Saturday, 11 April 2026

Blog

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువు కట్ట పెన్న బస్సు, కారు డి, తృటిలో తప్పిన ప్రమాదం, డివైడర్ ఎక్కిన బస్సు, బోల్తా పడిన కారు, పలువురికి గాయాలు

*బ్రేకింగ్* పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9133469506 *రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై బస్సు, కారు డి, తృటిలో తప్పిన ప్రమాదం, డివైడర్ ఎక్కిన బస్సు, బోల్తా పడిన కారు, పలువురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు*

నిర్మల్

ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం మూడవ రోజు – వాటోలి గ్రామం లో విశేష కార్యక్రమా

గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమం మూడవ రోజు వాటోలి గ్రామంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం అల్పాహారం అనంతరం విద్యార్థులు గ్రామ పరిసరాల్లో పచ్చదనం కోసం మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం అనే అంశంపై గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం తరువాత ప్రసిద్ధ యోగ ఇన్‌స్ట్రక్టర్ శోభ మందాని మేడం గారు విద్యార్థులకు యోగ యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణలో యోగ యొక్క పాత్ర పై అవగాహన కల్పించారు. 💫విద్యార్థుల ఉత్సాహం, గ్రామ ప్రజల సహకారం, మరియు శోభ మేడం మార్గదర్శకతతో ఈ రోజు కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పేకాట స్థావరాలపై పోలీస్ దాడులు….?

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో ఐదుచోట్ల పేకాట క్లబ్బులు….. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బొజ్జ ఐశ్వర్య….. అమలాపురం పట్నం ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఒక బిల్డింగులో పేకాట క్లబ్… అమలాపురం రూరల్ కామనగరువు పంచాయతీ పరిధిలో మరో క్లబ్…. ఉప్పలగుప్తం ప్రాంతంతో సహా నియోజకవర్గంలో మరో మూడు చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని ఐశ్వర్య ఆరోపణలు… సోషల్ మీడియాలో వీడియో విడుదల…. వీటిపై నియోజకవర్గంలో చర్చ… ఈ నేపద్యంలో పేకాట స్థావరాలపై పోలీస్ దాడులు జరిగినట్లుగా సమాచారం….?

E-పేపర్

భుజంగేశ్వర స్వామి గుడి చైర్మన్ ఉంగరాల సురేంద్ర కుమార్ మరియు పాలకవర్గం , సిబ్బంది,

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు లోని పురాతన శ్రీ భువనేశ్వరీ దేవి సమేత శ్రీ భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ శ్ఉంగరాల సురేంద్ర కుమార్ మరియు పాలకవర్గం , సిబ్బంది, అర్చకులు పవన్ స్వామి ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మొదటి కార్తీక సోమవారం శుభ సందర్భంగా భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను విశేషంగా దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించి , తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

ఆంధ్రప్రదేశ్

తుఫాను తాకిడి – వర్షాలతో శ్రీకాకుళం తడిసి ముద్దయింది – రైతుల ఆందోళన – పెండింగ్‌లో విద్యార్థుల తరగతులు

తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు నుండి వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతాల్లో గాలులు వేగంగా వీచడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడుతుండటంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వరి పంట కోత దశలో ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో పంటలు నష్టపోవచ్చని భయపడుతున్నారు. మరోవైపు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల తరగతులు పెండింగ్‌లో ఉండగా, ఆగస్టు నెలలోనూ వర్షాల కారణంగా తరచుగా సెలవులు రావడంతో పాఠ్యపథకం వెనుకబడింది. వాతావరణ శాఖ వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు సూచించారు.

E-పేపర్

అయ్యప్ప దీక్ష లో తల్లెం భరత్ కుమార్ రెడ్డి* *మొదటి కార్తీక సోమవారం సందర్భంగా అయ్యప్ప మాల ధరించిన తల్లెం

*అయ్యప్ప దీక్ష లో తల్లెం భరత్ కుమార్ రెడ్డి* *మొదటి కార్తీక సోమవారం సందర్భంగా అయ్యప్ప మాల ధరించిన తల్లెం *రైల్వే కోడూరు అయ్యప్ప స్వామి గుడిలో పురోహితులు సుదర్శన శర్మ చేతుల మీదుగా మాలధారణ* రైల్వే కోడూరు/ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో పురోహితులు బండాత్మకూరు సుదర్శన్ శర్మ చేతులు మీదుగా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో దీవెనలతో మొదటి కార్తీక సోమవారం సందర్భంగా గుంతకల్ రైల్వే డివిజన్ వినియోగదారుల సభ్యులు, వైసిపి రాయలసీమ బూత్ కమిటీ కన్వీనర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి అయ్యప్ప స్వామి వారి దీక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం జన్మజన్మల పుణ్యంగా భావిస్తూ ఈ మాల ధారణలో నియమ నిష్ఠలతో అయ్యప్ప స్వామివారిని ధ్యానించుకుంటూ అయ్యప్ప నామస్మరణలతో భక్తి పారవశ్యంతో ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉపాధ్యాయుల్లో టెట్‌ టెన్షన్‌ — సుప్రీం తీర్పుతో ప్రమోషన్లకు టెట్‌ తప్పనిసరి

