Wednesday, 8 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నావూరు పెద్దవాగును పరిశీలించిన కాకాణి…*

*మొంథా తుఫాన్ నేపథ్యంలో…* *నావూరు పెద్దవాగును పరిశీలించిన కాకాణి…* *భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు…* పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29(పొదలకూరు) మండలంలోని నావూరు పెద్దవాగును బుధవారం మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ మొంథా తుఫాన్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈరోజు నావూరు పెద్దవాగును పరిశీలించడం జరిగిందన్నారు. వర్షాకాలం వస్తే నావూరు, చెన్నారెడ్డిపల్లి, బోగసముద్రం, కొండలరాయుడు కండ్రిగ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారని అన్నారు. చిన్నపాటి వర్షానికే పెద్దవాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ఈ గ్రామాల ప్రజలు తరతరాలుగా క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. వారి పరిస్థితిని గమనించిన తాను మంత్రిగా 2023లో పెద్దవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి మూడు కోట్ల 62 లక్షలు మంజూరు చేయించానని చెప్పారు. మూడు నెలల నుంచి ఐదు నెలల లోపల పూర్తి కావలసిన ఈ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరమైనా ఇప్పటికీ అసంపూర్తిగా ఉందంటే అది ప్రస్తుత పాలకుల అసమర్థత, చేతకానితనం కాదా అని ప్రశ్నించారు. తాను అధికారంలో ఉన్నా, లేకున్నా 24/7 ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, మందల వెంకటశేషయ్య, రావుల ఇంద్రసేన్ గౌడ్, గోగిరెడ్డి గోపాల్ రెడ్డి,వాకాటి శ్రీనివాసులు రెడ్ది, మద్దిరెడ్డి రమణారెడ్డి, షేక్ అంజాద్, దాదిబత్తిన విజయభాస్కర్ రెడ్డి, నరసింహులు నాయుడు, కాకు పెంచలయ్య, చొప్ప రమేష్, కట్టా పెంచల భాస్కర్, వేణుగోపాల్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

చల్ల పాలెం నిరాశ్రయులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి– జనమాల గురవయ్య డిమాండ్

దెబ్బతిన్న ఇండ్ల నిర్మాణ మరమ్మత్తుల కోసం ప్రతి కుటుంబానికి 50వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి పనులు లేక పస్తులు తో జీవనం సాగిస్తున్న ప్రతి కుటుంబానికి నెలకు కావలసిన నిత్యవసర సరుకులను అందివ్వాలి తుఫాను ప్రభావం వల్ల గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కాళహస్తులు నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల లో నివాసముంటున్న దళిత గిరిజన కాలనీ ప్రజానీకాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఈరోజు కాళహస్తి మండలం చల్లపాలెం దళిత వాళ్లను ఆయన సందర్శించారు దెబ్బతిన్న ఇండ్లను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా దెబ్బతిన్న రోడ్లు పడిపోయిన ఇండ్లు ఈ అకాల వర్షాల వల్ల పనులు లేక ఉపాధి దొరకక పస్తులతో జీవనం సాగిస్తున్న వారికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొంతమేరకు ఆదుకున్నామని ప్రభుత్వం మరింత ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకోసం ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి దెబ్బతిన్న ఇండ్ల నిర్మాణ మరమ్మత్తుల కోసం తక్షణ సాయంగా 50 వేల రూపాయలు ప్రతి కుటుంబానికి అందుకోవాలని కనీసం ఒక నెలకు కావలసిన నిత్యవసర సరుకులను వారికి రేషన్ షాపుల ద్వారా యుద్ధ ప్రాతిపదికన సరుకులు అందివ్వాలని దెబ్బతిన్న రోడ్లు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఆ రకంగా పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది అని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలోకుడిచేడు చంద్రబాబు కాశీమాల మోహన్ సైదాపల్లి రవి తదితరులు పాల్గొన్నారు నమస్కారములతో జనామాల గురవయ్య కార్యదర్శి భారత కమ్యూనిస్టు పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం సమితి

ఎన్ టి ఆర్ జిల్లా

తుపాన్ సమయంలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించా లని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశం

నందిగామ, బుధవారం: మొంథా తుపాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, నందిగామ పట్టణంలోని డివిఆర్ ఏరియా హాస్పిటల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం సందర్శించారు. సందర్శనలో ఆమె: రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు పరిశీలించారు. అవసరమైన ఔషధ నిల్వలు, అత్యవసర సిబ్బంది విధులు, మరియు పూర్తిస్థాయి వైద్య సదుపాయా లు సమర్థవంతంగా నిర్వహించ మని వైద్య అధికారులకు ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల నుండి ఆసుపత్రికి తరలింపబడే బాధితులకు తక్షణ చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్, నీటి సరఫరా మరియు శానిటేషన్ సేవలు నిరంతరం కొనసాగేలా సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని తెలిపారు. హాస్పిటల్ సందర్శన లో హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

