Saturday, 11 April 2026

Blog

భద్రాద్రి కొత్తగూడెం

కోరం కనకయ్య కొంచం కనికరించవయ్యా

కోరం కనకయ్య గారు కొంచం కనికరించండి పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్ కామేపల్లి, ఇల్లందు 27-10-2025, శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు నియోజకవర్గం, కామేపల్లి మండలం అడవి మద్దుల పల్లి నుండి ముచర్ల వరకు ఉన్న రోడ్డు అడుగు లోతుతో, పగిలిన రోడ్డు అంచులు, నీటి నిల్వలతో ప్రమాదకరంగా మారింది. ఒక రోజులో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దశాబ్ద కాలంగా మరమ్మత్తులకు కూడా నోచుకోని రోడ్డు. పట్టపగలే ప్రయాణాలు చేయడానికి భయపడే పరిస్థితి, ఇంకా రాత్రిళ్ళు ప్రయాణం చేయాలి అంటే వేరే చెప్పనక్కర్లేదు. వర్షాకాలంలో అడుగు లోతు గుంతలతో నీరు నిల్వ ఉండి ప్రయాణికులకు కనపడక ఎన్నో ప్రమాదాలు జరిగాయి. దశాబ్ద కాలం నుండి ఒక్క అధికారి, కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఆ రోడ్డు వైపు కన్నెత్తి చూసిందే లేదు. ఇంకెంత కాలం ఈ అవస్థలు, ఇంకెంత కాలం ఈ ప్రమాదాలు. కామేపల్లి మండల పరిధిలోని ఈ రోడ్డును స్థానిక శాసనసభ్యులుగా ఉన్న మీరు అయినా కొంచం కనికరించి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్‌టీఆర్ జిల్లాలో తుపాను ముప్పు ప్రాంతాలను సంయుక్త కలెక్టర్లు, ఆర్డీవోలు విస్తృతంగా పరిశీలించుకున్నారు

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్లు మరియు ఆర్డీవోలు ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు నిర్వహించారు. *కొండపల్లి* : సంయుక్త కలెక్టర్ ఎస్. ఇలక్కియ్ ముంపు పొంచి ఉన్న ప్రాంతాలను పరిశీలించి ప్రజల ను అప్రమత్తం చేశారు. *తిరువూరు* : ఆర్డీవో కే.మాధురి భగత్ సింగ్ కాలనీ, గంపలగూడెం పునరావాస కేంద్రాలు, కట్టలేరు వాగు బ్రిడ్జిని పరిశీలించారు. *నందిగామ* : ఆర్డీవో కే.బాలకృష్ణ విలియమ్స్ పేట, ఊర చెరువునుపర్యవేక్షించారు. *విజయవాడ* : ఆర్డీవో కావూరి చైతన్య 46వ వార్డులోని దుర్బల భవనాలు, సితార సెంటర్ కొండ చరియల ముప్పు ఉన్న ప్రాంతాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులు ప్రభుత్వ మార్గదర్శ కాల ప్రకారం తుపాను ఎదుర్కో వడానికి తీసుకున్న ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు అందించారు.

