Wednesday, 8 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

మునేరు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, బుధవారం మొంథా తుపాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మునేరు నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, మునేరు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఎగువప్రాంతాల నుంచి అధికంగా వస్తున్న వరద నీరు బుధవారం రాత్రి నాటికి దిగువ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ప్రజలకు నిరంతర సమాచారం అందించాలి. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలి,” అని తెలిపారు. అదనంగా, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించా లంటూ అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. అలాగే, నది పరివాహక ప్రాంతాల గ్రామాలు, వంతెనలు, రహదారుల పరిస్థితులను నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు.

కామారెడ్డి

అన్నారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధర కల్పన

– సొసైటీ చైర్మన్‌ స్వామి కామారెడ్డి, 29 అక్టోబర్‌, ( పున్నమి ప్రతినిధి ) : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న ధాన్య కొనుగోలు కార్యక్రమం భాగం గా కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం,అన్నారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం, వడ్లు అరబెట్టే మిషన్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కేంద్రా న్ని మాచారెడ్డి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ స్వామి గౌడ్‌, మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్‌ స్వామి గౌడ్‌ మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా తమ వడ్లను విక్రయించాలనీ, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతుల కు గిట్టుబాటు ధర కల్పిస్తోందని అన్నారు.ముఖ్యం గా సన్నవడ్లకు ప్రతి క్వింటాల్‌ పైగా 500 రూపాయ ల బోనస్‌ అందిస్తున్నదని తెలిపారు. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోం దని పేర్కొన్నారు.సొసైటీ సీఈఓ చంద్రరెడ్డి మాట్లా డుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వడ్ల సేకరణ, కొలతలు, చెల్లింపుల ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహిం చేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రా మంలో కొత్తగా ఏర్పాటు చేసిన వడ్లు అరబెట్టే మిషన్‌ రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండబో తోందని, పంట సీజన్‌లో తడువడ్లు ఆరబెట్టే సౌక ర్యం వల్ల సమయానుకూలంగా ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలకు సరఫరా చేయగలరని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్‌ నాయకులు మద్దికుంట దయానంద్‌, గంగరెడ్డి, సల్మాన్‌, కిసరి లక్ష్మణ్‌, దేవదాసు, చంద్రం, మండ్ల బాలనర్సు, రవి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

ఇబ్రహీంపట్నం పట్టణ పరిధిలోని *వైష్ణవి ఫంక్షన్ హాల్ 2 నందు మెగా రక్తదాన శిబిరం

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9133469506 పోలీస్ అమరవీరుల వారోత్సవలకు సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్ ACP, KPV Raju ఆధ్వర్యంలో, రేపు అనగా 30.10.2025 గురు వారం ఉదయం 10 గంటలకు ఇబ్రహీంపట్నం పట్టణ పరిధిలోని *వైష్ణవి ఫంక్షన్ హాల్ 2 నందు మెగా రక్తదాన శిబిరం కలదు*, దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ మహేశ్వరం జోన్ DCP D. సునీత రెడ్డి IPS గారు హాజరవుతారు, అలాగే ఇబ్రహీంపట్నం డివిజన్ లోని, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, యాచారం, మంచాల, గ్రీన్ ఫార్మా సిటీ, మాడ్గుల పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరువ్వుతారు, అలాగే ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని, యువకులు, యువజన సంఘల సభ్యులు,క్రీడాకారులు, మరియి ప్రజలు ఈ రక్త దాన శిబిరం లో పాల్గొనాల్సిందిగా కోరడమైనది, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరడమైనది. ఇట్లు, M. మహేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్.

తిరుపతి

పలువురి మరణానికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో పలువురి మరణానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సంతాపం తెలియజేశారు. బుధవారం శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామానికి చెందిన టిడిపి ఎస్సీసెల్ సీనియర్ నాయకులు మద్దిరాల రంగయ్య సతీమణి గంగమ్మ ఆకస్మికంగా మరణించడంతో వారికి మరియు ఏర్పేడు మండలంలోని ఆమండూరు పంచాయతీకి చెందిన సుబ్రహ్మణ్య యాదవ్ మరణించడం తో ఈ ఇరువురి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయాలకు పూలమాలుల వేసి నివాళులర్పించడం జరిగింది.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

