Friday, 10 April 2026

Blog

విశాఖపట్నం

తుఫాన్ పరిస్థితుల్లో ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, అక్టోబర్ 28: ‘మెంథా’ తుఫాన్ తీవ్రరూపం దాల్చబోతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయని హెచ్చరిస్తూ, తీరప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం లేని బయటకు వెళ్లడాన్ని నివారించాలని సూచించారు. “పరిస్థితి చేయజారిపోకముందే స్థానిక నాయకులు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని సిద్ధంగా ఉండాలి. ప్రజల భద్రతే మన ప్రథమ కర్తవ్యం” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తీరప్రాంతం మరియు కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ప్రభుత్వం సురక్షిత వసతిగృహాలకు తరలించినట్లు తెలిపారు. ఈ సహాయక చర్యల్లో టీడీపీ మరియు కూటమి కార్యకర్తలు ముందుండి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. “రాబోయే 48 గంటలపాటు కూడా ఇదే క్రమశిక్షణ, నిబద్ధత కొనసాగించాలి. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తోడుగా, అధికారులకు అందుబాటులో ఉండాలి,” అని పల్లా సూచించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా విభాగాల పనితీరును సమీక్షిస్తూ ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గత రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్‌లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, ఫీల్డ్ స్థాయి సమస్యలను రియల్ టైమ్‌లో పరిష్కరిస్తున్నారని, ఆయన కృషి, నిబద్ధత అభినందనీయమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇక వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో పాత తుఫాన్ల (హుద్‌హుద్, టిట్లీ) చిత్రాలు, వీడియోలు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాన్ని రేకెత్తించడం బాధాకరమని తీవ్రంగా ఖండించారు. “సహాయం చేయలేకపోతే కనీసం ప్రజల్లో భయం సృష్టించకండి. సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వాడండి. మనమందరం ఐక్యంగా ఈ సవాళ్లను ఎదుర్కొని నిలబడతాం,” అని పల్లా స్పష్టం చేశారు. “చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ పర్యవేక్షణ, ఆంధ్రప్రజల ధైర్యం కలిసి ఈ విపత్తును కూడా జయించగలవు,” అని ధీమా వ్యక్తం చేశారు.

విజయనగరం 

మొంథా తుఫాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బెల్లాన చంద్రశేఖర్

చీపురుపల్లి, అక్టోబర్ 28: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర తుపానుగా బలపడిన మొంథా తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) విజ్ఞప్తి చేశారు. మొంథా తుపాన్ ప్రస్తుతం మచిలీపట్నం నుండి 190 కిలోమీటర్లు, కాకినాడ నుండి 270 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నం నుండి 340 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ తుపాన్ ఈ రోజు రాత్రి కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరప్రాంతాలు మరియు సమీప జిల్లాల్లో గాలుల వేగం గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉండటంతో పాటు, శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు విస్తార ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతు సోదరులు, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని బెల్లాన చంద్రశేఖర్ గారు సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వం, సిబ్బంది పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

అన్నప్రసాద వితరణ చేసిన చిరువ్యాపారి – మన ఊరు.. మన బాధ్యతలో మేము సైతం (శ్రీకాకుళం – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

మన ఊరు.. మన బాధ్యతలో భాగముగా, మెంథా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో, నగరంలో అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశ్యంతో, కోరాడవారి వీధికి చెందిన చిరువ్యాపారి కోరాడ.రమణ, కుమారి దంపతులు ముందుకువచ్చి నగరంలో పలు చోట్ల, నిరుపేదలకు ఆహారాన్నందించారు. స్థానిక గొంటి వీధిలో నిరాశ్రయులకు ఆహారాన్నందించి మాట్లాడుతూ మన ఊరు.. మన బాధ్యతను సేవకులు ఉర్లం.శివతేజ వివరించారని, ఆయన పిలుపుమేరకు, వారి సోదరులు కుప్పిలి.ఉపాధ్యాయులు ఉర్లం.రవితేజ సహకారంతో ఇంతటి వర్షంలోనూ, అన్నప్రసాదవితరణ చేపట్టామని, ఇక్కడ ఉండే పేదలకు నిరంతరం సేవ చేస్తున్న కథనాలను చూస్తున్నామని, తుఫాన్ ప్రభావంతో ఆహారం దొరక ఇబ్బందిపడతారనే విషయాన్ని గమనించి మా వంతు సహాయం అందించామని తెలిపారు. అన్నవితరణలో నిస్సహాయులు, నిరాశ్రయులు, సహాయకులు ఉర్లం.రవితేజ్, నేటి దాతలు కోరాడ రమణ, దంపతులు, కుమారుడి, కుమార్తె, పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ని దర్శించుకున్న అన్మోల్ అంబానీ

శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి సోమవారం అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీ కుటుంబ సమేతంగా విచ్చేశారు.వారిని ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు అధికారులు సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం మరియు స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను,చిత్ర పటాన్ని అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్,మెంబర్లు గుర్రప్ప శెట్టి,గోపీనాథ్,ప్రోటోకాల్ AEO మోహన్,ఆలయ పర్యవేక్షకులు నాగ భూషణం,APRO రవి,ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి లో మంగళవారం కుమారస్వామికి ప్రత్యేక పూజలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున్న శ్రీ కుమారస్వామి వారికి మంగళవారం సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల్ ఆధ్వర్యంలో శ్రీ కుమార స్వామి వారికి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించడం జరిగింది.అనంతరం శ్రీ కుమార స్వామి వారిని విభూది మరియు వివిధ రకాల పుష్పాలతో శోభామయంగా అలంకరించి దూప దీప,నైవేద్యాలను సమర్పించారు.భక్తులు విశేషం గా పాల్గొని స్వామి వారిని దర్చించుకున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాన్ తీరం దాటకుండానే విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో వీరుల్లాంటి విద్యుత్ సిబ్బంది సేవలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలంలోని అప్పనపల్లి గ్రామంలో మొంథా తుఫాన్ విపరీతమైన బీభత్సం సృష్టించింది. ప్రబలమైన గాలులతో చెట్లు విరిగి రహదారులపై పడిపోయాయి. ఈ ప్రభావంతో అనేక విద్యుత్ స్తంభాలు కూలిపోయి, తీగలు తెగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యుత్ శాఖ సిబ్బంది ప్రజల విద్యుత్ అందించే సేవలో తమ ప్రాణాలను సైతం సాహసంగా పెట్టారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డోన్ నాగేంద్ర నాయకత్వంలో లైన్మెన్ రాజు, లాజర్, సోమశేఖర్ తదితరులు క్షేత్రస్థాయిలోకి దిగి మరమ్మత్తు పనులు ప్రారంభించారు. తుఫాన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, వర్షం మరియు గాలులను లెక్కచేయకుండా వీరు విద్యుత్ తీగలను సరిచేసి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రజలకు అతి తక్కువ సమయంలో విద్యుత్ అందించే లక్ష్యంతో వీరు అహర్నిశలు శ్రమించారు. వారి సేవలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. “మేమున్నాము, చింతించకండి” అంటూ తుఫాన్ విపత్తులోనూ ప్రజలకు ఆశాకిరణమై నిలిచారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సైక్లోన్ ఎఫెక్ట్ కొబ్బరి చెట్లు మరియు వృక్షాలు రోడ్డు పైకి

మలికిపురం మండలంలో సైక్లోన్ ఎఫెక్ట్ కొబ్బరి చెట్లు మరియు వృక్షాలు రోడ్డుకి అడ్డంగా పడడంతో ఎస్ఐ సురేష్ మరియు వారి సిబ్బంది పరివేక్షణలో ఎలక్ట్రిషన్ తదితరులు పాల్గొని చెట్లు తొలగించడం జరిగింది

తిరుపతి

బుచ్చినాయుడు కండ్రిగ మండలం* *కారణి పంచాయతీ* *ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి పంచాయతీ సెక్రెటరీ శివారెడ్డి*

*బుచ్చినాయుడు కండ్రిగ మండలం* *కారణి పంచాయతీ* *ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి పంచాయతీ సెక్రెటరీ శివారెడ్డి* *మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు* *మొంథా తుఫాన్ వల్ల శ్రీకాళహస్తి – చెన్నై రహదారిలో ప్రవహిస్తున్న కారణి పంచాయతీ చెరువు పరిశీలించిన పంచాయతీ సెక్రెటరీ శివకుమార్ రెడ్డి గారు మరియు స్థానిక నాయకులు* *తూములు వద్ద పూడికను తీసి కట్ట కోతకు గురికాకుండా చూడాలని స్థానిక నాయకులకు కందేరి కార్తీక్ నాయుడు కి తెలియజేశారు* ⛑️మొంథా తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ⛑️ప్రజలు ఇంట్లోనే ఉండాలి ప్రభుత్వ యంత్రాంగం మీతోనే ఉంది ⛑️భయాందోళనలకు గురి కావొదు ⛑️ప్రజలకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా, నిమిషాల్లో స్పందిస్తున్న ఏపీ ప్రభుత్వం ⛑️ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి చెట్లు దగర మరియు కరెంటు పోల్లు, చెరువుల దగ్గరికి కి వెళ్లొద్దు. ⛑️రైతులు పొలాల దగ్గరికి వెళ్లకుండా ఒక రెండు రోజూలు సమన్వయం పాటించండి ⛑️శ్రీ సిటీ కార్మికులు కూడా సరైన జాగ్రత్తలతో ఉండాలని సూచించారు ⛑️ *కారణి పంచాయతీ ప్రజలకు నేనున్నానని భరోసానిస్తున్న టిడిపి మండల యువ నాయకులు కందేరి పద్మ కార్తీక్ నాయుడు* ⛑️ ప్రజలందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని స్థానిక నాయకులు కందేరి పద్మ కార్తీక్ నాయుడు పంచాయతీ ప్రజలకు పిలుపునిచ్చారు

శ్రీకాకుళం 

కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడు బారసాల వేడుకల్లో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు .గొండు శంకర్ స్వాతి దంపతులు.

27-10-2025, ఆదివారం ఢిల్లీలో జరిగే కేంద్ర మంత్రివర్యులు. విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడు బారసాల వేడుకల్లో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు .గొండు శంకర్ స్వాతి దంపతులు. కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ స్వాతి దంపతులు పాల్గొన్నారు. చిన్నారికి ఆశీర్వచనాలు అందిస్తూ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.