Saturday, 11 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ, కంచికచర్ల మండలా ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం

నందిగామ పార్టీ కార్యాలయం లో నందిగామ మండల స్థాయి, అలాగే కంచికచర్ల మండల పరిటాల గ్రామంలో పార్టీ నాయకులు చింతా రవీంద్ర నివాసంలో కంచికచర్ల మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ డా.మొండితోక జగన్మోహనరావు హాజరై నాయకులకు దిశానిర్దేశం చేశారు. డా.జగన్మోహనరావు మాట్లాడుతూ, గ్రామ మరియు బూత్ స్థాయిల్లో పార్టీ కమిటీల నిర్మాణంపై దృష్టి సారించి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి రెండు గ్రామాలకు ఒక పరిశీలకుడు, అలాగే నాలుగు గ్రామాల క్లస్టర్‌కు ఒక మండల స్థాయి పరిశీలకుడిని నియమించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

మొంథా తుఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్..!!

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అక్టోబర్ 27 (పున్నమి న్యూస్) ప్రతినిధి: రాష్ట్రంపై మొంధా తుఫాను ప్రభావాన్ని గంట గంటకు అంచనా వేస్తున్నామని, ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు ఎలమంచిలి నియోజకవర్గ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని *గౌరవ శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు అన్నారు* తుఫాన్ వల్ల ధన, ప్రాణ నష్టాలు, జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన *గౌర వ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు* అధికారులకు ఆదేశించడం జరిగింది ,ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మత్తులు ,డ్రైన్లు బలహీనంగా ఉన్న శారదా నది గట్లను, పటిష్ట పరిచేలా, తుఫానుకు విరిగిపడే చెట్లను రోడ్లకు అడ్డం లేకుండా వెనువెంటనే తొలగించేందుకు,యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని ఆయన కోరారు. తుఫాన్ పై నిరంతరం సమీక్షలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎవరికైనా ఎటువంటి అవసరమైన నన్ను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో *రాంబిల్లి మండల మాజీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబు గారు* మండల ఎమ్మార్వో, ఎండిఓ ,ఏఈ ఇరిగేషన్, హౌసింగ్ డిపార్ట్మెంట్, ఉద్యోగస్తులు కూటమి నాయకులు పాల్గొన్నారు

రంగారెడ్డి

ఇందిరమ్మ రాజ్యంలో ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమైనవి.. —- సబితా ఇంద్రారెడ్డి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 26 : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం ఆటో డ్రైవర్లకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గము సోమాజిగూడ డివిజన్‌లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటోలో ప్రయాణం చేసిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా వారు ఆటో డ్రైవర్లతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు ఏమో కానీ జీవితాలు చీకటి అయ్యాయని,.. ఈ ఎం ఐ లు కట్టలేక, ఇంటిని నడపలేక ఆటో డ్రైవర్ల జీవితాలు చాలా దుర్భర స్థితిలో ఉన్నాయి అని అన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పరిపాలన లో కుటుంబాలను పోషించుకోలేక 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు వారికీ 5,00,000 ఇస్తామని ప్రభుత్వం అన్నది.. ఇప్పటి వరకు ఓక్కరికి కుడా ఇవ్వలేదు.కాంగ్రె పార్టీ వచ్చాక మా జీవితాలు చాలా దుర్భర స్థితిలో ఉన్నాయని ఆటో డ్రైవర్లు అన్నారు అని తెలిపారు. ఆటోలో ప్రయాణం చేస్తూ డ్రైవర్ల కష్టాలు తెలుసుకుంతుంటే కంటికి దుఃఖం వచ్చింది. వారు కుడా దుఃఖంతో వారి బాధలు చెప్పుకున్నారన్నారు.గత కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజువారి ఖర్చులు పోను వెయ్యి నుండి 1200 సంపాదించే వారమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రోజు కనీసం 500 కూడా సంపాదించలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు వాపోయారు అని తెలిపారు ఇప్పటికే చాలి చాలని సంపాదన తో ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతుంటే చలాన్ల పేరుతొ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం తీసుకొచ్చింది దానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఆ పథకం తీసుకొచ్చినప్పుడు దానివల్ల ఇతర ఏ వర్గమైనా ఇబ్బందులు పడుతుందా లేదా అనేది ఈ ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది అని అన్నారు.,.. పర్యావసానముగా ఆటో డ్రైవర్లు వారి రోజువారి జీవితం గడుపుకోలేని దుర్భర స్థితిలోకి వెళ్లిపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆటోడ్రైవర్లకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు, సంక్షేమ బోర్డు ఏర్పాటు మరియు ఆటోనగర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు అని తెలియజేస్తూ,..సంవత్సరానికి 12,000 చొప్పున రెండేండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ లకు 24,000 బాకీ పడ్డది అని అన్నారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మొద్దు నిద్ర వీడి ఆటో డ్రైవర్లకు ఇప్పటివరకు బాకీ పడ్డ 24,000 వెంటనే ఇవ్వాలి అని,. అదేవిదంగాసంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఆటో నగర్ నిర్మించాలి అని, చనిపోయిన ఆటో డ్రైవర్లకు 5,00,000 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం

