Friday, 10 April 2026

Blog

కామారెడ్డి

కొనుగోలు కేంద్రాలోకలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కామారెడ్డి, అక్టోబర్ 28 ( పున్నమి ప్రతినిధి ). : జిల్లా రైతులు వడ్ల ధాన్యంతో కేంద్రాల్లోకి వస్తే ముందుగా అడిగేది ‘బస్తాలజాగ్రత్తలు, తేమ శాతం, ధర’. ఇప్పుడాకా తీరిగానే కొనసాగిన కొనుగోలు ప్రక్రియలో వాతావరణ సూచనలు హఠాత్తుగా కల్లోలం సృష్టించాయి. ఉప్పల్ వాయిలోని ధాన్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్… వ్యవస్థపై పెనుపులి ఉద్యమా న్ని ఆవిష్కరించారు. ప్రతి కేంద్రంలో పనుమానిపిం చకుండా, రైతులను నష్టపోకుండా పదేపదే హెచ్చ రికలు జారీ చేశారు. వర్ష ప్రభావానికి తడిచే వడ్ల బస్తాలకు తక్షణ విశ్రాంతి, టార్పాలిన్ కవర్లు, అవ సరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను అధికారులపై విధించారు.గ్రేడ్ ఎ రకం ధాన్యానికి రూ.2389, సాధారణ రకానికి రూ.2369 ధరలు నిర్ణయించి, మిల్లులకు పంపిన వెంటనే దిగుమతి పూర్తి చేస్తూ రిసిప్ట్, ట్యాబ్ ఎంట్రీ వంటి పారదర్శ కతకు ప్రాముఖ్యత ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా 427 ధాన్య కొనుగోలు కేంద్రాల నిర్వహణలోను, రైతుల అవగాహనకు పర్యవేక్షణలోను కొత్త దిక్సూచి కని పించిపోతుంది.ఈ తనిఖీల్లో పలు శాఖల అధికా రులు, సంఘ కార్యదర్శులు, సెంటర్ ఇంఛార్జీలు కీలక పాత్ర పోషించారు. జిల్లాలో రైతన్నకు నీడ నివ్వాల్సిన ధాన్య కేంద్రాల పరిస్థితిపై పత్రిక కథనానికి ఇది స్పందన. (ఎస్ఐఆర్) క్రియలో నిర్దాక్షిణ్యంగా–పెండింగ్ దరఖాస్తులకు పరిష్కారం చిత్తశుద్ధి కావాలి.రామారెడ్డి తహసిల్దార్ కార్యాల యంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన – భూభారతి రెవెన్యు సదస్సుల్లో పెండింగ్ దరఖాస్తులకు తక్షణ పరిష్కారం యాజమాన్య ధ్యేయంగా ప్రకటించారు. (ఎస్ఐఆర్) ఎన్నికల నిబంధనలు అమలు, బ్లాక్ బిఎల్వో, సూపర్వైజర్లు, పోలింగ్ స్టేషన్ వారీగా రివిజన్ ప్రక్రియను స్వీయ పర్యవేక్షణలో పూర్తి చేయాల్సిందిగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలి వ్వడం విస్తారమైన విశ్వాసానికి నిదర్శనం.2002, 2025 ఓటరు జాబితాల మ్యాపింగ్ లో ఎలాంటి లోపానికి తావు లేకుండా, ఎన్నికల సూత్రాలకు అనుగుణంగా సమగ్ర వ్యవస్థను నిలవరించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ సిబ్బంది,డీఆర్ఓ, తహసిల్దార్ వంటి అధికారుల సమన్వయం–నూతన క్రమశిక్షణకు అధిక వేగాన్ని చూయించాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరి, మినుము పండిస్తున్న వారు తూఫాన్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఏ డీ ఏ

