Tuesday, 7 April 2026

Blog

తిరుపతి

వరదరాజల స్వామివారి బాలాలయ కార్యక్రమం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజల స్వామివారి ఆలయం నందు బుధవారం సాయంత్రం బాలాలయ కార్యక్రమాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టేసాయి,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, దేవస్థానం డిప్యూటీ ఈ.వో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి, ఏ.ఈఓ హేమామాల్ని,సూపర్డెంట్ రవి మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అన్నమయ్య

పర్యావరణ పరిరక్షణ మన అందరి కర్తవ్యం

ఎంపియుపి ఉర్దూ స్కూల్ నందు రెండవ రోజు భాగంగా రాయచోటి రెడ్డి కాలనీ చెర్లోపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి.జ్యోతి మాట్లాడుతూ ప్రకృతిని కాపాడేందుకు ప్రభుత్వం,స్వచ్ఛంద సంస్థలు,విద్యాసంస్థలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి అని.చెట్లు నాటడం,ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం,నీటి సంరక్షణ వంటి చర్యలు ప్రతి వ్యక్తి తన జీవితంలో అమలు చేయాలి అని.విద్యార్థులు, యువత పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో అవగాహన కల్పించాలి.ఒక చెట్టు నాటితే వంద ప్రాణాలను కాపాడినట్లే అనే నినాదంతో ముందుకు సాగితే భవిష్యత్ తరాలకు పచ్చదనం అందించగలం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి,వెంకటరమణ అధ్యాపకులు మరియు విద్యార్థినిలు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

భిక్షాటన నిషేధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఆదేశాలు – జీ.ఓ నంబర్ 58 విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటనను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో భిక్షాటన చేయకుండా ఉండేలా ప్రభుత్వం జీ.ఓ నంబర్: 58ను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ప్రజా ప్రదేశాలు, దేవాలయాలు, బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాల్లో యాచన చేయడం నిషేధం. భిక్షాటన చేసే వారిని గుర్తించి వారికి పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది.

Featured

ఎంపీపీ శ్రీ రామిరెడ్డి ద్వాజారెడ్డి గారిని సన్మానించిన సర్పంచులు ఎంపీటీసీ లు

రైల్వే కోడూరు: ఈరోజు ఉదయం విదేశీ పర్యటన ముగించుకొని తమ సొంత నియోజకవర్గానికి చేరుకున్న ఎంపీపీ శ్రీ రామిరెడ్డి ద్వాజారెడ్డి గారిని సన్మానించిన సర్పంచులు ఎంపీటీసీలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో సర్పంచులు రామకృష్ణా, హరికృష్ణ రెడ్డి, చంగల్ రెడ్డి, ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, మల్లికార్జున , బత్తల సుబ్రహ్మణ్యం, బత్తల మని, షఫీ, తేజ రెడ్డి, అనిల్ రెడ్డి, రవి నాయుడు,శ్రీరాములు, లక్ష్మయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల AI సాయంతో తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ద్వారా ఫిర్యాదు చేసిన ఆయన, ఇప్పుడు సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారంటూ మరో ఫిర్యాదు చేశారు. ఓ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను ఆధారంగా చూపిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చిరంజీవి, ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఇలాంటి పోస్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Blog

ఎంపీపీ శ్రీ రామిరెడ్డి ద్వాజారెడ్డి గారిని సన్మానించిన సర్పంచులు ఎంపీటీసీ లు

ఎంపీపీ శ్రీ రామిరెడ్డి ద్వాజారెడ్డి గారిని సన్మానించిన సర్పంచులు ఎంపీటీసీ లు రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు: ఈరోజు ఉదయం విదేశీ పర్యటన ముగించుకొని తమ సొంత నియోజకవర్గానికి చేరుకున్న ఎంపీపీ శ్రీ రామిరెడ్డి ద్వాజారెడ్డి గారిని సన్మానించిన సర్పంచులు ఎంపీటీసీ లు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో సర్పంచులు రామకృష్ణా, హరికృష్ణ రెడ్డి, చంగల్ రెడ్డి, ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, మల్లికార్జున , బత్తల సుబ్రహ్మణ్యం, బత్తల మని, షఫీ, తేజ రెడ్డి, అనిల్ రెడ్డి, రవి నాయుడు,శ్రీరాములు, లక్ష్మయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ ను పరిశీలించిన డీఐఓ

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 మొంథా తుఫాను కారణంగా అరకులోయ, డుంబ్రిగుడ మండలాల పరిదిలో ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణీలను అరకులోయ లోని ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ లో చేర్పిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా కమల కుమారి తనిఖీ చేసి, గర్బిణీ స్త్రీల ఆరోగ్య స్థితిని పరిశీలించారు. డుంబ్రిగుడ మండలం, కిల్లోగుడ పీహెచ్సీ పరిధిలోని ప్రసవానికి దగ్గరగా ఉన్న 8 మంది గర్భిణీలను ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ లో చేర్పించినట్లు పిహెచ్ఎన్ జానకి తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వర్షం అడ్డంకి – భారత్‌–ఆస్ట్రేలియా తొలి టీ20 రద్దు

కాన్‌బెర్రా: భారత్‌–ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ప్రారంభం నుంచి వర్షం అంతరాయం కలిగించడంతో ఆట పలు మార్లు నిలిచింది. చివరికి వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. మ్యాచ్‌ నిలిచిన సమయానికి టీమ్‌ఇండియా 9.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేసింది. వర్షం కారణంగా ప్రేక్షకులు నిరాశ చెందగా, రెండు జట్లూ ఒక్కో పాయింట్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇన్‌కమింగ్‌ కాల్‌లోనే కాల్‌ చేస్తున్న వ్యక్తి పేరు – మార్చి నాటికి కొత్త ఫీచర్‌ అందుబాటులోకి!

ఇకపై ట్రూకాలర్‌ వంటి యాప్‌ల అవసరం లేకుండానే ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయంలోనే కాల్‌ చేస్తున్న వ్యక్తి పేరు మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని నంబర్‌ నుంచి కాల్‌ వస్తే, ఆ వ్యక్తి పేరు తెలుసుకోవడానికి థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగించాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, టెలికాం కంపెనీలు కొత్త సర్వీస్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఫోన్‌ కనెక్షన్‌ తీసుకునే సమయంలో ఇచ్చిన గుర్తింపు కార్డు (KYC)లో ఉన్న పేరునే ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయంలో ప్రదర్శించే విధంగా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని కొన్ని సర్కిళ్లలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత, దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సేవను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇకపై ఎవరు కాల్‌ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఎటువంటి యాప్‌ అవసరం లేకుండా, ఫోన్‌ స్క్రీన్‌పైనే కాలర్‌ పేరు కనిపించనున్నది!

అల్లూరి సీతారామరాజు

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

అనంతగిరి(పున్నమి ప్రతినిధి), అక్టోబర్ :29 మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో పంట చేలలో వద నీరు ప్రవహించడంతో రైతులు పంటను నష్టపోయారు. అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ, దిగుసోనబా గ్రామంలో కొండ వాగుల నుండి వచ్చిన వరద నీరు వరి పొలాల పై నుండి ప్రవహించిది. దీంతో వరి చేను నేలమట్టమైంది. కావున తుఫాను కారణంగా పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు, ఏపీ పీసీసీ డెలిగేట్ సభ్యులు నోగిలి చంద్రకళ కోరారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.