Saturday, 11 April 2026

Blog

విశాఖపట్నం

ట్రాన్స్ లేషనల్ మెడిసిన్ పై జాతీయ సదస్సు ప్రారంభం*

*ట్రాన్స్ లేషనల్ మెడిసిన్ పై జాతీయ సదస్సు ప్రారంభం* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* *ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ట్రాన్స్ లేషనల్ మెడిసిన్ ఇన్ క్యాన్సర్ టి.ఎం.సి- 2025 జాతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఏయూ టి.ఎల్.ఎన్ స భామందిరంలో సదస్సును వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్ పార్క్ సీఈఓ డాక్టర్ ఎం. కులకర్ణి ప్రారంభించారు* . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆలోచన పూర్తిస్థాయిలో వ్యాధులను నయం చేయలేదని అన్నారు. ఒక ఆలోచనను ఔషధంగా తయారు చేయడానికి మధ్యలో అనేక అంశాలు ముడిపడి ఉంటాయని చెప్పారు, ట్రాన్స్ లేషనల్ అంకాలజీ ప్రాముఖ్యతను వివరించారు. యువత, పరిశోధకులు మూడు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిందాలని చెప్పారు. విశాల దృక్పథం కలిగి ఉండడం, సవాళ్లను స్వీకరించే మనస్తత్వం అలవాటు చేసుకోవడం, అర్థమెటిక్ స్కిల్స్ పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహిందాలని చెప్పారు. వైఫల్యాలనుంచి నేర్చుకునే తత్వాన్ని కలిగి ఉండడం ఎంతో ప్రధానమని చెప్పారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. *ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విభిన్న సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకొని సంయుక్తంగా కలిసి పనిచేసే ఆలోచన* ఉందని చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయడం జరుగుతుందని అన్నారు. ఇంద్రాస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర ఓలేటి మాట్లాడుతూ క్యాన్సర్ ఒక భారంగా పరిణమిస్తోందని చెప్పారు. దీనికి పరిష్కారం చూపడంలో విద్యావేత్తలు, పరిశ్రమలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. క్యాన్సర్ కు అవసరమైన పరిష్కారాన్ని చూపడంలో విభిన్న విభాగాలకు చెందిన వారు సమన్వయంతో పని చేస్తే సత్వర ఫలితాలను పొందవచ్చునని అన్నారు. *సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. వి. ఆర్ రాజు మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడం ఎంతో అవసరమన్నారు. వినూత్నమైన ఆలోచనలతో పనిచేయాలని సూచించారు.* *సదస్సు కన్వీనర్ ఆచార్య పి.రాధిక రెండు రోజుల సదస్సు ప్రత్యేకతలను, ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం అతిదులను సత్కరించారు. పరిశోధకులు, ఆచార్యులు సదస్సుకు సంబంధించి అందించిన పరిశోధనా పత్రాలు, పోస్టర్ ప్రజెంటేషన్* తదితర అంశాలకు సంబంధించిన వివరాలను వివరించారు.

విశాఖపట్నం

అప్పుఘర్ తీర ప్రాంతాన్ని రాత్రి పరిశీలించిన విశాఖ నగర మేయర్*

*అప్పుఘర్ తీర ప్రాంతాన్ని రాత్రి పరిశీలించిన నగర మేయర్* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* బంగాళాఖాతంలో ఏర్పడిన మొoథా తుఫాన్ కారణంగా బీచ్ రోడ్ లోని లోతట్టు ప్రాంతా ప్రజలను అప్రమత్తం చేయాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆయన జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, మూడవ జోన్ జోనల్ కమిషనర్ శివప్రసాద్, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అప్పుఘర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం తో పాటు బీచ్ లోని తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తుఫాన్ ప్రభావత ప్రాంతాలను ఎదుర్కొనేందుకు 24 గంటలు అప్రమత్తంగా టీమ్లను ఏర్పాటు చేసామని తెలిపారు. జీవీఎంసీ అధికారులు తీర ప్రాంత వెంబడి 27 జెసిబిలు, 56 టిప్పర్లు, 6 క్రేన్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. తుఫాను వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఏదైనా విపత్తు సంభవిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్ కు గాని, జీవీఎంసీ ఏర్పాటుచేసిన ఫోన్ నెంబర్ గాని ఫోన్ చేయాలని నగర ప్రజలకు సూచించారు. నేడు రేపు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు తమ బోట్లకు లంగర్లు వేసి సురక్షితంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, చెట్లు కింద, ఓర్డింగులు వద్ద ఉండరాదని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తి లో వైభవంగా కార్తీక దీపోత్సవం