మోoథా తూఫాన్ ప్రభావంతో ఉదయగిరి వవ్యసాయ శాఖ డివిజన్ పరిధిలో వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఏ డీ ఏ చెన్నరెడ్డీ తెలిపారు సీతారామపురం , ఉదయగిరి, వరికుంటపాడు పలు మండలాల్లో 580 ఎకరాల వరి పంట వేశారన్నారు ఈ తూఫాన్ ప్రభావంతో వరి తో పాటు, మినుము కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు కోత దశకు వచ్చిన వరి పంట నీట వాలకుండా గండ్లు కొట్టాలని సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలు సురక్షిoతముగా అత్య అవసరం అయితే తప్ప బయటకు రావద్దు మేకపాటి రాజ గోపాల్ రెడ్డి

మొoథూ తుఫాన్ ప్రభావంతో ఉదయగిరి సమన్యకర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులు ఏటువంటి సహాయక చర్యలు కైనా సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు తుఫాన్ ప్రభావంతో ఎక్కడైనా నష్టం జరిగేతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం తెలపాలని కోరారు తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకూ ప్రజలు బయటికి రావద్దన్ని సూచించారు.

నిర్మల్

వాటోలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నాలుగో రోజు శివాలయంలో మొక్కలు నాటడం ఆలయం చుట్టూ పిచ్చిమొక్కలు తొలగింపూ వాటోలి గ్రామంలో

వాటోలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నాలుగో రోజు శివాలయంలో మొక్కలు నాటడం ఆలయం చుట్టూ పిచ్చిమొక్కలు తొలగింపూ వాటోలి గ్రామంలో గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా, ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ఈరోజుతో విజయవంతంగా నాలుగో రోజును చేరుకుంది. సేవస్ఫూర్తి, పర్యావరణ పరిరక్షణ, యువతలో సామాజిక బాధ్యత పెంపొందించాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ శిబిరంలో వాలంటీర్లు,, అధ్యాపకులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమాలు శివాలయంలో స్వచ్ఛ భారత్, ఆలయ ప్రాంగణంలో చెత్త, మురికి పరిసరాల శుభ్రత, డ్రైనేజీల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సమన్వయంతో నిర్వహించారు. శివాలయం పరిసరాల పర్యావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అనంతరం సుమారు 50 మొక్కలను నాటారు. వీటిలో పూల మొక్కలు, రావిచెట్టు, మర్రిచెట్టు, ఉసిరి చెట్టు తదితర ఔషధ, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలు ఉన్నాయి. ఈ చెట్లు అత్యంత అతీంద్రియ శక్తులను నిలబెట్టే విధంగా ఎంపిక చేయడం విశేషం. కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత విద్యార్థులదేనని, పర్యావరణ పరిరక్షణ మన భవిష్యత్తుతో ముడిపడి ఉందని పలు సూచనలు అందించారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ జి. అర్చన , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆరె రాజు, డాక్టర్ ఓం ప్రకాష్, నిర్మల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధాకర్, డా.గంగాధర్,సుభాష్ , సూర్యసాగర్ సార్, అధ్యాపకులు, కే రఘునాథ్, డాక్టర్ భీమ్రావు, యూ. రవికుమార్, డాక్టర్ పి.జి. రెడ్డి, డాక్టర్ శంకర్, డా, సంతోష్, శ్రావణ్య, హుజమ, తదితరులు పాల్గొని విద్యార్థులకు మానవీయ విలువలను గుర్తు చేశారు. మధ్యాహ్నం అనంతరం నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో డాక్టర్ చంద్రశేఖర్ హెల్త్ & హైజీన్, జీవనశైలి, పోషకాహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం పై ఉపయోగకరమైన సూచనలు ఇచ్చారు. ఆరోగ్యమైన విద్యార్థే ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిస్తాడని ఆయన పేర్కొన్నారు. అలాగే శ్రీ సాయి కుమార్ గారు టాస్క్ జిల్లా మేనేజర్ employability skills గూర్చి విద్యార్థులకు సవివరంగా వివరించారు. ఉద్యోగం సంపాదించడానికి కావలసిన సాఫ్టు స్కిల్స్ వాటికి కావలసిన సామర్థ్యాల సంపాదన గూర్చి వివరించారు. దీనితోపాటు నిఖిల్ చంద్ర రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన కల్పించారు. వ్యక్తిత్వ వికాసం, లక్ష్య సాధన, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ వంటి అంశాలపై ప్రభావవంతమైన ఉపన్యాసం ఇచ్చి వాలంటీర్లలో నూతనోత్సాహాన్ని నింపారు. 📌 గ్రామ ప్రజలు, స్థానిక ప్రతినిధులు, అధ్యాపకులు వాలంటీర్ల సేవాస్ఫూర్తిని అభినందించారు. 📌 పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర మహోన్నతమన్నారూ ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు వారిని సన్మానించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