ఏసీబీ వలలో చిక్కిన గ్రామ పరిపాలనధికారి

ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కిన గ్రామ పరిపాలనధికారి. పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్ కొత్తగూడెం, 27-10-2025, సోమవారం ఏసీబి డిఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యం లో ములకలపల్లి లో గ్రామ పరిపాలనధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. గ్రామ పరిపాలనాదికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కు సంబందించి రైతు నుండి 60 వేలు లంచం డిమాండ్ చేసాడు, 40 వేలు ముందు తీసుకున్నాడు. మిగతా బాలన్స్ 20 వేలు లంచం తీసుకుంటు ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కాడు. లంచాలు తీసుకునే ఇలాంటి అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

*🚨 ముఖ్య గమనిక 🚨*

*🚨 ముఖ్య గమనిక 🚨* *మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల వారు అందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, తీరప్రాంత ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలి* *అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము

అమరావతి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్

*అమరావతి *రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు– మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. * * జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, స్పెషల్ ఆఫీసర్ శ్రీ కృష్ణ తేజ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. * జిల్లాలో 12 మండలాలపై ప్రభావం ఉంటుందనీ తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు. * ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగు నీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలి అన్నారు. * డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకు తెలియచేయాలని తెలిపారు. * తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు.

E-పేపర్

ప్రాథమిక పాఠశాల చుట్టుపక్కల పరిస్థితుల మీద పర్యవేక్షించిన బిజెపి నాయకులు

ప్రాథమిక పాఠశాల చుట్టుపక్కల పరిస్థితుల మీద పర్యవేక్షించిన బిజెపి నాయకులు రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు కొత్త బజారులోని 2 వార్డులో గల మండల ప్రాధమిక పాఠశాల చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల మీద ప్రజలనుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు స్థానిక బిజెపి నాయకులతో కలిసి పర్యవేక్షించడం జరిగింది.అక్కడ స్కూల్ బయట ఉన్న దుస్థితి పందులకు,ఎనుములకు స్వర్గధామంగా ఉన్నట్లుంది .ఇక అసలు విషయానికొస్తే మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ పాఠశాలలను ఎంతో అభివృద్ధి చేయడానికి సంస్థాగతంగా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తుంటే క్రింది స్తాయి అధికారుల అలసత్వంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి పిల్లలకు శాపంగా మారుతోంది.ఈ సమస్యలను పరిష్కరించాలని సంబంధింత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్, రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ కన్వీనర్ తోట శ్రీనివాసులు మరియు కిసాన్ మోర్చా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ వర్మ , వీహెచ్ పి దరిశ వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కుప్పాల కిరణ్ , మండల ఆఫీస్ సెక్రటరీ అందరివాడు సుబ్బారావు, మహిళా నాయకురాలు కుప్పాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ 18 వ వార్షికోత్సవం,విశాఖ అర్బన్ తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ 18 వ వార్షికోత్సవం,విశాఖ అర్బన్ తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* నలుగురికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న విల్లూరి డాక్టర్ చక్రవర్తి,విల్లూరి తిరుమల దేవి దంపతులు అభినందనీయులని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సోమవారం విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ 18 వ వార్షికోత్సవం,విశాఖ అర్బన్ తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా హాజరై ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను నియోజకవర్గంలో దీర్ఘకాలకంగా నెలకొన్న వెంకటేశ్వర మెట్ట సమస్యపై చక్రవర్తి అనేక విధాలుగా పోరాడని ప్రశంసించి విల్లూరి డాక్టర్ చక్రవర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకఅతిధిగా హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ శ్రీ సీతారామ రాజు సుధాకర్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటినుంచి సుశిక్షితుడైన కార్యకర్తగా చక్రవర్తి పార్టీకి సేవలందించారన్నారు.చక్రవర్తి ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ సేవాకార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.కార్యక్రమానికి నాయకులు అధికసంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళల సందడిమధ్య చక్రవర్తి తో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. క్లస్టర్ ఇన్చార్జి,ఆంధ్రప్రదేశ్ గవర సాధికారసమితి సభ్యురాలు విల్లూరి తిరుమల దేవి సారధ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా సుమారు ఐదు వందల మంది మహిళలకు చీరలు, జాకెట్లు, పేదలకు పళ్ళు,రొట్టెలు అతిధుల చేతుల మీదుగా పంపిణీ చేసారు.చివరిగా విల్లూరి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ నందమూరి వీరాభిమానిగా,చంద్రబాబు స్ఫూర్తిగా సుదీర్ఘ కాలం ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ కి సేవలందించానన్నారు.దక్షిణ నియోజక పరిధి వెంకటేశ్వర మెట్ట దేవస్థానం భూ సమస్యపై సర్వే నెంబరు 1450,1261 పై అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నానని, చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సదరు సమస్యను పరిష్కరించాలని కోరారు. విశాఖలో పెండింగ్ లో పంచగ్రామాలు, సింహాచలం భూముల సమస్యలతో దీనికి ముడిపెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు.అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను ఘనంగా సత్కరించి,జ్ఞాపికలు బహూకరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర మెట్ట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిశెట్టి శ్రీను ,తనకాల గోవింద్ గారు , పీల రవి, కోరుబిల్లి ఆది, కోరుభిల్లి త్రినాథ్, ఎల్లపు గోపాలరావు గారు,చిప్పాడ అప్పారావు గారు, 33వ వార్డు బూతు ప్రెసిడెంట్లు సింగంపల్లి మాధవి,పొట్నూరు మీనాక్షి, ఎల్ కనకదుర్గ,కంఠంశెట్టి భాగ్యలక్ష్మి,ఎం జ్యోతి,శ్రీ సత్య, బొడ్డేటి హిమబిందు, జి సత్య, ఏం సాయి లక్ష్మి వార్డు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

