Saturday, 11 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చింతపల్లి పంచాయతీ వారు ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉండండి సర్పంచ్ సురేష్ ప్రసన్న

మొంథా తుపాన్ ప్రభావంకోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉన్నాదాని రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచును.అందువలన తుఫాను తీరం దాటే వరకు తాటాకు ఇళ్లు మరియు బలహీనం గా ఉన్న ఇళ్లల్లో ఉన్న వారు చింతపల్లి పంచాయతీ వారు ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉండవాల్సినదిగా గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్న సురేష్ సెక్రటరీ.కే రజినీ వీఆర్వో సాయిబాబు సత్తిబాబు మరియు పంచాయతీ సిబ్బంది కలిసి ప్రజలను కోరారు

ఆంధ్రప్రదేశ్

తుఫానులోను ఆగని మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) దాతృత్వం

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ కాకినాడ : మానవసేవే మాధవ సేవ అన్న నినాదాన్ని ఆచరిస్తూ… తన వంతు సహాయంగా సేవచేయాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) నిరుపేద కుటుంబాలకు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మొంథా తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు వీస్తూ… వర్షం కురుస్తున్న వాటిని సైతం లెక్కచేయకుండా రెండు నిరుపేద కుటుంబాలకు 2 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించారు. జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ ఎటుమొగలోని 14వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన ఓలేటి భవాని కుటుంబ సభ్యులును సోమవారం కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేశారు. ఇప్పటి వరకు 297 మందికి సహాయం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా జగన్నాధపురంలోని 25వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన దండుప్రోలు దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులును కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి కూడా రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఓలేటి భవాని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమలాంటి నిరుపేద కుటుంబాలను ఆపదలో ఆదుకుంటున్న జనసేన పార్టీలో సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు 300 కుటుంబాలకు తన దాతృత్వం చాటుకుంటున్నారని, కుటుంబ పెద్ద మరణించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారన్నారు. తన సొంత నిధులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, అటువంటి వ్యక్తి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు బిజెపి పార్టీ నాయకులు కొక్కిలగెడ్డ గంగరాజు, పొన్నాడ నాగేశ్వరరావు, వీర మహిళలు బంటు లీల, సుజాత, మోనా జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ

జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ముఖ్యన్యాయమూర్తి జస్టిస్ ధర్మేశ్ శాహ్ ఆయనకు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు హాజరయ్యారు. జస్టిస్ రాయ్ ఇంతకుముందు బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. న్యాయరంగంలో మూడు దశాబ్దాలకుపైగా అనుభవం కలిగిన ఆయన సివిల్‌, క్రిమినల్‌ మరియు రాజ్యాంగ సంబంధిత వ్యవహారాల్లో అనేక కీలక తీర్పులు ఇచ్చారు. న్యాయ నిష్ఠ, పారదర్శకత, ప్రజల పట్ల సానుభూతి ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్య లక్షణాలు అని న్యాయవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆయన నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయవ్యవస్థ మరింత బలపడనుంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

‘డిజిటల్ అరెస్టులు’ పేరుతో జరుగుతున్న అక్రమ చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. మొబైల్ యాప్‌లు, లోన్ యాప్‌ల ద్వారా ప్రజలను బెదిరించి, బలవంతంగా డబ్బులు వసూలు చేసే ఘటనలు పెరగడంతో సుప్రీంకోర్టు కేంద్రం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ డిజిటల్ అరెస్టులు వ్యక్తుల స్వేచ్ఛ, గోప్యత హక్కులను ఉల్లంఘిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ తరహా యాప్‌లు, ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టే విధంగా కఠిన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. ప్రజల రక్షణే ప్రభుత్వాల ప్రాధమిక బాధ్యత అని స్పష్టం చేసింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు

దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు గుర్తించిన యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ (UGC) దేశవ్యాప్తంగా 22 నకిలీ విశ్వవిద్యాలయాలను గుర్తించింది. వీటిలో ఎక్కువగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయని వెల్లడించింది. ఈ సంస్థలు యూజీసీ అనుమతి లేకుండా డిగ్రీలు, సర్టిఫికెట్లు జారీ చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, యూజీసీ వెబ్‌సైట్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలంటూ సూచించింది. నకిలీ యూనివర్సిటీల జాబితా విడుదల చేస్తూ, అవి చట్టపరంగా చెల్లవని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్