విశాఖపట్నం

దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయం

*దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయం* *విశ్వఖ్యాతివారధులు కళాకారులు* *పశ్చిమ బెంగాల్ కళాకారులకు కళాజీవ పురస్కారాల ప్రధానం* నగర పోలీస్ కమిషనర్ సంఖ బ్రత బాగ్చి *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మన దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయమైనదని నగర పోలీస్ కమిషనర్ సంఖ భ్రత బాగ్చి పేర్కొన్నారు. సోమవారం సీతమ్మధార ఏపీ ఎస్ ఈ బి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో స్కూల్ ఆఫ్ థియేటర్స్, ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వర్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ కళాకారుల సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాకారుల ప్రతిభకు ఎల్లలు ఉండవన్నారు. విశ్వ సమైక్యతకు కళాకారులే వారధులు అని పేర్కొన్నారు.మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ జానపద కళారూపాలను పరిరక్షించుకునే బాధ్యత అందరిదీ అన్నారు. బా జాపా మహిళా నాయకురాలు బాగాది శ్యామల మన సాంప్రదాయ కళలు విశ్వ ఖ్యాతిని అర్జిస్తున్నాయన్నారు. ఇంటర్నేషనల్ వాకర్స్ అవార్డు గ్రహీత డాక్టర్ కమల్ బెయిడ్ మాట్లాడుతూ విశాఖలో క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభావంతులకు కొదవ లేదన్నారు.విశాఖ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ విశాఖలో సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రభుత్వ వేదిక అవసరం ఉందన్నారు.దేశంలోని బహు భాషా నృత్య కళాకారులను విశాఖపట్నం తీసుకు వఛ్చి ఇక్కడి కళాభిమానులు విభిన్న నృత్య రీతులను చూసే అవకాశాన్ని కల్పిస్తున్న స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నిర్వహకులను అభినందించారు. బ్రహ్మ కుమారి రామేశ్వరి స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ విశాఖలో విభిన్న దేశాల జానపద నృత్య సమ్మేళనం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్, విశాఖపట్నం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను సత్కరించారు.కార్యక్రమంలో కొండ్రు రామారావు బి. గురునాధరావు, బాగాది శ్యామల ప్రవల్లిక నాయుడు, కుమారి తదితరులు పాల్గున్నారు. అనంతరం వెస్ట్ బెంగాల్, విశాఖ కళాకారుల జానపద నృత్యాలు ప్రదర్శించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మజ్జారి పరంధామయ్య కొత్త ఇంటి ప్రవేశ వేడుకలో సామినేని ప్రశాంత్ బాబు శుభాకాంక్షలు తెలిపారు

జగ్గయ్యపేట మండలం, అనుమంచిపల్లి గ్రామానికి చెందిన మజ్జారి పరంధామయ్య నూతన గృహ ప్రవేశ కార్యక్రమం లో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను తనయుడు, యువనాయకుడు సామినేని ప్రశాంత్ బాబు పాల్గొని, కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం సానుభూతి, ఆనందం మరియు సామూహిక ఉత్సాహంలో నడిచింది.

విశాఖపట్నం

ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన ప్రకారం, తుఫాన్ MONTHA ప్రభావం కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా క్రింది రైళ్లు రద్దు చేయబడ్డాయి.

