Saturday, 11 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేదల ఇళ్ళ నిర్మాణాల గుత్తే దారునికి నోటీసులు అందజేసిన ఎంపిడివో, శ్రీనివాసులు

ఉదయగిరి మండలం గంగి రెడ్డీ పల్లిలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన పేదల ఇళ్లు నిర్మాణాల సకాలంలో పూర్తి చేయని గుత్తే దారునికి ఎంపిడివో బీ శ్రీనివాసులు హౌసింగ్ ఇంఛార్జి డీ ఈ ఫిరాన్ నోటీసులు అందజేశారు ఎంపిడివో మాట్లాడుతూ నిర్దేశించిన గడువు లోగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో గుత్తేదారుడీ పై అసహనం వ్యక్తం చేశారు అనంతరం గుత్తేదారుడీ నుంచి లిఖతపూర్వకంగా వివరణ కోరారు ఏ ఈ రహమత్ షరీఫ్ పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ: తుఫాన్ సంసిద్ధత లోపాల నివారణ చర్యలు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు నేతృత్వంలో నందిగామ పురపాలక సంఘం లోతట్టు ప్రాంతాలలో తుఫాన్ ప్రభావం మరియు రాబోవు 5 రోజుల భారీ వర్షాల కారణంగా జలమయం, నష్టాలు మరియు ప్రమాదాలు కలగకుండా ముందస్తుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. *పునరావాస కేంద్రాలు* : బాబు జగజ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్ (పాత బస్టాండ్) జిల్లా పరిషత్ హై స్కూల్ మధిర రోడ్ లో కేంద్రీయ విద్యాలయం ఈ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, జనరేటర్లు, మంచినీరు మరియు విద్యుత్ సౌకర్యాలు సమస్యలేమి లేకుండా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే, పట్టణం లోని శిధిల భవనాలను గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. *ఇతర చర్యలు* : ఎండిపోయిన చెట్లను తొలగించడం ప్రధాన డ్రెయిన్లలో జలమయం మరియు మురుగు నీరు నిలవకుండా జెసిబి ద్వారా పూడికలు తొలగించడం సమస్యలు ఏర్పడకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. ఫణి శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కే.దుర్గాప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం వర్షపు నీరుతో రోడ్డు బ్లాక్

సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం వర్షపు నీరుతో రోడ్డు బ్లాక్ *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మొంథా తుఫాన్ ప్రభావంతో ప్రధాన రోడ్లు వర్షపునీరుతో నిండిపోతున్నాయి. సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం నోసనబాగ్ ప్రధాన జంక్షన్ నీటి ప్రవాహం లేకపోవడం వల్ల మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. అటుగా రాకపోకలకు స్తంభించాయి. ద్విచక్ర వాహనదారుడు నీటి ప్రవాహానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. హుటాహుట్న స్పందించిన మల్కాపురం లాండ్ ఆర్డర్ రక్షకబటులు వాహన రాకపోకలకు సహాయ సహకారాలు చేస్తున్నారు.

విశాఖపట్నం

సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం వర్షపు నీరుతో రోడ్డు బ్లాక్

సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం వర్షపు నీరుతో రోడ్డు బ్లాక్ *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మొంథా తుఫాన్ ప్రభావంతో ప్రధాన రోడ్లు వర్షపునీరుతో నిండిపోతున్నాయి. సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం నోసనబాగ్ ప్రధాన జంక్షన్ నీటి ప్రవాహం లేకపోవడం వల్ల మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. అటుగా రాకపోకలకు స్తంభించాయి. ద్విచక్ర వాహనదారుడు నీటి ప్రవాహానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. హుటాహుట్న స్పందించిన మల్కాపురం లాండ్ ఆర్డర్ రక్షకబటులు వాహన రాకపోకలకు సహాయ సహకారాలు చేస్తున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కార్తీక మాసం సందర్భంగా నందిగామలో ప్రత్యేక పూజలు

నందిగామ పట్టణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణ కుమారి పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థన లు చేయడం జరిగింది. ఈ పూజలు స్థానికుల కోసం శాంతి, ఐక్య భావాన్ని పెంపొందించే విధంగా నిర్వహించబడ్డాయి.