సీడ్ పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి రైతుల పక్షాన వినతిపత్రం ను సమర్పించిన….* *MRPS &BRS,కాంగ్రెస్ నాయకులు…*

*సీడ్ పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి రైతుల పక్షాన వినతిపత్రం ను సమర్పించిన….* *MRPS &BRS,కాంగ్రెస్ నాయకులు…* జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లో… ఈ రోజు జిల్లా లో సీడ్ పత్తి రైతులు… *భారీ వర్షాల కారణం గా సరైన పంటలు దిగుబడి రకా,* సీడ్ ఆర్గనైజర్లు *పెట్టుబడి పైసలు ఇవ్వక పోవడం తో* బయట *అప్పులు తెచ్చుకొని* పెట్టుబడి పెట్టుకొన్నారు,… అలాగే ఈసారి *కూలీల రేట్లు కూడా చాలా దారుణం గా పెరిగి పోవడం తో…* రైతులు అప్పుల పాలు అయ్యారు…!! *దీనికీ తోడు…ఆర్గనైజర్లు ప్యాకెట్ (పూత,పూత) కు ఈ సారి 450 మాత్రమే ఇస్తామని* కంపిణీ వారు చెపుతున్నారని,*చావు కబురు చల్లా గా చెపుతున్నారు,* ఇలా అయితే రైతు కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది,*కాబట్టి ఈ సారి కూడా గత సంవత్సరం మాదిరిగానే….ప్యాకెట్ కు 550 రూపాయలు ఇచ్చే విదంగా..* తగు చర్యలు తీసుకొని, మరియు *రైతుల కు ఇవ్వాల్సిన పంటల పైసలు ఎప్పటి లాగానే జులై నెల లో ఇచ్చే లా* ఆదేశాలు ఇచ్చి రైతుల కు న్యాయం చెయ్యాలని,రైతులతో కలిసి వినతిపత్రానందించారు… ఈ కార్యక్రమం లో…. *BRS నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, MRPS నాయకులు ఐజ రాజు మాదిగ*, *BRSV నాయకులు కుర్వ పల్లయ్య, MRPS నాయకులు బలీగేరి ఏసన్న మాదిగ, కాంగ్రెస్ నాయకులు బింగిదొడ్డి నాగేష్, చిన్న యాదవ్, మేడికొండ రామకృష్ణ*, తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వ ఆదేశాలు

మొంత తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సహాయం తుఫాన్ ప్రభావిత గ్రామాలు, రిలీఫ్ క్యాంపులు మరియు జీవనోపాధి దెబ్బతిన్న మత్స్యకార కుటుంబాలకు అందించబడుతుంది. పంపిణీ జాబితా: 1️⃣ బియ్యం – 25 కిలోలు (మత్స్యకారులకు 50 కిలోలు) 2️⃣ రెడ్‌గ్రామ్ దాల్ – 1 కిలో 3️⃣ పిండి నూనె – 1 లీటర్ 4️⃣ ఉల్లిపాయలు – 1 కిలో 5️⃣ బంగాళదుంపలు – 1 కిలో 6️⃣ చక్కెర – 1 కిలో సివిల్ సప్లైస్ కమిషనర్ విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైన వివరాలు సేకరించి వెంటనే రైస్, దాల్, ఆయిల్, షుగర్ పంపిణీ ప్రారంభించాలని సూచించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మొంథా తుపాన్ ప్రభావిత పునరావాస కేంద్రాలను సందర్శించిన తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణంలో బుధవారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మొంథా తుపాన్ ప్రభావిత పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్శనలో డివిఆర్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు బాబు జగ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు. అధ్యక్షులు, మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి మరియు కూటమి నేతలతో కలిసి, పునరావాస కేంద్రాల్లో తుఫాన్ బాధితులతో ప్రత్యక్షం గా మాట్లాడి, భోజనం, తాగు నీరు, వైద్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల పరిస్థితిని తనిఖీ చేశారు.తంగిరాల సౌమ్య అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయం అంది స్తుందని భరోసా ఇచ్చారు.

తెలంగాణ

సర్దార్ @150 యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపిన : ఎంపీ, రాజ్యసభ సభ్యుడు

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని ప్రజలలో జాతీయ సమైక్యతను దేశభక్తిని, పెంపొందించేందుకు గాను, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సహకారంతో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ ను నిర్వహించినట్లు,ఎంపీ,రాజ్యసభ సభ్యులు కేసరి దేవ్ సిన్హా జ్వాల తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ ఛార్జ్ గా నియమితులైన ఆయన బుధవారం నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇందులో భాగంగా ఈనెల 31 నుండి నవంబర్ 25 వరకు జిల్లాలలో విడుతలవారీగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను జిల్లా స్థాయిలో నిర్వహించాలని, ప్రతి పాదయాత్ర ఎనిమిది నుండి పది కిలోమీటర్లు ఉండేలా చూడాలని, ఈ పాదయాత్రలో కనీసం 500 మంది యువత,విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. ఇదే అంశంపై నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎంపీ, రాజ్యసభ సభ్యులు కేసరిదేవ్ సిన్హా జ్వాల, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో సర్దార్ @150 యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని, విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సర్దార్ @150 యూనిటీ మార్చ్ పై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