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము నకు అనుబంధంగా ఉన్నటువంటి నారద పుష్కరిణిలో కార్తీక సోమవారము సందర్భం గా దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడమైనది.భక్తులు విశేషంగా పాల్గొని నారద పుష్కరణి లో దీపాలను వెలిగించారు.ఈ కార్యక్రమములో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి T.బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ NR కృష్ణారెడ్డి దంపతులు,ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం,అనుబంధ ఆలయాల ఇంచార్జి లక్ష్మయ్య,అర్చకులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరుకు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

అరకులోయ( పున్నమి ప్రతినిధి), అక్టోబర్:27, పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అరకులోయ పోలీస్ స్టేషన్లో సోమవారం సిఐ హిమగిరి అధ్యక్షతన ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్ఆర్ పబ్లిక్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు పోలీసుల విధులు, ఆయుధ పరికరాలు ఉపయోగించే విధానం గురించి వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జరిగే నష్టం గురించి విద్యార్థులకు ఎస్సై జి గోపాలరావు వివరించారు.

అల్లూరి సీతారామరాజు

మొంథా తుఫాన్ ప్రభావంతో అరకు రైళ్ళు రద్దు

అరకులోయ(పున్మమి ప్రతినిధి), ఆక్టోబర్:27, మొంథా తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నం డివిజన్లో పలు రైలు రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. దీనిలో బాగంగా విశాఖపట్నం నుండి రాత్రి 9.20 గంటలకు బయలుదేరే విశాఖ-కిరండూల్(18515) రాత్రి ఎక్స్ ప్రస్ రైళు ఈ రోజు రద్దు చేయడం జరిగింది. ఈ నెల 28న విశాఖ నుండి కిరండూల్(58501), కిరండూల్ నుండి విశాఖ(58502) పాసింజర్ రైళ్ళు, కిరండూల్ నుండి బయలుదేరే కిరండూల్-విశాఖ(18516) రాత్రి ఎక్స్ ప్రెస్ రైలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

తూర్పు గోదావరి

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సిగ్గుమాలిన విధులు

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సిగ్గు మాలిన విధులు .. కార్తీకమాస పవిత్ర దినాల్లో రాజమండ్రి నగర పాలక సంస్థ వారు ఎంతో ప్రాముఖ్యత గల పుష్కర ఘాట్ కు తాళలు వేసి హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు . వారి మనోభావాలను గాయ పరుస్తున్నారు . హిందువుల పవిత్ర దినాలను కలుషితం చేస్తున్నారు .. కార్తీకమాస పర్వ దినాల్లో రాజమండ్రి నగర పాలక సంస్థ వారు చేసిన మహా పాపం జాతీయ ద్రోహంగా బావించాలి . ఎందరో భక్తులు పుష్కర ఘాట్ కు తాళాలు వేసిన కారణంగా నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు . రాజమండ్రి నగర పాలక సంస్థ చేసిన మహా ద్రోహ చర్య కారణంగా భక్తులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు . ఈ పాపం రాజమండ్రి పాలకులకు కనపడక పోవటం ఆశ్చర్యంగా వుంది . గోదావరి పోటు మీద ఉన్నప్పటికి అందుకు అవసరమయ్యే పటిష్టమైన భద్రతా చర్యలు , సహాయక చర్యలు నిర్వహించి భక్తుల మనోభావాలకు అండగా నిలవాలి అనే కనీస జ్ఞానం కూడా రాజమండ్రి నగర పాలక సంస్థకు లేకపోవటం దురదృష్టం . రాజమండ్రి నగర పాలక సంస్థ పనితీరు ఎలావుందంటే తుఫాన్ వుంది అంటే సముద్రానికి గోడ కట్టాలి . గోదావరికి తాళాలు వేయాలి అన్నట్టు రాజమండ్రి నగర పాలక సంస్థ పనితీరు కనపడుతుంది . పుష్కర ఘాట్ కు కార్తీకమాస పవిత్ర దినాల్లో తాళాలు వేసి రాజమండ్రి ప్రతిష్టను రాజమండ్రి నగర పాలక సంస్థ మంటగలిపింది . తక్షణమే తప్పును సరి దిద్దుకునే చర్యలు చేపట్టాలి. హిందువుల మనోభావాల ను రాజమండ్రి నగర పాలక సంస్థ వారు గాయపరిచినట్టు పాకిస్తాన్ వారు కూడా చేయరేమోనని అనిపిస్తుంది . హిందువుల ప్రతీకగా వున్నటు వంటి నరేంద్ర మోదీ పాలనలో జరిగిన ఈ పాపం రాజమండ్రి చరిత్రను వెంటాడుతూనే ఉంటుంది .

