Friday, 10 April 2026

Blog

తెలంగాణ

భారీ వర్షాలు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్త ఉండాలి. సామాజిక కార్యకర్త గగనం నరేష్

పున్నమి అక్టోబర్ 29 కరెంట్ స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ ఫార్మర్లను తాకకండి మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకుని నడవండి ఉధృతంగా ప్రవహించే చెరువులు, వాగుల వద్దకు వెళ్లకండి. వ్యవసాయ, తదితర పరిసర ప్రాంతాల్లో విష సర్పాలతో జాగ్రత్త పాత గోడలు, పాత ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉంటే ముందస్తు జాగ్రత్తగా ఉండండి* అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకండి…

ఖమ్మం

మొందా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బీజేపీ నేత గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి

ఖమ్మం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొందా’ తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలని, నీటి వనరుల సమీపంలో నివసించే కుటుంబాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జాగ్రత్త సూచనలుగా వాగులు, వంకల దాటే రహదారులపై ప్రయాణాలు చేయకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని గల్లా సత్యనారాయణ తెలిపారు. విద్యుత్ తీగలు లేదా నీటి ప్రవాహాల ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, గ్రామాలు మరియు పట్టణాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాల సమయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రజల ప్రాణ భద్రతనే ప్రధాన ప్రాధాన్యతగా తీసుకోవాలని గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో మొంథా తుఫాన్ ప్రభావం – చందాపురం వద్ద నల్లవాగు వరద పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నందిగామ మండలంలో వరద పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. చందాపురం గ్రామం వద్ద నల్లవాగులో నీటి మట్టం పెరుగుతుండటంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం అధికారులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితు లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ, “ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ప్రయాణికులు పొంగుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదు,” అని సూచించారు. తుఫాన్ ఉధృతి కొనసాగుతున్నందున అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, అవసర మైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలకు తాజా అప్‌డేట్‌లు అందించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, ఆర్డీఓ బాలకృష్ణ, ఎసీపీ తిలక్, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, అధికారులు, కూటమినేతలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నవంబర్ నెల పింఛన్ పంపిణీ షెడ్యూల్ విడుదల

నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్ పంపిణీ కార్యక్రమం నవంబర్ 1వ తేదీ శనివారం నుండి ప్రారంభమవుతుంది. ఈ పంపిణీ నవంబర్ 3వ తేదీ సోమవారం వరకు కొనసాగుతుంది. గమనించవలసిన విషయం ఏమిటంటే, నవంబర్ 2వ తేదీ ఆదివారం సెలవు దినం కావున ఆ రోజున పంపిణీ జరగదు. ఆఫ్లైన్ లొకేషన్ సచివాలయాలలో పింఛన్ పంపిణీ నవంబర్ 4వ తేదీతో ముగుస్తుంది. పింఛన్ దారులు తమ పింఛన్‌ను సమయానికి స్వీకరించేందుకు సంబంధిత సచివాలయాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్

భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి – మంత్రి పొంగులేటి ఆదేశాలు

హైదరాబాద్, అక్టోబర్ 30 (పున్నమి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనానికి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బుధవారం ఆయన రెవెన్యూ మరియు విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్తు, పంచాయతీరాజ్, ఆర్&బి విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, వాగులు, కాల్వలు, చెరువుల వద్ద పోలీసుల పర్యవేక్షణ ఉండాలని మంత్రి సూచించారు. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచి, ప్రజలకు అవసరమైన సహాయం అందించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నష్టాల సత్వర అంచనాలకు డ్రోన్ సాంకేతికత వినియోగం ప్రతి మండలానికి ప్రత్యేక డ్రోన్ సర్వే బృందం ఏర్పాటు తక్కువ సమయంలో కచ్చిత మైన, పారదర్శక నివేదికల తయారీకి అవకాశం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ

ఎన్‌టీఆర్ జిల్లాలో మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలు, రహదారులు, వంతెనలు, గృహాలు తదితర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని వేగవంతంగా, కచ్చితం గా, పారదర్శకంగా అంచనా వేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) లో కలెక్టర్ లక్ష్మీశ తుఫాను నష్టాల ప్రాథమిక అంచనాల కోసం డ్రోన్ కార్పొరేషన్ అందించిన డ్రోన్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “తుఫాను ప్రభావిత ప్రజలకు వేగంగా సహాయ సహకారాలు అందించేందుకు, ఆధునిక సాంకేతికత కీలకంగా పనిచేస్తోంది. జిల్లాలోని 20 మండలాలకు ఒక్కో డ్రోన్ సర్వే టీమ్‌ను నియమించాము. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే, డ్రోన్ సాంకేతికత ద్వారా తక్కువ సమయంలో పెద్ద విస్తీర్ణంలోని నష్టాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు,” అని అన్నారు. హై రిజల్యూషన్ చిత్రాలు, వీడియో ఫుటేజీ ద్వారా కూడా అంచనా ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చని ఆయన వివరించారు. మానవులు వెళ్లేందుకు ఇబ్బందికరమైన ప్రాంతాల్లో కూడా డ్రోన్లు చేరి అక్కడి పరిస్థితులను విశ్లేషించేందుకు వీలు కల్పిస్తాయన్నారు. డిజిటల్ మ్యాపులు, ఫోటోలు, 3D నమూనాల రూపంలో పంటనష్టం నివేదికలు రూపొందించడం ద్వారా పారదర్శకతను మరింత పెంచవచ్చని కలెక్టర్ తెలిపారు. పునరుద్ధరణ పనులకు మద్దతు డ్రోన్ సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టవచ్చని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రజల కు అవసరమైన సహాయాన్ని త్వరగా, సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

నాగర్‌కర్నూల్

ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు రాకపోకలకు అంతరాయం.

