Tuesday, 7 April 2026

Blog

నాగర్‌కర్నూల్

భారీ వర్షానికి లతీపూర్ గ్రామ సమీపంలో నేషనల్ హైవేపై కులుతున్న బ్రిడ్జ్

భారీ వర్షానికి నేషనల్ హైవేపై కుప్పకూలిన బ్రిడ్జ్ తెలంగాణ : నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై రాత్రి కురిసిన భారీ వర్షానికి డిండి వాగుపై నిర్మించిన వంతెన ఒక పక్కకు కూలిపోయింది. దీంతో హైదరాబాద్-శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు. తుఫాను ప్రభావంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది…

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎందుకు ఆంధ్రప్రదేశ్ తుఫాన్లకు ఎక్కువగా గురవుతుంది !

భౌగోళిక & వాతావరణ కారణాలు ఆంధ్రప్రదేశ్ తరచూ తుఫాన్ల దాడికి గురవుతున్న రాష్ట్రాల్లో ఒకటి. దీనికి ప్రధాన కారణాలు భౌగోళిక (Geographical) మరియు వాతావరణ (Climatological) అంశాలు. రాష్ట్రానికి సుమారు 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరరేఖ ఉంది — ఇది భారతదేశంలో రెండవ పొడవైన తీరప్రాంతం, తమిళనాడుకు తర్వాత. ఈ విస్తృత తీరరేఖ బంగాళాఖాతానికి ఎదురుగా ఉండటం ప్రధాన కారణం. బంగాళాఖాతం ప్రపంచంలో తుఫాన్లు ఎక్కువగా ఏర్పడే సముద్ర ప్రాంతాల్లో ఒకటి కావడంతో, అక్కడ ఏర్పడిన తుఫాన్లు నేరుగా ఆంధ్ర తీరాన్ని తాకే అవకాశం ఎక్కువ. మన తీరప్రాంతం ఎక్కువగా తక్కువ ఎత్తులో ఉన్న సమతల ప్రదేశం. కొండలు లేకపోవడం వల్ల తుఫాన్లు అడ్డంకులు లేకుండా లోపలికి చొరబడి, భారీ వర్షాలు, గాలివానలు, వరదలను కారణమవుతాయి. బంగాళాఖాతం త్రిభుజాకారంలో (funnel shape) ఉండటం కూడా తుఫాన్ల తీవ్రతను పెంచుతుంది. తుఫాన్లు ఎక్కువగా తూర్పు-దక్షిణ దిశ నుంచి పశ్చిమ-ఉత్తర దిశకు కదిలే క్రమంలో, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు వంటి ప్రాంతాలు నేరుగా దెబ్బతింటాయి. తుఫాన్లు ఏర్పడటానికి సముద్రపు నీటి ఉష్ణోగ్రత 26.5°C కంటే ఎక్కువగా ఉండాలి, బంగాళాఖాతం మాత్రం ఏడాదంతా వేడిగా ఉంటుంది. ఇది తుఫాన్ల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. తుఫాన్లు ఎక్కువగా మే–జూన్ (ప్రీ-మాన్సూన్) మరియు అక్టోబర్–నవంబర్ (పోస్ట్-మాన్సూన్) కాలాల్లో వస్తాయి. ఈ కాలాల్లో గాలి దిశలు, తేమ, ఉష్ణోగ్రతలు తుఫాన్లకు అనుకూలంగా మారుతాయి. అందువల్ల, పొడవైన తీరప్రాంతం, బంగాళాఖాతం ఆకారం, అధిక ఉష్ణోగ్రతలు, గాలి దిశలు, మరియు తక్కువ ఎత్తు భూభాగం వంటి అంశాల కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్ తరచూ తుఫాన్ల ప్రభావానికి గురవుతోంది.

సిద్ధిపేట

భారీ వర్షంలోనూ విద్యుత్ సేవలు

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, విద్యుత్ సిబ్బంది నిరంతరాయ విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నారు. ఏఈ చాంద్ బాషా ఆధ్వర్యంలో ఆర్టిజన్స్ బాబు, శ్రీనివాస్, మీటర్ రీడర్ రాజశేఖర్, చిన్నకోడూరు మారుతి వానల్లోనూ 33 బ్రేక్‌డౌన్‌ను సరిచేశారు. వారి సేవలను ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తీవ్ర ప్రభావంతో ! పంటలు, రహదారులు, శాఖలకు భారీ నష్టం

మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విపరీత నష్టం సంభవించింది. మొత్తం 1,696 గ్రామాల్లోని 1.4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా 90 వేల ఎకరాల్లో వరి, 23 వేల ఎకరాల్లో పత్తి, 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు నాశనమయ్యాయి. సుమారు 75 వేల మంది రైతులు ఈ విపత్తుతో నష్టపోయినట్లు సమాచారం. అదే విధంగా 95 మండలాల్లోని 292 గ్రామాల్లో ఉద్యాన పంటలు తీవ్ర నష్టం చవిచూశాయి. పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనలు, కల్వర్టులు బీభత్సానికి గురై అనేక చోట్ల రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. సుమారు 1,800 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రోడ్లు ధ్వంసమైనట్లు అంచనా. ఆర్ అండ్ బీ శాఖకు మాత్రమే రూ.1,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్, నీటిపారుదల, హౌసింగ్ శాఖలకు కూడా భారీ నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికల్లో తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

కూలిన మట్టి ఇల్లు ని పరిశీలించిన అధికారులు

డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 డుంబ్రిగూడ మండలం గసభ పంచాయతీ కేంద్రంలో తుఫాను కారణంగా మట్టిల్లు కూలింది. దీంతో సర్పంచ్ పాంగి సునీత విషయాన్ని మండల స్పెషల్ అధికారికి మరియు ఎంపీడీవోకి చరవాణిలో తెలియజేశారు. అధికారులు హుటా హుటిన గసభ గ్రామానికి చేరుకొని కూలిన ఇంటిని పరిశీలించారు. అనంతరం గ్రామంలో మట్టి ఇళ్లలో ఉన్న 20 కుటుంబాలకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించారు. మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ ఉన్నారు.

