Saturday, 11 April 2026

Blog

విశాఖపట్నం

జాగ్ర‌త్త‌గా ఉండండి.. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్దు…*

*జాగ్ర‌త్త‌గా ఉండండి.. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్దు…* *మొంథా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసిన స్పెష‌ల్ సీఎస్ అజ‌య్ జైన్ *అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు చేయొద్ద‌ని, స‌ముద్ర తీరానికి వెళ్లొద్ద‌ని క‌లెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి విశాఖ‌ప‌ట్టం, అక్టోబ‌ర్ 27 ః మొంథా తుపాను తీవ్ర‌త ఎక్కువ‌ని, ప్ర‌జ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని రాష్ట్ర స్పెష‌ల్ సీఎస్ అజయ్ జైన్ సూచించారు. శిథిల భ‌వ‌నాల్లో, నిర్మాణ ద‌శ‌ల్లో ఉన్న భ‌వ‌నాల్లో ఉండ‌రాద‌ని, ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సైక్లోన్ సెంట‌ర్ల‌కు గానీ, పున‌రావాస కేంద్రాల‌కు గానీ వెళ్లాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మొంథా తుపాను నేప‌థ్యంలో సోమ‌వారం సాయంత్రం విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ తో క‌లిసి అజ‌య్ జైన్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. శ్రీ‌కాకుళం నుంచి కోన‌సీమ వ‌ర‌కు యంత్రాంగం చేసిన ఏర్పాట్ల‌ను, సన్నద్ద‌త గురించి వివ‌రించారు. మొంథా సోమ‌వారం సాయంత్రం నాటికి విశాఖ‌ప‌ట్ట‌ణానికి 560 కి.మీ. ఆగ్నేయ దిశ‌లో ఉంద‌ని, గంట‌కు 19 కి.మీ. వేగంతో తీరానికి వ‌స్తోంద‌ని పేర్కొన్నారు. 28వ తేదీ అర్థ‌రాత్రి గానీ, 29వ తేదీ తెల్లవారు ఝామున గానీ తుపాను తీరం దాటుతుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతానికి కాకినాడ ప‌శ్చిమ దిశ‌లో తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని, అయితే దిశ మారొచ్చ‌ని అజ‌య్ జైన్ స్ప‌ష్టం చేశారు. కోస్తా తీరంలో 17 నుంచి 19 జిల్లాలు ప్ర‌భావితం కానున్నాయ‌ని, వాటిలో 9 జిల్లాలో తీవ్రంగా ప్ర‌భావితం అవుతాయ‌ని, వాటిలో 87 మండ‌లాలు, 705 గ్రామాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. 16 అర్బ‌న్ ప్రాంతాలు కూడా ప్ర‌భావం అవుతున్నాయ‌ని వివ‌రించారు. శ్రీ‌కాకుళం నుంచి ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి వ‌ర‌కు తొమ్మిది జిల్లాల ప‌రిధిలో 1,058 పున‌రావాస కేంద్రాల‌ను గుర్తించామ‌ని, వాటిల్లోకి 32,467 మందిని త‌రలించేందుకు ఏర్పాట్లు చేశామ‌ని చెప్పారు. అక్క‌డ తాగునీరు, టాయిలెట్లు, మందులు, చిన్న‌పిల్ల‌ల‌కు పాలు, ఆహారం వంటి వ‌స‌తులు స‌మ‌కూరుస్తున్నామ‌ని వెల్ల‌డించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల నిమిత్తం ఆరు ఎన్టీఆర్ఎఫ్, ఐదు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయ‌ని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వ‌ర్యంలో 13 వేల స్తంభాలు అందుబాటులో ఉంచామ‌న్నారు. అంద‌రూ క‌లిసి సుమారు 6వేల మంది వ‌ర‌కు సిబ్బంది అందుబాటులో ఉన్నార‌ని వివ‌రించారు. ఈ క్ర‌మంలో కోస్తా తీరంలోని అన్ని జిల్లాల అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశామ‌ని, హోర్డింగులు తొల‌గించాల‌ని, మ్యాన్ హోల్స్ ను స‌రిచేయాల‌ని చెప్పామ‌ని గుర్తు చేశారు. జ‌లాశాయాల వ‌ద్ద ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. 27వ తేదీ ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు 4.7 సెం.మీ. వ‌ర్ష పాతం న‌మోదైంద‌ని పేర్కొన్నారు. రాబోయే 38 నుంచి 46 గంట‌లు చాలా కీల‌క‌మ‌ని, ప్ర‌జ‌లు, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. *కొండ‌వాలు ప్రాంతాల ప్ర‌జ‌లు పున‌రావాస కేంద్రాల‌కు రావాలి ః జిల్లా క‌లెక్ట‌ర్* ఈ రెండు రోజులూ అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు చేయ‌రాద‌ని, తీర ప్రాంతాల‌ను సంద‌ర్శించ‌వ‌ద్ద‌ని విశాఖ ప్ర‌జ‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ విజ్ఞ‌ప్తి చేశారు. మొంథా తుపాను తీవ్ర ప్ర‌భావం చూప‌నున్న కార‌ణంగా ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లోనే ఉండాల‌ని సూచించారు. కొండ‌వాలు ప్రాంతాల ప్ర‌జ‌లు పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లి వెళ్లాల‌ని కోరారు. అత్య‌వ‌స‌ర‌మైతే కంట్రోల్ రూమ్ నెం.0891-2590100, 0891-2590102ల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు. అలాగే జీవీఎంసీ ప‌రిధిలోని వాట్సాప్ నెం.96669 09192ను కూడా అనుస‌రించి స‌హాయం పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. 11 మండ‌లాల ప‌రిధిలో 15 తీర ప్రాంత గ్రామాలు తీవ్రంగా ప్ర‌భావితం కానున్నాయ‌ని, ఈ క్ర‌మంలో వారంద‌రినీ సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేశామ‌ని వివ‌రించారు. ఈపీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో 500 స్తంభాలు అందుబాటులో ఉన్నాయ‌ని, 430 మంది సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నార‌ని పేర్కొన్నారు. గోస్తనీ, మేఘాద్రి గెడ్డ‌, గంభీరం రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశామ‌న్నారు. తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. అన్ని స‌చివాల‌యాల సిబ్బంది ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పున‌రావాస కేంద్రాల‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని, మందులు, ఇత‌ర వ‌స‌తులు స‌మ‌కూర్చామ‌ని చెప్పారు. ఇండియ‌న్ నేవీ స‌హాయం కోరామ‌ని, హెలికాఫ్ట‌ర్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని చెప్పామ‌న్నారు. అలాగే ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాల‌కు సంబంధించి 90 మంది సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

