Friday, 10 April 2026

Blog

రంగారెడ్డి

లక్ష్మారెడ్డిపాలెంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ

పున్నమి అక్టోబర్ 28 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: హయత్ నగర్ పోలీసు సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం రోజున ఎల్బీనగర్ డీసీపీ అనురాధ పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో లక్ష్మారెడ్డిపాలెం మైత్రీకుటీర్ గేటెడ్ కమ్యూనిటీని హయత్నగర్ పోలీసు సిబ్బందితో కలిసి సందర్శించారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు సిబ్బందికి నివాళులు అర్పించారు. కాలనీవాసులతో శాంతి భద్రతల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, సిఐ నాగరాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

ఘనంగా పూలమాలలు..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 226వ వారం బహుజన ఆర్టిసి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్

పున్నమి అక్టోబర్ 28 రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రతి మంగళవారం తెలంగాణ ఆర్టీసీ రాణిగంజ్ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది226వారం పూలమాలము ఇప్పిచ్చినవారు వెంకన్న డ్రైవర్ కుమార్ ఎండి మొయినుద్దీన్ మరియు జీవన్ శ్రామిక్, సుద్దాల సురేష్, గోపి మరియు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాతీయ రహదారిపై కూలిన చెట్టు

రాజోలు మండలం శివకోడు గ్రామంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం రావి చెట్టు నేల కూలింది. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో వాహనాల ఏమీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సర్పంచ్ నక్కా రామారావు, రెవెన్యూ అధికారులు చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలింపు

తుఫాన్ కారణంగా ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజోలు వశిష్ఠ గోదావరి ఒడ్డున మేకలపాలెంలో 60 కుటుంబాలు తాటాకు ఇళ్లలో నివసిస్తున్నాయి. ఇక్కడ ఉన్న 150 మందిని రాజోలు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. మండలంలో 16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలించామని తహసీల్దార్ భాస్కర్ వెల్లడించారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలింపు

తుఫాన్ కారణంగా ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజోలు వశిష్ఠ గోదావరి ఒడ్డున మేకలపాలెంలో 60 కుటుంబాలు తాటాకు ఇళ్లలో నివసిస్తున్నాయి. ఇక్కడ ఉన్న 150 మందిని రాజోలు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. మండలంలో 16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలించామని తహసీల్దార్ భాస్కర్ వెల్లడించారు

విశాఖపట్నం

జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన విశాఖ జిల్లా కలెక్టర్.

జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన విశాఖ జిల్లా కలెక్టర్. విశాఖపట్నం ,అక్టోబర్ పున్నమి ప్రతినిధి : విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎమ్ ఎన్. హరేంద్ర ప్రసాద్ మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి సందర్శించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా తుఫాన్ కు సంబంధించి చేపడుతున్న జాగ్రత్తలు, చర్యలను కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు. జీవీఎంసీ ఉన్నతాధికారులందరూ విభాగాల వారీగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో, ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులపై, చేపట్టవలసిన చర్యలపై జోనల్ కమిషనర్లకు ఫీల్డ్ లో ఉన్న ఉద్యోగులుకు, సిబ్బందికి, సచివాలయ కార్యదర్శులకు సూచనలను అందిస్తూ వస్తున్న సమస్యలపై వారికి పరిష్కార మార్గాలను తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ కు కమిషనర్ వివరించారు. అర్ధరాత్రి ఏ సమయంలో అయినా విశాఖ నగరానికి తుఫాను ప్రభావితం ఉండవచ్చునని అధికారులందరూ నిశితంగా పరిశీలిస్తూ, జోనల్ కంట్రోల్ రూమ్ లను, సచివాలయాల లో ఉద్యోగులు ,అధికారులు, సచివాలయం కార్యదర్శులు సంసిద్ధంగా అప్రమత్తతో ఉండి ప్రజలకు అందించవలసిన సహాయ సహకారాలపై ప్రత్యేక దృష్టి సారించాలని , ఉన్నత అధికారులు నిరంతర పరిశీలన చర్యలు చేపట్టాలని కమిషనర్ కు కలెక్టర్ సూచించారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి కీ రాకపోకలు ప్రయాణికులకు అంతరాయం

ఉదయగిరి ఆనకట్ట ట్యాంక్ బండ్ పూర్తీగా నిండి నీరు పొoగడంతో పట్టణం లోకి వెళ్ళే ప్రధాన రహదారి పై కీ చేరాయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలు నిమిత్తం వచ్చిపోయే వాహనదారులు అవస్థలు పడుతున్నారు వెంటనే ఉన్నత అధికారులు , పోలీసులు చర్యలు చేపట్టారు

తిరుపతి

అంటువ్యాధులకు గురికాకుండా ప్రజల జాగ్రత్త పడాలి…. డాక్టర్ బాలు.

శ్రీకాళహస్తి అక్టోబర్27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలో ప్రజలు అంటువ్యాధులు ప్రబలకుండా అత్యంత జాగ్రత్త వహించాలని శ్రీరామ నగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు సూచించారు. మంగళవారం నాడు స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందితో డాక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …గత వారంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా కలుషితమైన నీరు కలుస్తమైన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలకు డయేరియా, టైఫాయిడ్, మలేరియా వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వేడి చేసిన నీరు తాగాలని, బయట తినుబండారాలు తినకూడదని అలాగే ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వలు చేరకుండా చూసుకోవాలని అలా నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది పట్టణ వాసులు డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడే అవకాశం ఉందని, పది నుంచి 15 రోజుల్లో లోపల ప్రసవం అయ్యే గర్భవతులను శ్రీ కాళహస్తి ఏరియా ఆసుపత్రికి ముందస్తుగా తరలించాలని సిబ్బందికి వైద్యులు బాలు ఈ సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కాంట్రాక్టర్ తుళ్ళూరు తిరుమలరావునుపరామర్శించిన జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ తుళ్ళూరు తిరుమలరావు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగై ఇంటికి చేరిన సందర్భంగా, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మంగళవారం వారి షాపుకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భం గా ఉదయభాను తిరుమలరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరుమలరావు కూడా తనను పరామర్శించడా నికి వచ్చిన ఉదయభాను కు కృతజ్ఞతలు తెలిపారు.

రంగారెడ్డి

విరహత్ అలీ జర్నలిస్టు సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి …, టిడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు..డి రాందాస్

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : ఓ జర్నలిస్ట్ సంఘం నాయకులు విరహత్ అలీ జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణలు చెప్పాలని టిడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి రాందాస్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ యుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర అధ్యక్షులు విరహత్ ఆలీ జర్నలిస్టులను ఉద్దేశించి విష సర్పాలు, కుట్రలు, బుడ్డ సంఘాలు, బుడార్ ఖాన్లు, కాళ్లలోకి దూరడం వంటి అభ్యంతరకర వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. గతంలో కూడా సంఘాలను, జర్నలిస్టులను కించపరిచేలా విరహత్ అలీ ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. విరహత్ అలీ వ్యాఖ్యలను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రంగా రెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ఆయన వైఖరిని జర్నలిస్టు సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నా ఇప్పటివరకు విరహత్ అలీ కానీ ఆ సంఘం పెద్దలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. విరహత్ అలీ తన వ్యాఖ్యలపై జర్నలిస్టులకు భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.