Saturday, 11 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మొంథా తుఫాన్‌పై ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి కీలక ఆదేశాలు”

“మొంథా తుఫాన్‌పై ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి కీలక ఆదేశాలు” 🔴మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సూచించారు. 🔴తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రతి శాఖాధికారులు తమ పరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ☁️ “ఈ తుపాన్ సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు🌪️ వీసే అవకాశం ఉంది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అవసరమైతే పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి — ప్రజలను ముందుగానే అక్కడకు సురక్షితంగా తరలించాలి.” “ప్రజలను అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తెలిపారు.” ⚠️ ప్రజలకు సూచనలు: 🔴మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. 🔴తుపాన్ సమయంలో పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించి కాపాడుకోవాలి. 🔴విద్యుత్, నీటి, ఆహార సరఫరా వంటి సేవల్లో అంతరాయం రాకుండా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ☎️ అత్యవసర సహాయం కోసం: 📞 స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 112 మరియు 1070 📞 టోల్ ఫ్రీ నెంబర్: 1800-425-0101 ఏ సహాయం కావాలన్నా రాష్ట్ర లేదా జిల్లా కంట్రోల్ రూమ్‌లను సంప్రదించండి. ☎️📞ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం 8522084270, 9390011493. ఇట్లు మీ కాకర్ల సురేష్, ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“మెంథా తుపాను” నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలందరు చాలా అప్రమత్తంగా ఉండాలి….* *బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది.

*”మెంథా తుపాను” నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలందరు చాలా అప్రమత్తంగా ఉండాలి….* *బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది. ఈరోజు నుంచి మూడు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు,అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది, ముఖ్యంగా మన ఉదయగిరి వాసులు అప్రమత్తంగా ఉండండి..* *వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను…* *ముఖ్యంగా మన నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను…. ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు..

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో ఈ రోజే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ

మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తుపాను కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏలూరు జిల్లాలో తుపాను ముందస్తు చర్యలను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కీలక విషయాలు వెల్లడించారు. మొంథా తుపాను.. వారికి రూ.3000 సాయం.. చంద్రబాబు ప్రకటన.. తుపాను హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయి లో సేవలందించేందుకు పౌర సరఫరా శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 12 జిల్లాలలో మొంథా తుపాను ప్రభావం అత్యధికంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. భారీ వానలు.. ఏ జిల్లాల్లో ఎన్ని రోజులు సెలవులంటే? ఈ నేపథ్యంలో ఈ 12 జిల్లాల్లో రేపు (మంగళవారం) ఉదయం 9 గంటల నుంచే రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ 12 జిల్లాలలో14,145 రేషన్ షాపులు అందుబాటులో ఉన్నాయని.. వాటి ద్వారా 7 లక్షల మందికి నిత్యావసరాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగితే.. అలాంటి ప్రాంతాల్లో జనరేటర్స్ అందుబాటులో ఉంచామన్న నాదెండ్ల మనోహర్.. వాటికి అవసరమైన డీజిల్, కిరోసిన్ కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. 12 జిల్లాల్లో 626 పెట్రోల్, డీజిల్ ఆయిల్ కంపెనీ అవుట్లెట్లు ఉన్నాయని…పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా ఉండేందుకు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 30,000 టార్పాలిన్లు సైతం అందుబాటులో ఉంచినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తుపాను ఎఫెక్ట్.. మూడ్రోజుల పాటు 43 రైళ్లు రద్దు.. జాబితా ఇదే.. మొంథా తుపాను.. పవన్ కళ్యాణ్ సమీక్ష.. మరోవైపు మొంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలలో తుపాను ప్రభావం ఉంటుందని.. ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. మండలాల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు సహా.. అత్యవసర ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

విశాఖపట్నం

వావ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో సరోజినీకి రెండు స్వర్ణాలు!

గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత – జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన 23 పతకాల విజేతకు నగర ప్రముఖుల అభినందనలు తాటిచెట్లపాలెం, అక్టోబర్ 27: విశాఖపట్నం వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీస్ బేరక్స్‌లో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 30+ మహిళల విభాగంలో పాల్గొన్న దువ్వూరి సరోజినీ అద్భుత ప్రతిభ ప్రదర్శించింది. 100 మీటర్ల పరుగు పందెం, 5 కిలోమీటర్ల నడక పోటీలలో రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని, గుంటూరులో డిసెంబర్ 13, 14 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. కైలాసపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అర్చకులు రాజేశ్వరరావు – జోగులాంబ దంపతుల కుమార్తె సరోజినీ, గత రెండేళ్లలో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిల్లో అద్భుత విజయాలు సాధిస్తూ 13 స్వర్ణ, 6 రజత, 4 కాంస్య పతకాలతో మొత్తం 23 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. సరోజినీ ఇప్పటివరకు నెల్లూరు, గుడివాడ, కేరళలోని ఉడుపి, మహారాష్ట్రలోని ముంబై, రాజస్థాన్‌లోని అల్వార్, అయోధ్య తదితర ప్రదేశాలలో పోటీల్లో పాల్గొని విశాఖ ప్రతిష్టను నిలబెట్టింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ డా. శంక బ్రత బాగ్చి, వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్ చైర్‌పర్సన్ డా. కమల్ బయిద్, వరల్డ్ టీచర్ ట్రస్ట్ డైరెక్టర్ చింతలపాటి సత్యదేవ్, ఇండియా సెక్రటరీ జనరల్ డా. మంగా వరప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ చైర్‌పర్సన్ వంశీ చింతలపాటి, మాజీ ఏడీసీపీ మహమ్మద్ ఖాన్ తదితరులు ఆమెను అభినందించారు. సరోజినీ అంతర్జాతీయ స్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ప్రముఖులు ఆశీర్వదించారు.

ఆంధ్రప్రదేశ్

మొంథా తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే చినరాజప్ప

పున్నమి న్యూస్, పెద్దాపురం 27/10మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు.తుఫాను పరిస్థితులను పర్య వేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.

విశాఖపట్నం

సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను సోమవారం రాత్రి పరిశీలించారు. ఈ పరిశీలనలో తుఫాను కు సంబంధించిన రిపోర్టులను జోన్ వారీగా నిశితంగా పరిశీలించి, ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా నమోదయ్యాయి, నీరు ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో నిలిచి ఉన్నాయి, చెట్లు ఎన్ని విరిగి ఉన్నాయి, ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయబడినవి అనే తదితర అంశాలతో కూడిన రిపోర్టులను పరిశీలించారు. రెండు రోజులు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సహాయక చర్యల కొరకు ప్రజల నుండి ఎక్కువగా ఫిర్యాదులు స్వీకరించేందుకు సిటీ ఆపరేషన్స్ సెంటర్ సిబ్బంది, కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిటీ ఆపరేషన్స్ సెంటర్ నిర్వాహకులకు కమిషనర్ ఆదేశించారు. తుఫాను విపత్తుకు అధికారులు , జోనల్ కమిషనర్లు సిద్ధంగా ఉండాలని , విధులలో ఉన్న వారందరూ తప్పనిసరిగా జాగ్రత్త చర్యల దిశగా రైన్ కోట్లను ఉపయోగించుకోవాలన్నారు.

అమరావతి

మంత్రులు, అధికారులతో రాత్రి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష*