విశాఖపట్నం

*దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదగా రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ఆధ్వర్యంలో 40 లక్షల విలువైన వైద్య పరికరాలను కేజీహెచ్ కు అందజేత*

*దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదగా రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ఆధ్వర్యంలో 40 లక్షల విలువైన వైద్య పరికరాలను కేజీహెచ్ కు అందజేత* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* * *2 వెంటిలేటర్స్, 10 సిరంజి పంప్స్, 40 వీల్ చైర్స్, 100 కాట్స్, 5 రెస్పెటరీ హ్యూమిడిఫైర్స్ కేజీహెచ్ కు అందజేత* రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ఆధ్వర్యంలో 40 లక్షల విలువైన వైద్య పరికరాలను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదగా కేజీహెచ్ కు అందజేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రోటరీ క్లబ్లో ఎంతోమంది ప్రముఖులు అనేక రకమైన సేవా కార్యక్రమంలో విరివిగా చేస్తున్నారని తెలియజేశారు. నియోజకవర్గం లో విద్యకు , వైద్య రంగం పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ సందర్భంగా ప్రముఖులకు నియోజకవర్గంలో పలు పాఠశాలలకు, కళాశాలలకు రోటరీ క్లబ్ వారు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. 2 వెంటిలేటర్స్, 10 సిరంజి పంప్స్, 40 వీల్ చైర్స్, 100 కాట్స్, 5 రెస్పెటరీ హ్యూమిడైఫైర్స్ అందజేశారు . కార్యక్రమంలో సూపర్డెంట్ వాణి గారు, రోటరీ క్లబ్ పెద్దలు శోభన్ ప్రకాష్ గారు , ప్రిన్సిపాల్ సంధ్యాదేవి గారు, పెద్దలు రాంప్రసాద్ గారు, నహదా గారు, కృష్ణ కుమార్ గారు తో పాటు జనసేన పార్టీ వార్డ్ అధ్యక్షురాలు శ్రీమతి యజ్ఞశ్రీ గారు కూటమి నేతలు జోగి రాజుగారు, మహిగారు, డిప్యూటీ సూపర్డెంట్ శ్రీమతి వాసవి లత గారు, సీఎంఆర్వో శ్రీహరి గారు, ఏవో గారు పలువిభాగాల అధిపతిలు, డాక్టర్లు పాల్గొన్నారు….

