Saturday, 11 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

SIR 2025: రేపు దేశవ్యాప్తంగా SIR ప్రత్యేక సర్వేపై ఈసీ ప్రెస్‌మీట్ – కీలక ప్రకటనలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR 2025) తేదీలను ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) రేపు సోమవారం సాయంత్రం 4:15 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఈ సమావేశంలో పాల్గొంటారు. మొదటి దశలో 10 నుంచి 15 రాష్ట్రాలు కవర్ కానున్నాయి. ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు ఈ దశలో ఉన్నాయి. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, బదిలీలు వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ఓటర్ జాబితా లోపాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో, ఈ సర్వేకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా BLOల ద్వారా సర్వేలు, ఫోటో ID అప్‌డేట్స్ జరగనున్నాయి.

తిరుపతి

ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి మంత్రి నాదెండ్ల కితాబు

శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. ఈ ఆయనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆ యనకు ఘన స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల పత్యేక ప్రత్యెక దర్శనార్థ ఏర్పాట్లు చేయించి శ్రీ గురుమేద దక్షిణామూర్తి సన్న్ధిలో ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం చేయించి అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీ స్వామి, అమ్మ వార్ల చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు మంత్రి నాదెండ్లకు అందజేశారు. ఈ సందర్బంగా ఏపీ మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ…టిడిపి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూటమిలోని టిడిపి, బిజెపి, జనసేన, నాయకులను, కార్యకర్తలను, అటు పాలన పరంగాను ఇటు పదవుల పంపిణీ లోను అందరినీ ఏకతాటిపై నడిపిస్తూ ముందుకెళుతున్న విధానానికి ఏపీ మంత్రి నాదెండ్ల ఎమ్మెల్యే బొజ్జల పై ప్రశంసల జల్లు కురిపించారు..రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వివిధ ఆలయాలకు ధర్మకర్తలి మండలి నియమించిన విషయం తెలిసిందేనని అందులో భాగంగా ముక్కంటి ఆలయ పాలకమండలి సభ్యులు గా నియమితులైన టిడిపి, బిజెపి, జనసేన సభ్యుల ప్రమాణ స్వీకనానికి అన్నీ తానై నడిపించి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ

కాలేజీలు బంద్ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9640204826 నవంబరు 3 నుంచి కాలేజీలు బంద్ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్ పాటిస్తామని తెలిపిన తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కాలేజీలు నడిపే పరిస్థితుల్లో లేవని.. రూ.1200 కోట్ల బకాయిలు చెల్లిస్తామని కేవలం రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపిన రమేష్ బాబు నవంబరు 1 లోపు రూ.900 కోట్లు విడుదల చేయకపోతే.. 3 నుంచి నిరవధిక బంద్ చేస్తామని ప్రకటన నవంబరు 10వ తేదీ లోపు 2లక్షల మందితో సమావేశం నిర్వహిస్తామని.. వాళ్ల స్వార్థం కోసం మమ్మల్ని భయపెడితే ఊరుకునేది లేదని.. ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి అనుమతించమని హెచ్చరించి తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు

కాకినాడ

ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా పెద్దాపురం మండలంలోని ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వి మౌనిక పేర్కొన్నారు. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని కాలువలు ఆనుకొని నివాస ఉంటున్న ప్రజలు సురక్షిత మైన ప్రాంతాల్లో నివాసం ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. కాలవల్లో కానీ, కాలువ అంచున చిన్నారులు యువకులు మహిళలు వెళ్ళకుండ జాగ్రత్తలు పాటించాలన్నారు

తిరుపతి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని సత్కరించి టిటిడి పాలకమండలి సబ్యుడు

శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి దర్శనార్థం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు వైద్యం శాంతారామ్ దంపతులు ఆదివారం నాడు వీరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆ యనకు సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల పత్యేక ప్రత్యెక దర్శనార్థ ఏర్పాట్లు చేయించి స్వామివారి ప్రతిమ, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా శ్రీకాళహస్తిలో నాయి బ్రాహ్మణులు అందరూ కలసి ఎదుర్కొంటున్నసమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణ సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ తాను ముందుంటానని వారికి తెలిపారు. అనంతరం దేవస్థాన అతిది గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని టీటీడీ బోర్డుమెంబర్ వైద్యం శాంతారామ్ దంపతులు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మంగళం ప్రభాకర్, నెల్లూరు జిల్లా ఇదర శ్రీనివాసులు, తిరుపతి పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ కోటా చంద్రశేఖర్, నాయి బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు వీర రాఘవులు, డి. కృష్ణమూర్తి పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నవంబర్ మొదటి వారంలో ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు — రైతులకు కేంద్రం శుభవార్త!

రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే 21వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తం మూడు విడతలుగా — ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. ఇప్పటివరకు కేంద్రం 20 విడతలను విజయవంతంగా రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసింది. తాజాగా 21వ విడత నిధులను జమ చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. నవంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే, పీఎం కిసాన్ సాయాన్ని పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేసి ఉండాలి. అలాగే, వారి ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. ఈ వివరాలు సరిగ్గా లేనట్లయితే నిధులు నిలిపివేయబడే అవకాశం ఉంది. రైతులు తమ స్థితిని అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inలో చెక్ చేసుకోవచ్చు. “Beneficiary Status” ఆప్షన్‌లో ఆధార్ లేదా మొబైల్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన 2019లో ప్రారంభమై, ఇప్పటి వరకు కోట్లాది మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. ఈ పథకం ద్వారా రైతుల ఆర్థిక స్థిరత్వం పెంపొందడమే లక్ష్యం. నవంబర్ మొదటి వారంలో నిధులు జమ కాబోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆనందం నెలకొంది.

తూర్పు గోదావరి

వైయ‌స్ జగన్ కు పేరొస్తుందనే భయం -మాజీ ఎంపీ మార్గాని భరత్.

చంద్రబాబు నాయుడు తానే హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్, విశాఖపట్నానికి గూగుల్ తీసుకొచ్చానని చెప్పుకుంటున్నాడు. ఆ తర్వాతే సత్య నాదేళ్ల మైక్రోసాఫ్ట్ లో చేరాడు అని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి 1995లో ముఖ్యమంత్రి అయితే… వికీ సమాచారం ప్రకారం సత్య నాదేళ్ల మైక్రోసాఫ్ట్ లో 1992లో చేరారు. సుందర్ పిచాయ్ గూగుల్ డేటా సెంచర్ గురించి మాట్లాడుతూ ప్రధానితో మాట్లాడానని చెబితే… అది కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆదానీ కంపెనీ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు పునాదులు వేశారు. సబ్‌సీ కేబుల్ ఏర్పాటుకు సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో ఆరోజే చ‌ర్చించ‌డం జ‌రిగింది. ప్రజలు వాస్తవాలు గమనించాలి. ఆదానీ, ఎయిర్ టెల్, గూగుల్ సంయుక్తంగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు సుందర్ పిచాయ్ చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ఆదానీ భాగస్వామ్యం గురించి చెబితే… వైయస్.జగన్ కు క్రెడిట్ వస్తుందన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఆదానీ పేరు కూడా ప్రస్తావించడం లేదు. ఐటీకి నేనే ఆద్యుడుని, హైదరాబాద్ లో ఐటీ నేనే తెచ్చానని చెప్పుకోవడం చంద్రబాబుకి అలవాటు.. కానీ ఐటీ హబ్ ఆఫ్ ఇండియా అని బెంగుళూరుని చెబుతారు. హైదరాబాద్ కి చంద్రబాబు చేసిందేమీ లేదు. అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే, శంషాబాద్ ఇంటర్నేరేషల్ ఎయిర్ పోర్టు కూడా వైయస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మిస్తే.. చంద్రబాబు చేసిందేమిటి? ప్రజలు మీ మాటలు విని, నవ్వుకుంటున్నారన్న జ్ణానం కూడా లేకుండా పోయింది. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కి చంద్రబాబు చేసింది ఏమీ లేదు, ఒక బిల్డింగ్ మాత్రం కట్టి అంతా నేనే చేశానని చెప్పుకోవడం అలవాటుగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కర్నూలు వద్ద ప్రమాదంలో దహనమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ఏడాదిన్నరగా ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేదు. ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతుంటే అధికారులు, ప్రభుత్వం నిద్రపోతున్నారా? అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేస్తే రాష్ట్రంలో ఇలాంటి వాహనాలు లక్షల్లో బయటపడతాయి. ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు? ప్రభుత్వానిది కాదా? వీరిపై సుమోటోగా సుప్రీంకోర్టు, హై కోర్టుల్లో కేసులు వేయాలి. 19 మంది ప్రాణాలను అన్యాయంగా హరించారు. ప్రమాదానికి గురైన బస్సుకు ఇన్సూరెన్స్ లేదు, బస్సుపై 16 ఇ- చలాన్లు ఉన్నాయి. ఇంతటి నిర్లక్ష్యంతో ఉన్న ప్రభుత్వానికి కొనసాగే నైతిక అర్హత లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేదు. వీరిపై దాడులు, మానభంగాలు జరుగుతున్నా… ప్రభుత్వ చర్యలు శూన్యం. రాజమండ్రి హాస్టల్ లో పదోతరగతి చదువుతున్న బాలికను దీపావళి రోజున హాస్టల్ నుంచి తీసుకుని వెళ్లిన ఇద్దరు యువకులు లైంగికంగా లోబర్చుకుంటే… పోలీసులు కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. ఇంత దారుణం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వెలుగులోకి రాని దుర్ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ ఘటనపై బీసీ హాస్టల్ ముందు ధర్నా చేస్తే.. మా పై తిరిగి కేసులు నమోదు చేస్తున్నారు. ఘటనపై ఆగ్రహంతో ఉన్న మహిళలు హాస్టల్ ఎదురుగా స్థానిక ఎమ్మెల్యే వాసు బ్యానర్ చూసి ఆగ్రహంతో అనూయాదవ్ అనే మహిళ పేడ జల్లితే.. 10 మంది పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. దాదాపు 3 గంటలపాటు ఆమెను నిర్భంధించారు. హాస్టల్ లో బాలికకు రక్షణ కల్పించలేని పోలీసులు, ప్రభుత్వం తీరుపై ఆవేదనతో నిరసన తెలియజేస్తే అరెస్టు చేస్తారా ? 41 ఏ నోటీసులు ఇచ్చిన తర్వాత మరలా విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు కాదా? ప్రశ్నిస్తే మా పై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ అకృత్యాలకు రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యమే కారణం. 24 గంటలూ మద్యం దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. ఇది చాలదన్నట్టు అధికార పార్టీ నేతలే ఏకంగా కల్తీ మద్యం తయారీ కుటీరపరిశ్రమలా చేపడుతూ.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. రాజమండ్రిలో లిక్కర్ సిండికేట్ సంభాషణలో లీకేజీలతో అసలు విషయం తేటతెల్లమవుతుంది. రాష్ట్రంలో విచ్చవిడిగా ఉన్న పేకాట క్లబ్బులపై డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ విచారణకు ఆదేశిస్తే… గౌరవప్రదమైన డిప్యూటీ స్పీకర్ గోదావరి జిల్లాల్లో పేకాట సహజం అని మాట్లాడ్డం విడ్డూరం. రాజమండ్రిలో కూడా విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు ఇసుక, మద్యం , భూసెటిల్మెంట్, స్పా సెంటర్లు అన్నీ ఈవీఎం ఎమ్మెల్యే అండదండలతో నడుస్తున్నాయి. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావటం వల్లే అరాచకాలు జరుగుతున్నాయి. ఆదిరెడ్డి కుటుంబానికి రాజకీయ బిక్ష పెట్టిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీలో ఎమ్మెల్సీ పదవి పొంది టిడిపి అధికారంలోకి రాగానే అందులోకి దూకిన మీరు నీతులు చెప్పడం విడ్డూరం. వైయస్ జగన్ భిక్షతో మీ తండ్రి ఎమ్మెల్సీ అయ్యారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే మా పై కేసులు పెడుతున్నారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా పనిచేయవద్దు. వంద కేసులు పెట్టినా ఇదే స్థాయిలో పోరాటం చేస్తాం. కుమ్మక్కు రాజకీయాలు స్థానిక ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందన్నారు. అన్నీ త్వరలోనే భయటపెడతామన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… ఈ నెల 28వ తేదీన చేపట్టనున్న ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను పార్టీ నేతలతో కలిసన భరత్ విడుదల చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.

E-పేపర్

హైదరాబాద్ ghmc ఆఫీస్ అవినీతికి నిలయం పనిచేయని లిప్ట్ పారిశుద్ధ్యం నిర్వహణ అస్తవ్యస్తం బల్దియా అంటేనే అవినీతి కంపు..!* *ఏళ్ల తరబడి కొనసాగుతున్న బిల్డింగ్ అంతర్గత మరమ్మతులు