*🍄తుఫాన్ MONTHA కారణంగా రైళ్ల రద్దు* 📍ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన ప్రకారం, తుఫాన్ MONTHA ప్రభావం కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా క్రింది రైళ్లు రద్దు చేయబడ్డాయి. *రద్దు తేదీలు: 27, 28 & 29 అక్టోబర్ 2025* *🌹రద్దయిన రైళ్లు:* 1️⃣ 18515 విశాఖపట్నం–కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (27.10) 2️⃣ 18516 కిరండూల్–విశాఖ నైట్ ఎక్స్‌ప్రెస్ (28.10) 3️⃣ 58501 విశాఖ–కిరండూల్ ప్యాసింజర్ (28.10) 4️⃣ 58502 కిరండూల్–విశాఖ ప్యాసింజర్ (28.10) 5️⃣ 58538 విశాఖ–కొరాపుట్ ప్యాసింజర్ (28.10) 6️⃣ 58537 కొరాపుట్–విశాఖ ప్యాసింజర్ (28.10) 7️⃣ 18512 విశాఖ–కొరాపుట్ ఎక్స్‌ప్రెస్ (27.10) 8️⃣ 18511 కొరాపుట్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 9️⃣ 67285 రాజమండ్రి–విశాఖ MEMU (28.10) 🔟 67286 విశాఖ–రాజమండ్రి MEMU (28.10) 1️⃣1️⃣ 17268 విశాఖ–కాకినాడ ఎక్స్‌ప్రెస్ (28.10) 1️⃣2️⃣ 17267 కాకినాడ–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 1️⃣3️⃣ 08583 విశాఖ–తిరుపతి స్పెషల్ (27.10) 1️⃣4️⃣ 08584 తిరుపతి–విశాఖ స్పెషల్ (28.10) 1️⃣5️⃣ 22875 విశాఖ–గుంటూరు డబుల్ డెక్కర్ (28.10) 1️⃣6️⃣ 22876 గుంటూరు–విశాఖ డబుల్ డెక్కర్ (28.10) 1️⃣7️⃣ 22707 విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ (27.10) 1️⃣8️⃣ 18526 విశాఖ–బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (27.10) 1️⃣9️⃣ 18525 బ్రహ్మపూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 2️⃣0️⃣ 17243 గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ (27.10) 2️⃣1️⃣ 17244 రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్ (27.10) 2️⃣2️⃣ 67289 విశాఖ–పాలసా MEMU (28.10) 2️⃣3️⃣ 67290 పాలసా–విశాఖ MEMU (28.10) 2️⃣4️⃣ 67287 విశాఖ–విజయనగరం MEMU (27.10) 2️⃣5️⃣ 67288 విజయనగరం–విశాఖ MEMU (28.10) 2️⃣6️⃣ 68433 కటక్–గునుపూర్ MEMU (28.10) 2️⃣7️⃣ 68434 గునుపూర్–కటక్ MEMU (29.10) 2️⃣8️⃣ 58531 బ్రహ్మపూర్–విశాఖ ప్యాసింజర్ (28.10) 2️⃣9️⃣ 58532 విశాఖ–బ్రహ్మపూర్ ప్యాసింజర్ (28.10) 3️⃣0️⃣ 58506 విశాఖ–గునుపూర్ ప్యాసింజర్ (28.10) 3️⃣1️⃣ 58505 గునుపూర్–విశాఖ ప్యాసింజర్ (28.10) 3️⃣2️⃣ 17220 విశాఖ–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (27.10) 3️⃣3️⃣ 12727 విశాఖ–హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (27.10) 3️⃣4️⃣ 12861 విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (27.10) 3️⃣5️⃣ 12862 మహబూబ్‌నగర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 3️⃣6️⃣ 22869 విశాఖ–చెన్నై సెంట్రల్ వీక్లీ (27.10) 3️⃣7️⃣ 22870 చెన్నై సెంట్రల్–విశాఖ వీక్లీ (28.10) 3️⃣8️⃣ 12739 విశాఖ–సికింద్రాబాద్ గరిబ్‌రత్ (27.10) 3️⃣9️⃣ 20805 విశాఖ–న్యూఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్ (27.10) 4️⃣0️⃣ 20806 న్యూఢిల్లీ–విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ (29.10) 4️⃣1️⃣ 22707 విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ (27.10) 4️⃣2️⃣ 18519 విశాఖ–ఎల్‌టి‌టి ఎక్స్‌ప్రెస్ (27.10) 4️⃣3️⃣ 18520 ఎల్‌టి‌టి–విశాఖ ఎక్స్‌ప్రెస్ (29.10) 📢 ప్రయాణికులు అధికారిక రైల్వే వెబ్‌సైట్ లేదా సమీప విచారణ కార్యాలయంలో రైలు స్థితి తనిఖీ చేయాలి. అసౌకర్యానికి చింతిస్తున్నాము – ఈస్ట్ కోస్ట్ రైల్వే

ఎన్ టి ఆర్ జిల్లా

యన్టీఆర్ జిల్లా అనిగండ్లపాడు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల: పని సమయాల్లో మూసివేతకు స్థానికులు అసహనం

పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడు గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల లో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 27-10-2025 సోమవారం రోజు వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో వైద్యశాలను పని సమయాల్లో మూసి తాళం వేసి ఉంచారు. ప్రజలకు వైద్య సేవలు అందించ బడకపోవడం వల్ల అనారోగ్యం తో వచ్చిన వారు వెనక్కి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే, వైద్యశాల పని సమయాల సమాచారం అందించే సమయ పట్టికలు లేకపోవడం కూడా సమస్యను పెంచింది. స్థానికులు, వైద్యుల అభావం, సమయ పట్టికల లేమి కారణం గా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు ఆయుష్, ఆయుర్వేద ఉన్నతాధికారులు సంబంధిత వైద్యశాల సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

E-పేపర్

రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డిని* *కలిసిన* *తల్లెం* *భరత్ కుమార్రె రెడ్డి*,సనిశెట్టి నవీన్ కుమార్

*రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డిని* *కలిసిన* *తల్లెం* *భరత్ కుమార్* *రెడ్డి*,సనిశెట్టి నవీన్ కుమార్ . రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి ఇటీవల రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి గారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన డిఆర్సీసీ గుంతకల్లు రైల్వే సభ్యులు, రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు తళ్లెం భరత్ కుమార్ రెడ్డి. రాజంపేట పట్టణం ఆయన కార్యాలయం నందు కలిసి రైల్వే సంబంధిత సమస్యల మీద స్టాపింగ్ మరియు రైల్వే అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్,అన్నమయ్య జిల్లా Ysrcp వాణిజ్య విభాగం అద్యక్షులు శ్రీ సనిశెట్టి నవీన్ కుమార్ గారు ,కౌన్సిలర్ సురేష్,రామకృష్ణ, శివకుమార్ రాజు,కిరణ్ కుమార్,వెంకటసుబ్బయ్య ,శీను తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

భారత్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని ని కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

సోమవారం టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని ఢిల్లీలో కలిసిన శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మరియు స్వామి మహిమలను వివరించి,శ్రీకాళహస్తి వచ్చి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆహ్వానించడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంలో రక్తదాన శిబిరం

పోలీసు అమరవీరుల వారోత్స వాలను పురస్కరించుకొని నందిగామ పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆర్డీవో (RD) ప్రారంభించారు. పలువురు రక్తదాతలకు సర్టిఫికెట్లు కూడా అందజేయబడినాయి. ఏసీపీ తిలక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రక్తదానం ప్రాణదానంతో సమానం” అని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని, పోలీసు అమరవీరుల సేవలను నిరంతరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు ఆరు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న నందిగామ పోలీస్ స్టేషన్ సిఐ వైవిల్ నాయుడు, పోలీసులు, విద్యార్థులు, మరియు ఇతర రక్తదాతలకు ఏసీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీవో బాలకృష్ణ మాట్లాడుతూ, “పోలీసు అమర వీరుల స్మారక వారోత్సవాల సందర్భంలో ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ చేయడమే కాకుండా, అమరవీరుల త్యాగా లను స్మరించడమనిభావించాలి. పోలీస్ సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమే” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, ఆర్డీవో బాలకృష్ణ, సిఐ వైవియల్ నాయుడు, మున్సిపల్ చైర్మన్ కృష్ణకుమారి, ప్రభుత్వ హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు ఏచూరి రాము, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మడకశిరలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మరియు బాబు జగ్గీజీవన్ రామ్ విగ్రహావిష్కరణ

మడకశిర నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మరియు బాబు జగ్గీజీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు కావాలి గ్రీష్మ, 15 మంది ఎస్సీ శాసనసభ్యులు, మడకశిర శాసనసభ్యులు, టీటిడీ పాలకమండలి సభ్యులు ఎమ్మెస్ రాజు ఇతర అధికారి, ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ప్రధాన ప్రసంగంలో తంగిరాల సౌమ్య: డాక్టర్ అంబేడ్కర్ మరియు బాబు జగ్గీజీవన్ రామ్ దళితుల పక్షపాతం, సాధికారత కోసం సూర్యచంద్రుల వంటి వ్యక్తులు అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ దళిత పక్షపాతి పార్టీ విధానాలు (కూడు, గూడు,గుడ్డ, సబ్ ప్లాన్ నిధులు, ఉచిత విద్య, విదేశీ విద్య మొదలైన కార్యక్రమాలు) స్మరణచేసినారు. గతంలో బలహీన జాతులకు నిత్యావసరాలు, సంక్షేమ పథకాలు సరైన రీతిలో ఉపయోగించబడలేదని, కొందరు నేతలు అవమానం చేశారని విమర్శించారు. భవిష్యత్తులో అలాంటి వ్యక్తులు అధికారంలో రాకుండా చూసుకో వాల్సిన బాధ్యత మనం భరిం చాల్సినదని అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేస్తుండడం, దళిత పక్షపాతం విధానాలను ముందుకు తీసుకువెళ్ళడం గురించి గౌరవాభిప్రాయం వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.