Friday, 10 April 2026

Blog

అన్నమయ్య

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు

జనసేన పార్టీ అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం.రాజంపేట చుట్టుపక్కల మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.రైతులకు, చెయ్యేరు పరివాహక ప్రాంత ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ, అధికారులు సన్నద్ధతో ఉండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆదేశాలిచ్చారు.రేపటి వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ సందర్బంగా పట్టణంలో ఉన్న నిరాశ్రయులకు బిస్కెట్లు పాకెట్లు పంపిణీ చేశారు. రాజంపేట పార్లమెంట్ జనసేన శ్రేణులకు లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ జడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివరామరాజు,షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూబకర్, విశ్రాంత పోలీస్ అధికారులు కడిమెళ్ళ శ్రీనివాసరాజు,పూల లక్ష్మీ నరసయ్య,బీజేపీ నాయకులు వినోద్ వర్మ, లక్ష్మీపతి,పలుకూరి శంకర్, సారా రాజేష్,మౌలా,పెడకాల పివి,పత్తి నారాయణ,గాజుల కులాయప్ప,శంకర్ రాజు,సురేంద్ర తదితరులు.

విశాఖపట్నం

విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై ఏరులై పారుతోన్న వరద నీరు

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై ఏరులై పారుతోన్న వరద నీరు అనంతగిరి సమీపంలో రోడ్డుపైనా ఉధృతంగా వరద నీరు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు. కేకే లైన్‌లో వర్ష బీభత్సం 63వ కిలోమీటర్ వద్ద ట్రాకుపై విరిగిపడిన కొండ చరియలు బొర్రా, చిమిడిపల్లి రైల్వే స్టేషన్‌ మధ్య ట్రాక్‌పై వర్షపు నీరు. ట్రాక్‌ పునరుద్ధరణ చర్యలు చేపట్టిన రైల్వే శాఖ.