Cyclone Montha: ‘మొంథా’ పదం అర్థం ఏమిటి?

“పరిమళభరితమైన, అందమైన పుష్పం” మొంథా తుఫాన్ అనే పేరు వెనుక ప్రత్యేక అర్థం ఉంది. ‘మొంథా’ అనే పదం “థాయిలాండ్‌”లో ఆవిర్భవించింది. ఆ భాషలో ‘మొంథా’ అంటే “పరిమళభరితమైన, అందమైన పుష్పం” అని అర్థం. ప్రతి తుఫానుకు ఒక దేశం సూచించిన పేర్లలోంచి వరుసగా పేరు నిర్ణయించబడుతుంది. ఆ క్రమంలో ఈ తుఫాన్‌కు ‘మొంథా’ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర దిశగా దూసుకువస్తూ తీవ్ర ప్రభావం చూపనుంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మోంథా తుఫాన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి

నందిగామ ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు పట్టణ పరిధిలోని ఐదవ సచివాలయం లో గ్రామ సచివాలయ సభ నిర్వహించబడింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి మాట్లాడుతూ, మోంథాతుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. తుఫాన్ వల్ల సంభవించే నష్టాన్ని తగ్గించేం దుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు సచివాలయ మాజీ కౌన్సిలర్ విశ్వనాథపల్లి కృపారావు, రాటకొండ రమణ, దేవరకొండ అక్కరావు, వీసం జగదీష్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖలో మొంథా తుఫాన్‌ బీభత్సం.

విశాఖలో మొంథా తుఫాన్‌ బీభత్సం. రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద భారీగా వరద గురుద్వార దీపక్ పంజాబీ డాబా వద్ద నేలకొరిగిన చెట్టు ఫిషింగ్ హార్బర్ వద్ద ఎగిసిపడుతున్న రాకాసి అలలు *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్‌లో టెన్షన్‌ పెడుతోన్న మొంథా తుఫాన్‌ తీవ్రరూపం దాల్చింది.. విశాఖలో మొంథా తీవ్ర తుఫాన్‌ బీభత్సం కొనసాగుతోంది.. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. జ్ఞానాపురం రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు నీటమునిగింది. ఆరిలోవ రామకృష్ణాపురం ప్రాంతంలో గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పేర్కొన్నారు అదే విధంగా ఫిషింగ్ హార్బర్ వద్ద రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి.. 10 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి రాకాసీ అలలు.. విశాఖ పోర్టుకు ఏడో నెంబర్ ప్రమాదక హెచ్చరికలు జారీచేశారు వాతావరణ శాఖ అధికారులు.. ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు.. మొంథా తుఫాన్ ను తీవ్రంగా పరిగణిస్తున్నారు మత్స్యకారులు.. లంగర్ వేసిన బోట్లు, పడవలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.. తాళ్లతో కట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మత్స్యకారులు.. తుఫాన్‌ తీరం తాకే సమయంలో గంటకు 100-110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. బోట్లు కొట్టుకు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. జెట్టీల లోని సురక్షత ప్రాంతాలకూ బోట్లు తరలింపునకు పడరాని పాట్లు మత్స్యకారులు పడుతున్నారు.ఇక, కాకినాడకు గ్రేట్ డేంజర్‌ సిగ్నల్ జారీ చేశారు అధికారులు.. కాకినాడ పోర్టులో 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్‌ సిగ్నల్ 9 జారీ చేశారు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుకు 8వ నంబర్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి.. మరోవైపు, విశాఖపట్నంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో.. విశాఖలో అన్ని విమానాలు రద్దు చేశారు అధికారులు.. 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించారు.. ఇంకోవైపు.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు.. తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు చేశారు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు కాగా.. ఈస్ట్‌ కోస్ట్‌ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్‌ రైళ్లు రద్దు అయ్యాయి.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు.. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు.. నేడు, రేపు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

