Wednesday, 8 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చెరువులను పరిశీలించిన, డి ఈ రమణారావు, ఏ ఈ లు శ్రీనివాసులు, మహేంద్ర, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి..!

వింజమూరు అక్టోబర్ 29 పున్నమి పత్రిక ప్రతినిధి వింజమూరు మండలంలో మొంథా తుఫాన్ ప్రభావంతో వింజమూరు మండలం లో ఉన్న 31 చెరువులకు గాను 17 చెరువులు పూర్తిగా నిండినట్లు 12 చెరువులకు 75% నీరు చేరినట్లు, మరో రెండు చెరువులకు 25 శాతం నీరు చేరినట్లు ఇరిగేషన్ డిఈ రమణారావు తెలిపారు. బుధవారం ఇరిగేషన్ డి ఈ రమణారావు, ఏ ఈ లు మహేంద్ర,శ్రీనివాసరావు, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, తో కలిసి ఏ ఈ మహేంద్ర చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊటుకూరు, జువ్వు గుంట పాలెం చెరువులు, ప్రమాదపుటంచున ఉన్నాయని, జుగుంటపాలెం చెరువు అలుగు సమీపంలో బండ్ల బాట వద్ద నీరు బయటకు వస్తుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన చెరువు కట్టకు మరమ్మత్తుల చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఊటుకూరు చెరువు కట్ట బలహీనంగా ఉందని తొమ్మిది లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ పంపించడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి కట్ట బలహీనంగా ఉన్న ప్రాంతంలో మట్టిని తోలి సదును చేసేందుకు ప్రయత్నం ప్రయత్నం చేస్తామన్నారు. నల్లగొండ బొడ్డు వాగు చెరువు, చంద్రపడియ చెరువు, బుక్కాపురం చెరువు, మలపరాజు వాగు చెరువు, శంఖవరం చెరువు, ఊటుకూరు ఊర చెరువు, తక్కెళ్ళపాడు చెరువు, రావిపాడు పెద్ద చెరువు, కాటేపల్లి పెద్ద చెరువు, తమీద పాడు పెద్ద చెరువు, బాడవ చెరువు, ఇర్ల చెరువు, నల్లగొండ్ల ఊర చెరువు, కాటేపల్లి ఊర చెరువు, రావిపాడు ఊర చెరువు, బత్తిన వారి పల్లి పెద్ద చెరువు, బొమ్మరాజు చెరువులు పూర్తిగా నిండాయన్నారు. ఎర్రబల్లి పాలెం పెద్ద చెరువు, వింజమూరు పాత చెరువు, రామలింగారెడ్డి పెద్ద చెరువు, ఎర్ర చెరువు, అంకాలమ్మ చెరువు గుండె మడగల, ఏకమ్మ చెరువు జువ్వు గుంట పాలెం, మిట్ట చెరువు నంది గుంట, ఏ కిస్తీపురం పెద్ద చెరువు, ఏ కిస్తీపురం గ్రామ చెరువు, నంది గుడి వాగు ఊటుకూరు పెద్ద చెరువు, చింతలపాలెం చెరువు, చాకలి కొండ చెరువులు 75% నిండాయని తెలిపారు. మోట చింతలపాలెం చెరువు, ఓబులమ్మ చెరువులకు 25% నీరు చేరినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. వారి వెంట ఏగినేని శ్రీనివాసులు రైతులు ఉన్నారు.

ఖమ్మం

డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం

*డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం* *నీటి ప్రభావంలో డీసిఎం వ్యాను మరియు డ్రైవరు కొట్టుకుపోవడం జరిగింది* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29 ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అంజనపురం వద్ద నిమ్మ వాగులో డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వరదలో వాహనంతో పాటు డ్రైవర్ కూడా కొట్టుకుపోవడం జరిగింది విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాగా అధికారులు ముమ్మరంగా గాలింపులు చేపట్టారు స్థానిక పోలీసులు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు గాలింపులు చేపట్టినప్పటికీ డీసీఎం వ్యాను మరియు డ్రైవర్ ఆచూకీ అనేది కనబడలేదు అధిక వర్షాలు కురవడం వల్ల వరద ప్రభావము అధికముగా ఉండడంవల్ల ప్రస్తుతము డీసీఎం వ్యాన్ నీటిలో మునిగిపోవడం ఎంతసేపటికి బృందాలు వెతికినప్పటికీ ఆచూకీ అనేది కనపడలేదు జన్నారం గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకోగా డ్రైవరు నిర్లక్ష్యము వల్ల ఈ ప్రమాదము జరిగిందని నీటి ప్రభావము ఎక్కువగా ఉంది ఇటువైపుగా రావద్దు అని చెప్పినప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వంతెన దాటాలని ప్రయత్నించడంలో సగం దూరం రాగానే వ్యాను నీటి ప్రభావానికి కొట్టుకుపోవడం జరిగింది ఈ ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యం అని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటలలోనే చేరుకొని ఇక్కడి పరిస్థితులను పరిశీలించడం జరిగింది ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు ప్రజలు కూడా అప్రమతంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

