Wednesday, 8 April 2026

Blog

E-పేపర్

మొంథా తుఫాన్ లో యాచకులకు అన్నం పొట్లాలు అందజేత

మొంథా తుఫాన్ కారణంగా నందలూరులో దుకాణాలు సముదాయాలు మూత పడడంతో యాచకులకు నిరుపేదలకు పూట గడవని పరిస్థితి నెలకొంది.ఎడతెరపని వర్షం కురవడంతో బిచ్చగాళ్లకు బయటికి వెళ్లలేని పరిస్థితి.ఈ క్రమంలో నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టెంట్ మెంబర్ మరియు బీజేపీ నాయకులు రాచూరి మురళి,హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జిల్లా చైర్మన్, డాక్టర్ వేపకుంట డేవిడ్ కళ్యాణి రాజు,మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు,టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,,విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్,పొంబల శివ నరసింహులు తదితరులు అందరూ కలిసి నందలూరులోని రైల్వేస్టేషన్, అరవపల్లి,మగ్దమ్ షా వల్లీ దర్గా ఎర్రపాపాయపల్లి మరియు గుండ్లూరు శివాలయం పరిసరాలలో యాచుకులకు అన్నం పొట్లాలు అందజేసి తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు గ్రామవాసులు వారి సేవ నిరతిని అభినందించారు.

విశాఖపట్నం

అన్నా కాంటీన్ గేటు గోడపై విరిగిపడ్డ చెట్టు

మెంత తుపాన్ ప్రభావంతో 92వ వార్డు గోపాలపట్నం రైతు బజార్ వద్ద భారీ చెట్టు విరిగి అన్న క్యాంటీన్ గేటు మరియు గోడపై పడింది. ఈ ఘటనతో స్థానికులకు కొంత అసౌకర్యం ఏర్పడింది. సమాచారమందుకున్న ప్రభుత్వ విప్ గణబాబు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి, ట్రీ కటర్స్ సాయంతో చెట్టును తక్షణమే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

E-పేపర్

మొంథా తుఫాన్ లో యాచకులకు అన్నం పొట్లాలు అందజేత

మొంథా తుఫాన్ కారణంగా నందలూరులో దుకాణాలు సముదాయాలు మూత పడడంతో యాచకులకు నిరుపేదలకు పూట గడవని పరిస్థితి నెలకొంది.ఎడతెరపని వర్షం కురవడంతో బిచ్చగాళ్లకు బయటికి వెళ్లలేని పరిస్థితి.ఈ క్రమంలో నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టెంట్ మెంబర్ మరియు బీజేపీ నాయకులు రాచూరి మురళి,హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జిల్లా చైర్మన్, డాక్టర్ వేపకుంట డేవిడ్ కళ్యాణి రాజు,మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు,టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,,విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్,పొంబల శివ నరసింహులు తదితరులు అందరూ కలిసి నందలూరులోని రైల్వేస్టేషన్, అరవపల్లి,మగ్దమ్ షా వల్లీ దర్గా ఎర్రపాపాయపల్లి మరియు గుండ్లూరు శివాలయం పరిసరాలలో యాచుకులకు అన్నం పొట్లాలు అందజేసి తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు గ్రామవాసులు వారి సేవ నిరతిని అభినందించారు.

రంగారెడ్డి

*రావిర్యాల పెద్దచెరువు ముంపును అరికడతాం: కేఎల్ఆర్* –తూములు, గుర్రపుడెక్క సమస్యకు త్వరలోనే పరిష్కారం –రోడ్డు మరమ్మతులు, బ్రిడ్జి నిర్మాణంపై అధికారులతో చర్చ –శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ భక్తులకు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హామీ