జర్నలిస్టు మస్తాన్‌కు జర్నలిస్టు సంఘ నాయకుల చేయూత

నందిగామ స్థానిక జర్నలిస్టు మస్తాన్ అనారోగ్యంతో బాధ పడుతుండగా, జర్నలిస్టు సంఘ నాయకులు ఆయనకు అండగా నిలిచారు. గతంలో గుండెకు బైపాస్ సర్జరీ జరిగిన మస్తాన్ ఇటీవల కొంత అస్వస్థతకు గురికావడంతో నందిగామలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘ జాతీయ నాయకులు పి. మీరాహుస్సేన్ ఖాన్, జిల్లా నాయకులు అకుల వెంకటనారాయణ, పఠాన్ సైదాఖాన్, జర్నలిస్టులు హామీద్, అన్నవరపు చంద్రశేఖర్ తదితరులు మస్తాన్ ను పరామర్శించారు. సంఘం తరఫున రూ.5,000 నగదు, 25 కిలోల బియ్యం, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగ ది న్యూ ఇండియన్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, APBWJA వ్యవస్థాపక అధ్యక్షుడు పి. మీరా హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ – “మస్తాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలన్నది మన అందరి బాధ్యత” అన్నారు. జర్నలిస్టు మస్తాన్ కు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుం దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

తిరుపతి

ముంతా తుఫాన్ నేపథ్యంలో పురపాల సంగతికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు

*ఈ రోజు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మొంథా తుఫాను నేపథ్యంలో శ్రీకాళహస్తి టౌన్ పురపాలక సంఘ అధికారులతో పురపాలక పరిధిలో చేపట్టిన తుఫాన్ సహాయక చర్యలపై రివ్యూ నిర్వహించడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ అభివృద్ధిపై, పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది.*

ఎన్ టి ఆర్ జిల్లా

మున్సిపల్ మరియు ఎలక్ట్రికల్ సిబ్బందికి రైన్ కోట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

జగ్గయ్యపేట పట్టణానికి చెందిన కీర్తిశేషులు పేరూరి బ్రహ్మ ఉపేంద్రరావు – భారతి ట్రస్టు ఆధ్వర్యంలో, వారి అల్లుడు పోలా శ్రీనివాసరావు సౌజన్యం తో మున్సిపల్ మరియు ఎలక్ట్రికల్ శాఖ సిబ్బందికి రైన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిబ్బందిని ప్రోత్సహిస్తూ, వర్షాకాలంలో వారు ప్రజలకు అందించే సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు, డీసీ కెనాల్ చైర్మన్ ఏలూరి గోపాలరావు,మున్సిపల్ కమిషనర్ తులసి కృష్ణారావు, ధారా వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకాణికి కలలో కూడా సోమిరెడ్డే కనిపిస్తున్నాడు* పీఏసీఎస్ ఛైర్మన్ తలచీరు.మస్తాన్ బాబు

*కాకాణికి కలలో కూడా సోమిరెడ్డే కనిపిస్తున్నాడు* పీఏసీఎస్ ఛైర్మన్ తలచీరు.మస్తాన్ బాబు పొదలకూరు : మాజీమంత్రి కాకానికి కలలో కూడా సోమిరెడ్డి కనిపిస్తున్నాడని 2029 లోను ఓటమి తప్పదనే భయం ఆయనను వెంటాడుతుందని పొదలకూరు పిఎసిఎస్ చైర్మన్ తలచీరు. మస్తాన్ బాబు అన్నారు బుధవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో టిడిపి నాయకులు బొద్దులూరు మల్లిఖార్జున్ నాయుడు, కోడూరు.పెంచల భాస్కర్ రెడ్డి, కలిచేటి.ప్రభాకర్ రెడ్డి,గంటా.మల్లిఖార్జున్ యాదవ్,అలుపూరు శీనివాసులు తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలచీర మస్తాన్ బాబు మాట్లాడుతూ కాకాణి కారుల్లో షికార్లు చేయడం కాదు..కాలనీల్లోకి వస్తే వైసీపీ నేతల ఘన కార్యాలు తెలిసేవన్నారు.పొదలకూరు మండలంలో రోడ్లు వేసినా, కాలువలు పనులు జరిగినా, సోమశిల నీళ్లు తెచ్చినా, ఎత్తిపోతల పథకం వచ్చినా, ఆస్పత్రులు కట్టినా సోమిరెడ్డి పుణ్యమేనన్నారు.పరామర్శల పేరుతో పర్యటించిన కాకాణి నావూరుపల్లి ఎస్టీలతో రోడ్డుపై మాట్లాడటం కాదుఅని,కారు దిగి కాలనీలోకి వెళ్లుంటే వైసీపీ నేతల ఘనకార్యం తెలిసేవన్నారు.2023లో 5 గిరిజనుల ఇళ్లకు సంబంధించిన బిల్లులు చేసుకుని ఈ రోజుకీ నిర్మాణం పూర్తి చేయలేదన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక మేం వారి అక్రమాలను బయటపెడితే అప్పుడొచ్చి సున్నం పూశారన్నారు.సీఎస్ఆర్ నిధులతో అదనంగా ప్రతి ఇంటికి మంజూరైన రూ.15 వేలను కూడా గిరిజనులకు తెలియకుండా వైసీపీ నేతలే కొట్టేశారన్నారు.నావూరుపల్లిలో రూ.20 లక్షలతో డ్రైన్లు నిర్మిస్తే ఈ రోజు చుక్కనీరు ప్రవహించే పరిస్థితి లేదన్నారు.ఊళ్లలోకి వచ్చి తమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నోటికొచ్చినట్టు దూషించడం కాదు..ఆయన చేపట్టిన అభివృద్ధి పనులను చూసి కనువిప్పు కలిగించుకోవాలన్నారు.2024లో 18 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయిన తాను 2029లో మళ్లీ సోమిరెడ్డి చేతిలో 36 వేల ఓట్ల తేడాతో ఓడిపోతానని భయం కాకాణిని వెంటాడుతోందన్నారు.

