13.10.2025 న గాజువాక ఆటోనగరికి చేరిన తరువాత ముగ్గురూ మద్యం సేవించారు. అనంతరం మిరాజ్ హుస్సైన్ దగ్గర కొంత నగదు వున్నట్లు గుర్తించి, ఆనగదు, మరియు మొబైలు ఫోన్ ని దొంగలించలనే వుద్దేశ్యంతో, వాటిని దొంగలించే క్రమంలో మృతిని తలపై ఇనుప రాడ్తో బలంగా కొట్టగా, మిరాజ్ హుస్సైన్ ఆక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత నిందితులు మృతిని దగ్గర వున్న ₹7,000 నగదు, ఒక రిస్టు వాచ్, మొబైల్ ఫోన్ తీసుకొని, ఆయుధాన్ని సమీపంలోని స్క్రాప్ యార్డ్లో దాచిపెట్టి, దువ్వాడ రైల్వే స్టేషన్ కి వెళ్ళి, ట్రైన్ లో పరారయ్యారు. విచారణలో A1 ఇంద్రపాల్, 10.10.2025 న ఒడిశా రాష్ట్రం సబలపూర్లో మరో వృద్ధుడిని హత్య చేసి ? 5,000 మరియు మొబైల్ దోచుకున్నట్లు కూడా అంగీకరించాడు. ఇద్దరు నిందితులకు సరైపాలి పోలీస్ స్టేషన్లో పూర్వ చరిత్రలు ఉన్నాయి: 1. Cr.No. 271/2022-U/s 397, 392 r/w 34 IPC ( ) 2. Cr.No. 142/2022-U/s 294, 323, 506 IPC ఇద్దరు నిందితులను 25.10.2025 రాత్రి 21:00 గంటలకు గాజువాక పోలీస్ స్టేషన్ వారు అరెస్ట్ చేసి, గౌరవకోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి, రిమాండ్కు పంపించబడింది. నిందితులు వద్దస్వాధీనం చేసిన చోరీ సొత్తు మరియు హత్య కి ఉపయోగించిన ఆయుధాలు: మృతుడికి చెందిన Realme C67 5G మొబైల్ ఫోన్, ఇనుప రాడ్ (సంఘటన స్థలంలో స్వాధీనం). ఈ హత్య కేసును 10 రోజుల్లోనే ఛేదించినందుకు ఎస్.ఐ.చి. హరికృష్ణ గారు, PCs 1554, 3975, 1562, అలాగే CLUES మరియు RFSL బృందాలు చేసిన కృషి ప్రశంసనీయం. నిందితులను అరెస్ట్ చేసి విశాఖపట్నానికి తరలించే సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో స్థానిక పరిస్థితులు, పరిపాలనా ఇబ్బందులు ఎదురైన సందర్భంలో, శ్రీ శంకబ్రత బాగ్బీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం సిటీ, ఈ కేసు ను ఒక సవాలుగా స్వీకరించి, రెండు రాష్ట్రాల పోలీస్ విభాగాల మధ్య సమన్వయం, మార్గదర్శకత్వం, మరియు అద్భుతమైన మద్దతు అందించడం వలనే నిందితులను విజయవంతంగా విశాఖపట్నంకు రప్పించగలిగారు. ఈ కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం శ్రీ కె. శ్రీనివాసరావు గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సౌత్ క్రైమ్) కి నియమించదమైనది. శ్రీ శ్రీ శంకబ్రత బాగ్బీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం సిటీ, ఈ అనుమానాస్పద మరణాన్ని “మర్డర్ ఫర్ గైన్” ను ఛేదించిన గాజువాక పోలీస్ బృందం పై ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే శ్రీ కె. పార్తసారథి గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గాజువాక, మరియు ఆయన బృందం చేసిన పరిశోధన ఫలితంగా, గాజువాక హత్య కేసుతో పాటు ఒడిశా రాష్ట్రం అట్టబారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గుర్తించలేని హత్య కేసు ను కూడా ఛేదించడ మైనది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు అయ్యప్ప స్వామి దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం…