అక్టోబర్ 29 పున్నమి ప్రతినిధి: మొంతా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బైరాపూర్ -వెల్దండ, రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గతంలో కొట్టుకపోయిన బైరాపూర్ బ్రిడ్జి కి తాత్కాలికంగా రెండు గుణాలు వేసి మట్టితో పూడ్చారు. గూణలకు రెండు పక్కల వేసిన మట్టి వాగు ప్రవాహానికి కొట్టుకొని పోయింది . బొల్లంపల్లి గానుగట్టు తండాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది . దీంతో వాహనదారులకు మరియు ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.బైరాపూర్ గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న జగదీష్ అనే వ్యక్తి ఇంటిలోకి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో ఇంటిలో ఉన్న నిత్యవసర వస్తువులు అన్నీ తడిసి ముద్దాయి కావున అధికారులు తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.కావున ప్రజలు ఎవరు వాగులు దాటడానికి ప్రయత్నించవద్దని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఇబ్బంది ఉంటే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని వెల్దండ ఎస్సై కురుమూర్తి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మొందా తుఫాన్ ప్రభావం – మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక

ఖమ్మం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): మొందా తుఫాన్ ప్రభావం ఖమ్మం జిల్లా మీద గట్టిగా కొనసాగుతోంది. బుధవారం తెల్లవారు జామున నుంచే మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం, రానున్న 72 గంటలపాటు ఖమ్మం సహా తెలంగాణ దక్షిణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల బయటకు రావొద్దని, తక్కువ ప్రదేశాల్లో నీరు నిలిచే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మొంథా తుఫాను ప్రభావం తీవ్రం – నందిగామ పట్టణం వరద ముంపు! అధికారులు అలర్ట్‌లో

నందిగామ, NTR జిల్లా: మొంథా తుఫాను ప్రభావంతో నందిగామ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు పొంగిపొర్లి, కాలనీలు, రహదారులుమునిగిపోయాయి. నందిగామ 15వ వార్డులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మనబోతుల శ్రీరామ, వార్డు అధ్యక్షుడు మనబోతుల శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది మరియు వీఆర్‌ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. పాత బస్టాండ్ నుండి మార్కెట్ యార్డు వరకు హైవే రోడ్డుపై వరద ప్రవాహం కొనసాగుతోంది. రామన్నపేట రోడ్డులోని రమణ కాలనీ వద్ద వాగు ఉప్పొంగడం తో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్‌హెచ్-65 (NH-65) వద్ద మద్రాస్ ఫిల్టర్ కేఫ్ సమీపంలో మహావృక్షం రోడ్డుపై కూలడంతో ట్రాఫిక్ స్థంభించింది. వెంటనే స్పందించిన నందిగామ సీఐ వై.వి.ఎల్.నాయుడు, ఆర్డీవో, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది, కీసర టోల్ ప్లాజా బృందం సహకారంతో వెంటనే చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ప్రస్తుతం ట్రాఫిక్ సాఫీగా కొనసాగుతోంది. దేవినేని వెంకటరమణ కాలనీలో నీటి మట్టం అధికంగా ఉండటం తో ప్రజలు బయటకు రావడానికి వీలులేకపోతుంది. పునరావాస కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ జి.లోవరాజు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణచేస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆర్డీవో బాలకృష్ణ, ఎంఆర్వో సురేష్ బాబు, కమిషనర్ లోవరాజు సమీక్షిస్తున్నారు. అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. హెచ్చరికగా, ప్రజలు అత్యవసర మైతే తప్ప బయటకు రావొద్దని నందిగామ పోలీసులు మరియు అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం సూచనల మేరకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

ఎన్ టి ఆర్ జిల్లా

మొంథా తుఫాను ప్రభావం తీవ్రం – నందిగామ పట్టణం వరద ముంపు! అధికారులు అలర్ట్‌లో

నందిగామ, NTR జిల్లా: మొంథా తుఫాను ప్రభావంతో నందిగామ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు పొంగిపొర్లి, కాలనీలు, రహదారులుమునిగిపోయాయి. నందిగామ 15వ వార్డులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మనబోతుల శ్రీరామ, వార్డు అధ్యక్షుడు మనబోతుల శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది మరియు వీఆర్‌ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. పాత బస్టాండ్ నుండి మార్కెట్ యార్డు వరకు హైవే రోడ్డుపై వరద ప్రవాహం కొనసాగుతోంది. రామన్నపేట రోడ్డులోని రమణ కాలనీ వద్ద వాగు ఉప్పొంగడం తో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్‌హెచ్-65 (NH-65) వద్ద మద్రాస్ ఫిల్టర్ కేఫ్ సమీపంలో మహావృక్షం రోడ్డుపై కూలడంతో ట్రాఫిక్ స్థంభించింది. వెంటనే స్పందించిన నందిగామ సీఐ వై.వి.ఎల్.నాయుడు, ఆర్డీవో, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది, కీసర టోల్ ప్లాజా బృందం సహకారంతో వెంటనే చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ప్రస్తుతం ట్రాఫిక్ సాఫీగా కొనసాగుతోంది. దేవినేని వెంకటరమణ కాలనీలో నీటి మట్టం అధికంగా ఉండటం తో ప్రజలు బయటకు రావడానికి వీలులేకపోతుంది. పునరావాస కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ జి.లోవరాజు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణచేస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆర్డీవో బాలకృష్ణ, ఎంఆర్వో సురేష్ బాబు, కమిషనర్ లోవరాజు సమీక్షిస్తున్నారు. అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. హెచ్చరికగా, ప్రజలు అత్యవసర మైతే తప్ప బయటకు రావొద్దని నందిగామ పోలీసులు మరియు అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం సూచనల మేరకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.