➡️ సుప్రీం కోర్టు తాజా తీర్పు ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణులు కావాలి. ➡️ 2009 విద్యాహక్కు చట్టం తర్వాత నియమితులైన ఉపాధ్యాయులు రెండు సంవత్సరాల్లోగా టెట్‌ పాస్‌ అవ్వాల్సిందే. ➡️ టెట్‌ అర్హత లేకుంటే ప్రమోషన్ల మార్గం మూసుకుపోతుందని కోర్టు స్పష్టం. ➡️ జిల్లాలో 800 మంది ఉపాధ్యాయులు ఈ తీర్పు ప్రభావానికి లోనవుతారు. ➡️ సర్వీసులో ఐదేళ్లలోపు రిటైర్‌ అయ్యేవారికి మాత్రమే మినహాయింపు. ➡️ ఎన్‌సీటీఈ, టెట్‌ నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు సడలింపులు కోరుతున్నాయి. ➡️ టెట్‌ ప్రశ్నలు కఠినంగా ఉండటం, మార్కుల అర్హత ఎక్కువ కావడం ఉపాధ్యాయులకు ఆందోళన. ➡️ ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించి ఉపాధ్యాయుల సేవలను కాపాడాలని సంఘాలు డిమాండ్‌.

E-పేపర్

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని అక్టోబర్ 28న రాయచోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ను జయప్రదం చేయండి మాదరాజు గంగాధర్ ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని అక్టోబర్ 28న రాయచోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ను జయప్రదం చేయండి మాదరాజు గంగాధర్ ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు *అక్టోబర్ 28 రాయచోటికలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగు ధర్నా కు ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ గారు రాక.* *ఆదివారం రైల్వే కోడూరు లో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)అధ్యక్షులు పాండురంగయ్యఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది *ఈ సందర్భంగా ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ హాజరై మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పెండింగ్‌లో ఉన్న క్లైములకు తక్షణమే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.గత వైసిపి ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కార్మికుల కోసం ఏర్పాటైన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తూ 2019లో జీఓ నెం.1214 జారీ చేయడం వల్లే వేలాది క్లైమ్ లు పెండింగ్‌లోకి వెళ్లాయని వారు అన్నారు. అయితే అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూడా 18 నెలలు గడిచినా ఈ సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సెస్ రూపంలో వందల కోట్ల రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్‌కి చేరుతున్నప్పటికీ, ఆ నిధులు కార్మికుల సంక్షేమానికి వినియోగించకపోవడం ఆందోళనకరమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకుపైగా పెండింగ్ క్లెయిమ్లు వెంటనే క్లియర్ చేయాలని, లేనిపక్షంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలను ముట్టడించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.వైసిపి పాలనలో కార్మికులు ఎన్నో వేధింపులకు గురయ్యారని, ఎన్నికల ముందు కూటమి నాయకులు కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 50 లక్షల కుటుంబాలు ఆశతో కూటమికి మద్దతు ఇచ్చారని, కానీ ఇప్పటివరకు హామీలు నెరవేర్చకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.ఇప్పటికే వేలాది కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు పోస్టుకార్డులు రాసి వినతులు పంపారని, అలాగే కార్మికశాఖ మంత్రి, వెల్ఫేర్ బోర్డు చైర్మన్, లేబర్ కమిషనర్‌లను కూడా ప్రత్యక్షంగా కలిసి విన్నవించామని వారు తెలిపారు. అయినప్పటికీ పరిష్కారం లేకపోవడంతో, త్వరలో భవన నిర్మాణ కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుకు కోటి రూపాయలు కేటాయిస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక దాని వూసే లేదన్నారు. క్లైమ్లకు నిధులు మంజూరు చేస్తామని ధాంబికాలు పలికారని వారు ఏద్దావా చేశారు. కార్మికులు అక్టోబర్ 28 జరుగు ధర్నాను జయప్రదం చేయాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. *ఈ సమావేశంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రైల్వే కోడూరు కమిటీ నాయకులు భాస్కర్ నరసింహులు హరి చిన్న. భవన నిర్మాణ సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు.*

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాను పయనమిలా… కాకినాడ వైపు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 720 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 790 కిలోమీటర్లు, కాకినాడకి 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వచ్చే 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారి, అదే రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.

E-పేపర్

సోక సముద్రంలో శ్రీరంగపట్నం

తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం వాస్తవ్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవీ ఉపాసకులు శ్రీ శ్రీ శ్రీ లట్టాల శివరామకృష్ణ గారు ఉదయం 5 గంటలకు స్వర్గస్తులైనారు వారి ఆత్మకు శాంతి కలగాలని శాశ్వత స్వర్గలోకి నివాసం కలగాలని గ్రామస్తులు నివాళులర్పించారు శ్రీరంగపట్నం గ్రామం లో విషాద వాతావరణం నెలకొంది End

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.