వింజమూరు, అక్టోబర్ 26 పున్నమి పత్రిక ప్రతినిధి వింజమూరు లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం పోస్ట్ ఆఫీస్ వీధి ప్రసన్న రెడ్డి నగర్ పాతూరు వింజమూరు నందు, శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని తనుశ్రీ రిఫ్రిజిరేషన్ విజయవాడ వాస్తవ్యులు అయినటువంటి వల్లెం వెంకటేశ్వర్ రెడ్డి వారి ధర్మపత్ని అఖిలారెడ్డి కుమార్తె తను శ్రీ రెడ్డి కుమారుడు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అత్యధిక అయ్యప్ప మాల ధరించిన స్వాములు, గోవింద స్వాములు, శివ స్వాములు, భవాని దీక్షపరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్తీక మాసంలో అన్నదానం చేస్తే సకల ఫలాలు సిద్ధస్తాయని దేవస్థానం చైర్మన్ కరకర మాలకొండ రెడ్డి తెలియజేశారు. గురుస్వాములు అయినటువంటి చేబ్రోలు వసంతరావు,మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

విశాఖపట్నం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్*

*ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్* *విశాఖ‌ప‌ట్ట‌ణం, అక్టోబ‌ర్ పున్నమి ప్రతినిధి: మొంథా (Montha) తుఫాను హెచ్చరికల నేపధ్యంలో 27, 28 ,29 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు, పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు ప్రయాణాలు రద్దు చేసు కోవాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని ఇంటి వద్ద సురక్షితంగా ఉండాలని, గాలులు వీచే సమయంలో చెట్ల కింద హోర్డింగ్ ల సమీపంలో ప్రజలు నిలబడరాదని కలెక్టర్ సూచించారు. మత్స్యకారులు సముద్రం లోకి వేటకు వెళ్ల వద్దని, వేటకు వెళ్లిన వారు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని కోరారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పంటలు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పల్లపు ప్రాంతాల్లో, కొండ వాలు ప్రాంతాలలో, నది ఒడ్డున నివసించేవారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీచ్ లలో స్నానాలకు దిగవద్దని కోరారు.* *పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మం తాత్కాలికంగా ర‌ద్దు…..* *మొంథా (Montha) తుఫాను హెచ్చరికల నేపధ్యంలో 27వ తేదీ (సోమ‌వారం) క‌లెక్ట‌రేట్లో జ‌ర‌గాల్సిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ (పీజీఆర్ఎస్) కార్య‌క్ర‌మాన్ని తాత్కాలికంగా ర‌ద్దు చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హరేంధిర ప్ర‌సాద్ తెలిపారు.* *విద్యా సంస్థలకు శెలవు……* *మొంథా (Montha) తుఫాను హెచ్చరికల నేపధ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్వాడీలకు 27 మరియు 28 తేదీలలో సెలవులుగా జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ప్రకటించారు.* *కంట్రోల్ రూమ్ నెంబర్లు……* *తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో జిల్లాలో వర్షాలు, గాలులు ఇతర ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0891- 2590102 నకు గాని, 0891- 2590100 నకు గాని ఫోన్ చేసి తెలియ జేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.*

పల్నాడు

దుర్గి “మండల బూత్ కమిటీల విభాగ అధ్యక్షులుగా

పార్టీ అధ్యక్షులు శ్రీ YS Jagan Mohan Reddy గారి ఆదేశాల మేరకు మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు మాచర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి మరియు పిన్నెల్లి వెంకటరామి రెడ్డి గారి ఆధ్వర్యంలో మాచర్ల నియోజకవర్గం నుంచి వైస్సార్సీపీ దుర్గి “మండల బూత్ కమిటీల విభాగ అధ్యక్షులుగా” ఎన్నికైన అయినా బొబ్బా సీతారామిరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐

విశాఖపట్నం

బీచ్ లో వ్యర్ధాలు , మురుగునీరు కలవకుండా పటిష్ట చర్యలు .