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అరుదైన ఫొటో.. ఆరేళ్లు పట్టింది

ఆరేళ్ల కృషితో పట్టిన అరుదైన ఫొటో – ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ వాలెరియో మినాటో అద్భుతం ఇది ఏఐ సృష్టించిన చిత్రం కాదు, నిజమైన అరుదైన ఫొటో. ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ వాలెరియో మినాటో ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించడానికి ఆరేళ్లు ఎదురుచూశాడు. చంద్రుడు, పర్వతం, బాసిలికా ఒకే సరళ రేఖలో వచ్చే అరుదైన క్షణాన్ని అందుకోవడానికి అతను అనేక సంవత్సరాలుగా ప్రణాళిక రూపొందించాడు. చివరికి ఆ క్షణం సాకారమై, ప్రకృతి అందాన్ని, మానవ సహనాన్ని ప్రతిబింబించే ఈ అద్భుత చిత్రం ప్రపంచంలోనే అరుదైన ఫొటోల్లో స్థానం సంపాదించింది.

అన్నమయ్య

ఉరుస్ మహోత్సవాలకి ముస్తాబ్ అవుతున్న మగ్ధమ్ షావలి దర్గా

హజరత్ ఖ్వాజా సయ్యద్ షా వల్లీ మగ్దూం మొహమ్మద్ ఉరుస్ మహోత్సవాలకు దర్గా కమిటీ వారు ఉరుసు కు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకులు ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు,ఈ సందర్భంగా దర్గా పెద్ద పీఠాధిపతి మరియు చిన్న పీఠాధిపతి సయ్యద్ హైదర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈనెల 31-10-2025 జరగనున్న ఉరుసు మహోత్సవాలకు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొవాలని పత్రికా ముఖంగా తెలియజేశారు.

అన్నమయ్య

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చాటిన పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు

కడపలోని మాంటిస్సోరి జగతి ఇంటర్నేషనల్ స్కూల్ నందు జరిగిన అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల వాలీబాల్ పోటీల్లో నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం.యేసుప్రియ మరియు బి. నక్షత్ర అండర్ 14 విభాగంలో వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిద్దరూ నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో త్వరలో పాల్గొంటారు అని.అలాగే అండర్ 17 విభాగంలో కే.శివ మంజులకూడా వాలీబాల్ పోటీలకు ఎంపిక‌ కాబడింది అని మరియు త్వరలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనబోతోంది అని.ఈ సందర్భంగా నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.మాధవి లత గారు తెలిపారు. అండర్ 14 మరియు అండర్ 17 విభాగాలలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుతూ ఎంపికైన విద్యార్థినీలను ఘనంగా అభినందించి వారికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల పిడి యం.సుస్మిత,పిఈటి పి.జగన్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం

కోరం కనకయ్య కొంచం కనికరించవయ్యా

కోరం కనకయ్య గారు కొంచం కనికరించండి పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్ కామేపల్లి, ఇల్లందు 27-10-2025, శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు నియోజకవర్గం, కామేపల్లి మండలం అడవి మద్దుల పల్లి నుండి ముచర్ల వరకు ఉన్న రోడ్డు అడుగు లోతుతో, పగిలిన రోడ్డు అంచులు, నీటి నిల్వలతో ప్రమాదకరంగా మారింది. ఒక రోజులో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దశాబ్ద కాలంగా మరమ్మత్తులకు కూడా నోచుకోని రోడ్డు. పట్టపగలే ప్రయాణాలు చేయడానికి భయపడే పరిస్థితి, ఇంకా రాత్రిళ్ళు ప్రయాణం చేయాలి అంటే వేరే చెప్పనక్కర్లేదు. వర్షాకాలంలో అడుగు లోతు గుంతలతో నీరు నిల్వ ఉండి ప్రయాణికులకు కనపడక ఎన్నో ప్రమాదాలు జరిగాయి. దశాబ్ద కాలం నుండి ఒక్క అధికారి, కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఆ రోడ్డు వైపు కన్నెత్తి చూసిందే లేదు. ఇంకెంత కాలం ఈ అవస్థలు, ఇంకెంత కాలం ఈ ప్రమాదాలు. కామేపల్లి మండల పరిధిలోని ఈ రోడ్డును స్థానిక శాసనసభ్యులుగా ఉన్న మీరు అయినా కొంచం కనికరించి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్‌టీఆర్ జిల్లాలో తుపాను ముప్పు ప్రాంతాలను సంయుక్త కలెక్టర్లు, ఆర్డీవోలు విస్తృతంగా పరిశీలించుకున్నారు