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పులకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి, సహజ వనరులను నాశనం చేయటం వల్ల తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల పెద్ద చెరువు ఉప్పొంగి రోడ్లు, కాలనీలు ముంచెత్తుతున్నాయని కేఎల్ఆర్ అన్నారు. శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయం రోడ్డు మరమ్మతులు, చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, బ్రిడ్జి పునరుద్దరించి సమీప గ్రామాల ప్రజలకు రహదారి సౌకర్యం త్వరలో కల్పిస్తామని కిచ్చెన్న హామీ ఇచ్చారు. తూములను పునరుద్ధరించి చెరువు ముంపు నుంచి రోడ్డు, కాలనీలను కాపాడుతామని… సంబంధిత అధికారులతో మాట్లాడారు. హెచ్ఎండిఎ ఆర్&బీ, మున్సిపాలిటీ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని లక్ష్మారెడ్డి కోరారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో NH-65 రహదారిపై మద్రాస్ ఫిల్టర్ కేఫ్ సమీపంలో ఒక మహావృక్షం అకస్మాత్తుగా రోడ్డుపైన కూలిపోయింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన నందిగామ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.వి.ఎల్.నాయుడు, ఆర్డీఓ, కీసర టోల్ ప్లాజా సిబ్బంది, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులు కలిసి సమన్వయం తో చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం సూచనల మేరకు వెంటనే రహదారి శుభ్రపరిచే పనులు చేపట్టి, కొద్ది సేపటికే ట్రాఫిక్‌ను సాఫీగా కొనసాగిం చారు. ప్రస్తుతం రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు నిరాటంకం గా సాగుతున్నాయి.

యాదాద్రి భువనగిరి

ఎడతెరిపులేని భారీ వర్షాల నేపథ్యంలో* *ప్రజలు అప్రమత్తంగా ఉండండి : సంస్థాన్ నారాయణపురం ఎస్ ఐ జె. జగన్*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : భారీ వర్షాల కారణంగా ప్రజల,పౌరుల భద్రత దృష్ట్యా అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ బయటకు రాకూడదని ఎస్ ఐ జె. జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున,చిన్నారులను,వృద్ధులను, ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించవద్దు అని ఆయన సూచించారు.వర్షాలతో చెరువులు కుంటలు నిండి ప్రవహిస్తున్నందున ప్రజలందరూ పోలీసు వారి సూచనలతో తమ కుటుంబాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వగలరని ఆయన మనవి చేశారు.

E-పేపర్

శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు రాకపోకలు బంద్

శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు రాకపోకలు బంద్ శ్రీశైలంలో విరిగిపడుతున్న కొండచరియలు నల్లమలలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన అధికారులు తెలంగాణ వైపు నుంచి వచ్చే వాహనాలు నిలిపివేత పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలు. ఇబ్బంది పడుతున్న వాహనదారులు

తిరుపతి

టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షురాలు గంగమ్మ గారు ఆకస్మిక మృతి

*ఈ రోజు శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు మద్దిరాల రంగయ్య గారి సతీమణి గంగమ్మ గారి ఆకస్మిక మరణ వార్త తెలుసుకొని ముచ్చివోలు గ్రామానికి వెళ్లి గంగమ్మ గారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు*

కుమురం భీమ్ ఆసిఫాబాద్

“ఇదే మన సమాజం ముఖచిత్రమా?”

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని గాంధీ చౌక్ ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు, దళిత వర్గాలకు చెందిన శ్రమికుడు మురుగు లోపల, ఏ రక్షణ పరికరాలు లేకుండా, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నాడు ఇప్పటికీ వేల దళిత కుటుంబాలు నెలలు, సంవత్సరాలు మాన్యువల్ స్కావెంజింగ్ – అత్యంత ప్రమాదకర, అపమానకర వృత్తిని – బలవుత ఉంటున్నాయి�.వాస్తవానికి, ఇది రాజ్యాంగ హక్కులు, మానవ హక్కులు రెండింటికి వ్యతిరేకంగా ఉంది�.ఇప్పటికీ ప్రాథమిక సదుపాయాలు, ఉపాధిలో సమానత్వం, సురక్షిత వాతావరణం లభించడంలో విఫలమయ్యే పరిస్థితి కొనసాగుతోంది�. ప్రభుత్వం తక్షణమే manual scavenging పూర్తిగా నిషేధించాలని, బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆరోగ్య భద్రత కల్పించునట్లు చర్యలు తీసుకోవాలి.ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు మానవత్వం కోసం మొగ్గుపెట్టి, ఈ సమస్యపై అవగాహన పెంచాలి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.