Wednesday, 8 April 2026

Blog

తిరుపతి

*బైకు ఢీకొనడంతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి* *మానవత్వం చాటుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ శ్రీ*

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని శేష సాయి కళ్యాణ మండపం ఎదురుగా ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ క్యాంపు కార్యాలయం సమీపంలో నేషనల్ హైవే రోడ్డు దాటుతున్న మన్నే ముత్తూరు పంచాయతీ గంపల కండ్రిగ గ్రామానికి చెందిన పల్లికొండ పుల్లయ్య అనే వ్యక్తి హైవేపై నడిచి వెళ్తుండగా నాయుడుపేట వైపు మోటార్ బైకు పై ఇద్దరు వ్యక్తులు అతి వేగంగా వస్తూ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ శ్రీ వెంటనే స్పందించి రోడ్డుమీద రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని స్వయంగా ఎమ్మెల్యే దగ్గరుండి హాస్పిటల్ కి తరలించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పల్లికొండ పుల్లయ్య మరణించాడు. సమాచారం తెలుసుకున్న సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతి

*సూళ్లూరుపేట వద్ద రోడ్డు ప్రమాదం ప్రయాణికులకు స్వల్ప గాయాలు*

సూళ్లూరుపేట జాతీయ రహదారిపై చెన్నై నుంచి వస్తున్న కారు ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టడం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవర్ మరియు ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు కాగా వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి అపాయం కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు .

కర్నూలు

గాజులదిన్నె ప్రాజెక్టును పరిశీలించిన:-కలెక్టర్ డా సిరి

గాజులదిన్నె ప్రాజెక్టును పరిశీలించిన:-కలెక్టర్ డా సిరి ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 29(పున్నమి ప్రతినిధి) గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్)ను కలెక్టర్ డాక్టర్ సిరి బుధవారం సందర్శించారు. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం గురించి ఇరిగేషన్ ఎస్సీ బాలచంద్ర, ఈఈ పాండురంగయ్య, ఏఈ అలీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొంథా తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు. ప్రాజెక్ట్ కింద ఆయకట్టు వివరాలు తెలుసుకున్నారు.

తిరుపతి

*ఇస్రో నుంచి మరో కీలక ప్రయోగానికి అంత సిద్ధం : ఇస్రో*

మన ‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)’మరో బారి ప్రయోగానికి సంసిద్ధం అయ్యింది,ఈ ఏడాది నవంబర్ 2న తిరుపతి జిల్లా లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM3-M5 బాహుబలి రాకెట్ ద్వారా cms-03 ఉపగ్రహన్నీ ప్రయోగించడానికి సిద్ధం అయ్యింది.4400కేజీల బరువు ఉన్న GSAT-7R ఉపగ్రహన్నీ భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని GTO ఆర్బిట్ లోకి పంపడానికి శాస్త్రవేత్తలు సిద్ధం అవుతున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో మోంథా తుఫాన్ ప్రభావం: లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వరద పరిస్థితులు

మోంథా తుఫాన్ ప్రభావం మరియు అల్పపీడనం కారణంగా నందిగామ పురపాలక సంఘ పరిధిలో భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, ప్రజల వసతి, రహదారి పరిస్థితులు భయంకరంగా మారాయి. మునిసిపల్ జి.లోవరాజు ఈ ప్రాంతాలను పరిశీలించారు. వరద నీరు చేరిన ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి ఆహార సదుపాయాలు అందజేశారు. ప్రధాన డ్రెయిన్లలో నిలిచిన వరద మరియు మురుగు నీటిని జె.సి.బీ సాయంతోతొలగించడం జరిగింది. ప్రజలకు అత్యవసరం కాకపోతే ఇళ్ల నుంచి బయటకు రాకుండా సూచనలు ఇవ్వబడ్డాయి. సమస్యలపై తక్షణం స్పందించేందుకు పురపాలక సంఘ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో మునిసిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.ఫణి శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కే.దుర్గా ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కర్నూలు

వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్

వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్ ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 29(పున్నమి ప్రతినిధి) గోనెగండ్ల పరిధిలోని కులుమలలో కలెక్టర్ డాక్టర్ సిరి పర్యటించారు.జాతీయ ఆహార నూనె గింజల పథకం ద్వారా రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం వారి వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.రైతులకు ఉచితంగా 150 క్వింటాళ్ల వేరుశనగ ప్యాకెట్లను అందిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ

ఉరేసుకుని పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య*

పున్నమి ప్రతినిధి: తెలంగాణ : జడ్చర్ల మున్సిపాలిటీలో సోమవారం పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ (39) ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త నారాయణపేటలో మెడికల్ షాప్ నడుపుతుంటారని, అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి పోతుంటారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ ఫుటేజ్, రాజశ్రీ ఫోన్ వీడియో కాల్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కర్నూలు

ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం

ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ లో గోనె సంచుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు, మార్కెట్ యర్డు చైర్మన్ మల్లయ్య గా రు ప్రమాద ఘటన స్థానానికి చేరుకొని అగ్ని మాపక సిబ్బందికి సమాచార అందించి మంటలు అదుపులోకి తీసుకోచ్చారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి కూడా సంఘటన జరిగిన ప్రదేశం వద్దకు చేరుకొని చర్యలు చేపట్టారు.