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్లు మరియు ఆర్డీవోలు ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు నిర్వహించారు. *కొండపల్లి* : సంయుక్త కలెక్టర్ ఎస్. ఇలక్కియ్ ముంపు పొంచి ఉన్న ప్రాంతాలను పరిశీలించి ప్రజల ను అప్రమత్తం చేశారు. *తిరువూరు* : ఆర్డీవో కే.మాధురి భగత్ సింగ్ కాలనీ, గంపలగూడెం పునరావాస కేంద్రాలు, కట్టలేరు వాగు బ్రిడ్జిని పరిశీలించారు. *నందిగామ* : ఆర్డీవో కే.బాలకృష్ణ విలియమ్స్ పేట, ఊర చెరువునుపర్యవేక్షించారు. *విజయవాడ* : ఆర్డీవో కావూరి చైతన్య 46వ వార్డులోని దుర్బల భవనాలు, సితార సెంటర్ కొండ చరియల ముప్పు ఉన్న ప్రాంతాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులు ప్రభుత్వ మార్గదర్శ కాల ప్రకారం తుపాను ఎదుర్కో వడానికి తీసుకున్న ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు అందించారు.

విశాఖపట్నం

దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయం

*దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయం* *విశ్వఖ్యాతివారధులు కళాకారులు* *పశ్చిమ బెంగాల్ కళాకారులకు కళాజీవ పురస్కారాల ప్రధానం* నగర పోలీస్ కమిషనర్ సంఖ బ్రత బాగ్చి *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మన దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయమైనదని నగర పోలీస్ కమిషనర్ సంఖ భ్రత బాగ్చి పేర్కొన్నారు. సోమవారం సీతమ్మధార ఏపీ ఎస్ ఈ బి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో స్కూల్ ఆఫ్ థియేటర్స్, ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వర్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ కళాకారుల సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాకారుల ప్రతిభకు ఎల్లలు ఉండవన్నారు. విశ్వ సమైక్యతకు కళాకారులే వారధులు అని పేర్కొన్నారు.మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ జానపద కళారూపాలను పరిరక్షించుకునే బాధ్యత అందరిదీ అన్నారు. బా జాపా మహిళా నాయకురాలు బాగాది శ్యామల మన సాంప్రదాయ కళలు విశ్వ ఖ్యాతిని అర్జిస్తున్నాయన్నారు. ఇంటర్నేషనల్ వాకర్స్ అవార్డు గ్రహీత డాక్టర్ కమల్ బెయిడ్ మాట్లాడుతూ విశాఖలో క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభావంతులకు కొదవ లేదన్నారు.విశాఖ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ విశాఖలో సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రభుత్వ వేదిక అవసరం ఉందన్నారు.దేశంలోని బహు భాషా నృత్య కళాకారులను విశాఖపట్నం తీసుకు వఛ్చి ఇక్కడి కళాభిమానులు విభిన్న నృత్య రీతులను చూసే అవకాశాన్ని కల్పిస్తున్న స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నిర్వహకులను అభినందించారు. బ్రహ్మ కుమారి రామేశ్వరి స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ విశాఖలో విభిన్న దేశాల జానపద నృత్య సమ్మేళనం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్, విశాఖపట్నం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను సత్కరించారు.కార్యక్రమంలో కొండ్రు రామారావు బి. గురునాధరావు, బాగాది శ్యామల ప్రవల్లిక నాయుడు, కుమారి తదితరులు పాల్గున్నారు. అనంతరం వెస్ట్ బెంగాల్, విశాఖ కళాకారుల జానపద నృత్యాలు ప్రదర్శించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మజ్జారి పరంధామయ్య కొత్త ఇంటి ప్రవేశ వేడుకలో సామినేని ప్రశాంత్ బాబు శుభాకాంక్షలు తెలిపారు

జగ్గయ్యపేట మండలం, అనుమంచిపల్లి గ్రామానికి చెందిన మజ్జారి పరంధామయ్య నూతన గృహ ప్రవేశ కార్యక్రమం లో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను తనయుడు, యువనాయకుడు సామినేని ప్రశాంత్ బాబు పాల్గొని, కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం సానుభూతి, ఆనందం మరియు సామూహిక ఉత్సాహంలో నడిచింది.

విశాఖపట్నం

ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన ప్రకారం, తుఫాన్ MONTHA ప్రభావం కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా క్రింది రైళ్లు రద్దు చేయబడ్డాయి.