అమరావతి

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం*

*అమరావతి పున్నమి ప్రతినిధి* *ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం* *ప్రజలంతా చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలి* *మంత్రులు, ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు* *ప్రతి 2 గంటలకోసారి ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షిస్తున్నారు* *ప్రధానమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం* *మొంథా తుపాను ముందస్తు చర్యలపై మంత్రి నారా లోకేష్* అమరావతి: మొంథా తుపాను వల్ల రాష్ట్రంలో సుమారు 40లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒక్కటే, ఎటువంటి ప్రాణ నష్టం ఉండకూడదు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హోంమంత్రి అనితతో కలిసి మంగళవారం సాయంత్రం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ…. తుపాను సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఒకపక్క డిజాస్టర్ మేనేజర్ మెంట్ మంత్రి అనిత గారు, మరోవైపు ఆర్టీజీఎస్ మంత్రిగా నేను సమన్వయంతో గత 24గంటలుగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. గత ఐదు రోజులుగా మొంథా తుపాను గమనాన్ని పరిశీలిస్తూ తుపాను ప్రభావిత ప్రాంతాలపై దృష్టిసారిస్తున్నాం. ఈ రోజు రాత్రి 11.30 గం.లకు అమలాపురం సమీపంలో తుపాను తీరం దాటబోతోంది. ఈ సందర్భంగా 90 నుంచి 100 కి.మీల వేగంతో అక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. *1906 తాత్కాలిక షెల్టర్ల ఏర్పాటు* ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఈ నెల 23వ తేదీ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. యుఏఈకి వెళ్లే ముందు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత 12 రివ్యూ మీటింగ్ లు, టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా తుపాను పరిస్థితులపై సమీక్ష చేశారు. ప్రధాని నరేంద్రమోడీ గారు సీఎంతో మాట్లాడి ముందస్తు ఏర్పాట్లపై వాకబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రియల్ టైమ్ రిపోర్టులు పంపించింది. రాష్ట్రానికి ఏం కావాలన్నా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి చెప్పారు. తుపాను ప్రభావం, ముంపు తీవ్రత అధికంగా ఉండే 1,328 గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 3,465 గర్భిణీలను తరలించి, వారికి కావాల్సిన పౌష్టికాహారం, నిత్యావసరాలను అందజేస్తున్నాం. 1,906 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటుచేసి పునరావాసానికి అవసరమైన సామగ్రి అంతా పంపించాం. శానిటేషన్ కు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, లైమ్, ఇతర సామగ్రిని ఆయా గ్రామాలకు చేరవేశాం. *ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం* 14,798 పాఠశాలలకు సెలవులు ప్రకటించాం, 364 స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చాం. ఈ నెల 29వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసి, నిషేదాజ్ఞలు విధించాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం 11 ఎన్ డీఆర్ఎఫ్, 12 ఎస్ డీఆర్ ఎఫ్ టీమ్ లు, రిజర్వ్ టీమ్ లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే రావడానికి ఆర్మీ కూడా హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్నారు. 145 ఉడ్ కటింగ్ టీమ్స్ సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే విశాఖపట్నం, తదితర ప్రాంతాల్లో చెట్లు పడిపోయిన చోట వారు సేవలందిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ కు సంబంధించి 325 శిబిరాలు సిద్ధం చేశాం, 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. *సహాయ చర్యలపై ముందస్తు ఏర్పాట్లు* తుపాను తీరం దాటిన తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలు చాలా కీలకం. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి 11,347 స్తంభాలు, 1210 ట్రాన్స్ ఫార్మర్లు రెడీ చేశాం. సైక్లోన్ డైరెక్షన్ ను బట్టి సేవలందించేందుకు 772 రిస్టోరేషన్ టీమ్స్ ను కూడా సిద్ధంగా ఉంచాం. హాస్పటల్స్ కు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎక్కడైన రోడ్లు కోతకు గురైతే వెంటనే పునరుద్ధరించి, ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 7,289 జేసీబీ, క్రేన్స్, వాహనాలు సిద్ధంగా ఉంచాం. తాగునీటికి సంబంధించి వాటర్ ట్యాంకర్లను రెడీ చేశాం. తుపాను సమయంలో ప్రధానంగా ప్రభావితమయ్యేది సీపీ డబ్ల్యూ స్కీమ్స్. తిత్లీ అనుభవాలతో ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో పక్కాగా చర్యలు చేపట్టి 1,037 డీజిల్ జనరేటర్లను ఆయా ప్రాంతాలకు పంపించాం. ఎయిర్ టెల్, జియో, ఇతర సర్వీసు ప్రొవైడర్లు సెల్ ఫోన్ టవర్లకు అవసరమైన డీజి సెట్లు సిద్ధం చేశారు, డీజిల్ కూడా అందుబాటులో ఉంచాం. *రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నాం* తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం కలెక్టర్లందరికీ నిధులు విడుదల చేశాం. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆర్టీజీఎస్ లో రాత్రంతా బసచేసి రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తాం. ముఖ్యమంత్రిగారు ప్రతి 2గంటలకు ఒకసారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొంథా తుపాను తీరందాటాక వెనువెంటనే డ్రోన్స్, లోలెవల్ ఫ్లయింగ్ వెహికల్స్ తో పంట నష్టం, ఇళ్లు, ఆస్తి నష్టంపై రియల్ టైమ్ ట్రాకింగ్ పెట్టి యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. దయచేసి ప్రజలంతా ఇళ్లలోనే ఉండండి. బీచ్ లు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దు. అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించండి. 100 కి.మీ.ల వేగంతో తుపాను వస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతాం. ఈ సమయంలో బీచ్ ల దగ్గరకు వెళ్లడం మంచిది కాదు. ఈ రాత్రి 11.30 గంటల నుంచి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్నిచోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. తీరం దాటాక కూడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. *ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే* ఈ రోజు ఉదయం హోంమంత్రి, నేను ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడాం, వారివద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. గోపాలపురం ఎమ్మెల్యే ఎర్రకాలువ సమస్య ఉందన్నారు. వెంటనే తగు చర్యలు చేపట్టాం. తుపాను తీరం దాటాక క్షేత్రస్థాయిలో గ్రామాలు, పంటపొలాలకు వెళ్లి సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాల్సిందిగా ప్రజాప్రతినిధులకు సూచించాం. ఇప్పుడు మా దృష్టి అంతా ప్రజలను చైతన్యవంతం చేసి, అప్రమత్తం చేయడమే. ప్రభుత్వం ఈ నెల 23నుంచే అప్రమత్తంగా ఉంది. ముఖ్యమంత్రిగారు ఇప్పటికి 12సార్లు సమీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులంతా ఫీల్డ్ లోనే ఉన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో సహా మంత్రులంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులతోపాటు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. దీనిని తేలిగ్గా తీసుకోకుండా సీరియస్ గా పనిచేస్తున్నాం. *ఆర్టీజీఎస్ లో అవేర్ ప్లాట్ ఫాం* తుపాను తీరం దాటిన తర్వాత యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరిస్తాం. తుపాన్లను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి గారికి ఎంతో అనుభవం ఉంది. ఆయన 1996 కోనసీమ తుపాను, హుద్ హుద్, తిత్లీ సమయంలో సమర్థవంతమైన సేవలు అందించారు. గత 5 రోజుల నుంచి మేమంతా ప్రిపరేషన్ లో ఉన్నాం. చెట్లు కూలిపోయినపుడు వాటిని తొలగించే వరకు ఫాలో అప్ మెకానిజం ఏర్పాటుచేశాం. హోం మంత్రి మానిటర్ చేస్తున్నారు. 10 నిమిషాల్లో క్లియర్ చేయాలని సీఎం గారు ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో నేను మాట్లాడాను. అందరూ సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నారు. ప్రమాదం సంభవించకుండా చాలాప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు తొలగించాం. తుపానుకు సంబంధించి పూర్తిస్థాయి డేటా మాకు ఎప్పటికపుడు వస్తోంది. ఆర్టీజీఎస్ లో అవేర్ ప్లాట్ ఫాం ఏర్పాటుచేశాం. రియల్ టైమ్ మానిటర్ చేస్తున్నాం. డిజాస్టర్ మేనేజ్ మెంట్, రిలీఫ్, రిహాబిలిటేషన్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. వాట్సాప్, ఎస్ఎంఎస్, వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. *అన్నిశాఖలూ సర్వసన్నద్ధం* సహాయ చర్యల్లో ఎక్కడా అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. 99 శాతం కచ్చితత్వంతో మాకు సమాచారం అందుతోంది. రియల్ టైం సమాచారాన్ని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రధాని కార్యాలయానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. ప్రధానిమంత్రి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పీఎంఓ వారు కూడా మానిటర్ చేస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులంతా తుపాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ రకాల సోర్స్ ద్వారా డేటా సేకరిస్తున్నాం. శాటిలైట్ మ్యాప్స్ కూడా తీసుకుంటున్నాం. ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యం తేవడమే మా లక్ష్యం. ఇది రాజకీయాలకు సమయం కాదు. ప్రజలకు సేవలందించేందుకు అన్నిశాఖలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. విలేకరుల సమావేశంలో హోం మంత్రి అనిత పాల్గొన్నారు.