విశాఖపట్నం

మొంథా తుపాను ప‌ట్ల అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాలి* *జీరో క్యాజువాలిటీ ఉండేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి

*మొంథా తుపాను ప‌ట్ల అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాలి* *జీరో క్యాజువాలిటీ ఉండేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి *శిథిల భ‌వ‌నాలు, గోడల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి *హోర్డింగులు, విరగ‌డానికి అవ‌కాశం ఉన్న చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గించాలి *జిల్లా అధికారుల‌తో రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్ జైన్ *విశాఖ‌ప‌ట్ట‌ణం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* ః మొంథా తుపాను ప‌ట్ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, చిన్న‌పాటి దుర్ఘ‌ట‌న కూడా జ‌ర‌గ‌డానికి వీలులేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సైక్లోన్ జిల్లా ప్ర‌త్యేకాధికారి, స్పెష‌ల్ సీఎస్ అజ‌య్ జైన్ ఆదేశించారు. జీరో క్యాజువాలిటీ ఉండేలా ప‌టిష్ఠ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని, శిథిల భ‌వ‌నాలు, గోడ‌లను ముందుగానే గుర్తించి ప్ర‌మాద నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. విరిగి ప‌డ‌డానికి అవ‌కాశం ఉన్న చెట్ల కొమ్మల‌ను తొల‌గించాల‌న్నారు. గాలుల తీవ్ర‌త‌కు హోర్డింగులు కూలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, ముందుగానే వాటిని కూడా తొల‌గించాల‌ని జీవీఎంసీ క‌మిష‌న‌ర్ను ఆదేశించారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, తుపానుకు ముందు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని, త‌ర్వాత యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు అందించాల‌ని ఆదేశించారు. మొంథా తుపాను నేప‌థ్యంలో సోమ‌వారం ఉద‌యం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో ఆయ‌న జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్, జాయింట్ క‌లెక్టర్ కె. మ‌యూర్ అశోక్, ఇత‌ర విభాగాల జిల్లా స్థాయి అధికారుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. తుపాను స‌న్న‌ద్ధ‌త‌, త‌క్ష‌ణ స్పంద‌న‌, స‌హాయ‌క చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు. ప్ర‌మాద నివార‌ణ‌కు, స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అనుగుణంగా అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. తుపాను తీరం దాటే దిశ మారొచ్చ‌ని, మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి గాలుల తీవ్ర‌త మ‌రింత పెరుగుతుంద‌ని, అధికారులు అన్ని ర‌కాలుగా సంసిద్ధంగా ఉండాల‌ని అజ‌య్ జైన్ పేర్కొన్నారు. మ్యాన్ హోల్స్ ను స‌రిచేయాల‌ని, ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండే ప్రాంత ప్ర‌జ‌ల‌ను ర‌క్షిత భ‌వ‌నాల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు. అక్క‌డ అవ‌స‌ర‌మైన మేరకు తాగునీరు, ఆహారం, చిన్న‌పిల్లల‌కు పాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాల‌న్నారు. తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా ట్యాంకుల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌ర‌ణ‌కు త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేపట్టే విధంగా ప్రాంతాల వారీగా సిబ్బందిని, యంత్రాల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని ఈపీడీసీఎల్ అధికారుల‌ను ఆదేశించారు. ముందుగానే స్తంభాల‌ను, త‌గిన యంత్రాల‌ను ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచుకోవాల‌ని సూచించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా, జ‌న‌రేట‌ర్ల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని చెప్పారు. గ్రామాల్లో, అర్బ‌న్ ప్రాంతాల్లో సోలార్ ల్యాంపులు, మొబైల్ ఛార్జింగ్ యూనిట్ల‌ను స‌మ‌కూర్చాల‌ని పేర్కొన్నారు. రైల్వే అధికారుల‌తో మాట్లాడి అన్ని ర‌కాల ప్ర‌మాద నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కు సూచించారు. నిర్మాణ ద‌శ‌లో ఉన్న భ‌వ‌నాల వ‌ద్ద కార్మికుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని, సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని చెప్పారు. గాలుల తీవ్ర‌త‌కు చెట్లు, కొమ్మలు ప‌డిపోయి వాహనాల రాక‌పోక‌ల‌కు ఇబ్బంది లేకుండా ఎక్క‌డిక‌క్క‌డ క‌టింగ్ యంత్రాల‌ను, జేసీబీల‌ను, లారీల‌ను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాల‌ని అజ‌య్ జైన్ సూచించారు. *29న‌ టిఫ‌న్, భోజ‌నం ప్యాకెట్ల‌ను సిద్దం చేసుకోవాలి* గంట‌కు 150 నుంచి 200 కి.మీ. వేగంతో తుపాను 28వ తేదీన తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని, ఈ ప్ర‌భావంతో చాలా న‌ష్టం వాటిల్ల వ‌చ్చ‌ని, విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌వ‌చ్చ‌ని అజ‌య్ జైన్ పేర్కొన్నారు. కావున 29వ తేదీ ఉద‌యం, మ‌ధ్యాహ్నం న‌ష్టం వాటిల్లిన ప్రాంత ప్ర‌జ‌ల‌కు, తుపాను ప్ర‌భావిత ప్రాంత పౌరుల‌కు అల్పాహారం, భోజ‌నం ప్యాకెట్ల‌ను అందించేందుకు యంత్రాంగం సంసిద్ధంగా ఉండాల‌ని ఆదేశించారు. మందుల‌ను కూడా అందుబాటులో ఉంచుకోవాల‌ని చెప్పారు. ర‌హ‌దారుల్లో చిక్కుకుపోయే వాహ‌న‌దారుల‌కు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో ఉండేపోయే ప్ర‌యాణికుల‌కు కూడా ఆహారం అందించే ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. ప‌డిపోయిన విద్యుత్ స్తంభాల‌ను, దెబ్బ‌తిన్న‌ డ్రెయిన్ల‌ను డ్రోన్ల స‌హాయంతో గుర్తించి త‌క్ష‌ణ స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టాల‌ని ఆదేశించారు. ఆసుప‌త్రుల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అన్ని స‌చివాల‌యాల ప‌రిధిలో ఆహార తయారీకి సంబంధించి ఏర్పాట్లు చేయాల‌ని, ప్యాకెట్ల‌ను సిద్దంగా ఉంచుకోవాల‌ని అజ‌య్ జైన్ అధికారులను ఆదేశించారు. *జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉంది ః జిల్లా క‌లెక్ట‌ర్* స‌మావేశంలో భాగంగా మొంథా తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ర‌కాలుగా సిద్దంగా ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌న్నారు. తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను, అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశామ‌ని, మండ‌ల, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి అధికారులు ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి ప‌రిస్థితిని స‌మీక్షించార‌ని చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు, ఆయా మండ‌ల కేంద్రాల్లో తుపాను కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామ‌న్నారు. గోస్త‌నీ న‌దీ తీరంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా మందుగానే ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశామ‌ని, గంభీరం, మేఘాద్రిగెడ్డ జ‌లాయాశాల వ‌ద్ద ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని చెప్పారు. కొండ‌వాలు ప్రాంతాల్లో సుమారు 12,755 ఇళ్లు ఉన్నాయ‌ని, వాటిల్లో 96 ప్రమాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉండ‌గా, సంబంధిత నివాసితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించామ‌ని వివ‌రించారు. సైక్లోన్ షెల్ట‌ర్లు 20, పున‌రావాస కేంద్రాలు 23 ఉన్నాయ‌ని వాటిల్లో 9,290 మందిని ఉంచ‌డానికి వీలుగా ఏర్పాట్లు చేశామ‌ని, అక్క‌డ అన్ని ర‌కాల వ‌స‌తుల‌ను క‌ల్పిస్తున్నామ‌ని పేర్కొన్నారు. పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ప‌రిధిల‌ని ఆరు స‌ర్కిళ్లలో అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా బియ్యం నిల్వ‌ల‌ను ఉంచామ‌ని, ఎఫ్‌.పి. దుకాణాల‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేశామ‌ని చెప్పారు. టెలీ క‌మ్యూనికేష‌న్ సంస్థ‌ల ప్ర‌తినిధులను, ఎల్పీజీ పంపిణీదారులను అప్ర‌మ‌త్తం చేశామ‌ని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వ‌ర్యంలో 430 బృందాలు ఉన్నాయ‌ని, జేసీబీలు, లారీలు, కటింగ్ యంత్రాలు, పోల్ బిల్డింగ్ యంత్రాలు సిద్ధంగా ఉన్నాయ‌ని వివ‌రించారు. ఇవికాకుండా నేవీ, కోస్ట్ గార్డు అధికారుల‌తో మాట్లాడి త‌గిన చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. సముద్ర తీరంలో ఆరు మెక‌నైజ‌డ్ బోట్ల‌ను, నేవీ, కోస్ట్ గార్డ్ ప‌రిధిలో హెలిక్యాప్ట‌ర్ల‌ను సిద్ధంగా ఉంచామ‌ని క‌లెక్టర్ చెప్పారు. *జీవీఎంసీ ప‌రిధిలో ముమ్మ‌ర ఏర్పాట్లు* జిల్లా యంత్రాంగంతో క‌లిసి అద‌నంగా 38 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్ తెలిపారు. 20 క్యూ.ఆర్.టి. (క్విక్ రెస్పాన్స్ టీమ్స్) బృందాల‌ను నియమించామ‌ని, ఒక్కో జోన్ ప‌రిధిలో రెండేసి బృందాలు ఉంటాయ‌ని చెప్పారు. ప్రతి బృందం జేసీబీ, ట్రిప్ప‌ర్, ట్రాక్ట‌ర్, ట్రీ క‌ట్ట‌ర్, బెయిలింగ్ మెషిన్ క‌లిగి ఉంటాయ‌ని వివ‌రించారు. ఈ విధంగా 29 జేసీబీలు, 82 స్ప్రెయిర్స్, 64 ఫాగింగ్ మెషీన్లు, 26 ప‌వ‌ర్ రంపాలు, 2 శ‌క్తిమాన్లు, 15 జ‌న‌రేట‌ర్లు, 108 క‌మ్యూనికేష‌న్ ప‌రిక‌రాల‌ను, అద‌న‌పు సిబ్బందిని అందుబాటులో ఉంచుకున్నామ‌ని జీవీఎంసీ క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.