అల్లూరి సీతారామరాజు

మొంథా తుఫాను ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : పొద్దు బాలదేవ్

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:27 ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన వచ్చే మొంథా తుఫాను తో రాబోయే మూడు రోజులల్లో అల్లూరి జిల్లలో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ పిలుపునించారు. ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కావున ప్రజలు చెట్ల క్రింద, అడవులలోనూ, కాఫీ తోటలులోను ఉండకూడదని బాలదేవ్ పేర్కొన్నారు. పిల్లలు వాగుల వద్దకు, చెరువుల వద్దకు వెళ్ళవద్దని, ప్రజలు వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని, కరెంట్ స్తంబాలు పట్టుకోవద్దని సూచించారు. ఈ మూడు రోజులు పశువులను అడవికి మేతకు తీసుకువెళ్లకుండా ఇంటి వద్ద ఉన్న తౌడు ఉడకబెట్టి మరియు అందుబాటులో ఉన్న మేతను వేయాలని సూచించారు. ప్రజలు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని బాలదేవ్ కోరారు. అత్యవసర పరిస్థితులలో పొలీస్ వారికి కాని సంబందిత శాఖ అధికారులకు కాని తెలపాలని పేర్కొన్నారు. వర్షాలు వలన కాని, గాలుల వలన కాని ప్రమాదాలు జరిగితే కంట్రోల్ మరియు కమాండ్ కోసం 7780292811 నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు. రోడ్లకు అడ్డంగా చెట్లు పడినా, రాకపోకలు నిలిచిపోయినా ఫోన్ చేయవచ్చని తెలిపారు.

E-పేపర్

శ్రీ భవాని శంకర బాణలింగేశ్వరునికి ” శ్రీ మహాన్యాస పూర్వాక ఏకాదశి రుద్రాభిషేకం”

జై వాసవాంబ కార్తీకమాసం మొదటి సోమవారం 27/10/25 సాయంత్రం 6:30 నిమిషములకు మన కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ” శ్రీ భవాని శంకర బాణలింగేశ్వరునికి ” శ్రీ మహాన్యాస పూర్వాక ఏకాదశి రుద్రాభిషేకం” జరుగుతుంది. 🙏 ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్వయంగా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర తెచ్చుకుని శివునికి స్వయంగా అభిషేకం చేయవచ్చును. లోక రక్షణార్థం సర్వజన విజయ ఆయురారోగ్యాల కోసం సంకల్పం చేసి కార్యక్రమాన్ని సంఘము వారు జరిపించును. రుద్రాభిషేకము అనగా రుద్రునికి అభిషేకం చేయడము. ఏకాదశి రుద్రాభిషేకము అనగా 11 సార్లు నమకం చమకములతో శివునికి అభిషేకం చేయబడుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఆర్యవైశ్య సంఘం.

E-పేపర్

భుజంగేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ గా ఉంగరాల సురేంద్ర కుమార్

భుజంగేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ గా ఉంగరాల సురేంద్ర కుమార్ రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు లోని అతి పురాతన భువనేశ్వరీ దేవి సమేత శ్రీ భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానం స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర కార్తీక మాస ఉత్సవములు సందర్భంగా చైర్మన్ గా ఉంగరాల సురేంద్ర కుమార్ మరియు పాలకవర్గం , సిబ్బంది, అర్చకులు పవన్ స్వామి, ధూర్జటి యోగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరిగినవి. అందులో భాగంగా ఈరోజు మొదటి కార్తీక సోమవారం శుభ సందర్భంగా భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను విశేషంగా దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించి , తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అంతేకాకుండా 27-10-2025 బుధవారం నుండి 20-11-2025 వ తేది గురువారము వరకు విశేషమైనటువంటి ఈ కార్తీకమాసంలో భక్తులందరూ పాల్గొనీ స్వామి వారి యొక్క కృపకు పాత్రులు అవుతారని కోరుకుంటూ ఉంగరాల సురేంద్ర ఆలయ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారికి అమ్మవారికి కార్తీకదీపం వెలిగించి వారి కోరికలను కోరుకొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నాము: ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను

ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన పార్టీ తగిన కృషి చేస్తోందని తెలిపారు. మొదటి కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన కార్తీకమాస దీపోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈకార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆరో డివిజన్ అధ్యక్షులు పల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామినేని ఉదయభాను మాట్లాడుతూ — “జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది. అదే సమయం లో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి జనసైనికుడు అంకితభావం తో పనిచేస్తున్నాడు” అని పేర్కొన్నారు. అలాగే, ఆయన అన్నారు కార్తీక మాసం సనాతన ధర్మ విశిష్టత ను తెలియజేసే పవిత్ర మాసమని, ఈ నెలలో హిందువులు దేవుళ్లకు, దేవతా మూర్తులకు పూజలు, దీపారాధ నలు చేయడం శాశ్వత సంప్రదాయమని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక మహిళలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపోత్సవాన్ని విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.