Saturday, 11 April 2026

Blog

E-పేపర్

అక్రమ అరెస్టులను కడించండి, పోలీసు బలగలను పెట్టి ఉద్యమాలు ఆపలేరు, శ్రీ ఇందు కళాశాల యాజమాన్యం, కాంట్రాక్టర్ ల పై చర్యలు తీసికోవాలి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 *అక్రమ అరెస్టులను కడించండి, పోలీసు బలగలను పెట్టి ఉద్యమాలు ఆపలేరు, శ్రీ ఇందు కళాశాల యాజమాన్యం, కాంట్రాక్టర్ ల పై చర్యలు తీసికోవాలి* *Citu ఆధ్వర్యంలో శ్రీ ఇందు కాలేజ్ ముందు చనిపోయిన ఒడిశా కార్మికునికి 20,00000 లక్షలు ఇవ్వాలని ధర్నా నిర్వహించడం తో పోలీసులు citu నాయకులను, కార్మికులను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది*, గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన కార్మికున్ని తరలిస్తున్న శ్రీ ఇందు యాజమాన్యం *శ్రీ ఇందు ఇంజనీర్ కళాశాల ముందు ధర్నా చేయడం జరిగింది* ఇబ్రహీంపట్నం శేరి గూడా గ్రామం లో తేది 25/10/2025 రోజునా శ్రీ ఇందు కాలేజ్ లో ఒడిశా కు చెందిన దివాకర్ బత్ర s/.చందర్ బత్ర గ్రామం దమ్మన్న గూడా, (మండలం) జరియా( జిల్లా) నంబ్బరంగా పూర్, స్టేట్ ఒరిస్సా రాష్ట్ర నికి చెందినా దివాకర్ బత్ర, తన తమ్ముడు ఇద్దరు కలిసి రెండు నెలలు గా పని చేస్తున్నారు, దివాకర్ బత్ర కార్మికుడు సంట్రిన్ పని చేస్తుండగా బిల్డింగ్ నుండి పడి చనిపోయారు కార్మికుడు శ్రీ ఇందు కాలేజ్ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మటం చేయకుంగా కార్మికునికి నష్ట పరిహారం ఇవ్వవలసి వస్తది అని ఒడిస్సాకు 100 కిలోమీటర్లు దూరం తరలించడం ప్రయత్నం చేయగా, ఈ వార్త తెలిసిన ప్రజలు లు సమాచారం ఇవ్వగ ఇబ్రహీంపట్నం పోలీస్ లు స్పందించి మళ్ళీ ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకొని రావడం జరిగింది,కాబట్టి వారి కుటుంబనికి 20,00000 లక్షలు రూపాయలు శ్రీ ఇందు కాలేజ్ యాజమాన్యం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము,చనిపోయిన కార్మికున్ని గుట్టు చప్పుడు చేయకుండా పంపించిన యాజమాన్యం పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం అనుమతులు లేకుంగా బిల్డింగ్ కట్టుతున్న వాటిని ఆపాలని, రేపు శ్రీ ఇందు కాలేజ్ యాజమాన్యం, బిల్డర్ లు చర్చలకు రాలేదు, వెంటనే కార్మికునికి నష్టం ఇవ్వాలి ఇవ్వకపోతే రేపు వలస కార్మికుల 200 మంది, తో పోరాటం చేస్తా మని అన్నారు, ఈ కార్యక్రమం లో citu నాయకులు b యాదగిరి మళ్ళీ ఖర్జున భవన నిర్మాణం సంగంcitu యూనియన్ కార్య దర్శి బొస్పలి రాజు, కోశాధికారి కొంగర జంగయ్య, , k జంగయ్య, G అంకమారావు, తదితరులు పాల్గొన్నారు,

విశాఖపట్నం

తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు

తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు *విశాఖపట్నం దివ్యదర్శిని* మొంథా తుఫాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ఏపీ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తుఫాను తీవ్రత ఆధారంగా మరిన్ని మార్పులు చేయవచ్చని, ప్రయాణికులు గమనించాలని సూచించింది. *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మొంథా తుఫాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ఏపీ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తుఫాను తీవ్రత ఆధారంగా మరిన్ని మార్పులు చేయవచ్చని, ప్రయాణికులు గమనించాలని సూచించింది.

