Friday, 10 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తుఫాన్ ప్రభావంతో ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని రాజోలు తహశీల్దార్ భాస్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయంలో 9676273589 నంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన మంగళవారం వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జనగణన ప్రీ-టెస్ట్‌కు రంగం సిద్ధం – నవంబర్‌ 10 నుంచి 30 వరకు గృహ లెక్కింపు ప్రారంభం

దేశవ్యాప్తంగా జనగణన ప్రీ-టెస్ట్‌కు సంబంధించి భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌కు సమాంతరంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా రాష్ట్ర గెజిట్‌ విడుదల చేసింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో నవంబర్‌ 10 నుంచి 30 వరకు గృహాల లెక్కింపు, గృహ గణన కార్యక్రమం జరగనుంది. అదనంగా నవంబర్‌ 1 నుంచి 7 వరకు స్వీయ లెక్కింపు (Self Enumeration) సౌకర్యం కూడా కల్పించారు. ఈ ప్రీ-టెస్ట్‌ ద్వారా రాబోయే జనగణన ప్రక్రియకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా ఏర్పాట్లు పరిశీలించనున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అల్లకల్లోలంగా సముద్రం… కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక.. హై అలర్ట్ లో పోర్టులు

తీరం దిశగా దూసుకొస్తున్న మొంథా తుపాను తీరం దాటే సమయంలో 110 కి.మీ వేగంతో వీయనున్న గాలులు పోర్టులకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఉత్తర – వాయవ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన అలలు తీరంపై విరుచుకు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తుపాను తీవ్రత పెరుగుతుండటంతో ఏపీలోని పోర్టులను విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ చేసింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరో ప్రమాద హెచ్చరికను; మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.

అనకాపల్లి

చోడవరంలో రోడ్ల పునర్నిర్మాణం కొరకు ఆమ్ ఆద్మీ పార్టీ నిరవధిక రీలే నిరాహార దీక్ష

ఈ కార్యక్రమాన్ని దండలు వేసి దీక్షను ప్రారంభించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు కామిరెడ్డి వెంకటరావు చోడవరం నియోజకవర్గంలోని ప్రజల ప్రాణాలను తీస్తున్న అద్వాన్న రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక రీలే నిరాహార దీక్ష చోడవరం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ప్రారంభమైంది. వెంకన్నపాలెం – చోడవరం – మాడుగుల – పాడేరు – రోలుగుంట మార్గం లో ఉన్న రహదారులు పూర్తిగా ధ్వంసమై రోడ్లపై చెరువులు ఏర్పడినంత స్థాయికి చేరుకున్నాయి. ఈ రహదారుల కారణంగా రోజూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మరెందరో కాళ్లు , చేతులు విరగకొట్టుకుంటూ శాశ్వతంగా వికలాంగులుగా మారుతున్నారు. ఆసుపత్రులకు వెళ్లే అంబులెన్స్‌లు కూడా ఈ గుంతల రోడ్లలో వెళ్ళలేక ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గ్రామాల మధ్య రవాణా స్తంభించిపోవడంతో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిరవధిక రీలే నిరాహార దీక్షను అనకాపల్లి జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు చోడవరం ఆప్ ఇన్‌చార్జ్ వేగి మహాలక్ష్మి నాయుడు నిర్వహించగా, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రాధ్యక్షులు శీర రమేష్ కుమార్ , మార్గదర్శకత్వంలో జరుపబడుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ షీతల్ మదన్ , రాష్ట్ర సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పావన్ కుమార్ , కాంగ్రెస్ మడుగుల ఇన్‌చార్జ్ పదాల కొండలరావు , ఎమ్ నారాయణ రావు, అప్పలభక్తుల త్రినాథరావు తదితరులు చోడవరం మరియు పరిసర ప్రాంతాల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే రహదారుల పునర్నిర్మాణం చేపట్టి, ప్రజల జీవన భద్రతకు బాధ్యత వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ప్రత్యేక ధన్యవాదములు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కమిరెడ్డి వెంకటరావు కి, నిరాహార దీక్షలో పాల్గొన్న వారిని మాలలతో అలంకరించి, ఈ ఉద్యమ విజయానికి తన ఆశీస్సులు అందించినందుకు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు నిరంతర పోరాటం కొనసాగిస్తుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.

ఎన్ టి ఆర్ జిల్లా

“గ్రామర్ రీబూట్” వర్క్‌షాప్‌తో భాషా నైపుణ్యాల పెంపు – శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం

పత్రికా నివేదిక విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలోని ఆంగ్ల విభాగం “గ్రామర్ రీబూట్” అనే వర్క్‌షాప్‌ను నిర్వహించింది: మీ భాషా నైపుణ్యాలను మెరుగుపరచండి 27.10.2025న ప్రభావవంతమైన కమ్యూనికేషన్ కోసం భాషా నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్‌గా గుంటూరు జిల్లా నంబూరులోని VVITU ప్రొఫెసర్ డాక్టర్ వి. పావెల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమం పాల్గొనేవారి వ్యాకరణ నైపుణ్యాలను రిఫ్రెష్ చేయడం, వారు స్పష్టత మరియు నమ్మకంతో తమను తాము వ్యక్తీకరించుకునేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సెషన్ ఇంటరాక్టివ్ సెషన్, పాల్గొనేవారు ఆచరణాత్మక కార్యకలాపాలు మరియు చర్చలలో పాల్గొన్నారు, వ్యాకరణ నియమాలు మరియు అనువర్తనాలను అన్వేషించారు. రిసోర్స్ పర్సన్ వ్యక్తిగతీకరించిన అభిప్రాయాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని అందించారు, నిర్దిష్ట భాషా సవాళ్లను పరిష్కరించారు. హాజరైనవారు వ్యాకరణ వ్యాయామాలను అభ్యసించారు, శబ్దవ్యుత్పత్తి శాస్త్రం వంటి కీలక భావనలపై వారి అవగాహనను బలోపేతం చేశారు. గ్రామర్ రీబూట్ వర్క్‌షాప్ ఆకర్షణీయంగా మరియు సమాచారంగా ఉంది. ఇది వ్యక్తుల భాషా నైపుణ్యాలను శక్తివంతం చేయడానికి, వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధిని పెంచడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ అధ్యక్షత వహించారు మరియు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఓడీ డాక్టర్ కె. శైలజా రాణి మరియు ఇతర విభాగ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భారీ వర్షాల కారణంగా విద్యుత్ శాఖతో

మొంథా” తుఫాను నేపథ్యంలో విద్యుత్‌ సరఫరా నిరంతరంగా కొనసాగి, ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యల భాగంగా మనుబోలు apspdcl AEఅనిల్ కుమార్ సార్ గారు వారి సిబ్బంది మరియు కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకునీ సెక్షన్ ఆఫీసులో సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసినారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొoథా తుఫాన్ బీభత్సం: అప్పనపల్లిలో సర్పంచ్ గెడ్డం మంగలక్ష్మి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలానికి చెందిన అప్పనపల్లి గ్రామంలో మొoథా తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి నుండి ప్రారంభమైన గాలివానలు, వర్షాలు మంగళవారం ఉదయం వరకు కొనసాగి గ్రామమంతా ఆందోళనకు గురిచేశాయి. తుఫాన్ ప్రభావంతో రోడ్ల పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగి, ప్రధాన రహదారులపై అప్పనపల్లి మెయిన్ రోడ్డుపై అనేక చెట్లు రోడ్డుమీద కూలి, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ గెడ్డం మంగలక్ష్మి వెంకటేశ్వరరావు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆమె ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ యువత రోడ్లపై పడిన చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి వీఆర్వో అన్నపూర్ణ రావు, సిబ్బంది శ్రీనివాసరావు , సెక్రటరీ వెంకటరమణారావు, వంటి వారు స్థానికుల సహకారంతో రహదారుల్ని శుభ్రం చేసే పనిలో కృషి చేస్తున్నారు. ఇక ట్రాక్టర్ డ్రైవర్ తాడి నాగరాజు వర్షపు గాలులు, లెక్క చేయకుండా ట్రాక్టర్ ద్వారా రహదారులపై పడిన చెట్లను తొలగిస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. రాత్రంతా కొనసాగిన గాలివాన కారణంగా గ్రామంలోని విద్యుత్ సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మెయిన్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పక్కన పెద్ద చెట్లు కూలి విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఏర్పడింది. సర్పంచ్ గెడ్డం మంగలక్ష్మి వెంకటేశ్వరరావు తక్షణమే అక్కడికి చేరుకుని గ్రామ ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కరెంటు సరఫరా నిలిపివేయాలని ఆదేశించి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. గ్రామ పంచాయతీ బృందం ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తూ, నష్టపరిస్థితులను జిల్లా పరిపాలనకు తెలియజేసింది. తుఫాన్ తీవ్రత తగ్గకముందే గ్రామంలో సహాయక చర్యలు చేపట్టడం స్థానికులు అభినందిస్తున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో అప్పనపల్లి గ్రామం సహా మామిడి కుదురు మండలం మొత్తానికి నష్టం సంభవించింది. పంటలు, కొబ్బరి తోటలు, విద్యుత్ సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ గ్రామ సర్పంచ్, పంచాయతీ సిబ్బంది, స్థానికులు కలిసి చురుకైన చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదాలు తలెత్తకుండా నిరోధించగలిగారు.

