Saturday, 11 April 2026

Blog

తిరుపతి

షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్కంద షష్టి సందర్భంగా విశేష పూజలు

శ్రీకాళహస్తి పట్టణం తేరి వీధిలో వెలిసినటు వంటి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సోమవారం స్కంద షష్టి విశేషమైన రోజుగా భావించి ప్రత్యేక పూజలు,విశేష హారతులు, అన్నదానాలు నిర్వహించారు.ఆలయ వేద అర్చకులు మాట్లాడుతూ స్కంద షష్ఠి అనేది స్వామివారికి నెలవారి కృత్తిక కన్నా ఎంతో విశేషమైన రోజుగా భావిస్తూ,స్వామి వారిని చందనం మరియు బంగారు కవచంతో అలంకరించి,భక్తులు తెచ్చినటువంటి తీర్థ ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు.అదేవిధంగా సాయంత్రం దీపారాధన కార్యక్రమం కూడా నిర్వహించి ఈ యొక్క స్కంద షష్టి పూజలను విజయవంతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ మెంబర్లు,భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రైతుల పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు

రైతుల పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు సంబంధించిన వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల కారణంగా “అన్నదాత సుఖీభవ” పథకం లబ్ధి ఆగిపోయింది. ఈ తప్పులు ప్రధానంగా – తప్పు ఆధార్ మ్యాపింగ్ ఒకే ఆధార్‌ నంబర్‌ ఒక్కటి కంటే ఎక్కువ పట్టాదారులకు లింక్‌ అవడం. ఆధార్‌ లింక్‌ కాని పట్టాదారులు. ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 సేవా చార్జీ ఉంది. కానీ ప్రభుత్వం ఒకసారి మాత్రమే రూ.2.72 కోట్ల సేవా చార్జీని మాఫీ చేస్తూ, ఈ 5.44 లక్షల మంది రైతులకు ఉచితంగా సవరణలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సదుపాయం అన్నదాత సుఖీభవ పథకం కింద ధృవీకరించబడిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది.

నిర్మల్

వాటోలి గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్‌ సేవా శిబిరం మూడవ రోజు అద్భుత కార్యక్రమాలు

. గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా — నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబిరం మూడవ రోజు వాటోలి గ్రామంలో ఉత్సాహంగా కొనసాగింది. విద్యార్థులు గ్రామ అభివృద్ధికి తమ సేవలను సమర్పిస్తూ రోడ్ల శుభ్రత, డ్రైనేజీ శుభ్రత, చెత్త నిర్వాహణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి ముందర ఉన్న చెత్తను సక్రమంగా తొలగించాలని ప్రజలకు చైతన్యం కల్పించడంతో పాటు, పోచమ్మ మందిరం పరిసరాల్లోని చెత్తను పూర్తిగా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు గ్రామంలో పరిశుభ్రత ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు. మధ్యాహ్నం అనంతరం “యోగా అభ్యసనం దాని యొక్క ప్రాముఖ్యత” అనే అంశంపై యోగ ఇన్స్ట్రక్టర్ శోభ మందాని మేడం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు యోగ వల్ల కలిగే శారీరక, మానసిక లాభాలను వివరించడంతో పాటు సూర్యనమస్కారాలు, బ్రామరీ, అనులోమ–విలోమ వంటి ఆసనాలను చూపించి ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య గారు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ ఆరె. రాజు గారు, అధ్యాపకులు ఓం ప్రకాష్, గుంత సుధాకర్, డా.కోసారి సంతోష్ కుమార్, డా డా.కల్పన, శ్రావణి, రాజయ్య, రామ్మోహన్, అర్షియ బేగం జి. కిషన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఎన్ఎస్ఎస్ క్యాంపు తో గ్రామం మరింత అందంగా, పరిశుభ్రంగా మారింది

తిరుపతి

పరిమళించిన మానవత్వం.

దాతృత్వం చాటుకున్న ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ యల్లంపాటి కోటేశ్వర బాబు.శ్రీకాళహస్తి మండలం,వేలవేడు గ్రామంలో నివాస ఉంటున్న సుమతి(65) పూరిగుడిసెలో నివాసం ఉంటుంది.ఆమె ఇళ్ళు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నేలమట్టం కావడంతో ప్రక్కన ఉన్న బాత్రూంలో తలదాచుకుంటున్నది.ఆమెకు ఎవరూ లేకపోవడం వలన చలించిన కోటేశ్వర బాబు సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుని ఒక నెల కు సరిపడా 26 కేజీల నాణ్యమైన బియ్యం, నిత్యవసర సరుకులు,కూరగాయలు,భోజనము, ఖర్చులకు కొంత నగదు అందజేసి తన దాతృత్వాన్ని చాటుకోవడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ఆర్టీసీ అభివృద్ధి కీ తన వంతు కృషి చేస్తామని