విశాఖపట్నం

35వార్డులో లోతట్టు ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు పంపిణి

*35వార్డులో లోతట్టు ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు పంపిణి *మెంథా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!* * *వర్షాన్ని లెక్కచేయకుండా సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే “వాసుపల్లి* ” *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మెంథా తుఫాను నేపథ్యంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు దక్షణ ప్రజలందరూ అప్రమత్తమంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. *వార్డ్ అధ్యక్షుడు అలుపున కనక రెడ్డి, వార్డ్ సీనియర్ నాయకులు సమక్షంలో 35వ వార్డు లక్ష్మీ నగర్ లోతట్టు ప్రాంత ప్రజలకు సుమారు 250 కుటుంబాలకు రూ. 500 విలువచేసే నిత్యవసర వస్తువులను మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వర్షం లెక్కచేయకుండా తడుస్తూ పేదలకు సాయం అందించారు.* ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ బలమైన ఈదురు గాలులతో ముంచుకొస్తున్న మెంథా తుఫాను తీరం దాటే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిత్య అవసరాలకు ఇంటి నుండి బయటకు రాకూడదనే ఉద్దేశంతో మూడు కేజీల బియ్యం, కూరగాయలు, వంట నూనె, మాంసం అందజేస్తూ ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. రాజకీయం చేసే ఉద్దేశం తముకు లేదని, తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు దక్షిణంలో ప్రతి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు ప్రజలకు సాయం అందించడంలో ముందుంటామన్నారు. తుఫాన్ లో ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వం పిలుపునిస్తే రాజకీయానికి అతీతంగా వైఎస్ఆర్సిపి నాయకులంతా సైనికుల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వాసుపల్లి తెలిపారు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు అందరికీ 50 కేజీల బియ్యం తో పాటు రేషన్ ఉచితంగా ప్రభుత్వం అందించాలని ఓ మత్స్యకారుడుగా డిమాండ్ చేస్తున్నట్లు వాసుపల్లి తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి సహాయం కావాలన్నా తనని సంప్రదిస్తే సాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు.కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, జిల్లా సెక్రటరీ అభిరెడ్డి అడివిషు,మాజీ కార్పొరేట్ పచ్చిరపల్లి రాము,సౌత్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సువార్త రాజు, సౌత్ అనుబంధ సంఘాలు ప్రెసిడెంట్లు మల్ల విజయ్, జీరు సుధా, గంగాధర్, రావణమ్మ, వినోద్,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్, వార్డ్ అధ్యక్షులు పీతల వాసు, రాజా రెడ్డి, ముత్తబాతులు రమేష్, ఏరిమామ్మ గుడి చైర్మన్ లండ రమణ,లింగం శ్రీను,గంగళ రామరాజు, వైస్సార్సీపీ జిల్లా మరియు స్టేట్, సౌత్ అనుబంధ సంఘాల నాయకులు బేవార మహేష్,దుద్దా అప్పారావు,అరుగుల రాజు, చోడిపిల్లి శివ,సాగర్,గాలి పార్వతి, చేపల నూకరాజు బుడ్డి,పిల్లి సత్తిబాబు, జ్యోతి, కొనతాల కృష్ణవేణి,లక్ష్మణ్,సత్య,వెంకటి,చేపల ప్రసాద్,సత్తిరాజు, జిల్లా నాయకులు స్టేట్ నాయకులు వార్డ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీడీగా బాధ్యతలు స్వీకరించిన కె.రజిత.

డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీడీగా బాధ్యతలు స్వీకరించిన కె.రజిత. *విశాఖ పట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*. విశాఖలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డెరెక్టర్గా కె.రజిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె విజయనగరం, అనకాపల్లి ప్రాంత డ్రగ్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన విషయం తెలిసిందే. 2013లో ఆమెకు అసిస్టెంట్ డ్కెరెక్టర్గా పదోన్నతి లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2013నుంచి 2016వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, 2017 నుంచి 2022వరకు విశాఖ ఏడీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆమె విజయనగరం ఏడీగా ఇప్పటి వరకు విధులు నిర్వహించి, ప్రస్తుతం ఉద్యోగోన్నతి సాధించారు. ఉత్తమ ఉద్యోగిణిగా పంద్రాగస్టు దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయనగరం కలెక్టర్ నుంచి ఆమె ప్రశంసాపత్రాన్ని కూడా స్వీకరించారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది ఆమెను పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు.