అనకాపల్లి

మొంథ తుఫాన్ నేపథ్యంలో దొనకాడ గ్రామ ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించిన పోలీసులు” – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్.,

తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు జిల్లా పోలీసులు విస్తృతమైన చర్యలు చేపట్టారు. గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని డొంకాడ గ్రామం ప్రధాన రహదారి (తారు రోడ్) నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉండగా, వర్షాల కారణంగా రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. ఈ గ్రామంలో సుమారు 35 కుటుంబాలు (మొత్తం 120 మంది) మట్టితో చేసిన గుడిసెలలో నివసిస్తున్నారు. తుఫాన్, వర్షాల కారణంగా గుడిసెలు దెబ్బతినే అవకాశం ఉండటంతో, గొలుగొండ ఎస్సై పి.రామారావు గారు, గ్రామ రెవెన్యూ అధికారి (VRO) మరియు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి, ప్రజలను నచ్చజెప్పి సమీపంలోని కరకా గ్రామ సైక్లోన్ సెంటర్‌కి సురక్షితంగా తరలించారు. ప్రజల భద్రత కోసం సమయానుకూలంగా చర్యలు తీసుకున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ అభినందించారు. తుఫాన్ సమయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, స్థానిక అధికారులు మరియు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ప్రజలను కోరారు.

తిరుపతి

తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలీ…. టిడిపి మాజీ మండలాధ్యక్షులు

తొట్టంబేడు అక్టోబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు, తొట్టంబేడు మండల పరిధిలో గ్రామాల్లోని రైతులు మొంథా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని టిడిపి మండల మాజీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ…గ్రామస్తులకు అతి ముఖ్యమైన సుచనలు కొన్ని పాటించాలన్నారు. పొలాల దగ్గరికి, కరెంటు ట్రాన్స్ఫర్లు దగ్గరకు , చెట్ల కిందకు వెళ్లకుండా ఉండాలని, తొట్టంబేడు మండలంలో తెలుగు గంగ కాలవలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో విద్యార్థినీ , విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయంలోని అధికారులందరూ సమస్యలు ఎక్కడ ఉన్న మండల రెవెన్యూ ఆఫీసర్ వారికి, మండల ప్రజా పరిషత్ అధికారులకు తెలియజేయాలని, గ్రామాలలో ఉండేటటువంటి నాయకులు, మండల నాయకులకు గ్రామాలలో జరిగే సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, టిడిపి మండల మాజీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు గాలి మురళి నాయుడు మండల ప్రజలను కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెలగపాడు – కమ్మవారిపాలెం వద్ద పొంగిన పెద్ద వాగు

కలిగిరి మండల పరిధిలోని వెలగపాడు – కమ్మవారిపాలెం వద్ద పెద్ద వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. సమాచారం అందుకున్న ఎస్సై ఉమా శంకర్ తన సిబ్బందితో వాహనదారులకు ప్రజలను అప్రమత్తం చేశారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొర్లడంతో కలిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు, ప్రజలు తిప్పలు తప్పే పరిస్థితి లేదని తెలుస్తుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.