కాకినాడ

కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మొoధా తుఫాన్ ప్రభావితం ప్రాంతాలను పర్యటన.

పున్నమి న్యూస్, ఉప్పాడ గ్రామం,28/10 ఈరోజు కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు మొoధా తుఫాన్ ప్రభావితం ప్రాంతాలను పర్యటన చేశారు అందులో భాగంగా ఈరోజు కోనపాపపేట మరియు ఉప్పాడ తీర ప్రాంతాలను సందర్శించారు అంతేకాకుండా అక్కడ నివసిస్తున్న వారిని పలకరించి అదేవిధంగా ఏ సహాయం కావాలన్నా బిజెపి కార్యకర్తలు లేదా అధికారులు వెంటనే సహకారం కోరాలని చెప్పారు అదే విధంగా పునరావస కేంద్రాలని సందర్శించి అక్కడ ఉన్న వారిని అధికారులతో మాట్లాడి అదే విధంగా సముద్రంలో వేటకి వెళ్లి వాళ్ళు ఇల్లుకి వెళ్లి పలకరించి ఎట్టి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని బయటికి రాకుండా ఉండాలని చెప్పసాగారు ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు దాట్ల కృష్ణకర్మ కుండల తదితర కార్యకర్తలు పాల్గొన్నారు సాయికుమార్ యాదవ్ చోడ్డిశెట్టి రమేష్ బాబు, ముసలిగంటి సురేష్, రమణాం సుబ్రహ్మణ్యం, జ్యోతుల రాజేష్ ప్రతాప్ శ్రీహరి, గండి కొండలరావు దాట్ల సూర్యనారాయణ రాజు, గౌతు చిన్న, పైడా రవీంద్ర, సాయి గోపి ఘంటసాల గోవిందు, నాగరాజు, రంబాబు, పంపన శేషగిరి, అడబాల మోహనరావు, గలీదేవరా శేఖర్, పోతుల ప్రభాకర్, అరుణ్, కేటీఆర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

E-పేపర్

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురం గ్రామంలో తుపాను ప్రభావం

గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్ ✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 మొంథా తుపాను ప్రభావం వల్ల తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురం గ్రామంలో పోలీసు వారు మరియు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు End

కాకినాడ

పెద్దాపురం గౌరీ కోనేరులో పర్యటించి, ప్రజలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే చినరాజప్ప