విశాఖపట్నం

నైరుతి -ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య మొంథా తుఫాన్

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* జగన్నాధ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం.. ప్రస్తుతం నైరుతి -ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య మొంథా తుఫాన్ విశాఖ కు దక్షిణ ఆగ్నేయంగా 600కిలోమీటర్లు కాకినాడ కు దక్షిణ ఆగ్నేయంగా 570కిలోమీటర్ల చెన్నయి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల పోర్ట్ బ్లెయర్ కు పశ్చిమంగా 750 కిలోమీటర్ల దూరంలో మొంథా తుఫాన్ కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయువ్యంగా కదిలి రాగాల 12గంటల్లో -పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం. ఈ తుఫాన్ 28 వ తేదీ సాయంత్రం గాని ,రాత్రి గాని మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాన్ గానే తీరం దాటే అవకాశం. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110, కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు కొనసాగే అవకాశం ఉంది . . ఈ రోజు రాష్ట్రం లో అత్యధిక ప్రాంతంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి. విజయనగరం విశాఖ కాకినాడ కృష్ణ బాపట్ల నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం అల్లూరి యన్ టి ఆర్ తిరుపతి నంద్యాల లో అతి భారీ వర్ష సూచన. రేపు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా లో అతి భారీ వర్ష సూచన ఉంది.రెడ్ అలెర్ట్ జారీ ఎల్లుండి కూడా ఉత్తర కోస్తా లో భారీ నుంచి అతి భారీ వర్షం ఉంటుంది. ఈ రోజు తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు ఉంటాయి. రేపు ఈదురు గాలులు వేగం పెరుగుతుంది.80 నుంచి 90 వరకు వేగంతో ఈ గాలులు ఉంటాయి. రాష్ట్రం లో చాలా చోట్ల ఫ్లాష్ ఫ్లడ్ ..ప్రమాదం పొంచి ఉంది.

విశాఖపట్నం

మొంథా తుఫాన్ దృష్ట్యా విశాఖ మహా నగరం పరిధిలో సహాయక చర్యలకు జీవీఎంసీ యంత్రాంగం సంసిద్ధం.

మొంథా తుఫాన్ దృష్ట్యా విశాఖ మహా నగరం పరిధిలో సహాయక చర్యలకు జీవీఎంసీ యంత్రాంగం సంసిద్ధం. *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* * ఇప్పటికే నగరంలో 55 పునరావాస కేంద్రాలు ఏర్పాటు * ప్రజలకు సహాయక చర్యలు దిశగా 20 క్విక్ రెస్పాన్స్ టీమ్లు. ప్రతి జోన్ లో రెండు బృందాలు. ప్రతి బృందంలో జెసిబి/ టిప్పర్/ ట్రాక్టర్/ ట్రీ కట్టర్/ బెయిలింగ్ మెషిన్లు * 30వ తేదీ వరకు 24 గంటలు సిబ్బంది అందుబాటులో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు – టోల్ ఫ్రీ 1800 4250 0009, 0891- 2507225 జోన్ 1- 08933- 229535 జోన్ 2- 0891- 2715716 జోన్ 3- 0891- 2746314 జోన్ 4- 0891- 2590114 జోన్5- 0891- 2711480 జోన్ 6- 0891- 2753535 జోన్ 7- 08924- 222747 జోన్ 8- 0891- 2735353 జోన్-8- 0891- 2735353

అమరావతి

మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్

• మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ *అమరావతి* పున్నమి ప్రతినిధి • అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి • పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి, నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. • పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్‌చార్జ్‌లను నియమించాలి : సీఎం చంద్రబాబు. • పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ • తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలి • తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి • ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలి • జిల్లాల్లో తుఫాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే.. • వాలంటరీగా వచ్చేవారిని తుఫాన్ సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలి • ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి • మానవ ప్రయత్నంలో ఎటువంటి అలసత్వం కనిపించకూడదు. • వివిధ జిల్లాల కలెక్టర్లతో అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు • నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయని చెప్పిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా… అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని సీఎంకు వివరించిన శుక్లా • ఆర్టీజీఎస్ నుంచి సమాచారం అందుతుంది… ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపడకుండా చూసుకోవాలి : సీఎం చంద్రబాబు • భారీ వర్షాలతో నీరు ఎక్కడా నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలి • తుఫాను సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చూసుకోవాలి • విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండచరియలు జారిపడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి • మొంథా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్‌లో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలి : సీఎం చంద్రబాబు.

