Friday, 10 April 2026

Blog

E-పేపర్

ప్రజలకు ముఖ్య గమనిక అత్యవసరమైతే తప్ప బయటికి రావడానికి ఆలోచించండి ఎడతెడుపు లేకుండా భారీ వర్షాలతో రాష్ట్రాలు అతలాకుతం

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ప్రజలకు ముఖ్య గమనిక నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది కావున అన్ని మండల కేంద్రాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, చెరువులు. దగ్గరికి వెళ్ళకూడదు రైతన్నలు స్తంభాలను,కరెంట్ తీగలను, మరియు ట్రాన్స్ఫార్మర్లను తాకవద్దు డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్లపై వెళ్లేటప్పుడు మ్యాన్ హోల్స్ మరియు డ్రైనేజీలను గమనించండి ఉదృతంగా ప్రవహించే చెరువులు వాగుల వద్దకు వెళ్ళకండి ముఖ్యంగా కూలిపోయి స్థితిలో ఉన్న పాత ఇంట్లో మరియు పాత గోడల పక్కన ఉండకండి వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడడం కానీ కూర్చోవడం కానీ చేయవద్దు పిడుగు పడే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు గమనించగలరు చిన్నపిల్లల్ని వర్షం పడుతున్నప్పుడు ఆరు బయట ఆడుకోవడానికి పంపించొద్దు జాగ్రత్తలు పాటించండి క్షేమంగా ఉండండి

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో మక్కా మసీదు పరిసర ఇళ్లు నీట మునిగే ప్రమాదం – చెరువు నీరు ఇళ్లలోకి చేరింది, ప్రజలు ఆందోళనలో

నందిగామ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా రెండో వార్డులో ఉన్న చెరువు ప్రాంతం ప్రస్తుతం నీటమునిగే పరిస్థితిలో ఉంది. ఈ చెరువులో ఉన్న మక్కా మసీదుతో పాటు దాని పక్కన ఉన్న అనేక ఇళ్లలో కి చెరువు నీరు ప్రవేశిస్తోంది. స్థానిక నివాసితులు చెబుతున్న ట్లుగా, చెరువులోకి వర్షపు నీరు చేరడంతో మసీదు ప్రాంగణం మరియు ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు రోజులలో తుఫాన్, భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, పరిస్థితి మరింత విషమించ వచ్చని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిపిఎం పార్టీ నాయకుడు కరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, “ఈ ప్రాంతం చెరువు ప్రాంతమని ప్రభుత్వానికి తెలుసు. అయినా ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇళ్లపట్టాలు జారీ చేసి ప్రజలు ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు నీరు మసీదులోకీ ఇళ్లలోకీ వచ్చి ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. వెంటనే మున్సిపాలిటీ అధికారులు వచ్చి చెరువు నీటిని పక్కకు మళ్లించే చర్యలు తీసుకోవాలి,” అని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ శాఖ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ తక్షణమే స్పందించి చెరువు నీరు మసీదు మరియు ఇళ్లలోకి రాకుండా తాత్కాలిక గాడి లేదా పంప్ సెట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

E-పేపర్

మొంథా తుఫాన్ లో యాచకులకు అన్నం పొట్లాలు అందజేత

మొంథా తుఫాన్ కారణంగా నందలూరులో దుకాణాలు సముదాయాలు మూత పడడంతో యాచకులకు నిరుపేదలకు పూట గడవని పరిస్థితి నెలకొంది.ఎడతెరపని వర్షం కురవడంతో బిచ్చగాళ్లకు బయటికి వెళ్లలేని పరిస్థితి.ఈ క్రమంలో నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టెంట్ మెంబర్ మరియు బీజేపీ నాయకులు రాచూరి మురళి,హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జిల్లా చైర్మన్, డాక్టర్ వేపకుంట డేవిడ్ కళ్యాణి రాజు,మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు,టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,,విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్,పొంబల శివ నరసింహులు తదితరులు అందరూ కలిసి నందలూరులోని రైల్వేస్టేషన్, అరవపల్లి,మగ్దమ్ షా వల్లీ దర్గా ఎర్రపాపాయపల్లి మరియు గుండ్లూరు శివాలయం పరిసరాలలో యాచుకులకు అన్నం పొట్లాలు అందజేసి తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు గ్రామవాసులు వారి సేవ నిరతిని అభినందించారు.

