Wednesday, 8 April 2026

Blog

విశాఖపట్నం

విశాఖపట్నం హార్బర్ లో తుఫాను , అలలు తాకిడికి ఒక బోటు మునిగిపోయింది*

*దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీవంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఫిషింగ్ ఆర్బర్ లో ప్రమాదానికి గురైన బోటు వద్దకు వచ్చి ఘటన వివరాలు తెలుసుకున్నారు* *శ్రీవంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…..* విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* *విశాఖపట్నం హార్బర్ లో తుఫాను , అలలు తాకిడికి ఒక బోటు మునిగిపోవడం జరిగింది* *అనుకోకుండా జరిగిన ఘటన విషయాన్ని పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది* *మునిగిపోయిన బోటు విలువ సుమారు 30 లక్షల ఉంటుంది* *ఫిషరీ డిపార్ట్మెంట్ వారు కొంత, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత నష్టపరిహారం రిలీజ్ చేయించి వారిని పూర్తిగా ఆదుకుంటాము* *ఈ ఒక్క ఘటన మినహా హార్బర్ ఏరియా ప్రశాంతంగా ఉంది* *దక్షిణ నియోజకవర్గం లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా కలిగి ఉండడం వలన నీరు ఎక్కువగా చేరడం వల్ల ప్రజలు కొంత ఇబ్బందులకు గురయ్యారు* *లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది* *రెవెన్యూ, పోలీస్, జీవీఎంసీ యంత్రాంగం గత నాలుగు రోజుల నుండి అదేపనిగా పనిచేస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు* *పవర్ పోయిన, చెట్లు పడిపోయిన వెంటనేస్పందిస్తున్నారు ,అధికారులుఅందరూ ఎలార్ట్ గా ఉన్నారు* *తుఫాను తీవ్రత తగ్గింది,విశాఖ ప్రశాంతంగా ఉంది ,ఎటువంటి ఇబ్బందులు లేవు* *మరో రెండు రోజులు వర్షం పడినా వచ్చే ఇబ్బందులు ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నాము*. తుఫాను కారణంగా ఫిషింగ్ హార్బర్ సెంట్రల్ డాక్ ప్రాంతంలో నిలిపివుంచిన శ్రీ మేరుగ ధనరాజు గారి బోటు ( ఏపీ వి5 MM90) మునిగిపోయిన నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు హుటా హుటున సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. సుమారు 30 లక్షలు మేర నష్టపోయామని సంబంధిత బోటు యజమాని మరియు అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్థానిక అధికారులతో మాట్లాడి బోటు ఓనరుకు న్యాయం చేకూర్చాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ స్థానిక ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు గారితో పాటు సంబంధిత అధికారులకు ఘటనను వివరించామని త్వరలోనే నష్టపరిహారం అందిటట్లు చర్యలు చేపడతామని తెలియజేశారు. గత మూడు రోజులుగా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉందని వివరించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే చర్యలు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు .కార్యక్రమంలో బోటు అసోసియేషన్ పెద్దలు, స్థానిక మత్స్యకారులు, టిడిపి, బిజెపి, జనసేన నేతలు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు….