అన్నమయ్య

జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి వాలీబాల్‌కు అక్షర హై స్కూల్ విద్యార్థి ఎంపిక

చిట్వేల్ మండలంలోని అక్షర హై స్కూల్ విద్యార్థి కె. జశ్వంత్ జిల్లా స్థాయి అండర్–17 వాలీబాల్ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఆదివారం నాడు కడపలోని మాంటిస్సోరి జగతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన అండర్–17 బాల, బాలికల వాలీబాల్ పోటీల్లో ఆయన ప్రతిభను ప్రదర్శించారు. కె. జశ్వంత్ రానున్న రోజుల్లో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అక్షర హై స్కూల్ కరస్పాండెంట్ ఆర్. మల్లికార్జున నాయుడు, ప్రధానోపాధ్యాయిని స్రవంతి మేడం విద్యార్థి ఎంపిక పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జశ్వంత్ భవిష్యత్తులో జాతీయస్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థిని అభినందిస్తూ పాఠశాల తరఫున ఆయన తల్లిదండ్రుల చేతుల మీదుగా చిరు కానుకతో సత్కరించారు. ఈ విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు పి. సుకుమార్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించారు. చిట్వేల్ అక్షర హై స్కూల్ విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ, “మన చిట్వేల్ నుంచి రాష్ట్రస్థాయికి జశ్వంత్ వెళ్ళడం గర్వకారణం” అని పేర్కొన్నారు.

తెలంగాణ

టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన : కలెక్టర్

నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) మొంధా తుఫాను కారణంగా భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు వర్షాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1 8 0 0 4 2 5 1 4 4 2 కు సంప్రదించవచ్చు అని కలెక్టర్ తెలిపారు.

జనగాం

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ సూచన

ఈ తుఫాన్ తీవ్రంగా మారి వర్ష సూచన ఎక్కువగా ఉన్నందున ప్రజలకు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకి రాకండి అనారోగ్యం తో ఉన్నవారికి మన సహాయం కోరిన వారికి అందుబాటులో ఉండాలి అని స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని లోని కొన్నిచోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి కావున ప్రయాణికులు చూసుకొని వెళ్ళాలి అని తెలియ చేయాలి అని కోరుతున్నాను నేను మీ పసునూరి సందీప్ కుమార్ స్టేషన్ ఘనపూర్

ఆంధ్రప్రదేశ్

పదవ తరగతి విద్యార్థుల పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలెను

*అందరు ఉపవిద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది… రేపు అనగా 30.10.2025 నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు యధావిధిగా పనిచేయును.* *అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులు మరియు 100 డేస్ యాక్షన్ ప్లాన్ మీద అన్ని పాఠశాలల వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలెను.* *జిల్లా విద్యాశాఖాధికారి* *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.*

అనకాపల్లి

మొంథా తుఫాన్ కి గురైన ప్రదేశాలను పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్..!!

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అక్టోబర్ 29( పున్నమి న్యూస్) ప్రతినిధి (కె. ఆనంద్): మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో గిలకంశెట్టి లక్ష్మీ అనే మహిళ తాటాకు ఇల్లు కూలిపోయిందన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ తక్షణమే అధికారులతో ఎర్రవరం చేరుకిని బాధితురాలను పరామర్శించి, ప్రభుత్వం తరుపున తుఫాను నష్టంగా నమోదు చేయించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే తుఫాన్ ముప్పుకు గురైన ప్రదేశాలను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే దెబ్బతిన్న రోడ్లు, కాలువలు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు.

తిరుపతి

టీడీపీ నాయకుని సతీమణి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలు గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు మద్దిరాల రంగయ్య సతీమణి గంగమ్మ ఆకస్మిక మరణ వార్త తెలుసుకొన్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ముచ్చివోలు గ్రామానికి వెళ్లి గంగమ్మ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తిరుపతి

రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ కు స్వాగతం పలికిన కోలా ఆనంద్

తిరుమల దర్శనానికి కుటుంబ సమేతం గా విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు,రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పెద్దలు సి.యం. రమేష్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకో గా వారికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కలంకారి వస్త్రముతో సత్కరించడం జరిగింది.

తెలంగాణ

దేవరకొండ డివిజన్లో భారీ వర్షాలతో ప్రజల ఇక్కట్లు !

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) దేవరకొండ డివిజన్లో భారీ వర్షాలు ఎక్కువగా ఉండడం, డివిజన్ మొత్తంలో 12 సెంటీమీటర్ల వర్షం కురవడం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ డివిజన్ లో పర్యటించారు. కొండమల్లేపల్లి మండలం గిరిజనగర్ తండా వద్ద పై నుండి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తూ ప్రధాన రహదారిపై నిలిచిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గమనించి తక్షణమే వర్షపు నీటిని మళ్లించి, ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాజ్ వేలు, రహదారుల బ్రిడ్జ్ లపై ప్రయాణించవద్దని సూచించారు. అలాగే వర్షం వల్ల తడిసి పడిపోయేందుకు అవకాశం ఉన్న ఇళ్లలో ఉండవద్దని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటా దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి,తాహసిల్దార్, ఎంపీడీవో,తదితరులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.