విశాఖపట్నం

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాభిషేకం

పున్నమి ప్రతినిది అక్టోబర్ కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా మురళీనగర్‌లోని ఉమా రమలింగేశ్వర ఆలయంలో జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము భక్తిశ్రద్ధలతో పరమశివునికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, 50వ వార్డ్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సనపల వరప్రసాద్‌ జోనల్‌ కమిషనర్‌ను ఘనంగా సత్కరించాడు. ఈ కార్యక్రమంలో మురళీనగర్‌ రామాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు, జీవీఎంసీ సానిటరీ ఇన్స్పెక్టర్‌ మరియు సిబ్బంది పాల్గొని శివనామస్మరణతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ వేడుకను భక్తులు ఆనందంగా వీక్షించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అభినవ అంబేద్కర్ చింతకాయల పావన మూర్తి మాస్టారుకు ధమ్మ నివాళులు – అంబేద్కర్ భావజ్యోతి శాశ్వతంగా ప్రకాశిస్తుంది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి తరం అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వ్యవస్థాపక సభ్యుడిగా, అలాగే విశాఖపట్నంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ స్థాపకుడిగా విశేష సేవలు అందించిన అభినవ అంబేద్కర్ శ్రీమాన్ చింతకాయల పావన మూర్తి మాస్టారు గారు తేదీ 27-10-2025 ఉదయం సుమారు 11 గంటల సమయంలో పరినిర్వాణం పొందడం అత్యంత విచారకరమైన విషయం. ఆయన జీవితం సమాజ మాధ్యమం ద్వారా అంబేద్కర్ ఆలోచనలను ప్రజల్లో నాటిన ధర్మయాత్రగా నిలిచింది. మానవ సమానత్వం, విద్య, స్వాభిమానానికి ఆయన చేసిన కృషి అప్రతిహతం. ఆయన చూపిన మార్గం, ఆలోచనలు నూతన తరం దళిత బౌద్ధ ఉద్యమానికి ప్రేరణగా నిలుస్తాయి. ఆయన పరినిర్వాణం అంబేద్కర్ చింతన వర్గానికి తీరని లోటు. మా తరపున మహానుభావునికి ధమ్మ నివాళులు, జైభీమ్ నమస్సుమాంజలులు అర్పిస్తున్నాము.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.