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ జీహెచ్ఎంసీ ఆఫీస్ అవినీతికి నిలయం పనిచేయని లిఫ్ట్ పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం బల్దియా అంటేనే అవినీతి కంపు ఏళ్ల తరబడి కొనసాగుతున్న బిల్డింగ్ అంతర్గత మరమ్మతులు పక్కదారి పడుతున్న మెయింటెనెన్స్ నిధులు జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి కంపు రాజ్యమేలుతుంది. ఈ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నినాదంతో కాలనీలను, డివిజన్ లను శుభ్రపరిచే బల్దియానే నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో చెత్తా చెదారంతో నిండిపోతుంది. అదెక్కడో కాదు.. సరూర్ నగర్ పరిధిలో ఉన్న సర్కిల్ 3- 4- 5 కార్యాలయమే ఇందుకు నిదర్శనం. ఇక్కడికి స్థానిక ప్రజలు అనేక పనులపై వస్తుంటారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో వికలాంగులకు, వృద్ధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడి దుస్థితి చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. తమ కార్యాలయంలో ఓ లిఫ్టును కూడా బాగు చేసుకోలేని వాళ్లు.. తమ ఆఫీసును కూడా పరిశుభ్రంగా నిర్వహించుకోలేని అధికారులు ఇక వాళ్ల పరిధిలోని కాలనీలను, డివిజన్ పరిధిలోని బస్తీలను ఎలా పరిశుభ్రంగా ఉంచుతారనే చర్చ మొదలైంది.. *పని చేయని లిఫ్ట్* జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని కార్యాలయంలో గత ఏడాది కాలంగా లిఫ్ట్ పని చేయడం లేదు. దీంతో అనేక పనుల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు లిఫ్ట్ పని చేయకపోవడంతో రెండవ, మూడవ అంతస్తులోని కార్యాలయాల్లోకి తమ పనుల నిమిత్తం వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా మరమ్మత్తులు ఉంటే.. వారం.. పది రోజుల్లో పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెయింటెనెన్స్ నిధులు ఏమైతున్నట్టు ప్రభుత్వం ముఖ్యంగా జీహెచ్ఎంసీ నిధుల నుంచి ప్రతి సర్కిల్ కార్యాలయాలకు మెయింటెనెన్స్ కోసం కొంత ఫండ్ ను ప్రతినెలా రిలీజ్ చేస్తుంది. అట్లాగే సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయానికి ప్రతి నెల మెయింటెనెన్స్ కోసం నిధులు విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులు వేళల్లో కాదు.. రూ. లక్షల్లో ఉన్నట్లు సమాచారం. మరి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి. ఏడాదికాలంగా వృద్ధులు, వికలాంగులు సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయాలకు వచ్చే ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే ఈ పక్క దారి పట్టిన నిధులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి..? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజల ఇబ్బందులను గ్రహించి.. మెయింటెనెన్స్ నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సరూర్ నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి

తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం శ్రీకాళహస్తీ ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి,ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కార్యాలయాన్ని పరిశీలించారు.ఈ మేరకు తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా కురుస్తున్న నేపథ్యంలో ఆ కార్యాలయ భవనాన్ని తహసీల్దార్ కార్యాలయ భవన సమీపంలోని సమగ్ర శిశు పధక కార్యాలయంలోకి తాత్కాలికంగా మార్పు చేశారు. ఈ కార్యక్రమంలో తోట్టంబేడు తహసిల్దార్ భారతి, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు మరియు ఎస్పీలతో హోం మంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్

అమరావతి అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు మరియు ఎస్పీలతో హోం మంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రత్యేక దృష్టి పెట్టాలి 100 కిమీ వేగంతో బలమైనగాలుల ప్రభావంతో చెట్లు,పోల్స్ పడి విద్యుత్ సరఫరా అంతరాయం కలగవొచ్చు పునరుద్దరణకు ముందుగానే ట్రాన్స్ఫర్మర్స్, పోల్స్ సిద్ధంగా ఉంచాలి జేసీబీలు, జనరేటర్స్ రెడీగా ఉంచాలి భారీ హార్డింగ్స్ వెంటనే తొలగించాలి డెలివరీ దగ్గరలో ఉన్న గర్భిణీల కుటుంబాలతో మాట్లాడుతూ ఉండాలి మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్సులు ఏర్పాటు చేయాలి కాకినాడ జిల్లాల్లో 6 మండలాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం కాకినాడ జిల్లాలో ఎక్కువ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం రోడ్డు బ్లాక్ అయితే డైవర్షన్స్ ముందే మ్యాప్ చేసుకోవాలి జిల్లా, మండల కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలి పునరావాస కేంద్రాల్లో పరిశుభ్రమైన ఆహారం అందించాలి నిత్యవసర వస్తువులు, మెడిసిన్, శానిటేషన్ మెటీరియల్ వంటివి అందుబాటులో ఉంచాలి అవసరం అయితే తరలింపుకు ట్రాక్టర్, జేసీబీ, బస్సు, ఇతర వాహనాల వివరాలు సిద్ధంగా ఉంచాలి సముద్ర తీరప్రాంత గ్రామాల వారిని ముందుగానే ఒప్పించి రిలీఫ్ కేంద్రాలకు తరలించాలి

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.