*🍄తుఫాన్ MONTHA కారణంగా రైళ్ల రద్దు* 📍ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన ప్రకారం, తుఫాన్ MONTHA ప్రభావం కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా క్రింది రైళ్లు రద్దు చేయబడ్డాయి. *రద్దు తేదీలు: 27, 28 & 29 అక్టోబర్ 2025* *🌹రద్దయిన రైళ్లు:* 1️⃣ 18515 విశాఖపట్నం–కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (27.10) 2️⃣ 18516 కిరండూల్–విశాఖ నైట్ ఎక్స్‌ప్రెస్ (28.10) 3️⃣ 58501 విశాఖ–కిరండూల్ ప్యాసింజర్ (28.10) 4️⃣ 58502 కిరండూల్–విశాఖ ప్యాసింజర్ (28.10) 5️⃣ 58538 విశాఖ–కొరాపుట్ ప్యాసింజర్ (28.10) 6️⃣ 58537 కొరాపుట్–విశాఖ ప్యాసింజర్ (28.10) 7️⃣ 18512 విశాఖ–కొరాపుట్ ఎక్స్‌ప్రెస్ (27.10) 8️⃣ 18511 కొరాపుట్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 9️⃣ 67285 రాజమండ్రి–విశాఖ MEMU (28.10) 🔟 67286 విశాఖ–రాజమండ్రి MEMU (28.10) 1️⃣1️⃣ 17268 విశాఖ–కాకినాడ ఎక్స్‌ప్రెస్ (28.10) 1️⃣2️⃣ 17267 కాకినాడ–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 1️⃣3️⃣ 08583 విశాఖ–తిరుపతి స్పెషల్ (27.10) 1️⃣4️⃣ 08584 తిరుపతి–విశాఖ స్పెషల్ (28.10) 1️⃣5️⃣ 22875 విశాఖ–గుంటూరు డబుల్ డెక్కర్ (28.10) 1️⃣6️⃣ 22876 గుంటూరు–విశాఖ డబుల్ డెక్కర్ (28.10) 1️⃣7️⃣ 22707 విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ (27.10) 1️⃣8️⃣ 18526 విశాఖ–బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (27.10) 1️⃣9️⃣ 18525 బ్రహ్మపూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 2️⃣0️⃣ 17243 గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ (27.10) 2️⃣1️⃣ 17244 రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్ (27.10) 2️⃣2️⃣ 67289 విశాఖ–పాలసా MEMU (28.10) 2️⃣3️⃣ 67290 పాలసా–విశాఖ MEMU (28.10) 2️⃣4️⃣ 67287 విశాఖ–విజయనగరం MEMU (27.10) 2️⃣5️⃣ 67288 విజయనగరం–విశాఖ MEMU (28.10) 2️⃣6️⃣ 68433 కటక్–గునుపూర్ MEMU (28.10) 2️⃣7️⃣ 68434 గునుపూర్–కటక్ MEMU (29.10) 2️⃣8️⃣ 58531 బ్రహ్మపూర్–విశాఖ ప్యాసింజర్ (28.10) 2️⃣9️⃣ 58532 విశాఖ–బ్రహ్మపూర్ ప్యాసింజర్ (28.10) 3️⃣0️⃣ 58506 విశాఖ–గునుపూర్ ప్యాసింజర్ (28.10) 3️⃣1️⃣ 58505 గునుపూర్–విశాఖ ప్యాసింజర్ (28.10) 3️⃣2️⃣ 17220 విశాఖ–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (27.10) 3️⃣3️⃣ 12727 విశాఖ–హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (27.10) 3️⃣4️⃣ 12861 విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (27.10) 3️⃣5️⃣ 12862 మహబూబ్‌నగర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 3️⃣6️⃣ 22869 విశాఖ–చెన్నై సెంట్రల్ వీక్లీ (27.10) 3️⃣7️⃣ 22870 చెన్నై సెంట్రల్–విశాఖ వీక్లీ (28.10) 3️⃣8️⃣ 12739 విశాఖ–సికింద్రాబాద్ గరిబ్‌రత్ (27.10) 3️⃣9️⃣ 20805 విశాఖ–న్యూఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్ (27.10) 4️⃣0️⃣ 20806 న్యూఢిల్లీ–విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ (29.10) 4️⃣1️⃣ 22707 విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ (27.10) 4️⃣2️⃣ 18519 విశాఖ–ఎల్‌టి‌టి ఎక్స్‌ప్రెస్ (27.10) 4️⃣3️⃣ 18520 ఎల్‌టి‌టి–విశాఖ ఎక్స్‌ప్రెస్ (29.10) 📢 ప్రయాణికులు అధికారిక రైల్వే వెబ్‌సైట్ లేదా సమీప విచారణ కార్యాలయంలో రైలు స్థితి తనిఖీ చేయాలి. అసౌకర్యానికి చింతిస్తున్నాము – ఈస్ట్ కోస్ట్ రైల్వే

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.