జయశంకర్ భూపాలపల్లి

సింగరేణి జీఎం పై బార్ అసోసియేషన్ చేసిన వాక్యనలను తీవ్రంగా ఖండించిన నాయకులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: అక్టోబర్ 29, పున్నమి ప్రతినిధి సింగరేణి సంస్థ యొక్క ఆస్తులపై కన్నేసిన వారి ఆటలు సాగనివ్వమమని వాటి రక్షణకై ఎంత కైనా తేగిస్తమని సింగరేణి కార్మికుల సత్త ఏమిటో చేపిస్తామని బార్ అసోసియేషన్ నాయకులకు తెలియజేస్తున్నాము. కార్మికుల వెల్ఫైర్ ఫండ్ నుండి కట్టిన బిల్డింగ్ లు కేవలం కార్మికుల అవసరాలకు మాత్రమే వాడుకోవాలని ఇతరులకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వకూడదని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాము. కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా ప్రకటనలు ఎవ్వరు చేసిన INTUC చూస్తూ ఊరుకోదని కార్మికుల పక్షాన నిలబడి వారి సంక్షేమానికి కృషి చేస్తామని భూపాలపల్లి INTUC బ్రాంచ్ తెలియజేస్తుంది. పైలట్ కలనీ లోని కమ్యూనిటీ హాలు ను తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పాటు సమయం లో దీనిని భూపాలపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్ కు కేటాయిస్తే సింగరేణి కార్మికులు , కార్మిక సంఘాలు జిల్లా యంత్రాంగాని వారి కార్యకలాపాలు కొనసాగించుటకు సహకరించమని తిరిగి 10 సంవత్సరాలు గడిచినాక పోలీస్ శాఖ వారు వారి స్వంత భవనం లోకి వెళ్లడం జరిగింది . 10 సంవత్సరాల తరువాత కార్మికుల అవసరాలకు అందుబాటులోకి వచ్చిన కమ్యూనిటీ హాలును కోర్ట్ కోసం ఇవ్వాలని బార్ అసోసియేషన్ నాయకులు స్థానిక జేనరల్ మేనేజర్ గారి పై అనుచిత వాక్యాలు చేయడం ప్రభుత్వం పై , ప్రభుత్వ శాకాలపై , న్యాయస్థానాలపైన గౌరవం లేదని వారిని కించపర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గౌరవం లేనిదే జడ్జిల నివాసం కొరకు బంగ్లా ఏరియాలోని అధికారుల క్వార్టర్లను నిర్థ్యక్షిణంగా నలుగురు అధికారులు నివాసముంటున్న వారిని ఖాళీ చేపించి జడ్జిలకు ఇవ్వడాన్ని గౌరవించడం కదా! సింగరేణి గెస్ట్ హౌస్లలో ప్రభుత్వ శాకాల అధికారులు సంవత్సరాల తరబడి ఉంటున్నది వాస్తవం కదా … సింగరేణి కార్మికుల నివాసం కొరకు కేటాయించిన సుమారు 100 క్వార్టర్లను ప్రభుత్వ అధికారులకు కేటాయించిన, సింగరేణి కార్మికులు సహకరించిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం కార్మికులని మరియు యాజమాన్యాన్ని కించపర్చటం హేయమైన చర్యగా మేము భావిస్తూ ఆ వాక్యాలని వెనక్కి తీసుకోవాలని INTUC గా డిమాండ్ చేస్తున్నాము. పైలెట్ కాలనీ లో ని డిస్పెన్సరీ ని జిల్ల ప్రధాన మరియు సెషన్స్ కోర్ట్ కు ఇవ్వడం , జిల్లా కోర్టు సముదాయానికి 10 ఆకారాల స్థలమును కేటాయించడం న్యాయస్థానాలను గౌరవించినట్లు కాదా “””బార్ అసోసియేషన్ నాయకులు జనరల్ మేనేజర్ గారి పట్ల హుందాగా మర్యాదగా ప్రవర్తిచాలని INTUC కోరుచున్నది .. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా INTUC బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ గౌ “ శ్రీ బేతెల్లి మధుకర్ రెడ్డి గారు, INTUC సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్య ,A . రఘుపతి రెడ్డి , INTUC జనరల్ సెక్రటరీ “ శ్రీ పశునుటి రాజేందర్ , డిప్యూటీ జనరల్ సెక్రటరీ గౌ “ శ్రీ రత్నం సమ్మి రెడ్డి , గౌ “ శ్రీ వేణుగోపాల్ యాదవ్ గారు, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ SCMLU-INTUC మహిళా విభాగం అధ్యక్షురాలు గౌ” శ్రీమతి శ్రీ మద్దినేని శేషారత్నం ,,భూపాలపల్లి ఏరియా INTUC స్ట్రక్చర్ కమిటీ నాయకులు గౌ “ శ్రీ షేక్ హుస్సేన్ , గౌ “ శ్రీ బొడ్డు అశోక్,గౌ “ శ్రీ చిప్పకుర్తి రమేష్ ,భూపాలపల్లి ఏరియా బ్రాంచ్ నాయకులు గౌ “ శ్రీ కె. శంకర్, గౌ “ శ్రీ రవి కిరణ్ , తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

మొంథా తుపాను కారణంగా 20 ఇళ్లు దెబ్బతిన్నాయి.