పున్నమి న్యూస్ పెద్దాపురం 28 /10 పెద్దాపురం, గౌరీ కోనేరులో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే చినరాజప్ప, తనయుడు రంగనాథ్. ముంథా తుఫాన్ కారణం అక్కడి వారు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకుని, విద్యుత్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు భరోసా — తుపాను ప్రతిస్పందన చర్యల్లో అధికారులు నిమగ్నం

మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఎన్‌టీఆర్ జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అక్టోబర్28 (రిపబ్లిక్ న్యూస్) జాయింట్ కలెక్టర్ ఎస్‌. ఇలక్కియ, ఆర్‌డీవోలు కె. చైతన్య (విజయవాడ), కె. బాలకృష్ణ (నందిగామ), కె. మాధురి (తిరువూరు)లు పునరావాస కేంద్రాలు, ముప్పు ఉన్న ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఆహారం, వైద్యసదుపాయాలు తదితర ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. మండల, గ్రామ, వార్డు స్థాయి విపత్తు స్పందన బృందాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జేసీ ఇలక్కియ కంచికచర్ల మండలంలోని పరిటాల చెరువును, స్థానిక పునరావాస కేంద్రాన్ని, వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలిం చారు. అలాగే నందిగామ మండలంలో ఐతవరం గ్రామంలోని వరి పొలాలు, రైతు సేవా కేంద్రం, డీవీఆర్ కాలనీ వంటివి పరిశీలించారు. ప్రజలు తుపాను సమయంలో అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలను వినియోగించు కోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.

కడప

వైస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో లింగ నిర్ధారణ చేస్తున్నారని ఫిర్యాదుతో హాస్పిటల్ పై చర్యలు చేపట్టిన జిల్లా వైద్యధికారి

*స్థానిక సి యన్ ఆర్ నర్సింగ్ హోమ్ నందలి నేహా స్కాన్ సెంటర్ ను సీజ్ చేస్తున్న ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా గీత మరియు డెమో భారతి గార్లు, వారు మాట్లాడుతూ ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆర్ యం పి క్లినిక్ నకు స్కానింగ్ మిషన్ తీసుకెళ్లినట్లు విచారణ లో వెళ్ళడైనా కారణంగా చట్టరీత్యా స్కాన్ మిషన్ బయటికి తీసుకెళ్ళకూడదు కావున స్కానింగ్ మిషన్ సీజ్ చేసి జిల్లా కార్యాలయంనకు తీసుకెళ్తున్నామని, ఎవ్వరైనా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం స్కానింగ్ మిషన్ ను రిజిస్టర్డ్ సెంటర్ లో ఉపయోగించాలని అలాగే లింగ నిర్ధారణ చెప్పిన వారిని చట్ట రీత్యా కఠిన శిక్షలు అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెంకటేశ్వర్లు, మరియకుమారి, కన్సల్టెంట్ పాలేశ్వర రావ్ పాల్గొన్నారు.*

కడప

జమ్మలమడుగు డివిజన్ లో అత్యధికంగా127.6 గా ప్రొద్దుటూరులో వర్షపాఠం నమోదు

జసమ్మలమడుగు డివిజన్ నందు నమోదైన వర్షపాతం వాటి వివరాలు జమ్మలమడుగు 44.2 సెం మీ ఎర్రగుంట్ల 41.8 సెం మీ ముద్దనూరు 24 సెం మీ మైలవరం 34.2 సెం మీ పెద్దముడియం 54.2 సెం మీ కొండాపురం 53.6 సెం మీ ప్రొద్దుటూరు 127.6సెం మీ రాజుపాలెం 34.2 సెం మీ చాపాడు 64.8 సెం మీ దువ్వూరు 54.1 సెం మీ అత్యధికంగా ప్రొద్దుటూరు నందు వర్షపాతం నమోదు అయింది.

రంగారెడ్డి

లక్ష్మారెడ్డిపాలెంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ

పున్నమి అక్టోబర్ 28 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: హయత్ నగర్ పోలీసు సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం రోజున ఎల్బీనగర్ డీసీపీ అనురాధ పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో లక్ష్మారెడ్డిపాలెం మైత్రీకుటీర్ గేటెడ్ కమ్యూనిటీని హయత్నగర్ పోలీసు సిబ్బందితో కలిసి సందర్శించారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు సిబ్బందికి నివాళులు అర్పించారు. కాలనీవాసులతో శాంతి భద్రతల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, సిఐ నాగరాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.