విశాఖపట్నం

అన్నా కాంటీన్ గేటు గోడపై విరిగిపడ్డ చెట్టు

మెంత తుపాన్ ప్రభావంతో 92వ వార్డు గోపాలపట్నం రైతు బజార్ వద్ద భారీ చెట్టు విరిగి అన్న క్యాంటీన్ గేటు మరియు గోడపై పడింది. ఈ ఘటనతో స్థానికులకు కొంత అసౌకర్యం ఏర్పడింది. సమాచారమందుకున్న ప్రభుత్వ విప్ గణబాబు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి, ట్రీ కటర్స్ సాయంతో చెట్టును తక్షణమే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

E-పేపర్

మొంథా తుఫాన్ లో యాచకులకు అన్నం పొట్లాలు అందజేత

మొంథా తుఫాన్ కారణంగా నందలూరులో దుకాణాలు సముదాయాలు మూత పడడంతో యాచకులకు నిరుపేదలకు పూట గడవని పరిస్థితి నెలకొంది.ఎడతెరపని వర్షం కురవడంతో బిచ్చగాళ్లకు బయటికి వెళ్లలేని పరిస్థితి.ఈ క్రమంలో నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టెంట్ మెంబర్ మరియు బీజేపీ నాయకులు రాచూరి మురళి,హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జిల్లా చైర్మన్, డాక్టర్ వేపకుంట డేవిడ్ కళ్యాణి రాజు,మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు,టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,,విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్,పొంబల శివ నరసింహులు తదితరులు అందరూ కలిసి నందలూరులోని రైల్వేస్టేషన్, అరవపల్లి,మగ్దమ్ షా వల్లీ దర్గా ఎర్రపాపాయపల్లి మరియు గుండ్లూరు శివాలయం పరిసరాలలో యాచుకులకు అన్నం పొట్లాలు అందజేసి తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు గ్రామవాసులు వారి సేవ నిరతిని అభినందించారు.

రంగారెడ్డి

*రావిర్యాల పెద్దచెరువు ముంపును అరికడతాం: కేఎల్ఆర్* –తూములు, గుర్రపుడెక్క సమస్యకు త్వరలోనే పరిష్కారం –రోడ్డు మరమ్మతులు, బ్రిడ్జి నిర్మాణంపై అధికారులతో చర్చ –శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ భక్తులకు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హామీ

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పులకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి, సహజ వనరులను నాశనం చేయటం వల్ల తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల పెద్ద చెరువు ఉప్పొంగి రోడ్లు, కాలనీలు ముంచెత్తుతున్నాయని కేఎల్ఆర్ అన్నారు. శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయం రోడ్డు మరమ్మతులు, చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, బ్రిడ్జి పునరుద్దరించి సమీప గ్రామాల ప్రజలకు రహదారి సౌకర్యం త్వరలో కల్పిస్తామని కిచ్చెన్న హామీ ఇచ్చారు. తూములను పునరుద్ధరించి చెరువు ముంపు నుంచి రోడ్డు, కాలనీలను కాపాడుతామని… సంబంధిత అధికారులతో మాట్లాడారు. హెచ్ఎండిఎ ఆర్&బీ, మున్సిపాలిటీ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని లక్ష్మారెడ్డి కోరారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో NH-65 రహదారిపై మద్రాస్ ఫిల్టర్ కేఫ్ సమీపంలో ఒక మహావృక్షం అకస్మాత్తుగా రోడ్డుపైన కూలిపోయింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన నందిగామ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.వి.ఎల్.నాయుడు, ఆర్డీఓ, కీసర టోల్ ప్లాజా సిబ్బంది, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులు కలిసి సమన్వయం తో చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం సూచనల మేరకు వెంటనే రహదారి శుభ్రపరిచే పనులు చేపట్టి, కొద్ది సేపటికే ట్రాఫిక్‌ను సాఫీగా కొనసాగిం చారు. ప్రస్తుతం రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు నిరాటంకం గా సాగుతున్నాయి.

యాదాద్రి భువనగిరి

ఎడతెరిపులేని భారీ వర్షాల నేపథ్యంలో* *ప్రజలు అప్రమత్తంగా ఉండండి : సంస్థాన్ నారాయణపురం ఎస్ ఐ జె. జగన్*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : భారీ వర్షాల కారణంగా ప్రజల,పౌరుల భద్రత దృష్ట్యా అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ బయటకు రాకూడదని ఎస్ ఐ జె. జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున,చిన్నారులను,వృద్ధులను, ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించవద్దు అని ఆయన సూచించారు.వర్షాలతో చెరువులు కుంటలు నిండి ప్రవహిస్తున్నందున ప్రజలందరూ పోలీసు వారి సూచనలతో తమ కుటుంబాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వగలరని ఆయన మనవి చేశారు.

E-పేపర్

శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు రాకపోకలు బంద్

శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు రాకపోకలు బంద్ శ్రీశైలంలో విరిగిపడుతున్న కొండచరియలు నల్లమలలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన అధికారులు తెలంగాణ వైపు నుంచి వచ్చే వాహనాలు నిలిపివేత పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలు. ఇబ్బంది పడుతున్న వాహనదారులు

తిరుపతి

టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షురాలు గంగమ్మ గారు ఆకస్మిక మృతి

*ఈ రోజు శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు మద్దిరాల రంగయ్య గారి సతీమణి గంగమ్మ గారి ఆకస్మిక మరణ వార్త తెలుసుకొని ముచ్చివోలు గ్రామానికి వెళ్లి గంగమ్మ గారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.