బీచ్ లో వ్యర్ధాలు , మురుగునీరు కలవకుండా పటిష్ట చర్యలు . • పరిష్కార మార్గం దిశగా ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులతో కలిసి బీచ్ ప్రాంతంలో పరిశీలన. • వై .ఎం. సి. ఎ . బీచ్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టుగా కన్స్ట్రక్టడ్ వెట్ ల్యాండ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం ,అక్టోబర్ పున్నమి ప్రతినిధి: విశాఖ నగర సముద్ర తీరంలో పలు కాలువలు ద్వారా వ్యర్ధాలు, మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారానికి జీవీఎంసీ పటిష్ట చర్యలు చేపడుతుందని, ఆ దిశగా అనుభవజ్ఞులైన ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులతో బీచ్ ప్రాంతంలో పర్యటించి పరిశీలనలు జరిపామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన జీవీఎంసీ అధికారులతో , ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో అనుభవజ్ఞులైన విశ్రాంత ప్రొఫెసర్ ఎస్. రామకృష్ణారావు, ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఎస్. బాలా ప్రసాద్ లతో కలిసి బీచ్ లో కలుస్తున్న పలు కాలువలను ఆదివారం పరిశీలించారు. ఈ పరిశీలనలో ముందుగా ఆల్ ఇండియా రేడియో సమీపంలో జగన్నాథ స్వామి దేవాలయం వద్ద ఉన్న వంతెన కింద కాలువను పరిశీలించిన అనంతరం బీచ్ రోడ్ లో వై ఎం సి ఎ వద్ద ,బీచ్ వైపు ఉన్న కాలువ ప్రాంతాన్ని పరిశీలించి మురుగునీరు బీచ్ లో కలవకుండా చేపట్టవలసిన చర్యలపై ప్రొఫెసర్లతో కమిషనర్ చర్చించారు. ముందుగా వై.ఎం.సి.ఏ బీచ్ మురుగు నీరు చేరిన ప్రాంతంలో ఒక పైలెట్ ప్రాజెక్టుగా కన్స్ట్రక్టడ్ వెట్ ల్యాండ్ ఏర్పాటు చేసినట్లయితే సమస్యకు కొంత పరిష్కారం ఏర్పడుతుందని , అందువలన కలిగే ప్రయోజనం దృష్ట్యా బీచ్ లో కలుస్తున్న మిగిలిన కాలువల వద్ద కూడా వాటిని ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్లు పలు సలహాలను అందించి కమిషనర్ కు సూచించగా .., దానివలన కలిగే ప్రయోజనాలపై కమిషనర్ ప్రొఫెసర్లతో సుదీర్ఘ చర్చ జరిపి అందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కార్యనిర్వాహక ఇంజనీరు ఏడుకొండలకు కమిషనర్ ఆదేశించారు. అనంతరం వై ఎం సి ఎ కాలువ వద్ద స్క్రీన్ లను , మురుగునీరు పారుతున్న ప్రక్రియను పరిశీలించి సంబంధిత సహాయక ఇంజనీర్లు నిత్యం కాలువలను పరిశీలించి, అడ్డంకులు లేకుండా తగిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కార్యనిర్వాహక ఇంజనీర్ ఏడుకొండలు కు కమిషనర్ ఆదేశించారు. * ” బీచ్ తీరంలో వ్యాపారస్తులు వ్యర్ధాల నిర్వహణపై పరిశుభ్రత పాటించనందుకు జరిమానాన్ని విధించిన కమిషనర్ ” బీచ్ లో వై ఎం సి ఎ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఒక దుకాణం ముందు అధికంగా పేరుకుపోయి ఉన్న వ్యర్ధాలను గమనించిన కమిషనర్ దుకాణదారుడు వ్యర్ధాలు నిర్వహణపై పరిశుభ్రత పాటించడం లేదని ఐదు వేల రూపాయలను ఆ దుకాణానికి జరిమానాలను విధించి వెంటనే వారిచే చెల్లింప చేశారు. విశాఖ నగరంలో నిత్యం బీచ్ తీర ప్రాంతాలకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నందున వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు విచ్చలవిడిగా దుకాణాల ముందు వ్యర్ధాలను పడవేస్తూ బీచ్ పరిసర ప్రాంతాలను, ఆహ్లాద వాతావరణాన్ని అపరిశుభ్రపరుస్తున్నారని, అటువంటి వారిపై జరిమానాలను విధించాలని అవసరమైనట్లయితే సంబంధిత షాపులను తొలగించాలని అందుకు జీవీఎంసీ ఎన్ఫోర్స్మెంట్ వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే బీచ్ తీర ప్రాంతంలో సందర్శకులు ,వ్యాపారస్తులు వ్యర్ధాలను పడవేయకుండా వారికి అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టాలని , బీచ్ తీర ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్ కు, జోనల్ కమిషనర్ శివప్రసాద్ కు కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీర్లు శాంతిరాజు మురళీకృష్ణ సహాయక వైద్యాధికారులు బి.ప్రసాదరావు, కృష్ణంరాజు, ఉప కార్య నిర్వాహక ఇంజనీర్లు,శానిటరీ ఇన్స్పెక్టర్ గోవిందరావు, వార్డ్ శానిటరీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