ఖమ్మం

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పై అధికారుల ….నిర్లక్ష్యం

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పై అధికారుల నిర్లక్ష్యం…. – పట్టించుకోని ఆహార భద్రత అధికారులు… *జిల్లాలో ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మండల స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని పర్మిషన్లు ఉన్నాయా లేవా❓* *పుట్టగొడుగుల్ల పుట్టుకొస్తున్న కొత్త కొత్త ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు* *ఫాస్ట్ ఫుడ్ యాజమాన్యులపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారులు కరువయ్యారు* *వీరిపైన అధికారుల చర్యలు ఉంటాయా ఉండవా అనేది వేచి చూడాలి* పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా అక్టోబర్ 29 ఖమ్మం జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల కేంద్రంలో ఉన్న పాస్ట్ ఫుడ్ మరియు టిఫిన్ సెంటర్ల పై అధికారుల నిఘా కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. పలురకాల మాంసాహార ఐటమ్స్‌తో ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నాయి. ఇష్టానుసారంగా నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయిస్తుంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పలువురు మండిపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాల బిజినెస్ ఊపందుకుంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అనుభవం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనె, కల్తీ ఆహారాన్ని విక్రయస్తూ ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆహార పదార్థాల విక్రయించే హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు దుకాణాలకు, ఆహార భద్రత అధికారుల నుంచి పలు అనుమతులు పొందాలి. అయితే ఈ అనుమతులకు విరుద్ధంగా కొందరు ఇష్టారాజ్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని సంపాదనే ధ్యేయంగా నాణ్యతలేని పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఈ ఫాస్ట్ ఫడ్ సెంటర్ల పై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వెలువెత్తు తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఓ…డ్వాక్రా మహిళ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకో!

డ్వాక్రా మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మనా డబ్బులు మనా లెక్కలు’ అనే ఒక కొత్త AI ఆధారిత యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, దాని ద్వారా తమ బ్యాంకు ఖాతా వివరాలను సులభంగా చూసుకోవచ్చు, ఏవైనా తేడాలుంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు, అలాగే రుణ వాయిదాలను కూడా సులభంగా చెల్లించవచ్చు. యాప్ పేరు: ‘మన డబ్బులు మన లెక్కలు’ యాప్ ఉపయోగం: బ్యాంకు ఖాతా వివరాలను ఫోన్‌లోనే చూసుకోవడం. ఏవైనా తేడాలుంటే తక్షణమే ఫిర్యాదు చేయడం. రుణ వాయిదాలను ఇంట్లో నుంచే సులభంగా చెల్లించడం. ఆర్థిక లావాదేవీలలో అక్రమాలను అరికట్టడం. ఏపీలో డ్వాక్రా మహిళల కష్టాలకు చెక్ పడింది. స్వయం సహాయక సంఘాలకు పారదర్శక సేవలు అందించేందుకు ప్రభుత్వం కొత్త యాప్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే “మన డబ్బులు.. మన లెక్కలు”, “స్త్రీనిధి” ద్వారా డీఆర్డీఏ- వెలుగు శాఖల అధికారులు వివరాలు సేకరించారు. తాజాగా “మొబైల్‌ బుక్‌ కీపింగ్‌.2″ను తీసుకొచ్చారు. వీవోఏలు క్షేత్రస్థాయిలో సభ్యుల ఇళ్లకు వెళ్లి, అక్కడే జీపీఎస్‌ ఆన్‌ చేసి, ఫొటోలు, ఇతర వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ కొత్త యాప్‌ల ద్వారా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. యాప్‌తో, వీవోఏలు (వాలంటీర్లు) నేరుగా సభ్యుల ఇళ్లకు వెళ్తారు. అక్కడ, సంఘం సభ్యుల వివరాలను, వారి ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరిస్తారు. డ్వాక్రా సంఘాల పనితీరును మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. మన డబ్బులు.. మన లెక్కలు కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, సీఐఎఫ్, సీడ్ క్యాపిటల్ వంటి పథకాల కింద మహిళలకు ఇచ్చే రుణాలు నేరుగా వారికే చేరేలా చూడటం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ యాప్ ద్వారా సభ్యులు తమ ఐడీ నంబర్‌తో లాగిన్ అయి, తమ పొదుపు, తీసుకున్న రుణాలు, చెల్లింపులు, ఏ పథకాల కింద రుణాలు పొందారు, ఎన్ని వాయిదాలు కట్టారు వంటి వివరాలన్నీ సులభంగా తెలుసుకోవచ్చు. ఈ మేరకు లావాదేవీల్లో అవకతవకలను అరికట్టడానికి ఈ ఆన్‌లైన్ విధానం ఉపయోగపడుతుంది. యాప్‌లో వ్యక్తిగత, సంఘం వివరాలు పూర్తిగా కనిపిస్తాయి. ఇప్పటివరకు చేసిన పొదుపు, తీసుకున్న రుణం, చెల్లింపులు, ఏఏ పథకాల నుంచి పొందారు, ఎన్ని వాయిదాలు కట్టారో సభ్యులు తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు లావాదేవీల్లో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకట్ట వేయడానికి ఈ ఆన్‌లైన్ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అందుకే ఈ కొత్త యాప్‌లను తీసుకొచ్చారు. ప్రజలు ఈ యాప్‌లపై అవగాహన పెంచుకుని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్ ద్వారా ‘ఉమెన్ పవర్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఉపయోగించడం చాలా సులభం. ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్ నుంచి ‘ఉమెన్ పవర్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత డీఆర్డీఏ అధికారులు ఇచ్చే లాగిన్ ఐడీతో లాగిన్ అవ్వాలి. ప్రతి సభ్యునికి 20 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఆ సంఖ్య, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయితే, తమ వివరాలన్నీ చూసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మహిళా సంఘాల కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని భావిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ఈ యాప్‌ల ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.