*మొంథా తుఫానుపై ఆందోళన వద్దు…అప్రమత్తంగా ఉందాం* *రేపటి నుంచి పెరగనున్న తుఫాను ప్రభావం….338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం* *తుఫాను ప్రభావంపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం* *రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటు* *ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా అలెర్ట్ చేసే అవకాశం* *మంత్రులు, అధికారులతో రాత్రి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష* *అమరావతి, :* మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 338 మండలాలు, 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే మొంథా తుఫానుపై ఆందోళన వద్దని…అప్రమత్తంగా ఉందామని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు మరోసారి తుఫాను ప్రభావంపై అధికారులతో ఆర్టీజీ సెంటర్ లో సమీక్ష చేశారు. మంత్రులు అనిత, నారా లోకేష్ తో పాటు….రియల్ టైం గవర్నెన్స్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మంగళవారం నుంచి తుఫాను తీవ్రత పెరగనన్న నేపథ్యంలో రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సిఎం సూచించారు. అలాగే ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సిఎం సూచించారు. ఇప్పటి వరకు తుఫాను సన్నద్దతపై ఐవిఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపైనా సీఎం సమీక్ష చేశారు. అధికారులు ఎన్ని రివ్యూలు నిర్వహించారు అనేది కాదు…క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రభావం చూపిందనేది ముఖ్యమని…దీనికి పబ్లిక్ పర్సెప్షన్ ను ప్రాతిపదికగా తీసుకోవాలని సిఎం అన్నారు. తుఫానుపై ప్రభుత్వ సన్నద్దత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83 శాతం సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. అదే విధంగా తుఫానుకు సంబంధించిన జాగ్రత్తలపై మీమీ.. ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయా అని అంశంపై 70 శాతం మంది అవును అన్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై 74 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని పబ్లిక్ పర్సెప్షన్ నివేదికలు చెపుతున్నాయని అధికారులు తెలిపారు. దీన్ని కొనసాగించాలని…ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు…వారి అవసరాలు, ఇబ్బందులు కూడా రియల్ టైంలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సిఎం అన్నారు. ప్రజలను అప్రమత్తం చేసేక్రమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటు చేసినట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో మొట్టమొదటి సారిగా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేశామని…..రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టిజీ సెంటర్ నుంచి నేరుగా ఆయా ప్రాంతాలకు మైక్ ల ద్వారా అప్రమత్తం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 28వ తేదీ రాత్రి నుంచి 29వ తేదీ ఉదయం లోపు తుఫాను తీరం దాటుతుందని తాజా అంచనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ముప్పు తప్పే వరకూ ప్రతీ శాఖ, ప్రతీ విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కుంభవృష్టి కురిసే ప్రాంతాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సిఎం సూచించారు.

విశాఖపట్నం

లంచం తీసుకొంటూ ఎ.సి.బి. కి చిక్కిన భీమిలి మున్సిపల్ కార్పోరేషన్ జోన్ – 1 ఉద్యోగులు

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* లంచం తీసుకొంటూ ఎ.సి.బి. కి చిక్కిన భీమిలి మున్సిపల్ కార్పోరేషన్ జోన్ – 1 ఉద్యోగులు విశాఖపట్నం జిల్లా తగరపువలస గ్రామానికి చెందిన పిన్నింటి దుర్గారావు, అతని తాత గారి పేరుమీద మునిసిపల్ రికార్డులలో వున్న ఇంటి పన్ను అసెస్ మెంట్ ను మార్చి, దాని స్థానంలో అతని భార్య మరియు మరదలు పేరును చేర్చవలసినదిగా కోరుచూ, అన్ని ఆధారాలతో, భీమిలి మునిసిపల్ కార్పోరేషన్, జోన్-1 కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా, ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి, వారి పేర్లమీద ఇంటి పన్ను అసెస్ మెంట్ ను మార్చడానికి గాను గాను, అదే కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్ పెక్టర్ గా పనిచేయుచున్న ముగడ రాజు మరియు బొగ్గు రోడ్డు – 2 వార్డు సచివాలయంలో టాక్స్ కలెక్టర్ మరియు వార్డ్ అడ్మిన్ సెక్రటరి గా పనిచేయుచున్న ఎర్నింటి స్వామి నాయుడులు, అతని వద్దనుండి రూ.60,000/-లు లంచంగా డిమాండ్ చేసినారు. సదరు దుర్గారావు అంత ఇచ్చుకోలేనని అనగా, అయితే రూ. 50,000/- లు అయినా ఇవ్వమన్నారు. అయితే సదరు దుర్గారావుకు ఆ లంచం డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టం లేక, ప్రస్తుతం తన వద్ద అన్ని డబ్బులు లేవని అనగా, అయితే ప్రస్తుతం రూ.30,000/- ఇవ్వు, మిగిలిన రూ. 20,000/- పని అయిపోయిన తరువాత ఇద్దువుగాని అని అన్నారు. అయితే సదరు దుర్గారావుకు ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టంలేక సదరు ఇద్దరు అధికారులపై తగుచర్య తీసుకోవలసినదిగా కోరుచూ విశాఖపట్నం ఎ.సి.బి అధికారులకు రిపోర్టు ఇవ్వగా, వారు ఆ రిపోర్టు ను వారి ఆఫీసు క్రైం. నెం. 8/RCT-RJY/2025, అవినీతి నిరోధక (సవరణ) చట్టం 2018 సెక్షన్ 7 (a) క్రింద కేసు నమోదు చేసి, సదరు అధికారులు ఇద్దరూ ఆ లంచం డబ్బులు రూ.30,000/- లను ఫిర్యాదు దారుని వద్దనుండి ఈ రోజు అనగా తేది. 27.10.2025 నాడు, తీసుకొంటుండగా, వారివురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, అరెస్టు చేసినారు. అరెస్టు కాబడిన వారివురిని రేపు అనగా మంగళవారం నాడు విశాఖపట్నం లోని ఎ.సి.బి. ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుచున్న అవినీతిని గురించి ఎవరైనా సంభందిత జిల్లా ఎ.సి.బి అధికారులకు కాని లేదా ఎ.సి.బి టోల్ ఫ్రీ నెంబరు 1064 లేదా ఎ.సి.బి మొబైల్ నెం. 94404 40057 కు కాని లేదా ఎ.సి.బి ఈ-మెయిల్ ఐ.డి. నెం. complaints-acb@ap.gov.in కు కానీ తెలియపరచవచ్చు.