పున్నమి న్యూస్, పెద్దాపురం 29/10 మొంథా తుఫాను కారణంగా పెద్దాపురం డివిజన్ లో భారీ వర్షాలు, ఈదురు గాలులతో 20 ఇళ్లు దెబ్బతిన్నాయని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీ రమణి పేర్కొన్నారు. పెద్దాపురంలో-10ఇళ్లు, కిర్లంపూడి-4ఇళ్లు , తొండంగి – 2 ఇళ్ళు, కోటనందూరు- 3 ఇళ్లు,:రౌతులపూడి-1 ఇళ్ళు దెబ్బ తిన్నాయని ఆమె వెల్లడించారు. కట్టమూరు గ్రామంలో ఉన్న శ్రీ కేశవ పట్టాభి రామస్వామి వారి దేవస్థాన అర్చకుల నివాసం మొంథా తుఫాన్ కారణంగా ఇంటిగోడ కూలిపోయింది. అది గమనించిన, గ్రామ ప్రజలు అర్చకుల నివాసం వద్దకు వెళ్ళి తక్షణమే ఖాళీ చేయించి, అర్చకులకు పునరవాసం కల్పించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం – ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ప్రభుత్వం ప్రకటించింది

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి బాధితుడికి రూ.1000 చొప్పున అందజేయాలని నిర్ణయించింది. ఒక కుటుంబంలో ముగ్గురికంటే ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా రూ.3000 వరకు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నగదు సాయం పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో అందజేయబడుతుంది. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ప్రభుత్వం తక్షణ సహాయాన్ని అందిస్తూ చర్యలు వేగవంతం చేసింది.

తెలంగాణ

జిల్లా కేంద్రం మొదలుకొని, గ్రామ స్థాయి వరకు అధికారులు సిబ్బంది వారి కార్య స్థానాల్లో ఉండాలన్న : కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) మోంథా తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం మొదలుకొని, గ్రామ స్టాయి వరకు, అధికారులు సిబ్బంది అందరూ వారి వారి కార్య స్థానాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేవరకొండ డివిజన్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినందున,ఈ ప్రాంతంలోని మారుమూల గిరిజన తండాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బంది, క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.

నిర్మల్

వాటోలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం- ఐదవ రోజు

వాటోలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం- ఐదవ రోజు గోపాల్ రావు పాటిల్ భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వాటోలి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక శిబిరం ఐదవ రోజు ఆరోగ్య అవగాహన కార్యక్రమం .”గ్రామ ప్రజల అపార స్పందనతో విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా మధుమేహం, రక్తపోటు పరీక్షలు,సాధారణ, దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న 250 మందికి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సేవలో 10 మంది వైద్యుల బృందం పాల్గొని, మొత్తం లక్ష రూపాయల విలువైన మెడిసిన్స్‌ను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మెడిసిన్ పంపిణీలో సిపిడిసి సభ్యుడు నిఖిల్ మెడికల్ ప్రత్యేక సహాయం . ల్యాబ్ టెక్నీషియన్స్ బాలాజీ, సాయికుమార్ సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు: డా. నగేష్, డా. ముత్యంరెడ్డి, డా. మహేష్, డా. విజయానంద్, డా. చంద్రశేఖర్, డా. వైభవ్, డా. మనోజ్, డా. ఆకాష్ రెడ్డి తదితరులు గ్రామస్తులను వైద్య పరీక్షలు నిర్వహించి వారికి వివిధ సూచనలు చేసి, మందులను పంపిణీ చేశారు. మధ్యాహ్నం విద్యార్థుల కోసం న్యాయవాదులు టి గంగాధర్ మాధవి గారు లీగల్ అవేర్నెస్ చట్ట అవగాహన & మోటివేషన్ క్లాస్ నిర్వహించి, విద్యార్థులు సమాజంలో ఎలా ఉండాలి, చట్టపరమైన అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి కీలక విషయాలను వివరిస్తూ వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రిన్సిపాల్ కరోల బుచ్చయ్య గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఉచిత వైద్య సేవలు దగ్గరుండి వారికి ఏ విధంగా పరీక్షలకు చేసుకోవాలని అవగాహన కల్పిస్తూ పలు రకాలుగా తమల సేవలను వినియోగించడం అభినందనీయమని అనంతరం గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ కులపైన అవగాహన కల్పించి ప్లాస్టిక్ వల్ల మానవాళికి ఎటువంటి అపాయం జరుగుతున్నదని ప్రజలకు తెలియజేసి వాటిని వేస్తూ చైతన్యం కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆరె రాజు గారు, అధ్యాపకులు .డాక్టర్ జే ఓం ప్రకాష్, గుంత సుధాకర్, డా. నహీదా, డా.సంతోష్ కుమార్, టి. సురేందర్, జి. కిషన్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. 🎯 ప్రజల ఆరోగ్యం – విద్యార్థుల చైతన్యం ఈ రెండు లక్ష్యాలతో ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమం ఘనవిజయం సాధించింది!