విశాఖపట్నం

ముంపు ప్రాంతాల్లో బోటులో ప్రయాణించిన గంటా*

*ముంపు ప్రాంతాల్లో బోటులో ప్రయాణించిన గంటా* * విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* _భీమిలి మండలం పెద నాగమయ్యపాలెంలో ముంపు బాధితులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బోటులో వెళ్లి పరామర్శించారు. తుపాను రక్షణ కేంద్రంలో తలదాచుకుంటున్న 32 కుటుంబాలకు నిత్యావసరాలను అందజేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు బాధితులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు._

తెలంగాణ

చేనేతల ఆవేదన

*చేనేతల ఆవేదన* నాటి స్వదేశీ ఉద్యమానికి నాంది చేనేత. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి ఆశ్చర్యపరచిన కళా నైపుణ్యాలు చేనేత కళాకారులవే. భవిష్యత్ తరాలలో ఈ కళాకారులు కలగానే మిగిలిపోతారని ఆవేదన. ఒకవైపు ప్రపంచీకరణ, మరో వైపు యాంత్రికరణ వస్త్రాలపై ఆసక్తి వెరసి నేతన్నపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి అవుతున్న చేనేత జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారంటే ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వాలకి ఎంతగానో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల కొరకు చేనేతభరోసా, నేతన్న పొదుపు లాంటి కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. చేనేత కార్మికులును రుణ విముక్తులను చేయడం కోసం రాష్ట్రంలోని చేనేత కార్మికులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తానని గత ఏడాది సెప్టెంబర్ 9న NIHT ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఇప్పటికీ 14 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు. చేనేత కార్మికుల లక్ష రుణమాఫీకి లక్ష కారణాలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎన్నికల కోడ్ మరియు సరిపడా బడ్జెట్ కేటాయింపులు ఇవ్వకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతుంది. అలాగే చేనేత కార్మికులకు పని కల్పించే సహకార సంఘాల వ్యవస్థ మూతపడి సంవత్సరాలు గడుస్తున్నాయి. సహకార సంఘాలకు పాలకవర్గాలు లేక సుమారుగా ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చేనేత వస్త్రాలు ప్రభుత్వం TSCO ద్వారా కొనుగోలు చేయకపోవడంతో ఎగుమతులు లేక వస్త్ర నిలువలు పేరుకుపోయాయి. దయనీయ పరిస్థితిలోకి చేనేత వ్యవస్థ చేరుకున్నది. చేనేత వ్యవస్థలోని కార్మికులకు పని దొరుకకా కులవృత్తిని వదులుకోలేక ఇతర వృత్తుల పనులు చేయలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతపై ప్రత్యేక దృష్టిని పెట్టి వారికి బడ్జెట్లో అధిక మొత్తంలో కేటాయింపులు, సబ్సిడీలను సంక్షేమ పథకాలను అందించడం, చేనేత డిజన్లను ప్రింటింగ్ చేయకుండా కట్టడీ చేయడం, చేనేత వస్త్రాలపై, నూలు రంగు రసాయనాలు, ముడి సరుకులపై ZERO GST తీసుకురావసిఉన్నది. నేతన్నల సంక్షేమాన్ని కాంక్షించి, వారికి దీర్ఘకాలికంగా ఆర్థిక చేయూతనిచ్చే పథకాలు తీసుకురావాలి. కులవృత్తిని చేసుకుంటున్న అణగారిన వర్గాలు, ముఖ్యంగా మనకు నాగరికత నేర్పిన నేతన్నలకి వెన్నుదన్నుగా నిలబడడమే ప్రభుత్వలా లక్ష్యం కావాలి. అప్పుడే నేతన్న కుటుంబాల్లో నిజమైన వెలుగులు నిండి తిరిగి చేనేత పూర్వ వైభవం సంతరించుకోగలదు. -చెరుపల్లి రఘుపతి నేత, నల్లగొండ.

జోగులాంబ గద్వాల

పాలమూరుకు వాతావరణ శాఖ అలెర్ట్…. సెల్ ఫోన్లకు సందేశాలు

పాలమూరుకు వాతావరణ శాఖ అలెర్ట్…. సెల్ ఫోన్లకు సందేశాలు రాబోయే 3గంటల్లో ఉమ్మడిపాలమూరు జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజలకు సెల్ ఫోన్ లకు సందేశాల (SMS) ద్వారా అలెర్ట్ జారీ చేస్తోంది. మహబూబ్నగర్ వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట నగర్ కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాలలో వర్షం పడుతుంది అని అంచనా వేస్తూ. ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచిస్తోంది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.