రంగారెడ్డి

కల్వకుంట్ల కవిత జనం బాట ఘన విజయం –రంగారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : బుధవారం విలేఖరులు అందజేసిన ఒక ప్రకటనలో కప్పాటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని ప్రాజెక్టు పనులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ జాగృతి జనం బాటలో కవిత ముంపు గ్రామాల్లో ప్రజల పరిస్థితిని తెలుసుకుంటూ, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని, ముంపు గ్రామాల్లో పునరావాస పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గత రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రెస్ మీట్‌లు, సోషల్ మీడియా విమర్శలతోనే సరిపెట్టుకున్నాయి తప్ప, ప్రజల మధ్యకు వెళ్లి వారి బాధలను తెలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. కానీ, కవితక్క నీళ్లు, నియామకాలు, నిధులు, అమరవీరులు, సామాజిక తెలంగాణ అంశాలపై ప్రజల్లోకి వెళ్లి మాట్లాడడంతో ప్రతిపక్ష పార్టీలు కలవరపడుతున్నాయి అని కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు.

ఖమ్మం

రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్..

రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్.. *నీట మునిగిన వరి పొలాలు పత్తి పంటలు* *తుఫాను తాకిడికి రైతుల కలలన్నీ నీటిలో కలిసిపోయాయి* *మొంథా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సం ఈదురుగాలులతో సృష్టించాయి* ఖమ్మం జిల్లాలో మొంథా తుఫాన్ తాకిడికి రైతుల జీవితాలను అల్లాకల్లోలం చేసింది ఆరు కాలం కష్టపడి చేతికొచ్చిన పంట అంతా నీటి లో కలిసిపోయి ఆర్థికంగా రైతుల జీవితాలను తలకిందులుగా చేసింది, కుండపోత వర్షాలు ఈదురు గాలులు వల్ల పత్తి పంటలు వరి పొలాలు ముంచెత్తాయి. వేల ఎకరాలు వరి పంట మరియు పత్తి పంట కంకులు చేతికి వచ్చిన దశలో నీటిలో తేలుతూ రైతుల కళ్ళల్లో కన్నీటి దారాలు పారుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే నీటిలో మునిగిపోతుంటే గుండె పగిలేలా ఏడవడం తప్ప చేసేది ఏమీ లేదు అన్నట్టు రైతుల గోస వెళ్లవేల అర్ధనాదాలు చేయడం తప్ప మరి ఏమీ లేదు రైతులు ఎకరానికి 40 వేల నుండి 60 వేల వరకు నష్టం జరిగి ఉంటుంది అని అంచనా ప్రస్తుతం 40 బస్తాలు పండవలసిన వరి పంటలు 10 నుండి 15 బస్తాల వరకు దిగుబడి తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది నీరు నిల్వ ఉండడం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది క్రమంగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక గ్రామాల్లో రవాణా స్తంభవించింది రోడ్లు అంత గుంతల మయంగా ఏర్పడ్డాయి రైతులు తమ పంట లను ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి ఆర్థిక భరోసా కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు ఇంత పెద్ద నష్టం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఈ పంటల మీదే ఆధారపడి జీవిస్తున్న అని రైతులు తమ బాధను ఈ విధంగా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు తక్షణ సహాయం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.