కర్నూలు

ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం

ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ లో గోనె సంచుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు, మార్కెట్ యర్డు చైర్మన్ మల్లయ్య గా రు ప్రమాద ఘటన స్థానానికి చేరుకొని అగ్ని మాపక సిబ్బందికి సమాచార అందించి మంటలు అదుపులోకి తీసుకోచ్చారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి కూడా సంఘటన జరిగిన ప్రదేశం వద్దకు చేరుకొని చర్యలు చేపట్టారు.

జోగులాంబ గద్వాల

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటంను కొనసాగిస్తాం.BRSV

జోగులాంబ గద్వాల పున్నమి ప్రతినిధి: *ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటంను కొనసాగిస్తాం.* *హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం భారీ విజయవంతం మరియు విద్యార్థి గళం పెను ఉప్పెన* *BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య* ఈరోజు బిఆర్ఎస్వీ రాష్ట్ర పిలుపు మేరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చేపట్టిన *హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ ముట్టడి* కార్యక్రమం ను *500 పైగా విద్యార్థులతో గద్వాల కలెక్టరేట్ కార్యాలయంను ముట్టడి చేయడం జరిగింది.* *అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.* ఈ ముట్టడి కార్యక్రమంనకు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, పార్టీ జిల్లా నాయకులు గంజిపేట రాజు, మైనారిటీ రాష్ట్ర నాయకులు అతికూర్ రహమాన్,అలంపూర్ నియోజకవర్గం నాయకురాలు ప్రేమలత, కొండాపురం కృష్ణ రెడ్డి హాజరైనారు* మరియు BRSV నాయకులు *రంగస్వామి, కిరణ్, మల్దకల్, సాయన్న, పైపాడు రాజు,బసీర్, వి. రాజు, వీరేష్, ఆఫ్రిద్, రహీమ్, భువన మరియు విద్యార్థులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.* *ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ..* * బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రైవేట్ కాలేజీలకు ఇంతవరకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గం. దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు మూతపడడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంది అని అన్నారు. * విద్యార్థులకు 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తానని మోసం. * విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తానీ మోసం. * 18 ఏళ్లకు పైబడిన చదువుకుంటున్న విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తానని మోసం. * నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం. * సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మోసం. * ఈరోజు రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీ ల యజమాన్యాలు కాలేజీలను మూత చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం రేవంత్ రెడ్డి సర్కార్కు సిగ్గుచేటు అని అన్నారు. * విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి.. * విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల పై చదువులకు వెళ్ళడానికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. * కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ పనులు చేసిన తమ మంత్రులకు బిల్లులు క్లియర్ చెసింది కానీ విద్యాసంస్థ యాజమాన్యం లకు మాత్రం ఫీజురీయింబర్స్మెంట్ బిల్లులు క్లియర్ చేయలేకపోయారు.. * ఒక వైపు గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తు మరొ వైపు SC, ST, BC పేద విద్యార్థులకు ఫీజు రియాంబర్స్ మెంట్ ఇయ్యాక దాదాపు 22 నెలలు డిగ్రీ పూర్తి అయినా విద్యార్థులు పై చదులకు పోవడానికి TC లు ఇయ్యకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం చేస్తున్నా రేవంత్ రెడ్డి.. * 22 నెలలు నుంచి విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి.. * విదేశీ విద్యను అభ్యసిస్తునటువంటి అంబేద్కర్ స్కాలర్ షిప్ SC ST, BC జ్యోతిరావు పూలే స్కాలర్ షిప్, మైనారిటీ సీఎం విద్యార్థులకి గత మూడు సంవత్సరల నుండి పెండింగ్ లో ఉన్నటువంటి 350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు… * అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులను మోసం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం. వారు ఎవరైతే పది పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే 15000, డిగ్రీ పాస్ అయితే 25000, పిజి పాస్ అయితే లక్ష రూపాయలు, పీహెచ్డీ ఏం ఫీల్ పాస్ అయితే 5 లక్షలు ఇస్తా అని ఇవాళ నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం. * దేశంలో అత్యధికంగా క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డి మన రాష్టానికి హోం శాఖ మంత్రిగా కొనసాగడం దురదృష్టకరమైన అన్నారు. * రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 15 లక్షల విద్యార్థులకు 8000 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్లో పెట్టడం సిగ్గుచేటు. బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యార్థుల పైన రేవంత్ రెడ్డి సర్కారు కక్ష సాధించడం దుర్మార్గమని అన్నారు. * పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేసె వరకు బిఆర్ఎస్వీ తరుపున మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.