అమరావతి

డేటా సెంటర్ సలహా మండలిని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం… చైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్

డేటా సెంటర్ సలహా మండలిని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం… చైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్ *అమరావతి* విశాఖను డేటా సెంటర్ల హబ్‌గా మార్చేందుకు సలహా మండలి ఏర్పాటు 2030 నాటికి 6000 మెగావాట్ల సామర్థ్యమే లక్ష్యంగా నిర్ణయం మంత్రి నారా లోకేశ్ అధ్యక్షతన పనిచేయనున్న అడ్వైజరీ కౌన్సిల్ గూగుల్, సిఫీ వంటి సంస్థల పెట్టుబడులను వేగవంతం చేసేందుకు చర్యలు మైక్రోసాఫ్ట్, ఎన్టీటీ, జియో వంటి దిగ్గజ కంపెనీలకు మండలిలో చోటు ఏఐ యుగంలో విశాఖను దేశానికే డేటా హబ్‌గా మారుస్తామన్న లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌ను, ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్నిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగానికి అవసరమైన డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2030 నాటికి 6,000 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా ‘డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్’ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ మండలికి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గూగుల్ (1 గిగావాట్), సిఫీ ఇన్ఫినిటీ (550 మెగావాట్లు) వంటి దిగ్గజ సంస్థలు ప్రకటించిన భారీ పెట్టుబడులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయడమే ఈ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా విశాఖలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రపంచ పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సలహా మండలి… విద్యుత్, పునరుత్పాదక ఇంధన అనుసంధానం, హై-స్పీడ్ ఫైబర్ కనెక్టివిటీ, ప్రత్యేక డేటా సెంటర్ పార్కులు, అనుమతుల సరళీకరణ, రియల్ ఎస్టేట్ నిబంధనలు, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయనుంది. ‘ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ 4.0’కు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించి, ఒప్పందాలు కుదిరిన నాటి నుంచి నిర్మాణం, కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు వేగంగా పనులు జరిగేలా ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మండలిలో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు స్థానం కల్పించారు. క్లౌడ్, ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ అజూర్, గ్లోబల్ ఆపరేషన్స్‌లో ఎన్టీటీ, ఎస్టీ టెలీమీడియా, ల్యాండ్ అడ్వైజరీ కోసం కుష్‌మ్యాన్ అండ్ వేక్‌ఫీల్డ్, జేఎల్‌ఎల్, కనెక్టివిటీ కోసం జియో ప్లాట్‌ఫామ్స్, పవర్, కూలింగ్ కోసం ష్నైడర్ ఎలక్ట్రిక్ వంటి సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రం నుంచి పై డేటా సెంటర్స్ ప్రతినిధికి కూడా చోటు కల్పించారు. వీరితో పాటు నాస్కామ్, డీఎస్‌సీఐ, ఐఈఈఎంఏ వంటి పారిశ్రామిక సంఘాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఐఐఎం విశాఖపట్నం, ఐఐటీ తిరుపతి వంటి విద్యాసంస్థల ప్రతినిధులు కూడా ఈ కౌన్సిల్‌లో భాగస్వాములు కానున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, “ఏఐ యుగంలో డేటా అనేది కొత్త ఆయిల్ లాంటిది. డేటా సెంటర్లే కొత్త రిఫైనరీలు. ఇప్పటికే గూగుల్, సిఫీ వంటి సంస్థలు విశాఖలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఈ అడ్వైజరీ కౌన్సిల్ మార్గదర్శకాలతో విశాఖను దేశంలోనే డేటా సెంటర్ల రాజధానిగా తీర్చిదిద్దుతాం” అని ధీమా వ్యక్తం చేశారు. సరైన విధానాలు, అనుమతులతో ఏఐ ఆధారిత మౌలిక వసతుల కల్పనలో విశాఖను అత్యంత పోటీతత్వమున్న నగరంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.