E-పేపర్

అక్రమ అరెస్టులను కడించండి, పోలీసు బలగలను పెట్టి ఉద్యమాలు ఆపలేరు, శ్రీ ఇందు కళాశాల యాజమాన్యం, కాంట్రాక్టర్ ల పై చర్యలు తీసికోవాలి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 *అక్రమ అరెస్టులను కడించండి, పోలీసు బలగలను పెట్టి ఉద్యమాలు ఆపలేరు, శ్రీ ఇందు కళాశాల యాజమాన్యం, కాంట్రాక్టర్ ల పై చర్యలు తీసికోవాలి* *Citu ఆధ్వర్యంలో శ్రీ ఇందు కాలేజ్ ముందు చనిపోయిన ఒడిశా కార్మికునికి 20,00000 లక్షలు ఇవ్వాలని ధర్నా నిర్వహించడం తో పోలీసులు citu నాయకులను, కార్మికులను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది*, గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన కార్మికున్ని తరలిస్తున్న శ్రీ ఇందు యాజమాన్యం *శ్రీ ఇందు ఇంజనీర్ కళాశాల ముందు ధర్నా చేయడం జరిగింది* ఇబ్రహీంపట్నం శేరి గూడా గ్రామం లో తేది 25/10/2025 రోజునా శ్రీ ఇందు కాలేజ్ లో ఒడిశా కు చెందిన దివాకర్ బత్ర s/.చందర్ బత్ర గ్రామం దమ్మన్న గూడా, (మండలం) జరియా( జిల్లా) నంబ్బరంగా పూర్, స్టేట్ ఒరిస్సా రాష్ట్ర నికి చెందినా దివాకర్ బత్ర, తన తమ్ముడు ఇద్దరు కలిసి రెండు నెలలు గా పని చేస్తున్నారు, దివాకర్ బత్ర కార్మికుడు సంట్రిన్ పని చేస్తుండగా బిల్డింగ్ నుండి పడి చనిపోయారు కార్మికుడు శ్రీ ఇందు కాలేజ్ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మటం చేయకుంగా కార్మికునికి నష్ట పరిహారం ఇవ్వవలసి వస్తది అని ఒడిస్సాకు 100 కిలోమీటర్లు దూరం తరలించడం ప్రయత్నం చేయగా, ఈ వార్త తెలిసిన ప్రజలు లు సమాచారం ఇవ్వగ ఇబ్రహీంపట్నం పోలీస్ లు స్పందించి మళ్ళీ ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకొని రావడం జరిగింది,కాబట్టి వారి కుటుంబనికి 20,00000 లక్షలు రూపాయలు శ్రీ ఇందు కాలేజ్ యాజమాన్యం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము,చనిపోయిన కార్మికున్ని గుట్టు చప్పుడు చేయకుండా పంపించిన యాజమాన్యం పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం అనుమతులు లేకుంగా బిల్డింగ్ కట్టుతున్న వాటిని ఆపాలని, రేపు శ్రీ ఇందు కాలేజ్ యాజమాన్యం, బిల్డర్ లు చర్చలకు రాలేదు, వెంటనే కార్మికునికి నష్టం ఇవ్వాలి ఇవ్వకపోతే రేపు వలస కార్మికుల 200 మంది, తో పోరాటం చేస్తా మని అన్నారు, ఈ కార్యక్రమం లో citu నాయకులు b యాదగిరి మళ్ళీ ఖర్జున భవన నిర్మాణం సంగంcitu యూనియన్ కార్య దర్శి బొస్పలి రాజు, కోశాధికారి కొంగర జంగయ్య, , k జంగయ్య, G అంకమారావు, తదితరులు పాల్గొన్నారు,

విశాఖపట్నం

తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు

తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు *విశాఖపట్నం దివ్యదర్శిని* మొంథా తుఫాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ఏపీ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తుఫాను తీవ్రత ఆధారంగా మరిన్ని మార్పులు చేయవచ్చని, ప్రయాణికులు గమనించాలని సూచించింది. *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మొంథా తుఫాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ఏపీ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తుఫాను తీవ్రత ఆధారంగా మరిన్ని మార్పులు చేయవచ్చని, ప్రయాణికులు గమనించాలని సూచించింది.