ఆర్టీసీ సమస్త అభివృద్ధి కీ తన వంతు కృషి చేస్తామని నెల్లూర్ జోనల్ ఛైర్మెన్ సన్నపు రెడ్డీ సురేష్ రెడ్డి తెలిపారు సోమవారం ఆయన ఉదయగిరి ఆర్టీసీ డిపో గ్యారేజి లో ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న సిబ్బందికి బీజేపీ నాయకులు మూడమాల రమేష్ రెడ్డి సౌజన్యం తో ఏర్పాటు చేసిన యూని ఫామ్ , రెయిన్ కోట్ లను సురేష్ రెడ్డి అందజేశారు ఆయన మాట్లాడుతూ డిపో లెని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు

ఖమ్మం

బీజేపీ రాష్ట్ర కార్యలయం లో కొమరం భీమ్ కీ నివాళులు అర్పించిన బీజేపీ నేతలు

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) తెలంగాణ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన మహానాయకుడు, ఆదివాసీ గౌరవ ప్రతీక గోండు బెబ్బులి కొమరం భీం వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నెనవత్ రవి, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాతోట్ మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు కొమరం భీం త్యాగస్ఫూర్తి, పోరాట పటిమను స్మరించుకుంటూ ఆయన చూపిన దారిలో నడుస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.

E-పేపర్

రైల్వే కోడూరు పంచాయతీ అభివృద్ధి పై నాయకులతో సమీక్ష ముక్క సాయివికాస్ రెడ్డి

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలపై కోడూరు నాయుకులతో *రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* చర్చలు జరిపారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, పంచాయతీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై నేతలతో చర్చించారు. ప్రస్తుతం తుఫాను పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి అందరం సహాయం అందించాలన్నారు. పంచాయతీల్లో అవసరమైన చర్యలు తీసుకుని, ప్రజల ఆపద సమయాల్లో అండగా నిలవాలని స్థానిక నాయకులను కోరారు. ముఖ్యంగా తుఫాను కారణంగా వచ్చే వర్షాలు, గాలులు, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు సమిష్టిగా కృషి చేయాలని ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు అన్నారు.రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతు కృషి నిరంతరంగా కొనసాగుతుందని, ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడికి ముస్లిం మైనారిటీ నాయకులు సన్మానం

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గాదిపాకుల గోపీనాథ్ ని ముస్లిం మైనారిటీ సోదరులు ఘనంగా సన్మానించి స్వీట్స్ పంచారు.ముస్లిమ్స్ సోదరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ మరియు ఎమ్మెల్యేబొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబం న్యాయం చేస్తారు అనేదానికి నిదర్శనం గోపీనాథ్ ని ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా నియమించడం అని తెలిపారు.ఈ కార్యక్రమం లో షాకిర్ అలీ,ఖాదర్ భాష,షఫీ,ఖలీల్,ఫ్రూట్ మీర్జా, షేక్ జహీర్ అహ్మద్,C.S మస్తాన్, మీర్జా, రఫీ బాయ్,ఖాదర్ వలీ,సాజిద్,నయీమ్, జావిద్,రాజా ఇర్ఫాన్, షాహిద్,కోపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ దొరబాబు,మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రైల్వే కోడూరు పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులతో సమీక్ష ముక్క సాయి వికాస్ రెడ్డి నాయకులతో సమీక్ష మొక్క సాయి వికాస్ రెడ్డి

రైల్వేకోడూరు అక్టోబర్ పౌర్ణమి ప్రతినిధి రైల్వే కోడూరు పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలపై కోడూరు నాయుకులతో *రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* చర్చలు జరిపారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, పంచాయతీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై నేతలతో చర్చించారు. ప్రస్తుతం తుఫాను పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి అందరం సహాయం అందించాలన్నారు. పంచాయతీల్లో అవసరమైన చర్యలు తీసుకుని, ప్రజల ఆపద సమయాల్లో అండగా నిలవాలని స్థానిక నాయకులను కోరారు. ముఖ్యంగా తుఫాను కారణంగా వచ్చే వర్షాలు, గాలులు, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు సమిష్టిగా కృషి చేయాలని ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు అన్నారు.రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతు కృషి నిరంతరంగా కొనసాగుతుందని, ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

E-పేపర్

పంచాయతీ అభివృద్ధిపై రైల్వే కోడూరు నాయకులతో సమీక్ష మొక్క సాయి వికాస్ రెడ్డి

రైల్వేకోడూరు అక్టోబర్ పౌర్ణమి ప్రతినిధి రైల్వే కోడూరు పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలపై కోడూరు నాయుకులతో *రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* చర్చలు జరిపారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, పంచాయతీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై నేతలతో చర్చించారు. ప్రస్తుతం తుఫాను పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి అందరం సహాయం అందించాలన్నారు. పంచాయతీల్లో అవసరమైన చర్యలు తీసుకుని, ప్రజల ఆపద సమయాల్లో అండగా నిలవాలని స్థానిక నాయకులను కోరారు. ముఖ్యంగా తుఫాను కారణంగా వచ్చే వర్షాలు, గాలులు, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు సమిష్టిగా కృషి చేయాలని ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు అన్నారు.రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతు కృషి నిరంతరంగా కొనసాగుతుందని, ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.