బెంగుళూరు హోసూర్ లో రెండవసారి డాక్టర్ పిల్లా చంద్రంకి డాక్టరేట్ అవార్డు

పిఠాపురం : గత 2018వ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి ధ్యేయంగా ఏపీ తెలంగాణలో 3000 ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు పర్యటన చేస్తూ విద్యార్థిని విద్యార్థుల సమస్యల పట్ల సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ గా ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ, చదువు ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు అనే మహానుభావులు యొక్క స్ఫూర్తిని పాఠశాలలలో తెలియజేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ద్వారా నారా లోకేష్ కి డైరెక్ట్ గా ప్రభుత్వ పాఠశాలలలో, గురుకుల పాఠశాలలలో, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో సన్న బియ్యం ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. అర్జీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నబియ్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 1983లో గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు వ్యవస్థను తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎస్సార్ శంకరరాన్ గురించి కూడా విద్యార్థిని విద్యార్థులకు అనేక సందర్భాలలో తెలియజేయడం జరుగుతుంది. పేదలు అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరమని గత ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి పేదలు అత్యున్నత స్థాయికి చేరే విధంగా అనేక పథకాలు గత ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలకు వాటర్ ప్లాంట్స్, లైబ్రరీస్, ఫర్నిచర్, మెయింటినెన్స్, ప్రతి క్లాస్ కి టీచర్, గురుకులాలలో, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో రద్దు చేసిన కాస్మెటిక్ ఛార్జీలు అమలు చేయాలని, గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి దళిత సంక్షేమ పథకాలు తిరిగి అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కార్పొరేషన్లకు ఫండ్ రిలీజ్ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొనుచున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రీ బస్సుపాసులు ఇవ్వాలని, పాఠశాలలలో చదువుకొనుచున్న విద్యార్థిని విద్యార్థులకు ఒకటో తరగతి నుండి పీజీ వరకు ప్రీ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, గురుకులాలలో, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, ప్రభుత్వానికి హృదయ పూర్వకంగా తెలియజేయడం జరుగుతుందన్నారు.

భక్తి

శ్రీ స్వర్ణ లింగేశ్వరుడికి ఘనంగా అభిషేకాలు

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 27: నెల్లూరు రూరల్ పరిధిలో గణేష్ ఘాట్ వద్ద వెలసివున్న శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి వారికి భక్తులు అధిక సంఖ్యలో కార్తీక సోమవారం సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్నారు. పాలాభిషేకలు, స్వయంగా వారే చేసుకొని భక్తితో పరవశించిపోయారు. ఇందులో భాగంగా స్వామి వారికి బీజేపీ నాయకులు సురేంద్ర రెడ్డి గారు స్వామి వారి పంచామృతాలు తో అభిషేకం నిర్వహించడం జరిగింది.

తిరుపతి

షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్కంద షష్టి సందర్భంగా విశేష పూజలు

శ్రీకాళహస్తి పట్టణం తేరి వీధిలో వెలిసినటు వంటి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సోమవారం స్కంద షష్టి విశేషమైన రోజుగా భావించి ప్రత్యేక పూజలు,విశేష హారతులు, అన్నదానాలు నిర్వహించారు.ఆలయ వేద అర్చకులు మాట్లాడుతూ స్కంద షష్ఠి అనేది స్వామివారికి నెలవారి కృత్తిక కన్నా ఎంతో విశేషమైన రోజుగా భావిస్తూ,స్వామి వారిని చందనం మరియు బంగారు కవచంతో అలంకరించి,భక్తులు తెచ్చినటువంటి తీర్థ ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు.అదేవిధంగా సాయంత్రం దీపారాధన కార్యక్రమం కూడా నిర్వహించి ఈ యొక్క స్కంద షష్టి పూజలను విజయవంతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ మెంబర్లు,భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రైతుల పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు

రైతుల పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు సంబంధించిన వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల కారణంగా “అన్నదాత సుఖీభవ” పథకం లబ్ధి ఆగిపోయింది. ఈ తప్పులు ప్రధానంగా – తప్పు ఆధార్ మ్యాపింగ్ ఒకే ఆధార్‌ నంబర్‌ ఒక్కటి కంటే ఎక్కువ పట్టాదారులకు లింక్‌ అవడం. ఆధార్‌ లింక్‌ కాని పట్టాదారులు. ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 సేవా చార్జీ ఉంది. కానీ ప్రభుత్వం ఒకసారి మాత్రమే రూ.2.72 కోట్ల సేవా చార్జీని మాఫీ చేస్తూ, ఈ 5.44 లక్షల మంది రైతులకు ఉచితంగా సవరణలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సదుపాయం అన్నదాత సుఖీభవ పథకం కింద ధృవీకరించబడిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది.

నిర్మల్

వాటోలి గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్‌ సేవా శిబిరం మూడవ రోజు అద్భుత కార్యక్రమాలు

. గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా — నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబిరం మూడవ రోజు వాటోలి గ్రామంలో ఉత్సాహంగా కొనసాగింది. విద్యార్థులు గ్రామ అభివృద్ధికి తమ సేవలను సమర్పిస్తూ రోడ్ల శుభ్రత, డ్రైనేజీ శుభ్రత, చెత్త నిర్వాహణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి ముందర ఉన్న చెత్తను సక్రమంగా తొలగించాలని ప్రజలకు చైతన్యం కల్పించడంతో పాటు, పోచమ్మ మందిరం పరిసరాల్లోని చెత్తను పూర్తిగా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు గ్రామంలో పరిశుభ్రత ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు. మధ్యాహ్నం అనంతరం “యోగా అభ్యసనం దాని యొక్క ప్రాముఖ్యత” అనే అంశంపై యోగ ఇన్స్ట్రక్టర్ శోభ మందాని మేడం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు యోగ వల్ల కలిగే శారీరక, మానసిక లాభాలను వివరించడంతో పాటు సూర్యనమస్కారాలు, బ్రామరీ, అనులోమ–విలోమ వంటి ఆసనాలను చూపించి ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య గారు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ ఆరె. రాజు గారు, అధ్యాపకులు ఓం ప్రకాష్, గుంత సుధాకర్, డా.కోసారి సంతోష్ కుమార్, డా డా.కల్పన, శ్రావణి, రాజయ్య, రామ్మోహన్, అర్షియ బేగం జి. కిషన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఎన్ఎస్ఎస్ క్యాంపు తో గ్రామం మరింత అందంగా, పరిశుభ్రంగా మారింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.