అల్లూరి సీతారామరాజు

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ బుధవారం అరకు మండలంలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన సుంకరిమెట్ట, గాలికొండ, బిసుపురం గ్రామాలను సందర్శించారు. మొంథా తుఫాన్ కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితులను పాడేరు డీఎస్పీ సహబాజ్ అహమద్ తో కలసి ఎస్పీ పరిశీలించారు. రోడ్లపై ఉన్న వరద నీరు, చెత్త, చెట్లు, ఇతర అడ్డంకులను త్వరగా తొలగించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. ప్రజల రాకపోకలు సులభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకున్న ముందస్తు చర్యలకు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎస్పీ పర్యటనలో అరకు సీఐ ఎల్ హిమగిరి, ఎస్ఐ జి గోపాలరావు ఉన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్‌టీఆర్ జిల్లాలోనిపాఠశాలలు అక్టోబర్ 30 నుంచి ఫిట్‌నెస్ ధృవీకరణ అనంతరం పునఃప్రారంభం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ప్రకారం, పునరావాస కేంద్రాల పాఠశాలలు మినహా అన్ని పాఠశాలలు ఫిట్‌నెస్ ధృవీకరణ పూర్తయ్యాక యథావిధిగా తెరవబడతాయి. ఫిట్‌నెస్ ధృవీకరణలో తరగతి గదులు, పైకప్పులు, ప్రహరి గోడలు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఈ ధృవీకరణ ఆర్ అండ్ బీ ఇంజినీర్లు చేస్తారు, మరియు ఎంఈవోలు, తహసీల్దార్లు సరైన చర్యలు తీసుకోవాలి. పునరావాస కేంద్రాల పాఠశాల ల్లో పరిస్థితులు సాధారణ స్థితికి రాకముందు సెలవులు కొనసాగుతాయి. కలెక్టర్ సూచన ప్రకారం, సిబ్బంది, విద్యార్థులను భవనాల్లోకి అనుమతించడం ధృవీకరణ తర్వాత మాత్రమే జరగాలి.

విశాఖపట్నం

మానవసేవే మాధవసేవ అని కూటమి ప్రభుత్వం

*మానవసేవే మాధవసేవ అని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నిర్ణయాలు తో నిరూపణ అయ్యాయి* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* * తుఫాన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు, యుద్ధ ప్రాతిపదికన అన్ని ప్రాంతాల వారికి నిత్యవసర సరుకులు అనగా బియ్యం, పంచదార ,వంటనూనె ,కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి నిత్యవసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మానవత్వాన్ని చాటుకున్నట్లే అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల,వాస్తవానికి తుఫాన్ వల్ల ప్రాణ నష్టం జరగలేదు కానీ అధిక వర్షం వల్ల చాలా కుటుంబాల యజమానులు వారి ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి, కూలి పని మరియు మసీకారులు వేటకి వెళ్ళలేని పరిస్థితి, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు వెనుదండగా నిలవాలని చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయం వల్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మరియు

E-పేపర్

ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు మొబైల్ స్క్రీన్లలో వ్యక్తి పేరు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు మొబైల్ స్క్రీన్లలో వ్యక్తి పేరు మార్చి నెలకల్లా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం కంపెనీలు సన్నాహాలు మొబైల్‌లో సేవ్ చేయని నెంబర్ నుండి కాల్ వస్తే కేవలం నెంబర్ మాత్రమే వచ్చేది వ్యక్తి పేరు కోసం ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించేవాళ్ళం కానీ మార్చి నుండి నెంబర్ ఎవరి గుర్తింపు కార్డుపై తీసుకుంటే వారి పేరు ఫోన్ చేసినప్పుడు వచ్చే విధంగా సన్నాహాలు ఈ సేవలు దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం

ఖమ్మం

భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు

జన్నారం వాగు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఏన్కూరు : అంజనాపురం వాగులో డీసీఎం వాహనం కొట్టుకుపోయిన ఘటనపై అధికారులు స్పందించారు. బుధవారం రాత్రి ఏసీపీ, సీఐ, ఏన్కూరు ఎస్ఐ సంధ్య సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.వాగు నీటి ప్రవాహం, రహదారి పరిస్థితి, వాహనం కొట్టుకుపోయిన ప్రదేశం వంటి అంశాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు స్థానికులు మరియు సంబంధిత అధికారుల నుండి వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి. వాగు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రోడ్డు మరమ్మతులు చేయడం, డ్రైవర్లకు జాగ్రత్త సూచనలు ఇవ్వడం వంటి చర్యలను తక్షణమే అమలు చేయాలి అని సూచించారు.వర్షాకాలంలో ప్రజలు రాకపోకల ఇబ్బందులు పడకూడదని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. స్థానిక ప్రజలు అధికారులు వెంటనే స్పందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించడాన్ని స్వాగతించారు.ఇకనైనా ఈ వాగు వద్ద శాశ్వత పరిష్కారం తీసుకురావాలని, రహదారి మరమ్మతులు, భద్రతా బోర్డులు ఏర్పాటు చేయాలని” వారు కోరారు.ప్రతి సంవత్సరం ఇలాగే ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు పరిశీలించి చర్యలు ప్రారంభించడమే సరైన దిశలో మొదటి అడుగు అని గ్రామస్థులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.