పెద జాలారిపేటలో మెందా తుఫాన్ హెచ్చరిక వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: ఈ రోజు 19వ వార్డు పేదజాలరిపేట పరిసర ప్రాంతాల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ MLA వెలగపూడి రామకృష్ణ బాబు గారు *మోందా తుఫాను* హేచ్చరికల నేపథ్యంలో లో పేదజాలరిపేట గ్రామ ప్రజలను మరియు గ్రామ పెద్దలతో ముందస్తు తుఫాను చర్యల్లో భాగంగా సముద్రం తీర ప్రాంతాల్లో ఉన్నవారు మైదాన ప్రాంతాల్లోకి వెళ్లాలని, సహాయ శిబిరలను, సహాయ చర్యలు వినియోగించుకొవాలని తెలియజేసారు. సదరు కార్యక్రమంలో పేదజాలరిపేట గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు బైరెడ్డి పోతన రెడ్డి, తెడ్డు రాజు, బాపిరాజు, పోలారావు, మాణిరెడ్డి, తెడ్డు సతీష్, నూకన్నా మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు

అమరావతి

సాంకేతికతయంతో తుఫాను నష్ట నివారణకు చర్యలు చేపట్టాం*

* సాంకేతికతయంతో తుఫాను నష్ట నివారణకు చర్యలు చేపట్టాం* *గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాం* *ఎటువంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశాం* *రాష్ట్ర హోమ్ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత* అమరావతి,పున్నమి ప్రతినిధి: అత్యాధునిక సమాచార సాంకేతికత సాయంతో ‘మొంథా’ తుపాను నష్ట నివారణకు అన్ని ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందని రాష్ట్ర హోమ్ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం తాడేపల్లి లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరము ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మొంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం హై అలెర్ట్ గా ఉందన్నారు. గతంలో సంభవించిన తుఫాన్ల సందర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పతిష్టమైన ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి రాష్ట్ర అధికారులతో పలుమార్లు కాన్ఫరెన్స్ లు నిర్వహించి అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఇదే అంశంపై గత నాలుగు రోజుల నుండి రాష్ట్ర ప్రజలను పలు మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తక్షణ చర్యలు చేపట్టేందుకు అన్ని జిల్లాలకు నోడల్ అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. 6 ఎన్ డి ఆర్ ఎఫ్, 13 ఎస్డీ ఆర్ఎఫ్ టీమ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. హెలికాప్టర్ లతో నావెల్ అధికారులను సిద్ధం చేయడం జరిగిందని, అన్నిచోట్ల హెలీపాడ్లను కూడా సిద్ధం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అవసరం అయితే బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ నుంచి కూడా హెలికాప్టర్ లను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. తీరా ప్రాంతాల్లో 14 బోట్లను కూడా సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ తుఫాను సందర్భంగా గంటకు 100 కిలోమీటర్ల పైబడి భారీ గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని రకాల హార్డింగ్లను తొలగించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. తుఫాను కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ల టోల్ నెంబర్ కు ఫోన్ చేసి స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చని, తక్షణ సహాయం కూడా పొందవచ్చు అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, తక్షణ సహాయం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె విజ్ఞప్తి చేశారు. స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పల్నాడు

గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు మాచర్ల 27/10/2025

వివాహ రిసెప్షన్ వేడుకల్లో నూతన వధువరులు జూలకంటి గౌతమ్ రెడ్డి, తేజస్విని రెడ్డిలను మంచి మనస్సుతో ఆశీర్వదించడానికి విచ్చేస్తున్న ఏపీ గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ, విద్యాశాఖమాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం.. సుస్వాగతం ..!

E-పేపర్

వైసిపి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మందల పవన్ సాయి

వైసిపి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మందల పవన్ సాయి రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్యజిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మందల పవన్ సాయి నీ నియమించినందుకు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మరియు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కి , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గార్కి, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరముట్ల. శ్రీనివాసులుకి మరియు రైల్వేకోడూరు నియోజకవర్గ వైసిపి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్న మం దల పవన్ సాయి.

ఆంధ్రప్రదేశ్

బైక్ నలుపు రంగులో ఉండటం వల్ల గుర్తించలేకపోయా: డ్రైవర్

బైక్ నలుపు రంగులో ఉండటం వల్ల గుర్తించలేకపోయా: డ్రైవర్ ఆంధ్రప్రదేశ్పున్నమి ప్రతినిధి : కర్నూలు బస్సు ప్రమాదం గురించి డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు సంచలన విషయాలు చెప్పాడు. రోడ్డుపై పడిన బైక్ నల్లరంగులో ఉండటంతో దాన్ని దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయానని అతను తెలిపాడు. వర్షంలో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో, బైకుపై నుంచి కూడా బస్సును ఆపకుండా పోనిచ్చినట్లు చెప్పాడు. అయితే, ఈ ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైకును గుర్తించి పక్క నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.