విశాఖపట్నం

35వార్డులో లోతట్టు ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు పంపిణి

*35వార్డులో లోతట్టు ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు పంపిణి *మెంథా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!* * *వర్షాన్ని లెక్కచేయకుండా సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే “వాసుపల్లి* ” *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మెంథా తుఫాను నేపథ్యంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు దక్షణ ప్రజలందరూ అప్రమత్తమంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. *వార్డ్ అధ్యక్షుడు అలుపున కనక రెడ్డి, వార్డ్ సీనియర్ నాయకులు సమక్షంలో 35వ వార్డు లక్ష్మీ నగర్ లోతట్టు ప్రాంత ప్రజలకు సుమారు 250 కుటుంబాలకు రూ. 500 విలువచేసే నిత్యవసర వస్తువులను మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వర్షం లెక్కచేయకుండా తడుస్తూ పేదలకు సాయం అందించారు.* ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ బలమైన ఈదురు గాలులతో ముంచుకొస్తున్న మెంథా తుఫాను తీరం దాటే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిత్య అవసరాలకు ఇంటి నుండి బయటకు రాకూడదనే ఉద్దేశంతో మూడు కేజీల బియ్యం, కూరగాయలు, వంట నూనె, మాంసం అందజేస్తూ ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. రాజకీయం చేసే ఉద్దేశం తముకు లేదని, తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు దక్షిణంలో ప్రతి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు ప్రజలకు సాయం అందించడంలో ముందుంటామన్నారు. తుఫాన్ లో ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వం పిలుపునిస్తే రాజకీయానికి అతీతంగా వైఎస్ఆర్సిపి నాయకులంతా సైనికుల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వాసుపల్లి తెలిపారు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు అందరికీ 50 కేజీల బియ్యం తో పాటు రేషన్ ఉచితంగా ప్రభుత్వం అందించాలని ఓ మత్స్యకారుడుగా డిమాండ్ చేస్తున్నట్లు వాసుపల్లి తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి సహాయం కావాలన్నా తనని సంప్రదిస్తే సాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు.కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, జిల్లా సెక్రటరీ అభిరెడ్డి అడివిషు,మాజీ కార్పొరేట్ పచ్చిరపల్లి రాము,సౌత్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సువార్త రాజు, సౌత్ అనుబంధ సంఘాలు ప్రెసిడెంట్లు మల్ల విజయ్, జీరు సుధా, గంగాధర్, రావణమ్మ, వినోద్,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్, వార్డ్ అధ్యక్షులు పీతల వాసు, రాజా రెడ్డి, ముత్తబాతులు రమేష్, ఏరిమామ్మ గుడి చైర్మన్ లండ రమణ,లింగం శ్రీను,గంగళ రామరాజు, వైస్సార్సీపీ జిల్లా మరియు స్టేట్, సౌత్ అనుబంధ సంఘాల నాయకులు బేవార మహేష్,దుద్దా అప్పారావు,అరుగుల రాజు, చోడిపిల్లి శివ,సాగర్,గాలి పార్వతి, చేపల నూకరాజు బుడ్డి,పిల్లి సత్తిబాబు, జ్యోతి, కొనతాల కృష్ణవేణి,లక్ష్మణ్,సత్య,వెంకటి,చేపల ప్రసాద్,సత్తిరాజు, జిల్లా నాయకులు స్టేట్ నాయకులు వార్డ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీడీగా బాధ్యతలు స్వీకరించిన కె.రజిత.

డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీడీగా బాధ్యతలు స్వీకరించిన కె.రజిత. *విశాఖ పట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*. విశాఖలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డెరెక్టర్గా కె.రజిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె విజయనగరం, అనకాపల్లి ప్రాంత డ్రగ్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన విషయం తెలిసిందే. 2013లో ఆమెకు అసిస్టెంట్ డ్కెరెక్టర్గా పదోన్నతి లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2013నుంచి 2016వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, 2017 నుంచి 2022వరకు విశాఖ ఏడీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆమె విజయనగరం ఏడీగా ఇప్పటి వరకు విధులు నిర్వహించి, ప్రస్తుతం ఉద్యోగోన్నతి సాధించారు. ఉత్తమ ఉద్యోగిణిగా పంద్రాగస్టు దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయనగరం కలెక్టర్ నుంచి ఆమె ప్రశంసాపత్రాన్ని కూడా స్వీకరించారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది ఆమెను పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.