భక్తి

వార ఫలాలు

రాశి ఫలాలు (అక్టోబర్‌ 26 – నవంబర్‌ 1, 2025) (డా. శంకరరావు రామకృష్ణ శర్మ సూచనలతో – ఈనాడు ప్రత్యేకం) భవిష్యత్తును తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈ వారానికి సంబంధించిన రాశి ఫలాలు వృత్తి, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక స్థితి, విద్య మరియు శుభకార్యాల దృష్ట్యా మిశ్రమంగా ఉండనున్నాయి. మేషం: అదృష్టం గరి శిఖరాలకు చేరుతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశాజనక పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. కొత్త అవకాశాలు ఎదురవుతాయి. వృషభం: శారీరకంగా చురుకుదనం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. మిథునం: అప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. సుదీర్ఘకాలంగా వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. వ్యాపార లాభాలు పెరుగుతాయి. ఆర్థిక సౌలభ్యం కలుగుతుంది. కర్కాటకం: ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆనందం నెలకొంటుంది. కొత్త ప్రణాళికలు ఆచరణలోకి వస్తాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్‌ లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది. సింహం: ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నతాధికారుల అనుకూలత లభిస్తుంది. ఉద్యోగ మార్పులు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా లాభదాయకమైన వారం. కన్యా: స్నేహితులు, బంధువుల మద్దతు ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి సంబంధమైన కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. తుల: వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. వృత్తి పరంగా పురోగతి సాధిస్తారు. కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబంలో ఆనందం, శుభకార్యాల సూచన ఉంది. వృశ్చికం: దినచర్యలో కొత్త ఉత్సాహం. సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. శుభసందేశాలు అందుతాయి. ధనుస్సు: ధైర్యం, నైపుణ్యం కలిసొస్తాయి. కుటుంబంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం సుభ్రంగా ఉంటుంది. మకరం: వృత్తిలో ఉన్నత స్థానం దక్కుతుంది. అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కుంభం: ఆలోచనాపరంగా స్పష్టత ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. మీనం: మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలు సాఫల్యంగా పూర్తవుతాయి. ఈ వారంలో మొత్తం రాశులకూ మితమైన శుభఫలాలు కనబడుతున్నాయి. ధైర్యం, ధర్మం, కృషి – ఈ మూడింటిని పాటించే వారు ఈ వారంలో విజయాలను సాధించగలరు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామిఆలయంలో అయ్యప్ప స్వాముల కోసం ఘన అన్నదాన కార్యక్రమం ప్రారంభం

జగ్గయ్యపేట పట్టణంలోని పురాతన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం లో, భక్తి భావంతో నిండిన ఓం శ్రీ వనపులి భక్త బృందం ఆధ్వర్యం లో అయ్యప్ప దీక్ష స్వీకరించిన స్వాముల కోసం అన్నదాన కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ హాజరై భక్తుల తో కలిసి అన్నదానానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ అన్నారు: “అయ్యప్ప స్వాముల దీక్ష భక్తి, నియమ నిష్ఠల ప్రతీక. భక్తుల సేవే నిజమైన భగవంతుని సేవ. ఇలాంటి అన్నదానకార్యక్రమాలు సమాజంలో సాత్వికతను పెంపొందిస్తాయి.” ఆలయ కమిటీ ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతిరోజూ నిరంతరంగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు, భక్తుల సంక్షేమానికి ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని అభినందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద మొంథా తుపాన్ ప్రభావం

కోస్తా ఆంధ్రలో మొంథా తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ పరిసరాల్లో సముద్రం ఉద్ధృతంగా మారింది. గాలివానలు, భారీ అలలు తీరాన్ని ఢీకొడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. తుఫాన్ ప్రభావంతో వర్షాలు, బలమైన గాలులు కొనసాగుతున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.