విశాఖపట్నం

ఏయూలో ఐదు రోజుల వర్క్ షాప్ ప్రారంభం*

*క్వాంటం కంప్యూటింగ్ రంగంలో నిపుణులను తయారు చేయాలి* – *ఏయూలో ఐదు రోజుల వర్క్ షాప్ ప్రారంభం* విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి : *శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న క్వాంటం కంప్యూటింగ్ లో నిపుణులను తయారు చేయాలని క్విన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మహేష్ రావు వల్లూరి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో మ్యాథమెటిక్స్ విభాగం సమావేశ మందిరంలో ఇంర్వహించిన ఈ కార్యక్రమంలో ఐదు రోజుల వర్క్ షాప్ క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్ అండ్ క్రిప్టోగ్రఫీ కి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా* ఆయన మాట్లాడుతూ కొద్దికాలంలోనే క్వాంటం కంప్యూటింగ్ ఎంతగానో అభివృద్ధి సాధిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. విభిన్న శాస్త్రాలకు సంబంధించిన అంశాలకు క్వాంటం కంప్యూటర్ ఉపయుప్తంగా నిలుస్తుందని చెప్పారు. దీని ప్రాముఖ్యతను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం ముందడుగు వేసి వర్క్ షాప్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం వంటివి నిర్వహించడం మంచి పరిణామం అని చెప్పారు. *ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ లక్ష్యాలతో నిపుణులను ఈ రంగంలో తీర్చిదిద్దే విధంగా విభిన్న కార్యక్రమాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం చేపడుతోందని* చెప్పారు. ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో క్వాంటం కంప్యూటింగ్ పై ప్రత్యేక ఇంజనీరింగ్ కోర్సును సైతం ప్రారంభించామని అన్నారు. పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ రంగంలో ప్రాజెక్టులు చేయాలని సూచించారు. వీక్లీ వర్కింగ్ గ్రూప్ ని తయారుచేసుకొని ప్రతి వారం ఒక నిర్దిష్టమైన అంశంపై ప్రసంగించడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. తద్వారా విద్యార్థులు ఆయా అంశాలలో పూర్తిస్థాయిలో సామర్ధ్యాలను అందిపుచ్చుకోవడం సాధ్యపడుతుందని అన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు మాట్లాడుతూ సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడం నేడు ఎంతో కీలకంగా మారుతోందని అన్నారు. భద్రత, వేగం అనే అంశాలు ఆధారంగా ప్రపంచం పయనిస్తోందని తెలిపారు. టెక్నాలజీకి మానవ మేధస్సు దోహదపడాలని సూచించారు. అప్పుడే దేశ ప్రగతి సాధ్యపడుతుందని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. వర్క్ షాప్ కన్వీనర్ ఆచార్య పి. అనురాధ కామేశ్వరి మాట్లాడుతూ రూసా సహకారంతో ఈ రంగంలో విస్తృత అవగాహన కల్పిస్తూ నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఐదు రోజులపాటు వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వర్తమాన అంశాలను ఆధారంగా చేసుకుని విస్తృత అవగాహన, నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని తెలిపారు. డి.బి.ఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ఆచార్యులు పియూష్ దువా క్వాంటం కంప్యూటింగ్ కి సంబంధించిన విభిన్న అంశాలను వివరించారు. *కార్యక్రమంలో వర్క్ షాప్ సహా కన్వీనర్లు ఆచార్య పి.డి. ఎన్ శ్రీనివాసు, ఆచార్య జి. నానాజీరావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులను సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.