Friday, 10 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోనసీమకు తప్పిన మెంథా తుపాన్ ముప్పు

రాజోలు.డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ….ప్రజలను మూడు రోజులు నుండి భయ బ్రాంతులకు గురిచేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ,ఒక పక్క జిల్లా అంతా వర్షం,మరి కాసేపటికి ఎండ ప్రజలను అయోమయం చేసి కొన సీమ ప్రజలను వనికించిఆఖరికి అంతర్వేది సముద్రం తీరాన్ని తాకి బలహీనపడింది .స్వల్పంగా విద్యుత్ స్తంభాలు 20,పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి.కోనసీమ జిల్లా మాకనపాలెంనికి చెందిన గూ వీరవేణి (49) తాటి చెట్టు వి రి మీద పడటంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు

ఆంధ్రప్రదేశ్

బాలాహీనపడిన ముంథా తుఫాన్

కృష్ణాజిల్లా , గుడివాడ అక్టోబర్ 29: ఏపీ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ‘మొంథా’ తుఫాన్ బలహీనపడింది. తీవ్ర తుఫాన్.. తుఫాన్‌గా బలహీనపడింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ మచిలీపట్నంకు 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. తుఫాన్ ప్రభావంతో నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఏపీ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ‘మొంథా’ తుఫాన్ బలహీనపడింది. తీవ్ర తుఫాన్.. తుఫాన్‌గా బలహీనపడింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ మచిలీపట్నంకు 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. తుఫాన్ ప్రభావంతో నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కాకినాడ

నిర్లక్ష్య డ్రైవింగ్ కు 3 నెలలు జైలు శిక్ష విధించిన పెద్దాపురం అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ పెద్దాపురం G. బుల్లెమ్మ .

పున్నమి న్యూస్, రంగంపేట 28/10 2019 వ సంవత్సరంలోఆగస్టు 25 న రంగంపేట కు చెందిన యర్రసాని శ్రీకాంత్ తన మోటార్ సైకిల్ మీద రంగంపేట మండలం గ్రామం కు చెందిన చొల్లంగి వీరబాబు , బొంతు యేసు ను ఎక్కించుకుని అతి వేగం గా అజాగ్రత్తగా తన వాహనం నడిపి, అదుపుచేయలేక కారు, బైక్ ను గుద్దగా బైక్ పై ఉన్న వారిలో చొల్లంగి వీరబాబు మరణించగా బొంతు యేసు కు గాయాలు అయ్యాయి దీని పై రంగంపేట పోలీస్ లు కేసు నమోదు చేసి rash డ్రైవింగ్ చేసి ఒకరి మరణానికి కారణం అయిన యర్రసాని శ్రీకాంత్ పై కేసు నమోదు చెయ్యగా రంగంపేట S.I శివ ప్రసాద్ మంగళవారం సాక్షులను కోర్టు లో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల నాగ లీల రోజా బాధితులు తరుపున తన వాదనను వినపించడం తో పెద్దాపురం అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ పెద్దాపురం G. బుల్లెమ్మ ముద్దాయికి మూడు నెలలు జైలు శిక్ష లేదా 6 వేలు రూపాయలు జరిమానా విధించారు అని S.I శివ ప్రసాద్ తెలిపారు.

తిరుపతి

ముక్కంటి సేవలో సెక్రటరీ ఆఫ్ ది రెవిన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీ హరి జవహర్ లాల్

శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సెక్రటరీ ఆఫ్ ది రెవిన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీ హరి జవహర్ లాల్ బుధవారం దర్శించుకున్నారు. వారికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి సాదరంగా స్వాగతం పలికి,శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాల తో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించగా,కొట్టే సాయి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రం అందజేశారు.ఈ కార్యక్రమంల లో ఏ.ఈ.ఓ మోహన్, ఆలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లాను మొంథా తుఫాన్ వణికిస్తోంది….

ఎన్టీఆర్ జిల్లాను మొంథా తుఫాన్ వణికిస్తోంది…. తుఫాన్ ప్రభావంతో తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి… తిరువూరులో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆర్టీసీ బస్టాండ్ మరియు ప్రధాన రహదారి నీట మునిగాయి… పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి… మొంథా తుఫాన్ దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పత్తి రైతులకు శుభవార్త! కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం

తుఫాన్ ప్రభావం వల్ల రైతులు నష్టపోకూడదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ప్రధాన వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా 30 పత్తి కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం. పత్తికి క్వింటాలుకు ₹8,110 మద్దతు ధర ఖరారు. నమోదు విధానం: రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల (RBKs) ద్వారా తమ వివరాలను CM యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేయాలి. ఆ తర్వాత ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. రైతులు తక్షణమే నమోదు చేసుకుని తమ పత్తిని మద్దతు ధరకు విక్రయించాలి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో అతిభారీ వర్షాలు! మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రత

మొంథా తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం తీవ్రంగా మారింది. అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తూ, ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, NTR, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదవుతాయని అంచనా. అలాగే కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, యానాం ప్రాంతాల్లో కూడా భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బలమైన గాలులు, వడగళ్ల వానలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాన్ కారణంగా తీర ప్రాంతాల్లో సముద్రం ఉద్ధృతంగా ఉండవచ్చని, మత్స్యకారులు సముద్రయాత్రలకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాను నేపథ్యంలో వరి పంట రైతులు తీసుకోవలసిన కీలక జాగ్రత్తలు

మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, వరి పంట రైతులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవసాయ శాఖ సూచించింది. పాలు పోసుకునే దశలో ఉన్న స్వర్ణ, సంపద స్వర్ణ, బి.పి.టి 5204, ఆర్.ఎన్.ఆర్ 15048, కె.యన్.ఎం 1638 వంటి రకాలలో వర్షాలు వలన చేలు పడిపోతే, పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. నీరు ఎక్కువగా నిలిచిన చోట పెద్ద కాలువలు తవ్వి, మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించాలి. పడిపోయిన చేలను అవకాశం ఉన్నంతవరకు పైకి లేపి కట్టుకోవాలి. నిలబడి ఉన్న మరియు పడిపోయిన చేలలో గింజల రంగు మారటం, మాగుడు తెగులు మరియు మానిపండు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ఎకరాకు 200 మిల్లీ లీటర్ల ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలని సూచించారు. ఈ చర్యలు పంటను రక్షించడమే కాకుండా దిగుబడి నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అర్ధరాత్రి తుఫాన్ పునరావాస కేంద్రాలను పరిశీలించిన MRO MPDO సర్పంచ్

రాజోలు మండలంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలను మంగళవారం అర్ధరాత్రి రాజోలు నియోజకవర్గ ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపిడివో కె వెంకటేశ్వరరావు లతో కల్సి పరిశీలించినట్లు రాజోలు తాసీల్ధార్ సిహెచ్ భాస్కర్ తెలిపారు. ఈ పరిశీలనలో తాసీల్ధార్ సీహెచ్ భాస్కర్ తో పాటుగా రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రెహమాన్, విఆర్వోలు కూడా వున్నారు.

E-పేపర్

ఉరుసు మహోత్సవాలకు ఏఎస్పిను ఆహ్వానించిన గురువులయ్య హైదర్

రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నందలూరు నడిబొడ్డున వెలసిన మగ్దమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈనెల 31-10- 2025నా హాజరుకావాలని మగ్దమ్ షావలి దర్గా చిన్న పీఠాధిపతి గురువులయ్య సయ్యద్ హైదర్ హుసేని మరియు దర్గా కమిటీ సభ్యులు అసిస్టెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ రామ్ నాథ్ హెగ్డేను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.