కాకినాడ

కట్టమూరు కాండ్రకోట గ్రామాలలో పునరావాస కేంద్రాలను పరిశీలించిన అధికారులు.

పున్నమి న్యూస్, పెద్దాపురం. 29 /10 తుఫాన్, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడటంతో పెద్దాపురం మండలం కట్టమూరు, కాండ్రకోట గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను బుధవారం పెద్దాపురం తహాశీల్దార్ వెంకటలక్ష్మి, ఎస్సై మౌనిక, కూటమి నాయకులు కార్యకర్తలు పరిశీలించారు. పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న కుటుంబాలకు అందుతున్న సేవలు, బాగోగుల గురించి ఆధికారులు తెలుసుకున్నారు. పెద్దాపురం తహాశీల్దార్ వెంకట లక్ష్మి మాట్లాడుతూ ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నదని వృద్దులు, పసి పిల్లలు పట్ల తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అక్కడ వున్న సిబ్బందికి సూచించారు, అనంతరం కట్టమూరు గ్రామంలో ఏలేరు ప్రధాన కాలువ ద్వారా ప్రవహిస్తున్న వరద ఉధృతి ని అధికారులు పరిశీలించారు.

తెలంగాణ

భారీ వర్షాలు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్త ఉండాలి. సామాజిక కార్యకర్త గగనం నరేష్

పున్నమి అక్టోబర్ 29 కరెంట్ స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ ఫార్మర్లను తాకకండి మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకుని నడవండి ఉధృతంగా ప్రవహించే చెరువులు, వాగుల వద్దకు వెళ్లకండి. వ్యవసాయ, తదితర పరిసర ప్రాంతాల్లో విష సర్పాలతో జాగ్రత్త పాత గోడలు, పాత ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉంటే ముందస్తు జాగ్రత్తగా ఉండండి* అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకండి…

ఖమ్మం

మొందా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బీజేపీ నేత గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి

ఖమ్మం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొందా’ తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలని, నీటి వనరుల సమీపంలో నివసించే కుటుంబాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జాగ్రత్త సూచనలుగా వాగులు, వంకల దాటే రహదారులపై ప్రయాణాలు చేయకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని గల్లా సత్యనారాయణ తెలిపారు. విద్యుత్ తీగలు లేదా నీటి ప్రవాహాల ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, గ్రామాలు మరియు పట్టణాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాల సమయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రజల ప్రాణ భద్రతనే ప్రధాన ప్రాధాన్యతగా తీసుకోవాలని గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో మొంథా తుఫాన్ ప్రభావం – చందాపురం వద్ద నల్లవాగు వరద పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నందిగామ మండలంలో వరద పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. చందాపురం గ్రామం వద్ద నల్లవాగులో నీటి మట్టం పెరుగుతుండటంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం అధికారులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితు లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ, “ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ప్రయాణికులు పొంగుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదు,” అని సూచించారు. తుఫాన్ ఉధృతి కొనసాగుతున్నందున అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, అవసర మైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలకు తాజా అప్‌డేట్‌లు అందించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, ఆర్డీఓ బాలకృష్ణ, ఎసీపీ తిలక్, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, అధికారులు, కూటమినేతలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.